kuntala
-
మారనున్న రూట్రేఖలు
జాతీయ రహదారుల రూపురేఖలు మారనున్నాయి. భద్రాచలం–కుంట రహదారికి రూ.389 కోట్లు మంజూరయ్యాయి. చింతూరు–మోటు రహదారివిస్తరణ ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ రెండు పూర్తయితే ప్రయాణం మరింత సౌకర్యవంతంగా ఉంటుందని అధికారులు భావిస్తున్నారు. చింతూరు: జాతీయ రహదారి మరింత సౌకర్యవంతంగా మారనుంది. అభివృద్ధికి నిధులు మంజూరు కావడంతో త్వరలో పనులు ప్రారంభం కానున్నాయి. విజయవాడ–జగ్దల్పూర్ జాతీయ రహదారి–30లో భాగంగా భద్రాచలం నుంచి కుంట వరకు 64 కిలోమీటర్లు, ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ చింతూరు నుంచి మోటు వరకు 14 కిలోమీటర్ల మేర జాతీయ రహదారి– 326లో ఉన్నాయి. వీటిలో భద్రాచలం నుంచి మోటు వరకు ప్రస్తుత జాతీయ రహదారిని విస్తరించేందుకు కేంద్ర ప్రభుత్వం రూ.389 కోట్లు మంజూరు చేసింది. ఈ పనులకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, కేంద్ర మంత్రి నితిన్‌గడ్కరీ ఇటీవల అమరావతిలో శంకుస్థాపన చేశారు. 12 మీటర్ల వెడల్పుతో విస్తరణ.. ప్రస్తుతం ఏడు మీటర్ల వెడల్పు ఉన్న భద్రాచలం–కుంట జాతీయ రహదారి 12 మీటర్ల వెడల్పున విస్తరించనున్నారు. ప్రస్తుతం ఎటపాక మండలం గుండాల నుంచి చింతూరు మండలం చిడుమూరు వరకు ఏడు మీటర్ల వెడల్పున రహదారి వుంది. నిత్యం ఈ రహదారిలో ఆంధ్రా, చత్తీస్‌గఢ్, ఒడిశా, తెలంగాణ, తమిళనాడు, మధ్యప్రదేశ్, మహారాష్ట్రలకు చెందిన వేలాది వాహనాల ఈ మార్గంలో వెళ్తుంటాయి. చాలాచోట్ల ప్రమాదకర మలుపులు వుండడంతో తరచూ ప్రమాదాలు చోటు ó సుకుంటున్నాయి. చింతూరు మండలం కాటుకపల్లి నుంచి చట్టి మధ్య 12, ఎటపాక మండలం గుండాల నుంచి బండిరేవు నడుమ 8 వరకు ప్రమాదకర మలుపులు వున్నాయి. ఈ రహదారి విస్తరణకు రూ. 389 కోట్లు మంజూరయ్యాయి. విస్తరణలో భాగంగా ప్రమాదకర మలుపులు ఉన్న ప్రాంతాల్లో రహదారి నేరుగా ఉండేలా ప్రణాళిక రూపొందించారు. విస్తరించే క్రమంలో అవసరమైన చోట్ల అటవీ ప్రాంతాల్లో చెట్లు, నివాస ప్రాంతాల్లో ఇళ్లను తొలగించి వారికి పరిహారం అందించనున్నారు. రహదారి విస్తరణ పూర్తయితే ఈ మార్గంలో ప్రమాదాలు తగ్గుముఖం పట్టే అవకాశముంది. చింతూరు–మోటు రహదారికి డీపీఆర్ ఆంధ్రా, ఒడిశాలను కలుపుతూ నిర్మించిన జాతీయ రహదారి–326 విస్తరణకు ఇటీవల అధికారులు కేంద్రానికి డీపీఆర్ పంపారు. ఆంధ్రా, ఒడిశాల నడుమ సీలేరు నదిపై గతేడాది వంతెన నిర్మించగా దానికి అనుసంధానంగా 14 కిలోమీటర్ల మేర ఈ రహదారిని నిర్మించారు. ఈ రహదారి చింతూరు నుంచి మల్కనగిరి వరకు ఉంటుంది. ప్రస్తుతం ఈ రహదారి కూడా ఏడు మీటర్లు మాత్రమే ఉంది. దీనిని కూడా 12 మీటర్ల మేర విస్తరించేందుకు అధికారులు కేంద్రానికి ప్రతిపాదనలు పంపారు. నిధులు మంజూరైన వెంటనే పనులు ప్రారంభిస్తామని అధికారవర్గాలు తెలిపాయి. టెండర్ల దశలో ప్రక్రియ జాతీయ రహదారి–30 లో భాగంగా భద్రాచలం–కుంట నడుమ 64 కిలోమీటర్ల మేర విస్తరణకు రూ 389 కోట్లు మంజూరయ్యాయి. ప్రస్తుతం ఈ ప్రక్రియ టెండర్ల దశలో వుంది. టెండర్లు పూర్తి కాగానే విస్తరణ పనులు ప్రారంభిస్తాం. – శ్రీనివాస్, ఏఈ, జాతీయ రహదారి -
సోమేశ్వరుడిని ఇష్టదైవంగా కొలుస్తున్న ఆదివాసీలు
-
కాపురానికి రావడం లేదని సెల్‌టవర్ ఎక్కి భర్త హల్చల్
కుంటాల: భార్య కాపురానికి రావడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కుంటాల మండలం లింబా (కే) గ్రామంలో భర్త టవర్ ఎక్కి హల్చల్ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. లింబా (కే) గ్రామానికి చెందిన అశ్మినికి లోకేశ్వరం మండలం నగర్ గ్రామానికి చెందిన కొత్తూరు శ్రీనుతో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. తరచూ భర్త వేధిస్తుండడంతో భార్య అశ్మిని ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావాలని కోరుతూ శ్రీనివాస్ సోమవారం ఉదయం 10.30 గంటలకు సెల్ టవర్ ఎక్కాడు. దీంతో గ్రామస్తులు 100 నంబర్‌కు సమాచారం అందజేయడంతో ఎస్సై శ్రీకాంత్, ప్రొహిబిషినరీ ఎస్సై షరీఫ్‌లు ఘటన స్థలానికి చేరుకుని శ్రీనుకు నచ్చజెప్పారు. దీంతో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సెల్ టవర్ దిగాడు. పెట్రో కార్ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్ తెలిపారు. చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం చదవండి: తీజ్ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య -
Ola Village: కరోనాను జయించిన ‘ఓలా’
కుంటాల: కరోనా సెకండ్ వేవ్ నేపథ్యంలో వైరస్ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రజలు, ప్రజాప్రతినిధులు కలిసి కట్టుగా ఒకటయ్యారు. ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలంలోని ఓలా గ్రామంలో దాదాపు 3960 వరకు జనాభా ఉంటుంది. గతంలో 15 నుంచి 30వరకు యాక్టివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో గ్రామంలో స్వచ్ఛంద లాక్డౌన్ విధించారు. ప్రతీ రోజు సర్పంచ్, ఆశ, పారిశుధ్య కార్మికులు వాడవాడా తిరుగుతూ.. ప్రజలకు అవగాహన కల్పించారు. గ్రామంలో హైపోక్లోరైడ్ పిచికారీ చేయించారు. దీంతో కరోనాను అరికట్టారు. ప్రస్తుతం ఒక్క పాజిటివ్ కేసు కూడా లేదు. చేపట్టిన చర్యలు.. గ్రామంలో ప్రతీరోజు డ్రెయినేజీలను శుభ్రం చేయించారు. పారిశుధ్య పనులు ముమ్మరం చేస్తున్నారు. కరోనాను జయించిన వారి ఇంట్లో హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించారు. ఇతర గ్రామాల వారు రాకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకున్నారు. ఇంటింటా సర్వే నిర్వహించి జలుబు, దగ్గు, జ్వరం ఉన్నవారిని గుర్తించి మందులు పంపిణీ చేశారు. అవగాహన కల్పించాం గ్రామంలో కరోనా కే సులు పెరుగుతుండడంతో తీవ్రంగా భ యాందోళన చెందాం. గ్రామస్తులకు ప్రతీరో జు వైరస్ మహమ్మారిపై అవగాహన కల్పించాం. ప్రతిరోజు హైపోక్లోరైడ్ ద్రావణాన్ని పిచికారీ చేయించాం. ప్రసుత్తం ఒక్క కేసు కూడా లేకపోవడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నాం. - కనీస్ ఫాతిమా, సర్పంచ్, ఓలా కరోనాను జయించాను కరోనా లక్షణాలు ఉండడంతో పరీక్షలు చేయించుకున్న దీంతో పాజిటివ్ వచ్చింది. వైద్య సిబ్బంది సూచనాల మేరకు మందులు వాడిన. గ్రామస్తులు ధైర్యం చెప్పారు. అంతేకాకుండా వైద్యసిబ్బంది ఎప్పటికప్పుడు ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని మందులు అందించారు. దీంతో కరోనాను జయించా. - జగదీష్, ఓలా -
అల్లు అర్జున్‌తో సెల్ఫీ కోసం పోటీలు..
-
అల్లు అర్జున్‌తో సెల్ఫీ కోసం పోటీలు..
సాక్షి, ఆదిలాబాద్ : హీరో అల్లు అర్జున్‌తో సెల్ఫీ దిగేందుకు అభిమానులు పోటీలు పడ్డారు. సినిమా షూటింగ్లో భాగంగా బన్నీ జిల్లాలో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. శనివారం నేరడిగొండ మండలం కుంటాల, మావల మండలం హరిత వనాన్ని ఆయన సందర్శించారు. ఇక ఆదివారం మహారాష్ట్రలోని తిప్పేశ్వర్ అటవీ ప్రాంతానికి వెళుతుండగా జైనథ్ మండలం మాండగడ టోల్ ప్లాజా సమీపంలో జాతీయ రహదారిపై బన్నీ అభిమానులు పెద్ద ఎత్తున తరలి వచ్చారు. దీంతో ఆయన వాహనంపై నుంచి అభిమానులకు అభివాదం చేశారు. (పుష్ప ప్లాన్ మారింది) కాగా అల్లు అర్జున్ అల వైకుంఠ పురంలో తర్వాత పుష్ప సినిమాలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమా లోకేషన్స్‌లో భాగంగా ఆదిలాబాద్ జిల్లా అడవులు అందాల్ని చూడటానికి ఆయన వచ్చారు. ఆదిలాబాద్ సమీపంలోని మావల హరిత వనాన్ని సందర్శించి మొక్కని నాటారు. తర్వాత మహారాష్ట్రలోని తిప్పేశ్వరం అభయారణ్యం వెళ్లారు. బన్నీతో పాటు కుటుంబ సభ్యులు, ఇంకా చిత్ర యూనిట్ సభ్యులు ఉన్నారు. అల్లు అర్జున్ టీమ్‌తో అటవీ శాఖ అధికారులు కూడా ఉన్నారు. (అదిరిపోయేలా ‘పుష్ఫ’ ఐటమ్ సాంగ్!) ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
అదిలాబాద్‌లో కుంటాల జలపాతం వద్ద సందడి
-
ధ్రువపత్రాల జారీ కేసులో ఇద్దరికి రిమాండ్
కుంటాల (ఆదిలాబాద్) : తహశీల్దార్‌కు తెలియకుండా ధ్రువీకరణ పత్రాలు జారీ చేసిన కేసులో వీఆర్‌ఏతోపాటు తాత్కాలిక ఉద్యోగి ఒకరిని పోలీసులు రిమాండ్ చేశారు. వివరాల్లోకి వెళ్తే.. కుంటాల మండలానికి చెందిన వీఆర్ఏ గంగాధర్, తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్న మరో వీఆర్ఏ లక్ష్మీబాయి కుమారుడు రవి కలసి మహారాష్ట్ర వాసులు 12 మందికి కుల తదితర ధ్రువీకరణపత్రాలు జారీ చేశారు. దీనిపై తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు సీఐ వినోద్ ఆధ్వర్యంలో విచారణ జరిపి, ఆరోపణలు రుజువని తేలటంతో సోమవారం గంగాధర్, రవిలను రిమాండ్‌కు పంపారు.తహశీల్దార్ సంతోష్‌రెడ్డి పుష్కరాల విధుల్లో ఉన్న సమయంలో ఆయనకు తెలియకుండానే వారిద్దరూ ఇష్టారాజ్యంగా వ్యవహరించారని, పలువురికి ధ్రువీకరణ పత్రాలు జారీ చేశారని ఈ సందర్భంగా సీఐ తెలిపారు. -
విషం తాగి యువకుడి ఆత్మహత్య
కుంటాల (ఆదిలాబాద్) : కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో విషం తాగి ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాలలో మంగళవారం చోటుచేసుకుంది. మండల కేంద్రానికి చెందిన కండెల రాజు(20) చదువు పూర్తై ఇంటి దగ్గరే ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ సమస్యలు, ఆర్థిక ఇబ్బందులతో సోమవారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఇది గమనించిన స్థానికులు అతన్ని ఆస్పత్రికి తరలించాలని ప్రయత్నించగా.. అప్పటికే మృతిచెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్య
