బాలికపై వృద్ధుడి లైంగిక దాడి | Oldman sexual assult on girl | Sakshi
Sakshi News home page

బాలికపై వృద్ధుడి లైంగిక దాడి

Published Fri, Mar 2 2018 7:12 AM | Last Updated on Mon, Jul 23 2018 9:15 PM

Oldman sexual assult on girl - Sakshi

నాంపల్లి: పదమూడేళ్ల బాలికపై ఓవృద్ధుడు అత్యాచారం చేసిన సంఘటన హబీబ్‌నగర్‌ పోలీసు స్టేషన్‌ పరిధిలో జరిగింది.  ఇన్‌స్పెక్టర్‌ పరవస్తు మధుకర్‌ స్వామి తెలిపిన వివరాల ప్రకారం... ఆగాపురాలో అబ్దుల్‌ వహబ్‌ (76) అనే వృద్ధుడు నివాసముంటున్నాడు. సౌదీ అరేబియా నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడ్డాడు. అతనికి ముగ్గురు కుమారులు, ఐదుగురు కుమార్తెలు ఉన్నారు. వీరంతా సౌదీ అరేబియాలోనే ఉంటున్నారు. వహబ్‌ మాత్రం కోడలితో పాటుగా ఆగాపురాలో ఉంటున్నాడు. బుధవారం కోడలు ఇంట్లో లేని సమయంలో అతను బస్తీకి చెందిన 13 ఏళ్ల అమ్మాయికి చాక్లెట్‌ ఇస్తానంటూ నమ్మించి ఇంట్లోకి పిలిచి అత్యాచారం చేశాడు. దీంతో బాధితురాలు హబీబ్‌నగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు అతనిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement