నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ... | 26 castes indect in BC list, demands MLA Madhavaram Krishna rao | Sakshi
Sakshi News home page

నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ...

Published Thu, Jan 29 2015 10:13 AM | Last Updated on Sat, Sep 2 2017 8:29 PM

నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ...

నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు కానీ...

హైదరాబాద్: 'నేనొక్కడిని నష్టపోయిన పర్వాలేదు, 26 బీసీ కులాలకు న్యాయం జరగాలని' కూకట్పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు గురువారం హైదరాబాద్లో స్పష్టం చేశారు.  తెలంగాణ ప్రభుత్వం 26 కులాలను బీసీల జాబితా నుంచి తొలగించడం పట్ల ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆ 26 కులాలను బీసీ జాబితాలో చేర్చితే అధికార టీఆర్ఎస్లో చేరడానికి తాను సిద్దమని కృష్ణారావు తెలిపారు. గురువారం ఉదయం తనను కలవాలని మాధవరం కృష్ణారావుకు చంద్రబాబు అపాయింట్మెంట్ ఇచ్చారు.

ఈ నేపథ్యంలో బాబును కలిసేందుకు కృష్ణారావు ఆయన నివాసానికి వచ్చారు. ప్రస్తుతం తాను బిజీగా ఉన్నానని... దాంతో శుక్రవారం ఉదయం కలవాలని కృష్ణారావుకు బాబు సూచించారు. అనంతరం అక్కడే ఉన్న విలేకర్లు .... మీరు సైకిల్ దిగి... కారు ఎక్కుతున్నారటగా అని ప్రశ్నించారు. దాంతో కృష్ణారావుపై విధంగా స్పందించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement