
హైదరాబాద్: కూకట్‌పల్లి ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు క్యాంపు కార్యాలయంలో శుక్రవారం కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఆగస్టు 1 నుంచి ప్రారంభమయ్యే పాదయాత్రకు సంబంధించిన కార్యక్రమాలను వివరించారు.
► ముఖ్యమంత్రి కేసీఆర్, మంత్రి కేటీఆర్‌ల ఆధ్వర్యంలో తొమ్మిదేళ్లలో నియోజకవర్గాన్ని వేల కోట్ల రూపాయలతో అభివృద్ధి చేశామన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో 95శాతం పనులు పూర్తయ్యాయని తెలిపారు. ప్రజలకు కావాల్సిన అన్ని మౌలిక సదుపాయాలు కలి్పస్తున్నామన్నారు. భూగర్భ పైపులైన్ల ద్వారా వదర నీరు రోడ్లపై ప్రవహించకుండా చర్యలు చేపట్టామని తెలిపారు.
► ఒకప్పుడు చిన్నపాటి వర్షానికే మోకాళ్ల లోతు వరకు నీరు నిలిచేదన్నారు. ఈ తొమ్మిదేళ్లలో చేపట్టిన అభివృద్ధి కారణంగా ముంపు తీవ్రత చాలా వరకు తగ్గిందన్నారు. ఇటీవల కురిసిన భారీ వర్షాలను కూడా తట్టుకోగలిగామని పేర్కొన్నారు.
► ఇవన్నీ ప్రజలకు తెలియచెప్పే బాధ్యత మనపై ఉందన్నారు. సంక్షేమ పథకాల విషంలో తెలంగాణ రాష్ట్రం ఏ స్థాయిలో ఉందో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు. ప్రజలకు ఇంకా ఏమైనా సమస్యలు ఉంటే నేరుగా వారి వద్దకే వెళ్లి తెలుసుకుంటానన్నారు. సమస్యలను అక్కడికక్కడే పరిష్కరించే విధంగా చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రజలు కూడా ఏమైనా సమస్యలు ఉంటే ఈ పాదయాత్రలో తన దృష్టికి తీసుకురావాలని కోరారు.