కొత్తగూడెం సమగ్రాభివృద్ధే లక్ష్యం
ఎమ్మెల్యే జలగం వెంకట్రావు
కొత్తగూడెం /పాల్వంచ : కొత్తగూడెం జిల్లా సమ గ్రాభివృద్ధి సాధించాలనే సంకల్పంతోనే తాను పాదయాత్ర చేపట్టినట్టు కొత్తగూడెం ఎమ్మెల్యే జలగం వెంకట్రావు అన్నారు. పరిపాలన సౌలభ్యం, ప్రజలకు అందుబాటులో అధికార యంత్రాంగం ఉండాలనే లక్ష్యంతోనే కొత్త జిల్లాల ఏర్పాటుకు ప్రభుత్వం శ్రీకారం చుట్టిందన్నారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఏర్పాటు చేస్తున్న సందర్భంగా సీఎం కేసీఆర్కు కృతజ్ఞతలు తెలిపేందుకు ‘మన ప్రగతి యాత్ర’ పేరుతో కొత్తగూడెం నుంచి భద్రాచలం వరకు మంగళవారం పాదయాత్ర చేపట్టారు. తొలుత కొత్తగూడెంలోని శ్రీవిజయ విఘ్నేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన ఆయన అక్కడి నుంచి పాద యాత్ర ప్రారంభించారు. మధ్యాహ్నం పాల్వం చలోని నవ భారత్ చేరుకుంది. అక్కడి నుంచి ఆయనకు పార్టీ శ్రేణులు అడుగడుగునా ఘన స్వాగతం పలికారు. నవభారత్, పాత పాల్వంచ, దమ్మపేట సెంటర్, అంబేడ్కర్, బస్టాండ్ సెంట ర్, ఇందిరా కాలనీ తదితర ప్రాంతాల్లో నాయకులు, మహిâýæలు బతుకమ్మలతో ఎదురెళ్లి స్వాగ తం పలికారు. దమ్మపేట సెంటర్లో సభలో జల గం మాట్లాడుతూ.. బంగారు తెలంగాణ సాధించేందుకు సీఎం కేసీఆర్ విశేషంగా కృషి చేస్తున్నారని అన్నారు. కొత్తగూడెం పారిశ్రామికంగా మరింత అభివృద్ధి సాధించేందుకు, విమానాశ్రయం, టూరిజం హోటâýæ్ల ఏర్పాటుకు, పర్యాటకాభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తుందని చెప్పారు. కాగా.. తొలిరోజు యాత్ర 17 కిలోమీటర్లు కొనసాగింది. రాత్రి పాల్వంచ మండలం జగన్నాధపురం పెద్దమ్మతల్లి దేవాలయం వద్ద బస చేశారు. కార్యక్రమంలో టీఆర్ఎస్ జిల్లా మాజీ అధ్యక్షుడు దిండిగాల రాజేందర్, నాయకులు కిలారు నాగేశ్వరరావు, మంతపురి రాజుగౌడ్, కాల్వ భాస్కర్, పొనిశెట్టి వెంకటేశ్వర్లు, మల్లెల రవిచంద్ర, మురళి, దాసరి నాగేశ్వరరావు పాల్గొన్నారు.