kuchibhatla srinivas
-
'అమెరికాలో తెలంగాణ విద్యార్థులకు భద్రత కల్పించాలి'
తెలంగాణ అమెరికా తెలుగు సంఘం తీర్మాణం రాయికల్ : అమెరికాలో తెలుగు వాళ్లపై జరుగుతున్న దాడుల నుంచి ముఖ్యంగా తెలంగాణ వారిని రక్షించేలా యుద్ధ ప్రతిపాదికన చర్యలు తీసుకోవాలని తెలంగాణ అమెరికా తెలుగు సంఘం సభ్యులు తీర్మానించారు. మంగళవారం అమెరికాలోని వర్జీనియాలో బోర్డు కమిటి సమావేశం నిర్వహించగా తెలంగాణ రాష్ట్రానికి చెందిన ప్రతినిధులు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, తెలంగాణ ఆచార సాంప్రదాయాలను కాపాడటం కోసమే ఈ సంఘం పనిచేస్తుందని, దీని కోసం ప్రతి ఒక్కరు కృషి చేయాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ఏప్రిల్ 29న రెండో వార్షికోత్సవ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. దీనిపై తీసుకోవాల్సిన ప్రణాళికలను ప్రజెంటేషన్ రూపంలో వివరించారు. ముఖ్యంగా అమెరికాలో జరుగుతున్న దాడులను ఖండించి ఇటీవల కాన్సస్‌లో జరిగిన కాల్పుల్లో మృతిచెందిన ఇంజినీర్ శ్రీనివాస్ మృతిపట్ల బోర్డు సభ్యులు సంతాపం వ్యక్తం చేసినట్లు మీడియా ఇన్చార్జి బండ ఈశ్వర్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రతినిధులు మల్లారెడ్డి, ఝాన్సీరెడ్డి, విజయ్‌పాల్, సుధాకర్, శ్రీనివాస్, రవీందర్, వంశీరెడ్డి, శరత్, నవీన్‌రెడ్డి పాల్గొన్నారు. -
అమెరికా కంపెనీ పెద్దమనసు
అమెరికాలో దారుణ హత్యకు గురైన తెలుగు ఇంజినీర్ కూచిభొట్ల శ్రీనివాస్ భార్య సునయనకు అండగా నిలబడేందుకు ఆయన పనిచేసే కంపెనీ ముందుకొచ్చింది. శ్రీనివాస్ హెచ్1బి వీసాతో అమెరికాలో పనిచేసేందుకు వెళ్లారు. అక్కడ గార్మిన్ అనే కంపెనీలో ఆయన పనిచేసేవారు. అయితే ఇప్పుడు ఆయన లేకపోవడంతో.. ఆయన వద్దకు వెళ్లేందుకు వీసా తీసుకుని ఉంటున్న సునయన శ్రీనివాస్ అంత్యక్రియల తర్వాత మళ్లీ అమెరికా వెళ్లేందుకు వీలుండదు. ఈ విషయాన్ని ఆమె అమెరికాలో ఉన్నప్పుడే నిర్వహించిన మీడియా సమావేశంలో చెప్పి.. గార్మిన్ కంపెనీ తాను మళ్లీ అమెరికా వచ్చేందుకు, ఇక్కడ తాను శ్రీనివాస్ కలలను నెరవేర్చేందుకు తాను ఎంచుకున్న రంగంలో విజయవంతం అయ్యేందుకు సాయపడాలని కోరారు. శ్రీనివాస్‌కు హెచ్1బి వీసా ఉండగా, సునయనకు హెచ్4 వీసా ఉంది. దాని ఆధారంగా ఆమె అమెరికాలో ఉండేందుకు, పనిచేసేందుకు వీలుంటుంది. ఇప్పుడు సునయన అమెరికా వచ్చేందుకు వీలుగా తగిన వీసా సిద్ధం చేసేందుకు గార్మిన్ న్యాయ ప్రతినిధులు, వాళ్ల ఇమ్మిగ్రేషన్ అధికారులు ప్రయత్నిస్తున్నారు. ఆమెకు ఉచితంగా న్యాయసహాయం అందించేందుకు బ్రయాన్ కేవ్ అనే న్యాయసంస్థ సహా పలు సంస్థలు ముందుకు వచ్చినట్లు గార్మిన్ హెచ్ఆర్ వైస్ ప్రెసిడెంట్ లారీ మినార్డ్ చెప్పారు. శ్రీనివాస్ సహా భారతదేశం, మరికొన్ని ఇతర దేశాలకు చెందిన ఉద్యోగులు తమ కంపెనీలో పనిచేసేందుకు వీలుగా గార్మిన్ కంపెనీ స్పాన్సర్షిప్ అందించింది. ఇప్పుడు సునయనకు కూడా తాము అన్ని రకాలుగా సాయం చేస్తామని, ఆమె అమెరికాలోనే ఉండి పని చేసుకోడానికి అవకాశం కల్పిస్తామని గార్మిన్ ప్రతినిధులు చెప్పారు. అమెరికాలో జాతివిద్వేషంపై మరిన్ని కథనాలు చూడండి... హైదరాబాద్‌కు చేరుకున్న శ్రీనివాస్ మృతదేహం ‘కాలుస్తుంటే ఏదో ఒకటి చేయాలనిపించింది’ అమెరికాలో ప్రమాదం ఇలా తప్పించుకోండి అమెరికాలో భారతీయులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు అమెరికాలో జాతి విద్వేష కాల్పులు విద్వేషపు తూటా! మనం అమెరికాకు చెందిన వాళ్లమేనా? భారతీయుల రక్షణకు కట్టుబడి ఉండాలి కాల్పులపై శ్వేతసౌదం ఏం చెబుతుందో? నా భర్త మరణానికి సమాధానం చెప్పాలి ‘తరిమేయండి.. లేదా తలలో బుల్లెట్లు దించండి’