krishnapuram
-
కేపీ ఉల్లి: అధిక యాంటీ ఆక్సిడెంట్లు, ఫినోలిక్ సమ్మేళనాలు!
వైవీయూ: తల్లి చేయని మేలు ఉల్లి చేస్తుందనే నానుడి తెలుగునాట ఎంతో ప్రాచుర్యం.. అలాంటి ఉల్లిలో ప్రత్యేకమైన కేపీ ఉల్లికి అంతర్జాతీయ ఖ్యాతి దక్కింది. ఈ ఉల్లిపై వైవీయూ (యోగి వేమన విశ్వవిద్యాలయం) వృక్షశాస్త్ర విభాగం చేపట్టిన పరిశోధనల్లో పలు అంశాలు వెలుగులోకి రావడంతో దీని ప్రాధాన్యత పెరిగింది. దీనికి తోడు కేపీ ఉల్లిని ఈ ప్రాంత పంటగా జియోట్యాగ్ కోసం వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నిస్తుండగా, అంతర్జాతీయ ప్రఖ్యాత జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్లో పరిశోధక పత్రం ప్రచురితమై ఖ్యాతిని మరింత విస్తరించేలా చేసింది. కేపీ ఉల్లిగా కృష్ణాపురం ఉల్లి వైఎస్సార్ జిల్లా మైదుకూరు పరిధిలోని కృష్ణాపురంలో రైతులు ఉల్లి పంటను ఎక్కువగా పండించడంతో కృష్ణాపురం ఉల్లి (కేపీ ఉల్లి)గా ప్రసిద్ధికెక్కింది. కేపీ ఉల్లిని సలాడ్స్, సాస్, సూప్‌లలో విపరీతంగా వినియోగిస్తున్నారు. ప్రపంచ దేశాల్లో అనేక రకాల పేర్లతో ఉల్లి వంగడాలను పండిస్తున్నప్పటికీ కేపీ ఉల్లి ఎగుమతి కావడానికి ఆరోగ్యపరంగా అత్యధిక ప్రయోజనాలు ఉండటమేనని పరిశోధకులు గుర్తించారు. వ్యాధి నిరోధకత పెంచే యాంటీ ఆక్సిడెంట్లు.. కేపీ ఉల్లిలో ఫినోలిక్ సమ్మేళనాలు సమృద్ధిగా ఉండటంతో పాటు అధిక యాంటీ ఆక్సిడెంట్లు ఉండటం కారణంగా ఇందులో వ్యాధి నిరోధకతను పెంచే సామర్థ్యం ఉన్నట్లు వైవీయూ వృక్షశాస్త్ర పరిశోధకులు వెల్లడించారు. వైవీయూ వృక్షశాస్త్ర ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ మార్గదర్శకంలో డాక్టర్ జి. విజయలక్ష్మి, ఇటలీలోని ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫుడ్ సైన్స్, నేషనల్ కౌన్సెల్ పరిశోధకులు సంయుక్తంగా కేపీ ఉల్లిపై పరిశోధనలు సాగించారు. ఈ పరిశోధనల్లో కేపీ ఉల్లికి ఒక ప్రత్యేకత ఉందని.. దీనికి సంబంధించిన విశిష్టతలను తెలియజేస్తూ ‘ఇంటర్నేషనల్ జర్నల్ ఆఫ్ బయోలాజికల్ సైన్స్ స్ప్రింగర్’లో పరిశోధక వ్యాసం ప్రచురితమైంది. అలాగే, వైఎస్సార్ జిల్లాకు చెందిన కేపీ ఉల్లిని ప్రత్యేక వంగడం (లాండ్‌రేస్)గా పరిశోధకులు పేర్కొన్నారు. ప్లేవనాయిడ్ కంటెంట్, యాంటి యాక్సిడెంట్లు ఇందులో ఎక్కువని పరిశోధనల్లో తేల్చారు. కేపీ ఉల్లి ప్రత్యేకించి ముదురు ఎరుపు రంగును కలిగి ఉండటానికి కారణం అందులోని ఆంథోసైనిన్ అని గుర్తించారు. అదే విధంగా యాంటీ ఆక్సిడెంట్స్ అయిన ప్లావినాయిడ్స్ రోగ నిరోధకతను కల్గిస్తాయని శాస్త్రీయంగా నిరూపించారు. ఇందులోని లక్షణాలు మరే ఇతర రకాల్లో లభించవని పరిశోధకులు స్పష్టంచేశారు. జియోట్యాగ్ కోసం ప్రయత్నం.. కేపీ ఉల్లికి జియోట్యాగ్ (భౌగోళికపరమైన గుర్తింపు) పొందేందుకు వైవీయూ వృక్షశాస్త్ర విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది. జియోట్యాగ్ వస్తే కేపీ ఉల్లికి న్యాయపరమైన రక్షణ లభిస్తుంది. ఈ వంగడాన్ని ఇతరులు అనధికారికంగా వినియోగించుకునే అవకాశం ఉండదు. ఈ ప్రాంత ఉత్పత్తిదారులకు ఎగుమతుల విషయంలో ఆర్థిక ప్రయోజనం కలుగుతుంది. అందువల్ల ప్రభుత్వ గుర్తింపు సంస్థలు, రిజిస్టర్డ్ రైతు సంస్థలు ముందుకు వచ్చి సహకారం అందించి జియోట్యాగ్ లభించేలా చూడాలని వృక్షశాస్త్ర సహాయ ఆచార్యులు డాక్టర్ పీఎస్ షావల్లీఖాన్ కోరారు. మరోవైపు.. కేపీ ఉల్లిపై పరిశోధనలు చేసిన డాక్టర్ విజయలక్ష్మి దాని పుష్పాల నుంచి ఉల్లి మొక్కలు సృష్టించడం విశేషం. -
కృష్ణాపురంలో సౌర వెలుగులు
జలశుద్ధి కేంద్రం విద్యుత్ బిల్లులను ఆదా చేయడమే గాకుండా.. మరింత విద్యుత్‌ను విక్రయించడం ద్వారా ఆదాయాన్ని సమకూర్చుకునే వైపు గ్రేటర్ విశాఖ మున్సిపల్ కార్పొరేషన్(జీవీఎంసీ) అడుగులు వేస్తోంది. ఇందు కోసం శృంగవరపుకోట మండలం కృష్ణాపురం జలశుద్ధి కేంద్రాన్ని వేదికగా చేసుకుంది. ఇక్కడ 1.5 మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించి.. జలశుద్ధి కేంద్రానికి విద్యుత్ సరఫరా చేయడంతో పాటు మిగులు విద్యుత్‌ను విక్రయించేందుకు సన్నాహాలు చేస్తోంది. పనులు కూడా చకచకా సాగుతున్నాయి. మే మొదటి, రెండో వారంలో ప్రారంభానికి సమాయత్తమవుతోంది. శృంగవరపుకోట రూరల్(విజయనగరం): ఎస్.కోట మండలం కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో 1.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణ పనులు యుద్ధప్రాతిపదికన జరుగుతున్నాయి. విశాఖ స్మార్ట్ సిటీ రూపకల్పనలో భాగంగా సుమారు రూ.10 కోట్ల నిధులను ఈ సోలార్ విద్యుత్ ప్లాంట్ నిర్మాణానికి ఖర్చు చేస్తున్నారు. 1.5 మెగావాట్ల విద్యుత్ సరఫరాకు 4800 సోలార్ మాడ్యుల్స్‌ను ఈపీసీ కాంట్రాక్టర్ నోవస్ గ్రీన్ ఎనర్జీ సిస్టమ్స్ ప్రయివేట్ లిమిటెడ్(జీవీఎస్సీసీఎల్) సంస్థ కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మాణ పనులను చేపడుతోంది. ఇక్కడి సోలార్ ప్లాంట్ నుంచి ఉత్పత్తయ్యే విద్యుత్‌ను పోతనాపల్లి వద్ద గల విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేయనున్నారు. మొత్తంగా మే మొదటి లేదా రెండో వారంలో సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను ప్రారంభించేందుకు జీవీఎంసీ సన్నాహాలు చేస్తోంది. 25 ఏళ్ల పాటు ఆదాయం ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న ఈ సోలార్ మాడ్యుల్స్ ప్లాంట్ ద్వారా 25 సంవత్సరాల పాటు విద్యుత్‌ను సరఫరా చేయడం ద్వారా జీవీఎంసీకి ఆదాయం సమకూరుతుంది. ఇదే సమయంలో కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం నిర్వహణకు అవసరమైన విద్యుత్ వినియోగానికి నెలకు సుమారు రూ.6 లక్షల వరకు బిల్లుల రూపంలో జీవీఎంసీ చెల్లిస్తోంది. అయితే ప్రస్తుతం జలశుద్ధి కేంద్రం ఆవరణలో