- కొండపల్లి ఖిల్లాపై ఘటన.. లారీ డ్రైవర్ దురాగతం
- కేసు నమోదు
ఇబ్రహీంపట్నం : కొండపల్లి ఖిల్లా మీద బాలికపై లైంగికదాడి జరిగినట్లు అందిన ఫిర్యాదుపై ఇబ్రహీంపట్నం పోలీస్‌స్టేషన్‌లో శుక్రవారం కేసు నమోదైంది. పోలీసులు తెలి పిన వివరాల ప్రకారం.. మండలంలోని కిలేశపురం గ్రామానికి చెందిన బాలిక(14)ను స్థానికురాలైన నాగమణి(25) గురువారం కొండపల్లిలో బంగారం దుకాణానికి వెళదామని మాయమాటలు చెప్పి తీసుకువచ్చింది. ఆటోలో ఎక్కించుకుని కొండపల్లి ఖిల్లాకు తీసుకువెళ్లింది.
అదే ఆటోలో ముగ్గురు యు వకులు కూడా ఉన్నారు. వారిలో దామెర్ల ప్రకాష్(22) అనే లారీ డ్రైవర్ ఆ బాలికను దూరంగా తీసుకువెళ్లి లైంగికదాడికి పాల్పడ్డా డు. ఇంటికి వెళ్లిన తరువాత బాలిక ఈ ఘట న గురించి తల్లిదండ్రులకు చెప్పింది. వారు శుక్రవారం స్థానిక పోలీస్‌స్టేషన్‌కు వచ్చి ఫిర్యాదు చేశారు. సీఐ సిహెచ్.రాంబాబు సిబ్బందితో ఖిల్లాకు వెళ్లి ఘటన జరిగిన ప్రదేశాన్ని పరిశీలించారు. బాధితురాలిని వైద్య పరీక్షల కోసం విజయవాడ ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. ఈ ఘటనపై సీఐ రాంబాబు ఆధ్వర్యంలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
పోలీసుల అదుపులో నాగమణి, ముగ్గురు యువకులు
బాలికను ఖిల్లాపైకి తీసుకువెళ్లిన నాగమణిని, ఆమె వెంట ఉన్న ముగ్గురు యువకులను కూడా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. నాగమణి (25) వ్యభిచారానికి పాల్పడుతూ మరి కొందరు యువతులను కూడా ఆ ఊబిలోకి లాగాలని చూస్తోందని గ్రామస్తులు తెలిపారు. ఆమె గతంలో కూడా ఓ బాలికను ఈ కూపంలోకి లాగిందని పేర్కొన్నారు.
చిన్నవయస్సులోనే గర్భవతి కావడంతో ఆ అవమానం భరించలేక బాలిక ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని తెలి పారు. ప్రస్తుతం మరో బాలికను కూడా ఇదే విధంగా వ్యభిచార కూపంలోకి లాగాలని చూస్తుండటంపై వారు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. నాగమణి గ్రామంలో బాలికలను ఎంచుకుని వ్యభిచార వృత్తిలోకి దించుతోందని, ఆమెవల్ల యువకులు కూడా చెడిపోతున్నారని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆమెపై పోలీసులు కఠిన చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు.