కోటిలింగాలలో బాలకృష్ణ ప్రత్యేక పూజలు
కోటిలింగాల: ప్రముఖ సినీనటుడు నందమూరి బాలకృష్ణ జగిత్యాల జిల్లాలో పర్యటిస్తున్నారు. శుక్రవారం ఉదయం జగిత్యాలకు చేరుకున్న బాలకృష్ణ ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాల వేసి పర్యటన ప్రారంభించారు. అనంతరం కోటిలింగాలలోని శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆయన వెంట దర్శకుడు క్రిష్(రాధాకృష్ణ జాగర్లముడి) ఉన్నారు. బాలకృష్ణ నటించిన వందో చిత్రం గౌతమిపుత్ర శాతకర్ణి సంక్రాంతి కానుకగా ప్రేక్షకుల ముందకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ రోజు సాయంత్రం 5 గంటలకు స్థానిక తిరుమల 70 ఎమ్ఎమ్ థియేటర్ లో సినిమా ట్రైలర్ను విడుదల చేయనున్నారు.