Kondapalli Quila
-
కొండపల్లిలో శిల్పారామం!
15 ఎకరాలు ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధం వీలైనంత త్వరగా పనులు ప్రారంభించేందుకు కసరత్తు ఆలస్యమైతే కేంద్రం ఇచ్చిన రూ.5కోట్లు వృథా ప్రతిష్టాత్మక శిల్పారామం కొండపల్లి ఖిల్లా సమీపంలో ఏర్పాటుచేయాలని జిల్లాయంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఖిల్లా సమీపంలో ఉన్న 15 ఎకరాలను ఇందుకు కోసం కేటాయించాలని నిర్ణయించింది. విజయవాడ : నవ్యాంధ్ర రాజధానికి కేంద్రమైన విజయవాడలో ప్రతిష్టాత్మక శిల్పారామం ఏర్పాటు పనులను సాధ్యమైనంత త్వరగా ప్రారంభించాలని జిల్లా యంత్రాంగం కసరత్తు చేస్తోంది. ఇందుకోసం పలు ప్రాంతాల్లో స్థలాలను అన్వేషిస్తోంది. ప్రాథమికంగా కొండపల్లి అనుకూలమని, ఇక్కడ 15 ఎకరాలు కేటాయించేందుకు సిద్ధమని అధికారులు ప్రకటించారు. ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్టును తొలుత భవానీద్వీపంలో ఏర్పాటుచేయాలని భావించారు. ఇందుకోసం 20 ఎకరాలు కేటాయించాలని గతంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవెలప్మెంట్ కార్పొరేషన్(ఏపీటీడీసీ) ఎండీగా వ్యవహరించిన చందనాఖాన్ ఆదేశించారు. అయితే, ఈ ప్రతిపాదనను ముఖ్యమంత్రి చంద్రబాబు తిరస్కరించడంతో జిల్లా యంత్రాంగం మళ్లీ స్థలం కోసం అన్వేషిస్తోంది. ప్రస్తుతం కొండపల్లి ఖిల్లా సమీపంలో 15 ఎకరాల భూమి ఉందని, దాన్ని ఏపీటీడీసీకి కేటాయించాలని అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు ప్రతిపాదనలు పంపినట్లు సమాచారం. దీనికి శిల్పారామం సొసైటీ సానుకూలంగా స్పందిస్తుందా లేదా అని దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. రూ.5 కోట్లకు గ్రహణం నగరంలో శిల్పారామం ఏర్పాటుకు 13వ ఆర్థిక సంఘం నిధుల నుంచి సుమారు రూ.5కోట్లు మంజూరయ్యాయి. ఈ నిధులు వచ్చే ఏడాది మార్చిలోపు వినియోగించుకోవాల్సి ఉంది. ఇప్పటివరకు స్థలం కేటాయించకపోవడంతో సకాలంలో పనులు ప్రారంభమవుతాయా.. అనే సందేహం నెలకొంది. సకాలంలో పనులు ప్రారంభంకాకపోతే నిధులు వెనక్కి వెళ్లిపోతాయి. -
బాలికపై లైంగికదాడి
కొండపల్లి ఖిల్లాపై ఘటన.. లారీ డ్రైవర్ దురాగతం కేసు నమోదు ఇబ్రహీంపట్నం : కొండపల్లి ఖిల్లా మీద బాలికపై లైంగికదాడి జరిగినట్లు అందిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని కిలేశపురం గ్రామానికి చెందిన బాలిక(14)ను స్థానికురాలైన నాగమణి(25) గురువారం కొండపల్లిలో బంగారం దుకాణానికి వెళదామని మాయమాటలు చెప్పి తీసుకువచ్చింది. ఆటోలో ఎక్కించుకుని కొండపల్లి ఖిల్లాకు తీసుకువెళ్లింది. అదే ఆటోలో ముగ్గురు యు వకులు కూడా ఉన్నారు. వారిలో దామెర్ల ప్రకాష్(22) అనే లారీ డ్రైవర్ ఆ బాలికను దూరంగా తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డా డు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక ఈ ఘట న గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. సీఐ సిహెచ్.రాంబాబు సిబ్బందితో ఖిల్లాకు వెళ్లి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసుల అదుపులో నాగమణి, ముగ్గురు యువకులు బాలికను ఖిల్లాపైకి తీసుకువెళ్లిన నాగమణిని, ఆమె వెంట ఉన్న ముగ్గురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగమణి (25) వ్యభిచారానికి పాల్పడుతూ మరి కొందరు యువతులను కూడా ఆ ఊబిలోకి లాగాలని చూస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఆమె గతంలో కూడా ఓ బాలికను ఈ కూపంలోకి లాగిందని పేర్కొన్నారు. చిన్నవయస్సులోనే గర్భవతి కావడంతో ఆ అవమానం భరించలేక బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలి పారు. ప్రస్తుతం మరో బాలికను కూడా ఇదే విధంగా వ్యభిచార కూపంలోకి లాగాలని చూస్తుండటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగమణి గ్రామంలో బాలికలను ఎంచుకుని వ్యభిచార వృత్తిలోకి దించుతోందని, ఆమెవల్ల యువకులు కూడా చెడిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.