to krishna
-
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
భద్రాచలం : ఈ నెల 12 నుంచి 23 వరకు జరుగనున్న పుష్కరాలకు కృష్ణ నది ఉన్న అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపబడునని భద్రాచలం డిపో మేనేజర్ ఎన్. నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కొరకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే బస్సులు ఇబ్రహీంపట్నం వరకు వెళ్తాయని, అక్కడ నుంచి 4పి, 4బి, 4ఎస్ నంబర్ల గల ఉచిత బస్సులు కృష్ణా పుష్కర ఘాట్ల వద్దకు ఉచితంగా భక్తులను చేర్చుతాయన్నారు. ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9959225987 నంబరును సంప్రదించాలన్నారు. -
పుష్కరాలకు ప్రత్యేక బస్సులు
భద్రాచలం : ఈ నెల 12 నుంచి 23 వరకు జరుగనున్న పుష్కరాలకు కృష్ణ నది ఉన్న అన్ని ప్రాంతాలకు ప్రత్యేక బస్సులు నడుపబడునని భద్రాచలం డిపో మేనేజర్ ఎన్. నర్సింహ ఒక ప్రకటనలో తెలిపారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే ప్రయాణికుల కొరకు ఉదయం 3 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు ప్రతి 20 నిమిషాలకు ఒక బస్సు ఉంటుందన్నారు. విజయవాడ కృష్ణా పుష్కరాలకు వెళ్లే బస్సులు ఇబ్రహీంపట్నం వరకు వెళ్తాయని, అక్కడ నుంచి 4పి, 4బి, 4ఎస్ నంబర్ల గల ఉచిత బస్సులు కృష్ణా పుష్కర ఘాట్ల వద్దకు ఉచితంగా భక్తులను చేర్చుతాయన్నారు. ప్రయాణికులు ఈ బస్సు సౌకర్యాలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 9959225987 నంబరును సంప్రదించాలన్నారు.