Kotireddi
-
కోటిరెడ్డి సారు ఇకలేరు
సికింద్రాబాద్, న్యూస్‌లైన్: సికింద్రాబాద్ ప్రాంతంలోని పలుమురికివాడల పిల్లలకు ఉచిత విద్యాబోధన అందించి ఉన్నత ఉద్యోగాల్లో నిలిపిన అమరావతి విద్యాసంస్థల అధినేత వట్టిపల్లి కోటేశ్వర్‌రెడ్డి(కోటిరెడ్డి సారు) (56) ఆదివారం సాయంత్రం కన్నుమూశారు. ఆరురోజుల క్రితం గుండెపోటు రావడంతో ఆయన్ను స్థానిక సన్‌షైన్ ఆస్పత్రికి తరలించారు. మాస్టారు మరణవార్త వినగానే పలు మురికివాడలకు చెందిన ప్రజలు ఆస్పత్రికి తరలివచ్చారు. కోటేశ్వరరెడ్డికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. విద్యాభ్యాసం కోసం వచ్చి.. మహబూబ్‌నగర్ జిల్లా వనపర్తి మండలం రామాపురానికి చెందిన వట్టిపల్లి కోటేశ్వరరావు ఉన్నత విద్యకోసం నగరానికి వచ్చారు. ఓయూ హాస్టల్ నుంచి కాలినడక చిలకలగూడలోని శ్రీదేవి, నామాలగుండులోని సురేష్ థియేటర్ ప్రాంతానికి వచ్చేవారు. అక్కడి మురికివాడలు ఆయన్ను కదిలించాయి. అక్కడివారి కుటుంబాల్లో వెలుగు నింపాలన్న సంకల్పంతో 1984లో ఇక్కడ పాఠశాల నెలకొల్పి మురికివాడల పిల్లలకు అక్షరాలు నేర్పిచారు. కేవలం 30 మందితో చిన్న గదిలో ప్రారంభమైన అమరావతి పాఠశాల పలు శాఖల విద్యా సంస్థగా ఎదిగింది. ఇక్కడి మురికివాడల్లో ఉన్న ఏడు పాఠశాలల్లో 8 వేల మంది విద్యార్థులుండగా, వారిలో 2,500 మందికి ఉచితంగానే విద్యాబోధన అందిస్తున్నారు. మిగతావారు నెలకు రూ.10 మొదలు ఎంతతోస్తే అంతే ఫీజు చెల్లిస్తారు. ఇక్కడ విద్యాభ్యాసం చేసినవారిలో 800 మంది ఇంజినీర్లు, 600 మంది డాక్టర్లుగా స్థిరపడ్డారు. మరో 1500 మంది ఎంబీఏ, ఎంసీఏ చదివి దేశ విదేశాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు. కోటేశ్వరరెడ్డి కూతుర్లు, అల్లుళ్లు సైతం అమరావతి విద్యా సంస్థల్లో ఉపాధ్యాయులే కావడం గమనార్హం. ఎక్కడకు వెళ్లిన లూనాపైనే.. పలు పాఠశాలల కరస్పాండెంట్ హోదా ఉన్నా కోటేశ్వరరెడ్డి సాధారణ జీవితమే గడిపారు. ఆయనకు ఏ పాఠశాలలోనూ ఛాంబర్ లేదు. మిత్రులు, పేరెంట్లు ఎవరోచ్చినా సరే సదరు పాఠశాలపై టైలో రెండు కుర్చీలు వేసుకుని మాట్లాడేవారు. ఆయన ఎక్కడికైనా ఓ పాత లూనాపైనే వెళ్లేవారు. కోటేశ్వర్‌రెడ్డి మాస్టారు తుదిశ్వాస విడిచేవరకు అద్దె ఇంటిలోనే జీవించడం ఆయన నిరాడంబరతకు నిదర్శనం. నేడు పాఠశాలల బంద్ కోటేశ్వరరెడ్డి మృతికి సంతాపంగా సోమవారం సికింద్రాబాద్ ప్రాంత ప్రై వేటు పాఠశాలల యాజమాన్యలు సెలవు ప్రకటించాయి. సీతాఫల్మండి మేడిబావిలోని గల నివాసంలో కోటేశ్వరెడ్డి భౌతికకాయాన్ని ప్రజల సందర్శన కోసం ఉంచారు. మంగళవారం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. -
ఉడుముల ఆమరణ దీక్ష భగ్నం
మార్కాపురం టౌన్, న్యూస్‌లైన్ :ఇరుప్రాంతాలకూ సమన్యాయం చేయలేనప్పుడు రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలన్న డిమాండ్‌తో వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్షకు మద్దతుగా ఆ పార్టీ రైతు విభాగం గుంటూరు, నెల్లూరు జిల్లాల కన్వీనర్ ఉడుముల కోటిరెడ్డి స్థానిక ఆర్డీఓ కార్యాలయం ఎదుట మూడు రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. ఆయన దీక్షను బుధవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పోలీసులు భగ్నం చేసి స్థానిక ఏరియా వైద్యశాలకు తరలించారు. సీఐ శివరామకృష్ణారెడ్డి, ఎస్సై రాజమోహనరావులు తమ సిబ్బందితో వచ్చి దీక్ష విరమించాలని కోటిరెడ్డిని కోరారు. అందుకు ఆయన నిరాకరించటంతో జీపులో వైద్యశాలకు తరలించి బలవంతంగా చికిత్స చేయించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కోటిరెడ్డిని పార్టీ మార్కాపురం నియోజకవర్గ సమన్వయకర్త జంకె వెంకటరెడ్డి, వైపాలెం నియోజకవర్గ సమన్వయకర్త పాలపర్తి డేవిడ్‌రాజులు గురువారం ఉదయం పరామర్శించారు. నేతల వెంట పెద్దారవీడు మాజీ ఎంపీపీ దుగ్గెంపుడి వెంకటరెడ్డి, ఆరవీటి మౌలాలీ, పి.