kondareddypally
-
కొండారెడ్డి పల్లి మాజీ సర్పంచ్ ఆత్మహత్య
సాక్షి, నాగర్ కర్నూల్ జిల్లా: వంగూరు మండలం కొండారెడ్డిపల్లి మాజీ సర్పంచ్ సాయిరెడ్డి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపుతోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత గ్రామమైన కొండారెడ్డిపల్లిలో మాజీ సర్పంచ్ ఆత్మహత్యకు పాల్పడటం వెనుక.. ఇటీవల గ్రామంలో నూతనంగా నిర్మించబడిన పశు వైద్యశాల ప్రహరీ గోడ నిర్మాణమేనని సమాచారం.పశు వైద్యశాల వెనకాలే సాయిరెడ్డి ఇల్లు ఉండగా, ఆయన ఇంటికి దారి లేకుండా పశు వైద్యశాల ప్రహరీ గోడను నిర్మించారంటూ వివాదం నెలకొంది. దీంతో మనస్తాపానికి గురైన సాయి రెడ్డి కల్వకుర్తి వచ్చి పురుగుల మందు తాగాడు. అదే సమయంలో పెట్రోలింగ్ పోలీసులు గమనించి ఆసుపత్రికి తరలించే లోపు సాయిరెడ్డి మృతి చెందాడు. సాయిరెడ్డి రాసినట్లుగా చెబుతున్న సూసైడ్ నోట్లో తనను సీఎం రేవంత్ రెడ్డి అన్నదమ్ములు వేధింపులు తట్టుకోలేక చనిపోతున్నట్లు పేర్కొనడం సంచలనంగా మారింది. -
కొండారెడ్డిపల్లి కాదు.. ఇక మాది సీఎం ఊరు
సాక్షి, నాగర్‌కర్నూల్: తెలంగాణ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించిన తర్వాత.. కాంగ్రెస్ శ్రేణుల్లోని ఆయన అభిమానులు సంబురాలు చేసుకుంటున్నారు. హైదరాబాద్‌లోని రేవంత్ ఇంటి వద్ద సందడి వాతావరణం నెలకొంది. ఈ క్రమంలో తెలంగాణ కొత్త సీఎం ఇంటి వద్ద భారీగా మోహరించిన పోలీసులు భద్రత ఏర్పాటు చేశారు. అదే సమయంలో రేవంత్ స్వస్థలంలో పండుగ వాతావరణం నెలకొంది. రేవంత్‌రెడ్డి పుట్టింది ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని కొండారెడ్డిపల్లి గ్రామంలో. ఇవాళ ముఖ్యమంత్రిగా రేవంత్‌రెడ్డి పేరును ప్రకటించాక ఆ ఊరి ప్రజలు సంబురాలు చేసుకుంటున్నారు. పటేలా.. అంటూ రేవంత్‌ను ఆప్యాయంగా పిలిచే కొందరు మీడియాతో తమ సంతోషం పంచుకున్నారు. ‘‘మా రేవంత్ పటేల్ సీఎం అయ్యాడు. ఢిల్లీకి రాజు అయినా.. తల్లికి కొడుకే. రేవంత్ అప్పటికీ.. ఇప్పటికీ మా మంచి పటేల్. ఎప్పుడు ఊరికి వచ్చినా ఆప్యాయంగా పలకరిస్తారు. ఇకపై మా ఊరు కొండారెడ్డిపల్లి కాదు.. సీఎం ఊరు’’ అని గ్రామస్తులు స్వీట్లు పంచుకుంటూ, రంగులు చల్లుకుంటూ కనిపించారు. పాలమూరు నుంచి రెండో సీఎం! గతంలో హైదరాబాద్ స్టేట్‌కు కల్వకుర్తి నుంచి బూర్గుల రామకృష్ణారావు ముఖ్యమంత్రిగా పని చేశారు. దశాబ్దాల తర్వాత ఇప్పుడు పాలమూరు ప్రాంతంలో పుట్టిన రేవంత్‌రెడ్డి తెలంగాణ రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయ్యారు. -
కేటీఆర్ ప్రశంసపై కొండారెడ్డిపల్లివాసుల ఆగ్రహం
కేశంపేట: సినీనటుడు ప్రకాశ్‌రాజ్ తన దత్తత గ్రామమైన రంగారెడ్డి జిల్లా కేశంపేట పరిధిలోని కొండారెడ్డిపల్లిని బాగా అభివృద్ధి చేశారని మంత్రి కేటీఆర్ ట్విట్టర్ వేదికగా ప్రశంసించడంపై ఆ గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గ్రామస్తులతో కలసి సర్పంచ్ పల్లె స్వాతి బుధవారం విలేకరులతో మాట్లాడుతూ.. గ్రామాభివృద్ధిపై కేటీఆర్ పూర్తి సమాచారం తెలుసుకొని మాట్లాడితే బాగుండేదని అభిప్రాయపడ్డారు. ప్రకాశ్‌రాజ్ 2019 వరకే తమ గ్రామాన్ని దత్తత తీసుకున్నారని, ఆయన చేసిన అభివృద్ధి కంటే తాము సొంత నిధులతో చేసిన అభివృద్ధి ఎక్కువగా ఉందని ఆమె స్పష్టం చేశారు. మూడేళ్లుగా సొంత నిధులతో అభివృద్ధి చేస్తున్న తమను అభినందించాల్సి పోయి.. ప్రకాశ్‌రాజ్ అభివృద్ధి చేశారని చెప్పడం ఎంతవరకు సమంజసమని సర్పంచ్ స్వాతి ప్రశ్నించారు. పనిచేసింది మేమైతే.. ప్రశంసలు ప్రకాశ్‌రాజ్‌కా? అంటూ కేటీఆర్‌కు ప్రశ్న సంధించారు ఆ ఊరి ప్రజలు. This is the village adopted by @prakashraaj Great progress made in tandem with local MLA @AnjaiahYTRS Garu 👏 https://t.co/yGfYdloaFT — KTR (@KTRTRS) September 20, 2022