Kotla Suya Prakash Reddy
-
టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి..
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సునామీలో టీడీపీ ఫ్యామిలీ ప్యాకేజీలు కొట్టుకుపోయాయి. రాయలసీమలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి దంపతులు కాంగ్రెస్ నుంచి టీడీపీలో చేరి టికెట్లు దక్కించుకుంటే వారికి ఘోర పరాజయం తప్పలేదు. దశాబ్దాల వైరాన్ని మరచి డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తితో సర్దుబాటు చేసుకుని మరీ పోటీకి దిగిన ఆ కుటుంబానికి చేదు అనుభవమే మిగిలింది. చంద్రబాబుకు ముందస్తుగా విధించిన షరతు మేరకు కోట్ల తాను కర్నూల్ లోక్‌సభ స్థానం నుంచి తన భార్య సుజాతమ్మను ఆలూరు శాసనసభ స్థానం నుంచి బరిలోకి దించారు. వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో వారిద్దరూ ఓడిపోయారు. డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తి ఎన్నికల్లో పోటీ చేయకుండా తన కుమారుడు కేఈ శ్యాంబాబును పత్తికొండ నుంచి సోదరుడు కేఈ ప్రతాప్‌ను డోన్ నుంచి బరిలోకి దించారు. వారిద్దరూ వైఎస్సార్సీపీ ముందు నిలవలేకపోయారు. భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ నుంచి.. నంద్యాల నుంచి ఆమె సోదరుడు, సిట్టింగ్ ఎమ్మెల్యే భూమా బ్రహ్మానందరెడ్డి టీడీపీ తరఫున పోటీ చేసి వైఎస్సార్సీపీ అభ్యర్థుల చేతిలో పరాజయం పాలయ్యారు. నంద్యాల ఎంపీ ఎస్పీవై రెడ్డి జనసేన తరఫున నంద్యాల లోక్‌సభ స్థానం నుంచి.. ఆయన అల్లుడు, కుమార్తెలు నంద్యాల, శ్రీశైలం, బనగానపల్లె శాసనసభ స్థానాల నుంచి పోటీ చేశారు. పోలింగ్ అయ్యాక ఎస్పీవై రెడ్డి మరణించారు. కానీ.. ఆ ఫ్యామిలీ మొత్తం ఓడింది. జేసీ దివాకర్‌రెడ్డి, జేసీ ప్రభాకర్‌రెడ్డి తనయులు జేసీ పవన్‌కుమార్‌రెడ్డి, జేసీ అస్మిత్ రెడ్డిని టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓటమి చవిచూశారు. సినీ నటుడు బాలకృష్ణ పెద్ద అల్లుడు నారా లోకేష్ మంగళగిరి నుంచి.. చిన్న అల్లుడు భరత్ విశాఖ లోక్‌సభ స్థానం నుంచి పోటీ చేసి ఘోరంగా ఓడిపోయారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నుంచి బొల్లినేని రామారావు, ఆత్మకూరు నుంచి ఆయన సోదరుడు కృష్ణయ్య టీడీపీ తరఫున బరిలోకి దిగి ఓడిపోయారు. మంత్రి గంటా శ్రీనివాసరావు.. మరో మంత్రి పి.నారాయణ, భీమవరం మాజీ ఎమ్మెల్యే పూలపర్తి రామాంజనేయులు వియ్యంకులు. గంటా విశాఖపట్నం ఉత్తర నియోజకవర్గంలో ఓటమి అంచున ఉన్నారు. నెల్లూరు, భీమవరం నుంచి పోటీ చేసిన ఆయన ఇద్దరు వియ్యంకులు ఓటమిపాలయ్యారు. విజయనగరం లోక్‌సభ స్థానం నుంచి పోటీచేసిన అశోక్ గజపతిరాజు, విజయనగరం శాసనసభ స్థానం నుంచి పోటీ చేసిన ఆయన కుమార్తె అథితి ఓడిపోయారు. -
మోదీ, బాబుని సాగనంపే రోజులు వచ్చాయ్
ఎమ్మిగనూరు: దేశంలో ప్రధాని మోదీ, రాష్ట్రంలో చంద్రబాబును సాగనంపే రోజులు దగ్గర పడ్డాయని..అందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని కేంద్ర మాజీ మంత్రి కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి వ్యాఖ్యానించారు. బుధవారం ఎమ్మిగనూరు నియోజకవర్గ పరిధిలో కోట్ల పర్యటించారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ..ప్రజలను రక్షించే వారు పాలకులు అవుతారే తప్ప భక్షించే వాళ్లు కాదన్నారు. దేశంలో, రాష్ట్రంలో రోజు రోజుకూ మహిళలపై దాడులు పెరిగిపోతున్నా పాలకులు నోరు విప్పడం లేదని మండిపడ్డారు. రానున్న రోజుల్లో రాహుల్‌ను ప్రధాని చేసి ఇందిరమ్మ రాజ్యం-ఇంటింటా సౌభాగ్యం అనే పాలన మరోసారి తెచ్చుకుందామని అన్నారు. ఈ నెల 18వ తేదీ కర్నూలులో రాహుల్ పర్యటనతో రాష్ట్ర రాజకీయ సమీకరణాలు మారబోతున్నాయని వ్యాఖ్యానించారు. -
సీమ కాంగ్రెస్‌లో ‘రాయల’ చిచ్చు!
