KP Sharma
-
నేపాల్ కొత్త అధ్యక్షుడిగా పౌద్యాల్!
కాఠ్మాండూ: నేపాల్ నూతన అధ్యక్షుడిగా నేపాలీ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత రామచంద్ర పౌద్యాల్ ఎన్నికయ్యే అవకాశముంది. దేశాధ్యక్ష ఎన్నికల్లో భాగంగా శనివారం ఆయన అభ్యర్థిత్వానికి ఎనిమిది రాజకీయ పార్టీలు మద్దతు పలికాయి. కేపీ శర్మ ఓలీ నేతృత్వంలోని సీపీఎన్(యూఎంఎల్), పుష్పకమల్ దహాల్(ప్రచండ) నేతృత్వంలోని సీపీఎన్(మావోయిస్ట్ సెంటర్), మరో ఐదు పార్టీ లు కలిసి కూటమిగా ఏర్పడి ప్రభుత్వాన్ని ఏర్పాటుచేసిన సంగతి తెల్సిందే. అయితే కూటమి పార్టీ అయిన సీపీఎన్(యూఎంఎల్) బలపరిచిన అభ్యర్థి సుభాష్ నెబాంగ్కి కాకుండా అధికార కూటమిలోలేని వేరొక పార్టీ అభ్యర్థి కి ప్రధానమంత్రి ప్రపంచ మద్దతు పలకడంతో రెండునెలల క్రితమే కొలువుదీరిన ప్రభుత్వం కూలే పరిస్థితులు నెలకొన్నాయి. నేపాల్ పార్లమెంట్లో పార్టీ ల ప్రస్తుత బలాబలాల ప్రకారం ఈ ఎనిమిది పార్టీ లు బలపరిచే అభ్యర్థే వచ్చే నెలలో జరిగే దేశాధ్యక్ష ఎన్నికల్లో గెలుస్తారు. ప్రచండ నిర్ణయంతో ఆగ్రహించిన అధికార కూటమిలోని నేషనల్ డెమొక్రటిక్ పార్టీ తాము ప్రభుత్వం నుంచి వైదొలుగుతున్నట్లు ప్రకటించింది. రాష్ట్రీయ ప్రజాతంత్ర పార్టీ చైర్మన్ రాజేంద్ర ప్రసాద్ లింగ్డెన్ ఉపప్ర«దానిగా రాజీనామా చేశారు. కూటమి పార్టీ లు మద్దతు ఉపసంహరిస్తే నెలరోజుల్లోపు పార్లమెంట్లో ప్రచండ విశ్వాస పరీక్షలో నెగ్గాలి. -
మోదీతో నేపాల్ ప్రధాని భేటీ
న్యూఢిల్లీ: మూడు రోజుల పర్యటన నిమిత్తం శుక్రవారం భారత్ చేరుకున్న నేపాల్ ప్రధాని కేపీ శర్మ ఓలి ప్రధాని మోదీతో భేటీ అయ్యారు. ఆ తరువాత నేపాల్ రాయబార కార్యాలయంలో నేపాల్ ప్రజలనుద్దేశించి ప్రసంగించారు. అంతకుముందు విమానాశ్రయంలో ఆయనకు కేంద్ర హోం మంత్రి రాజ్నాథ్ స్వాగతం పలికారు. ఓలి శనివారం ప్రధాని మోదీతో ప్రతినిధుల స్థాయి చర్చల్లో పాల్గొంటారు. ఆదివారం ఉత్తరాఖండ్లోని పంత్నగర్లో ఉన్న జీబీ పంత్ వ్యవసాయ, సాంకేతికత యూనివర్సిటీని సందర్శిస్తారు. అక్కడి సంకరణ విత్తనాల ఉత్పత్తి కేంద్రం, ఇంటిగ్రేటెడ్ ఫార్మింగ్ కేంద్రాన్ని పరిశీలిస్తారు. అదే యూనివర్సిటీ ఓలికి గౌరవ డాక్టరేట్ ప్రదానం చేయనుంది. -
బీజేపీలో జేవీపీ విలీనం
రాంచి: జార్ఖండ్ వికాస్ మోర్చా (జేవీపీ-ప్రజాతాంత్రిక్)లోని ఒక వర్గం బుధవారం లాంఛనంగా బీజేపీలో విలీనమైంది. కేపీ శర్మ అధ్యక్షతలోని జేవీపీకి చెందిన ఐదుగురు ఎమ్మెల్యేలు- సర్మేశ్ సింగ్, చంద్రికా మహతా, జై ప్రకాశ్ భోక్తా, నిర్భయ్ సహవాది, పూల్చంద్ మండల్ బీజేపీలో చేరారు. రాంచీలోని పార్టీ కార్యాలయంవద్ద జరిగిన కార్యక్రమంలో సీనియర్ బీజేపీ నేత అర్జున్ ముండా, పార్టీ ప్రధాన కార్యదర్శి భూపేంద్ర యాదవ్, జార్ఖండ్ శాఖ అధ్యక్షుడు రవీంద్ర రాయ్ వారిని పార్టీలోకి స్వాగతించారు. జేవీపీ-ప్రజాతాంత్రిక్ అధ్యక్షుడు బాబూలాల్ మారాండీ కూడా బీజేపీలో చేరాలని అర్జున్ ముండా విజ్ఞప్తి చేశారు.