కాశిం, ఎస్కే ఖలీల్, డి.వెంకటరెడ్డి, రామిరెడ్డి, పాపిరెడ్డి సుబ్బారెడ్డి, గెల్లి చౌడేశ్వరరావు, టీవీ కాశయ్య, డాన్ శ్రీను, కాళ్ల ఆది, ఆర్.యలమంద, కందురు వెంకటేశ్వరరెడ్డి ఉన్నారు. లక్ష్మీరెడ్డి దీక్షను కూడా.. పెద్దారవీడు, న్యూస్‌లైన్ : వైఎస్ఆర్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆమరణ దీక్షకు మద్దతుగా మండలంలోని సానికవరానికి చెందిన ఒద్దుల లక్ష్మీరెడ్డి కూడా మూడో రోజుల నుంచి ఆమరణ దీక్ష చేస్తున్న విషయం తెలిసిందే. స్థానిక బస్టాండ్ సెంటర్లోని వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆమరణ దీక్ష చేస్తుండగా మార్కాపురం సీఐ శివరామకృష్ణారెడ్డి, రూరల్ ఎస్సై రాములనాయక్లు తమ సిబ్బందితో బుధవారం అర్ధరాత్రి వచ్చి దీక్ష భగ్నం చేశారు. ఆస్పత్రికి వచ్చేది లేదంటూ లక్ష్మీరెడ్డి ప్రతిఘటించినా పోలీసులు పట్టించుకోకుండా ఆయన దీక్షను భగ్నం చేసి మార్కాపురం ఏరియా వైద్యశాలకు తరలించారు. ఆస్పత్రిలో అతికష్టం మీద సెలైన్ ఎక్కించారు. గురువారం ఉదయం డాక్టర్ ఐసీ లక్ష్మీరెడ్డి వచ్చి లక్ష్మీరెడ్డికి వైద్య పరీక్షలు నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న లక్ష్మీరెడ్డిని వైఎస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలు, తిమ్మిశెట్టి తిమ్మరాజు, పొందుగుల వెంకటరెడ్డి, ఇంజినీరింగ్ విద్యార్థులు ఒద్దుల నారాయణరెడ్డి, పొందుగుల సంజీవరెడ్డి, రామిరెడ్డి, వీరారెడ్డి, ప్రసన్న భరత్‌రెడ్డి, గుండారెడ్డి శ్రీనివాసరెడ్డి, శ్రీనుయాదవ్, సురేశ్, మాధవ్‌లు పరామర్శించారు. -
ఆంధ్రప్రదేశ్ విభజన సరికాదు
బనశంకరి, న్యూస్‌లైన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీట్లు, ఓట్లు కోసం విభజించడం సరికాదని ప్రవాసాంధ్రులు కోటిరెడ్డి, వివేకానందరెడ్డి అన్నారు. మంగళవారం జేపీ.నగర ఏడవ పేజ్‌లోని కేఆర్.లేఔట్లో ప్రవాసాంధ్ర ఐటీ ఉద్యోగులు కోటిరెడ్డి, వివేకానందరెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో సమైక్యాంధ్రకు మద్దతుగా నల్లబ్యాడ్జీలు ధరించి ప్లకార్డు పట్టుకుని నిరసన వ ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం కుటిల రాజకీయాల కోసం అంధ్రప్రదేశ్‌ను విభజించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. విభజన చేస్తే ప్రత్యేకరాష్ట్రాల ఉద్యమాలు ఊపందుకుని దేశ ఉనికికే ప్రమాదకరంగా మారతాయన్నారు. తెలంగాణా రాష్ట్రం విషయంలో కేంద్రంలోని యుపీఏ ప్రభుత్వం, సోనియాగాంధీ మరోసారి పునరాలోచించాలన్నారు. సమైకాంధ్రకు మద్దతుగా న గరంలోని ప్రవాసాంధ్రులు మద్దతు ప్రకటించాలని వారు పిలుపునిచ్చారు. ధర్నాలో వైఎస్.రవిరెడ్డి, సీ.చంద్రశేఖర్‌రెడ్డి, సురేంద్ర, హరి, భరత్‌రాజు, కే.శంకర, శ్రావణ్‌కుమార్, సచిన్‌అగర్వాల్, ఆనందరెడ్డి, ఎన్ఆర్ఐలు రూపేశ్‌కుమార్, కార్తీక్‌రెడ్డి, రవీంద్రారెడ్డి, కిరణ్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు.