Kothapalli Getha
-
కొత్తపల్లి గీతకు షోకాజ్ నోటీసులు
సాక్షి, న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు వైఎస్ఆర్ సీపీ విప్ వైవీ సుబ్బారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని మంగళవారం లోకసభ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రస్తావించినప్పుడు లేచి నిలబడనందుకు ఈ నోటీసు జారీ చేశారు. తాను లేచి నిలబడకపోవడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు. -
పూర్తి వివరాలను కోర్టు ముందుంచండి
ఎంపీ గీత కుల ధ్రువీకరణపై హైకోర్టు ఆదేశం.. సాక్షి, హైదరాబాద్: అరకు ఎంపీ కొత్తపల్లి గీత కుల ధ్రువీకరణ అంశంలో హైకోర్టు స్పందించింది. ఈ మొత్తం వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలను తమ ముందుంచాలంటూ కొత్తపల్లి గీతతోపాటు ఏపీ గిరిజన సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి, కమిషనర్, జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, ఎన్నికల కమిషన్ తదితరులకు నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను వచ్చే నెల 6కు వాయిదా వేసింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కళ్యాణ్‌జ్యోతి సేన్‌గుప్తా, న్యాయమూర్తి జస్టిస్ పి.వి.సంజయ్‌కుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. గీత ఎస్టీ కాదని, తప్పుడు కుల ధ్రువీకరణ పత్రంతో అరకు నుంచి ఎంపీగా గెలుపొందారని, ఈ కారణంగా ఆమె ఎన్నికను రద్దు చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ గిరిజన ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఈ.ఆంజనేయులు, మరొకరు గతేడాది నవంబర్‌లో హైకోర్టులో పిటిషన్ వేశారు. దీనిని ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలోని బుధవారం విచారించింది. పిటీషినర్ల తరుఫున సీనియర్ న్యాయవాది ఎ.సత్యప్రసాద్ చేసిన వాదనలు విన్న ధర్మాసనం, ప్రతివాదులకు నోటీసులు జారీ చేస్తూ.. విచారణను మార్చి 6వ తేదీకి వాయిదా వేసింది. -
కొత్తపల్లి గీతపై అసభ్యప్రచారం.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో అసభ్యకరవ్యాఖ్యలను పోస్ట్ చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ఇంటూరి రవికిరణ్, సురేష్ కృష్ణ ఈ ఉదంతానికి పాల్పడ్డారు. మంగళవారం సీఐడీ పోలీసులు రవికిరణ్, సురేష్ కృష్ణలను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై ఇటీవల ఫేస్బుక్లో అసభ్య పదజాలం వాడుతూ దుష్ర్పచారం చేసిన సంగతి తెలిసిందే. గీత ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.