ఏర్పాటు చేస్తున్న సోలార్ ప్లాంట్ ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను నేరుగా గ్రిడ్‌కు సరఫరా చేయటం వల్ల కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం వినియోగిస్తున్న బిల్లులను మినహాయించుకుని.. అదనంగా తీసుకున్న విద్యుత్‌కు అయిన మొత్తాన్ని జీవీఎంసీ ఖాతాకు విద్యుత్ శాఖ జమ చేయనుంది. ప్లాంట్ నిర్వహణ ద్వారా పలువురికి ఉపాధి ఈ సోలార్ మాడ్యుల్స్ ప్లాంట్ నిర్వహణకు సుమారు ఐదు నుంచి ఎనిమిది మంది వ్యక్తులకు ఉపాధి లభించవచ్చని తెలుస్తోంది. 10 నుంచి 15 రోజులకోసారి సోలార్ మాడ్యుల్స్‌పై పేరుకుపోయిన దుమ్ము ధూళిని శుభ్రపరచటం, ప్లాంట్ ఆవరణలో పెరిగిన తుప్పలు, గడ్డి వంటివి తొలగించే పనులు చేయాల్సి ఉంటుంది. ఇక జీవీఎంసీ ఆధ్వర్యంలో ఎస్.కోట మండలం కృష్ణాపురం జలశుద్ధి కేంద్రంలోను, సింహాచలం సమీపంలో కూడా సోలార్ విద్యుత్ ప్లాంట్ రూపుదిద్దుకుంటోంది. తద్వారా ఆదాయంతో పాటు పలువురికి ఉపాధి కూడా లభిస్తుంది. త్వరలో ప్రారంభానికిసన్నాహాలు కృష్ణాపురం జలశుద్ధి కేంద్రం ఆవరణలో నిర్మిస్తున్న 1.5 మెగావాట్ల సోలార్ విద్యుత్ ప్లాంట్‌ను త్వరలో ప్రారంభించనున్నాం. 4800 సోలార్ మాడ్యుల్స్ ఏర్పాటు ద్వారా ఉత్పత్తయిన విద్యుత్‌ను నేరుగా విద్యుత్ సబ్‌స్టేషన్ ద్వారా గ్రిడ్‌కు అనుసంధానం చేస్తాం. తద్వారా జలశుద్ధి కేంద్రం వినియోగిస్తున్న నెలవారీ విద్యుత్ బిల్లింగ్‌ను కట్ చేస్తారు. అదనంగా విద్యుత్తును ఉత్పత్తి చేసినట్టయితే అందుకు తగ్గ నిధులను జీవీఎంసీ ఖాతాలో జమ చేస్తారు.– శ్రీనివాస్, ఎలక్ట్రికల్ విభాగం డీఈఈ, జీవీఎంసీ త్వరితగతినసోలార్ మాడ్యుల్స్ అమరిక 1.5 మెగావాట్ల విద్యుత్‌ను ఉత్పత్తి చేసేందుకు 4800 సోలార్ మాడ్యూల్స్‌ను అమర్చే పనులు చురుగ్గా జరుగుతున్నాయి. ఇందు కోసం రోజుకు 50 మంది పని చేస్తున్నారు. మరికొద్ది రోజుల్లో పనులు పూర్తవుతాయి. ప్లాంట్ నిర్వహణకు కూడా కొంత మందిని తీసుకుంటాం.– జె.నాగరాజు, సైట్ ఇంజినీరింగ్ ఇన్చార్జ్ -
పాముకాటుతో విద్యార్థి మృతి
గార్లదిన్నె: మండల పరిధిలోని క్రిష్ణాపురంలో గురువారం పాముకాటుతో ఓ విద్యార్థి మృతి చెందిన సంఘటన జరిగింది. 108 సిబ్బంది, వైద్య సిబ్బంది తెలిపిన వివరాలు మేరకు పట్ర సూరి అనే వ్యక్తి కుమారుడు ప్రసాద్ (9) అనే విద్యార్థి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. బుధవారం రాత్రి కుటుంబ సభ్యులంతా నిద్రకు ఉపక్రమించారు. అయితే గురువారం తెల్లవారు జామున ప్రసాద్ నోట్లో నురుగు వస్తుండటాన్ని గమనించి వెంటనే చికిత్స నిమిత్తం 108కు సమాచారం అందించగా అనంతపురము ప్రభుత్వాస్పత్రికి తరలించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ విద్యార్థి చనిపోయాడన్నారు. పాము కాటుకు గురైనట్లు వైద్యులు గుర్తించారు. సమాచారం అందుకున్న తహసీల్దార్ గోపాల్‌రెడ్డి, ఎంపీడీఓ భాస్కర్‌రెడ్డిలు విద్యార్థి మృతదేహన్ని పరిశీలించారు. -
సంచలనం
► నాతవరం మండలంలో జంట హత్యలు ► సహచరిపై అనుమానంతో గునపంతో దాడి ► మహిళ, ఆమె ప్రియుడు హతం విశాఖపట్నం : తెలతెలవారుతుండగానే కలకలం రేగింది.. జంట హత్యలతో గ్రామమంతా విస్తుబోయింది.. ఆరేళ్ల నుంచి తనతో సహజీవనం చేస్తున్న మహిళ వేరొకరికి దగ్గర కావడం సహించలేకపోయాడు.. మద్యం మత్తులో ఉన్నట్టు నటించి సహచరి, ఆమె ప్రియుడు ఒక్కచోటకు చేరేక కిరాతకంగా హతమార్చాడు. నాతవరం మండలంలో శనివారం తెల్లవారుజామున జరిగిన జంట హత్యలు సంచలనం సృష్టించాయి. కె.వి.శరభవరం పంచాయతీ శివారు కృష్ణాపురం గ్రామానికి చెందిన వంజరి రాము అనుమానంతో తనతో సహజీవనం చేస్తున్న సంధ్యారాణి (26)ని, ఆమెతో సన్నిహితంగా మెలుగుతున్న కాళ్ల రాంబాబు (46)ను కిరాతకంగా గునపంతో కొట్టి చంపేశాడు. నిందితుడు, గ్రామస్తుల కథనం ప్రకారం.. రాముకు గతంలో వివాహం జరిగింది. మొదటి భార్యకు దూరంగా ఉంటూ ఆరేళ్ల నుంచి సంధ్యారాణితో కలిసి ఉంటున్నాడు. వీరికి మూడేళ్ల కుమారుడు ఉన్నాడు. కొంతకాలంగా వెదురుపల్లి గ్రామానికి చెందిన కాళ్ల రాంబాబుకు సంధ్యారాణికి మధ్య వివాహేతర సంబంధం నడుస్తోంది. ఈ విషయం గమనించిన రాము.. పద్ధతి మార్చుకోమని పలుమార్లు హెచ్చరించాడు. అయినప్పటికీ మార్పు రాకపోవడంతో కొన్నాళ్లుగా కోపంగా ఉన్నాడు. పథకం ప్రకారం.. శుక్రవారం రాత్రి కృష్ణాపురం గ్రామంలో జరిగిన వివాహ వేడుకలకు రాము, సంధ్యారాణి కలిసివెళ్లారు. ఆ పెళ్లికి రాంబాబుకు కూడా వచ్చాడు. దీంతో రాము అనుమానం మరింత బలపడింది. వీరి ప్రవర్తనపై ఓ కన్నేసి ఉంచాడు. పెళ్లి సమయంలో వారిద్దరి కనుసైగలను గమనించి మద్యం మత్తులో ఉన్నట్టు నటించాడు. అర్ధరాత్రి సమయంలో నిద్ర వస్తోందని సంధ్యారాణితో కలిసి ఇంటికి వెళ్లిపోయాడు. మత్తుగా పడుకున్నాడని భావించిన ఆమె పెరట్లో వేచివున్న రాంబాబు వద్దకు మెల్లగా జారుకుంది. రాము పథకం ప్రకారం గునపంతో ఇద్దరిపై దాడి చేశాడు. వారి కళ్లు, ముఖాలపై కసి తీరా కొట్టి ప్రాణాలు తీశాడు. కేకలు విని చుట్టుపక్కల వారు ఏం జరిగిందని వెళ్లి చూడగా రాంబాబు, సంధ్యారాణి రక్తం మడుగులో పడివున్నారు. రాము వెంటనే నాతవరం పోలీసు స్టేషన్‌కు వెళ్లి లొంగిపోయాడు. ఈ సంఘటనపై వీఆర్వో సత్తిబాబు పోలీసులకు ఫిర్యాదు చేశారు. నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ, కొత్తకోట సీఐ జి.కోటేశ్వరరావు, ఎస్ఐ అశోక్‌కుమార్ సంఘటన స్థలంలో ఉన్న జంట మృతదేహాలను పరిశీలించారు. గ్రామస్తులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం నర్సీపట్నం ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
విశాఖ జిల్లాలో దారుణం
