kukatpally mla
-
నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ...
హైదరాబాద్: 'నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు, 26 బీసీ కులాలకు న్యాయం జరగాలని' కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వం 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ 26 కులాలను బీసీ జాబితాలో చేర్చితే అధికార టీఆర్ఎస్లో చేరడానికి తాను సిద్దమని కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం తనను కలవాలని మాధవరం కృష్ణారావుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు. ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు కృష్ణారావు ఆయన నివాసానికి వచ్చారు. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని... దాంతో శుక్రవారం ఉదయం కలవాలని కృష్ణారావుకు బాబు సూచించారు. అనంతరం అక్కడే ఉన్న విలేకర్లు .... మీరు సైకిల్ దిగి... కారు ఎక్కుతున్నారటగా అని ప్రశ్నించారు. దాంతో కృష్ణారావుపై విధంగా స్పందించారు. -
'కేసీఆర్ ఒప్పుకుంటే టీఆర్ఎస్లో చేరతా'
-
'కేసీఆర్ ఒప్పుకుంటే టీఆర్ఎస్లో చేరేందుకు సిద్ధం'
హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ ఒప్పుకుంటే ఆ పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నట్లు టీడీపీ కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు అన్నారు. ఆయన బుధవారం 'సాక్షి'తో మాట్లాడుతూ 26 కులాలను బీసీల నుంచి తొలగించడంతో తన నియోజకవర్గంలో వేలాదిమంది ఇబ్బంది పడుతున్నారన్నారు. వాళ్లని బీసీ జాబితాలో చేర్చాలన్నదే తన కోరిక అని మాధవరం తెలిపారు. సమస్యను అసెంబ్లీలో లేవనెత్తినప్పుడు సొంత పార్టీ తనకు అండగా నిలవకపోవడం అసంతృప్తి కలిగించిందని మాధవరం అన్నారు. గ్రేటర్ హైదరాబాద్లో టీడీపీ బలంగా ఉంటే కంటోన్మెంట్లో ఒక్క సీటు కూడా ఎందుకు గెలుచుకోలేకపోయామని ఆయన ప్రశ్నించారు. తానొక్కడినే కాదని, తెలంగాణ టీడీపీ ఎమ్మెల్యేలంతా అధికార పార్టీతో టచ్లో ఉన్నారని మాధవరం పేర్కొన్నారు. కాగా ఈ నేపథ్యంలో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును మాధవరం కలవనున్నారు.