కుంటాల (ఆదిలాబాద్) : ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ.. జీవితంపై విరక్తి చెంది ఓ వివాహిత ఆత్మహత్య చేసుకుంది. ఈ సంఘటన ఆదిలాబాద్ జిల్లా కుంటాల మండలం కల్లూరు గ్రామంలో సోమవారం జరిగింది. వివరాల్లోకి వెళ్తే.. కల్లూరు గ్రామానికి చెందిన బద్దం లక్ష్మి(38) గత కొన్నేళ్లుగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో జీవితం పై విరక్తి పుట్టి ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
అభివృద్ధికి ‘చోటిచ్చారు..’
కుంటాల, న్యూస్‌లైన్ : స్థలం కరువై ఎన్నో అభివృద్ధి పనులు కొనసా... గుతూనే ఉన్నాయి. మరికొన్ని అసలు నిర్మాణానికే నోచుకోవడం లేదు. మండల కేంద్రాల్లో గ్రంథాలయ భవనాల నిర్మాణానికి నిధులు ఇవ్వడానికి రాజారాం మోహన్‌రాయ్ ఫౌండేషన్ సిద్ధంగా జిల్లాలో ఎక్కడా స్థలం లేకుండా పోయింది. అటు రెవెన్యూ అధికారులు గానీ.. ఇటు ప్రభుత్వం గానీ చొరవ తీసుకున్న దాఖాలాలు లేవు. ఫలితంగా అద్దె భవనాల్లో కొనసాగుతున్నాయి. కానీ కుంటాల గ్రామస్తులు ఎవరో వస్తారని.. ఏదో చేస్తారని ఎదురు చూడలేదు. ప్రభుత్వం నిధులు కేటాయించడంతో ఐకమత్యం ప్రభుత్వ భవనాల నిర్మాణానికి ముందుకొచ్చారు. స్థలం కొరత ఏర్పడకుండా చూశారు. గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో గ్రామస్తులు చందాలు వేసుకుని, వారసంత, వీరబ్రహ్మేంద్రస్వామి ఆలయానికి వచ్చే ఆదాయం, ఇతర ఆదాయాలతో స్థలం కొనుగోలు చేసి అప్పగించారు. దీంతో ప్రభుత్వ కార్యాలయాలకు పక్కా భవనాలు సమకూరాయి. రాంనగర్‌కాలనీలో హన్మాన్ ఆలయాన్ని నిర్మించారు. 1992లో సబ్‌స్టేషన్ నిర్మాణానికి రూ.1.50లక్షలు వెచ్చించి ఎకరన్నర స్థలం కొనుగోలు చేశారు. 2000లో ప్రభుత్వం ఎంపీడీవో కార్యాలయ నిర్మాణానికి రూ.14లక్షలు మంజూరు చేసింది. గ్రామస్తులు రూ.2లక్షలు సేకరించి ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. దీంతో భవన నిర్మాణం పూర్తయింది. 2007లో పోలీసుస్టేషన్ నిర్మాణానికి ప్రభుత్వం రూ.18లక్షలు కేటాయించింది. దీంతో గ్రామస్తులు రూ.3లక్షలు వెచ్చించి రెండెకరాల స్థలాన్ని అప్పగించారు. 2012లో హైస్కూల్ అదనపు గదుల నిర్మాణానికి ప్రభుత్వం ఆర్‌ఎంఎస్‌ఏ నిధులు రూ.31.31లక్షలు కేటాయించింది. రూ.4లక్షలు వెచ్చించి నాలుగున్నర ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. 2013లో ఆదర్శ పాఠశాల నిర్మాణానికి రూ.21లక్షలు వెచ్చించి ఐదెకరాల స్థలాన్ని కొనుగోలు చేసి ఇచ్చారు. ప్రస్తుతం భవనాల నిర్మాణం పూర్తయింది. -
రబీ.. కష్టాల సాగు!