రాయల తెలంగాణ కోసం కర్నూలు, అనంత నేతల యత్నాలు మేడం అపాయిట్మెంట్ కోసం యత్నిస్తున్న కోట్ల అనంత వెంకట్రామిరెడ్డి నివాసంలో రఘువీరా, కోట్ల మంతనాలు రాష్ట్ర విభజన అనివార్యమని తేలిపోవడంతో కర్నూలు, అనంతపురం జిల్లాల కాంగ్రెస్ నేతలు మళ్లీ ‘రాయల తెలంగాణ’ ప్రతిపాదనను తెరపైకి తెస్తున్నారు. విభజన అనివార్యమైతే తమ రెండు జిల్లాలను తెలంగాణలోనే కొనసాగించాలే తప్ప సీమాంధ్రలో విలీనం చేస్తే ఒప్పుకునే ప్రసక్తే లేదని డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయాన్ని మరోసారి పార్టీ అధ్యక్షురాలు సోనియాగాంధీ దృష్టికి తీసుకెళ్లేందుకు రైల్వేశాఖ సహాయ మంత్రి కోట్ల సూర్యప్రకాశ్‌రెడ్డి ప్రయత్నిస్తున్నారు. మంగళవారం కోట్ల నివాసంలో మంత్రులు ఏరాసు ప్రతాపరెడ్డి, టీజీ వెంకటేశ్ సమావేశమై ఈ అంశంలో హైకమాండ్ పెద్దలపై ఒత్తిడి తేవాలని నిర్ణయించారు. ఈ మేరకు సోనియాగాంధీ అపాయిట్మెంట్ కోరినప్పటికీ ఇంకా ఖరారు కాకపోవడంతో టీజీ, ఏరాసు హైదరాబాద్ వెళ్లిపోయారు. మరోవైపు నిన్నటి వరకు రాష్ట్రం సమైక్యంగా ఉంచడం మినహా మరో ప్రత్యామ్నాయాన్ని అంగీకరించే ప్రసక్తే లేదని నినదించిన అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి స్వరం మారింది. ఆయన మంగళవారం తన నివాసంలో మంత్రి ఎన్.రఘువీరారెడ్డి, రాజంపేట ఎంపీ సాయిప్రతాప్‌కు మధ్యాహ్న విందునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ తమ జిల్లా ప్రజల నుంచి రాయల తెలంగాణ డిమాండ్ వస్తోందని చెప్పారు. కేంద్రం లేదా కాంగ్రెస్ పార్టీ ఈ దిశగా ప్రతిపాదనలు సిద్ధం చేస్తే మద్దతిచ్చే విషయంపై ఆలోచిస్తామని చెప్పారు. సాయిప్రతాప్ మాత్రం రాష్ట్రాన్ని విడదీయడం కంటే సమైక్యంగా కొనసాగించి పదేళ్ల పాటు అభివృద్ధి చేసిన తరువాతే విభజన గురించి ఆలోచిస్తే బాగుంటుందని అభిప్రాయపడ్డారు. ‘రాయల తెలంగాణ’ వెనుక వేరే ఉద్దేశం? ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి సన్నిహితులు మాత్రం రాయల తెలంగాణ ప్రతిపాదన వెనుక వేరే దురుద్దేశాలున్నాయని అభిప్రాయపడ్డారు. హైకమాండ్ పెద్దలు దీని వెనుక పథక రచన చేసినట్లు కన్పిస్తోందని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అసెంబ్లీలో విభజన బిల్లుపై చర్చ జరిగితే మెజారిటీ సభ్యుల అభిప్రాయాలు వ్యతిరేకంగా ఉండే పరిస్థితి కన్పించడంతో రాయల తెలంగాణ పేరుతో కొందరిని, పదవుల పేరుతో మరికొందరిని విడదీసి మెజారిటీ అభిప్రాయాలు బిల్లుకు అనుకూలంగా వచ్చేలా చేయాలన్నదే హైకమాండ్ పెద్దల లక్ష్యంగా కన్పిస్తోందన్నారు. ఇప్పటికే సీమాంధ్రకు చెందిన పలువురు మంత్రులు విభజన విషయంలో రాజీపడి హైకమాండ్ లైన్లో వెళుతున్నారని, రాయల తెలంగాణ పేరుతో మరికొంతమందిని సమైక్య భావనకు దూరం చేయాలనే వ్యూహంతోనే తెరపైకి మళ్లీ ఈ అంశాన్ని తెచ్చారని పేర్కొంటున్నారు. సమైక్యం కోసం పోరాడుతా: శైలజానాథ్ సాక్షి, హైదరాబాద్: సమైక్యాంధ్రప్రదేశ్ కోసం తన పోరాటం కొనసాగిస్తానని సీమాంధ్ర కాంగ్రెస్ ప్రజాప్రతినిధుల కన్వీనర్ సాకే శైలజానాథ్ తెలిపారు. తాను ఎవర్నీ మభ్యపెట్టడంలేదని, కేంద్ర మంత్రుల బృందం(జీవోఎం)తో భేటీకి హాజరైన తర్వాత తనకేమీ పశ్చాత్తాపం లేదని అన్నారు. ఏవో సొంత ఆలోచనలతో రాయల తెలంగాణ అనకుండా వాస్తవాల ఆధారంగా డిమాండ్ చేయాలని మంగళవారం హైదరాబాద్‌లో అన్నారు.