కొత్తపల్లి గీతపై అసభ్యప్రచారం.. నిందితుల అరెస్ట్
హైదరాబాద్: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అరకు ఎంపీ కొత్తపల్లి గీతను ఉద్దేశిస్తూ ఫేస్బుక్లో అసభ్యకరవ్యాఖ్యలను పోస్ట్ చేసిన నిందితులను పోలీసులు గుర్తించారు. ఇంటూరి రవికిరణ్, సురేష్ కృష్ణ ఈ ఉదంతానికి పాల్పడ్డారు.
మంగళవారం సీఐడీ పోలీసులు రవికిరణ్, సురేష్ కృష్ణలను అరెస్ట్ చేశారు. విశాఖపట్నం జిల్లా అరకు ఎంపీ కొత్తపల్లి గీతపై ఇటీవల ఫేస్బుక్లో అసభ్య పదజాలం వాడుతూ దుష్ర్పచారం చేసిన సంగతి తెలిసిందే. గీత ఈ విషయంపై పోలీసులకు ఫిర్యాదు చేశారు.