కుంటాల, న్యూస్‌లైన్ : కరెంటు కోతలు అన్నదాతలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రబీ సాగు చేసిన పంటలకు నీరందించలేని దుస్థితిలో రోడ్డెక్కుతున్నారు. మండలంలోని 90శాతం మంది రైతులు కరెంటుపై ఆధారపడి రబీ పంటలు సాగు చేశారు. ఊహించినట్లుగానే గత ఏడాది కంటే ఈ ఏడాది రబీ సాగు పెరిగింది. దీంతో విద్యుత్ వినియోగమూ పెరుగుతోంది. కోటాకు మించి వినియోగించడంతో కోతలు మొదలయ్యాయి. వ్యవసాయ రంగానికి ఏడు గంటలపాటు విద్యుత్ సరఫరా సక్రమంగా అమలు కాకపోవడంతో పంటలు ఎండిపోయే పరిస్థితి ఏర్పడింది. కాలిపోతున్న పరికరాలు ఖరీఫ్ సాగు కష్టాలే మిగిల్చింది. అధిక వర్షాలతో పత్తి, వరి పంటలు నష్టపోయారు. రబీలోనైనా కష్టాల నుంచి గట్టెక్కుతామని ఆశించిన రైతులు ఎన్నో ఆశలు సాగుకు సిద్ధమయ్యారు. మండలంలో కరెంటు బావులపై ఆధారపడి 1,050 హెక్టార్లలో వరి, 1,125 హెక్టార్లలో మొక్కజొన్న, 239 హెక్టార్లలో శెనగ, 78 హెక్టార్లలో పసుపు, 54 హెక్టార్లలో పొద్దుతిరుగుడు, 38 హెక్టార్లలో మినుము, 42 హెక్టార్లలో పెసర, 65 హెక్టార్లలో నువ్వు పంటలు సాగు చేశారు. ఏళ్ల కిందటి ఫీడర్లు, కాలం చెల్లిన విద్యుత్ తీగలు, తరచూ కాలిపోతున్న నియంత్రీకరణ పరికరాలు రైతుల పాలిట శాపంగా మారాయి. విద్యుత్ సరఫరాలో కోతలు, లోఓల్టేజీ సమస్యలను నిరసిస్తూ లింబా(కె), విఠాపూర్ గ్రామాల రైతులు ఇటీవల కుంటాల సబ్‌స్టేషన్‌ను ముట్టడించారు. రాస్తారోకో చేశారు. ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తున్నామని అధికారులు చెబుతున్నా మూడు నాలుగు గంటలకు మించి సరఫరా కావడం లేదు. రాత్రివేళ అడవి పందుల బెడద తీవ్రంగా ఉండడంతో పొలాల వైపు వెళ్లడం లేదు. మొక్కజొన్న, శెనగ, పొద్దుతిరుగుడు, పసుపు, నువ్వు, మినుము, పెసర పంటలు కోత దశకు వచ్చాయి. వారం పదిరోజుల్లో పంటలు చేతికొచ్చే అవకాశం ఉండడంతో అప్రకటిత కరెంట్ కోతలతో పంటలు ఎండుతున్నాయి. దీంతో రైతులు అందోళన చెందుతున్నారు. రబీ సాగు గట్టెక్కడానికి రైతులు సక్రమంగా విద్యుత్ సరఫరా చేయాలని కోరుతున్నారు. కాగా, ఈ విషయమై డిస్కం ఏఈ శంకర్‌ను సంప్రదించగా సామర్థ్యానికి మించి కనెక్షన్లు ఉండడంతో నియంత్రీకరణ పరికరాలు తరచూ చెడిపోతున్నాయని తెలిపారు. ఏడు గంటలు విద్యుత్ సరఫరా చేస్తామని, సమస్యలు పరిష్కరిస్తామని పేర్కొన్నారు. -
