
సాక్షి, న్యూఢిల్లీ : 2014 సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరాయించిన అరకు ఎంపీ కొత్తపల్లి గీతకు వైఎస్‌ఆర్ సీపీ విప్ వైవీ సుబ్బారెడ్డి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. పార్లమెంట్‌లో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన అవిశ్వాస తీర్మానాన్ని మంగళవారం లోకసభ సభలో స్పీకర్ సుమిత్రా మహాజన్ ప్రస్తావించినప్పుడు లేచి నిలబడనందుకు ఈ నోటీసు జారీ చేశారు. తాను లేచి నిలబడకపోవడంపై వివరణ ఇవ్వాలని నోటీసుల్లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment