కృష్ణా నదిలో ఈతకు వెళ్లి ముగ్గురి మృతి
అచ్చంపేట(గుంటూరు): గుంటూరు జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. కృష్ణానదిలో స్నానానికి వెళ్లిన ముగ్గురు చిన్నారులు నీట మునిగి మృతిచెందారు. ఈ సంఘటన జిల్లాలోని అచ్చంపేట మండలం కోసూరులో ఆదివారం చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన ముగ్గురు బాలురు స్నానం చేయడానికి కృష్ణానదికి వెళ్లి ప్రమాదవశాత్తు నీట మునిగి మృతిచెందారు.
విషయం తెలుసుకున్న స్థానికులు ముగ్గురి మృతదేహాలను వెలికి తీశారు.