Kotamreddy srinivasulu reddy
-
మాస్క్‌ల పేరుతో చందాల దందాలు
నెల్లూరు: మాస్క్‌ల వితరణ పేరుతో చందాల దోపిడీలు చేసే టీడీపీ నేత కోటంరెడ్డి శ్రీనివాసులరెడ్డికి నిజాయతీ పరుడైన మంత్రి అనిల్‌కుమార్‌యాదవ్‌ను విమర్శించే స్థాయి లేదని జిల్లా వైఎస్సార్సీపీ యువజన విభాగ అధ్యక్షుడు పీ రూప్‌కుమార్‌యాదవ్ విమర్శించారు. నగరంలోని జలవనరులశాఖ మంత్రి క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన కోటంరెడ్డిపై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. కరోనా వైరస్ ప్రబలిన నెల తర్వాత మేల్కొన్న కోటంరెడ్డి రోజుకు ఐదో పదో మాస్కులు ఇస్తూ అందు కోసం రియల్టర్లు, కాంట్రాక్టర్ల వద్ద చందాలు దండుకుని దోపిడీ చేస్తున్నారని దుయ్యబట్టారు. తగిన జాగ్రత్తలు తీసుకోకుండా సేవా కార్యక్రమాలు (భోజనం, నిత్యావసరాలు తదితరాలు పంపిణీ) చేయడం వల్ల కరోనా ప్రబలే పరిస్థితులు ఉన్నాయనే హెచ్చరికల నేపథ్యంలో ఎవరు పడితే వారు పంపిణీ చేయరాదని ప్రభుత్వం అధికార ప్రకటనను దృష్టిలో ఉంచుకుని దాతల దగ్గరున్న ప్రభుత్వ కార్యాలయాలు (వార్డు సచివాలయాలు, తహసీల్దార్, నగరపాలక సంస్థ కార్యాలయాలు) అందజేయాలని మంత్రి పిలుపునిచ్చారని తెలిపారు. అయితే శ్రీనివాసులరెడ్డితో పాటు కొంత మంది భద్రతా సూచనలకు సహకరించాల్సింది పోయి చౌకబారు విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. నాణ్యతలేని మాçసు్కలను కలెక్టర్ దగ్గరకు తీసుకెళ్లి డాక్టర్లకు ఇవ్వాలని కోటంరెడ్డి కోరారని ఎద్దేవా చేశారు. కోటంరెడ్డి తన దోపిడీ దందాలోకి తన కుమారుడిని తీసుకురావడం బాధాకరమన్నారు. కరోనా వైరస్ నేపథ్యంలో టీడీపీ నేతలు ఇళ్లకే పరిమితమయ్యారన్నారు. మంత్రి అనిల్‌కుమార్ తొలిరోజు నుంచి ప్రజల మధ్యనే ఉన్నారన్నారు. తన సొంత నిధులు రూ.15 లక్షలతో మాసు్కలు, శానిటైజర్లు కొనుగోలు చేసి వైద్యులు, ప్రజలకు అందజేశారన్నారు. ఇప్పటి వరకు 80 వేల మాసు్కలు, 60 వేల శానిటైజర్లు, వేలాది పీపీఈ కిట్లను అందజేయడంతో పాటు రెడ్జోన్లను నిరంతరం పర్యవేక్షిస్తూ కరోనా నియంత్రణకు మంత్రి కృషి చేస్తున్నారన్నారు. జిల్లాలో అర్చకులు, ఇమామ్‌లు, పాస్టర్లకు నిత్యావసరాలు, ఆర్థిక సాయం అందజేశారన్నారు. ప్రస్తుత తరుణంలో కుల, మత, రాజకీయాలకు అతీతంగా పనిచేయాల్సిన అవసరం ఉందన్నారు. ఈ తరుణంలో నీచ నికృష్ణ రాజకీయాలు చేయడం హేయమన్నారు. సాయం చేయాలనే పెద్ద మనస్సు లేకపోయినా పర్వాలేదు.. కానీ పేదలకు జరిగే మంచిపై విమర్శలు చేయడం సిగ్గు చేటన్నారు. -
నెల్లూరుకు ఘనమైన చరిత్ర
నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారంలో బాలకృష్ణ నెల్లూరు(వీఆర్సీసెంటర్) : తెలుగుజాతి కోసం ప్రాణాలర్పించిన పొట్టి శ్రీరాములు జన్మించిన నెల్లూరు జిల్లాకు ఘనమైన రాజకీయ చరిత్ర ఉందని సినీనటుడు, హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ పేర్కొన్నారు. నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి ప్రమాణస్వీకారం సందర్భంగా శుక్రవారం బాలకృçష్ణ నెల్లూరుకు విచ్చేశారు. బాలాజీనగర్‌లోని శ్రీనివాసులురెడ్డి నివాసానికి చేరుకున్న బాలకృష్ణ కాన్వాయ్‌తో వీఆర్సీ సెంటర్ వరకు వచ్చారు. అక్కడ నుంచి ర్యాలీగా ట్రంకురోడ్డు మీదుగా నర్తకీసెంటర్కు చేరుకున్నారు. అక్కడ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం అక్కడ ఏర్పాటు చేసిన సభలో నుడా చైర్మన్‌గా కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి, పాలక మండలి సభ్యులతో మంత్రులు నారాయణ, సోమిరెడ్డి ప్రమాణస్వీకారం చేయించారు. ఈ సందర్భంగా బాలకృష్ణ మాట్లాడుతూ శ్రీనివాసులురెడ్డి ప్రమాణ స్వీకారోత్సవానికి నెల్లూరుకు రావడం సంతోషంగా ఉందన్నారు. నెల్లూరుకు సింహపురి అనే మరో పేరు ఉందని, నెల్లూరును మనుమసిద్ది రాజుపాలించగా, తిక్కన ఆస్థాన కవి అని పేర్కొన్నారు. నెల్లూరు జిల్లాను అభివృద్ధి చేసేందుకు 1060 కి.మీ. విస్తీర్ణంతో నుడాను ఏర్పాటుచేయడం అభినందించదగ్గ విషయమన్నారు. కష్టపడ్డవారికి పార్టీలో గుర్తింపు ఉంటుందనేందుకు శ్రీనివాసులురెడ్డి నిదర్శనమన్నారు. మంత్రులు నారాయణ, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి మాట్లాడుతూ ఎన్టీఆర్ కుటుంబంతో శీనయ్యకు మంచి సంబంధాలున్నాయని, భవిష్యత్‌లో నుడాను అభివృద్ధి పథంలో నడిపించేందుకు ఆయన కృషి చేస్తారన్నారు. నుడా చైర్మన్ కోటంరెడ్డి శ్రీనివాసులురెడ్డి మాట్లాడుతూ నా దైవం బాలకృష్ణ అని, నేను ఇప్పటికీ సామాన్య కార్యకర్తగా ఉన్నానని, నాయకుడిగా ఎప్పుడూ భావించలేదన్నారు. కార్యక్రమంలో మేయర్ అబ్దుల్ అజీజ్, ఎమ్మెల్యేలు కురుగొండ్ల రామకృష్ణ, పాశం సునీల్‌కుమార్, నాయకులు శ్రీధరకృష్ణారెడ్డి, కిలారి వెంకటస్వామినాయుడు, బీజేపీ నాయకులు కర్నాటి ఆంజనేయరెడ్డి, విజయ డెయిరీ చైర్మన్ కొండ్రెడ్డి రంగారెడ్డి పాల్గొన్నారు.