విశాఖపట్నం: జిల్లాలో దారుణ సంఘటన వెలుగుచూసింది. జిల్లాలోని నాతవరం మండలం సరుగుడు పంచాయతి పరిధిలోని కృష్ణాపురం గ్రామంలో జంటహత్యలు కలకలం రేపాయి. గ్రామానికి చెందిన ఓ మహిళ, ఓ పురుషుడు శుక్రవారం రాత్రి దారుణ హత్యకు గురయ్యారు. ఇది గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ఆస్పత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్యలు జరిగి ఉంటాయని స్థానికులు అంటున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
గుంటూరు జిల్లాలో భారీ అగ్నిప్రమాదం
శావల్యపురం(గుంటూరు): గుంటూరు జిల్లా శావల్యపురం మండలం కృష్ణపురంలో శనివారం భారీ అగ్నిప్రమాదం సంభవించింది. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ జరగడంతో.. మంటలంటుకొని రెండిళ్లు కాలి బూడిదయ్యాయి. ఈ ప్రమాదంలో రూ. 10 లక్షల ఆస్తి నష్టం వాటిల్లినట్లు సమాచారం. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకునే లోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది. -
వేధింపులతో విద్యార్థిని బలవన్మరణం
మదనపల్లె రూరల్ (చిత్తూరు) : ప్రేమ పేరుతో యువకుడి వేధింపులు తాళలేక ఓ యువతి ఆత్మహత్య చేసుకుంది. చిత్తూరు జిల్లా పుంగనూరు మండలం కృష్ణాపురంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలం పాలెంకొండ గ్రామానికి చెందిన వెంకటరమణ కుమార్తె(18) ఇటీవలే ఇంటర్ పూర్తి చేసింది. అదే గ్రామానికి చెందిన ఎంబీఏ చదివే వెంకట నారాయణ(22)తో కొన్నాళ్లుగా ఆమెకు పరిచయం ఉంది. అయితే ఇటీవల ప్రేమిస్తున్నానంటూ ఆమె వెంటపడుతున్నాడు. దీనిపై ఆమె కుటుంబసభ్యులకు తెలిపింది. వారి సూచన మేరకు పెద్దనాన్న ఉండే పుంగనూరు మండలం కృష్ణాపురం వెళ్లిపోయింది. అక్కడే ఉండి చదువుకునేందుకు సిద్ధమవుతోంది. ఈ విషయం తెలుసుకున్న వెంకట నారాయణ శనివారం ఉదయం అక్కడికి వెళ్లాడు. ఇది గమనించిన పెద్దనాన్న కుటుంబసభ్యులు అతడిని వెంటబడి తరిమారు. ఈ గొడవతో తీవ్ర మనస్తాపం చెందిన యువతి ఇంట్లోనే విష గుళికలు మింగింది. ఆస్పత్రికి తరలించిన కొద్దిసేపటికే మృతిచెందింది. -
బాలికపై అత్యాచారయత్నం
నెల్లూరు: ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై ఓ దుండగుడు అత్యాచారానికి యత్నించాడు. ఈ ఘటన శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెం మండలంలో ఆదివారం వెలుగులోకి వచ్చింది. జిల్లాలోని జలదంకి మండలం కృష్ణాపురం గ్రామానికి చెందిన పి. వెంకట రత్నం(30) బుచ్చిరెడ్డి పాలెం మండలం పెనుబల్లి గ్రామానికి వచ్చాడు. అయితే శనివారం రాత్రి గ్రామంలో ఓ ఇంట్లో ఒంటరిగా ఉన్న బాలికపై అత్యాచారానికి యత్నించాడు. బాలిక వెంకటరత్నంను ప్రతిఘటించి గట్టిగా కేకలు వేయడంతో స్థానికులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. దీంతో వెంకటరత్నం పరారయ్యాడు. బాలిక కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు, కేసు నమోదు చేసుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.