మళ్లీ కుట్ర
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : కుంటాల జలపాతంపై మళ్లీ ‘హైడల్’ కుట్ర మొదలైంది. ఓ వైపు రాష్ట్ర విభజనకు వేగంగా సన్నాహాలు జరుగుతున్న సంగతి విధితమే. ఈ నేపథ్యంలో సీమాంధ్రకు చెందిన కాంట్రాక్టు సంస్థ కుంటాలపై జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణానికి పావులు కదుపుతుండటం చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్‌లో మకాం వేసిన సదరు కాంట్రాక్టర్, జిల్లాకు చెందిన కొందరు రాజకీయ నాయకులతో కుమ్మక్కై అధికార యంత్రాంగంపై ఒత్తిడి తెస్తుండటంపై నిరసన వ్యక్తమవుతోంది. ఇదే క్రమంలో అటవీశాఖ నుంచి అనుమతులు లేవనేదే హైడల్ ప్రాజెక్టుకు ప్రధాన అడ్డంకి కాగా, సదరు కాంట్రాక్టర్ ప్రభుత్వంపై తెచ్చిన ఒత్తిడి మేరకు తాజాగా అటవీశాఖ సర్వే నిర్వహించడం మళ్లీ వివాదాస్పదం అవుతోంది. కుంటాల జలపాతంపై ఎట్టి పరిస్థితుల్లో జలవిద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసే ప్రసక్తే లేదంటూ గిరిజన, ఆదివాసీ, ప్రజా సంఘాలు నిరసనలు, ఆందోళన కార్యక్రమాలకు సన్నద్ధం అవుతున్నాయి. 13 ఏళ్లుగా పట్టువీడని రాజీ పవర్ సంస్థ కుంటాలపై విద్యుత్తు ప్రాజెక్టు వద్దని పెద్ద ఎత్తున ఉద్యమాలు సాగుతున్నా రాజీ పవర్ ప్లాంట్ సంస్థ, ఆ సంస్థకు మద్దతునిస్తున్న రాజకీయ నాయకులు పదమూడేళ్లుగా పట్టువీడటం లేదు. ఉద్యమాలు ఉధృతంగా సాగితే కొంతకాలం ఊర్కోవడం, ఆ తర్వాత మళ్లీ ప్రయత్నాలు చేయడం వారికి పరిపాటిగా మారింది. ఈ పద్ధతిలోనే పర్యాటక, నీటిపారుదల, ఆర్అండ్బీ, కాలుష్య నియంత్రణ మండలి, స్థానిక వనసంరక్షణ సమితి అనుమతులను ఒక్కొక్కటిగాా పొందిన సదరు కాంట్రాక్టరు అటవీశాఖ అనుమతులపైనా ఇటీవలే పట్టు సాధించారు. ఇదిలా వుండగా జలపాతంపై జలవిద్యుత్తు ప్రాజెక్టు ఏర్పాటుకు అనువుగా ఉంటుందని 1999లో అప్పటి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యుత్తు మండలి(ఏపీఎస్ఈబీ) ప్రకటన జారీ చేసింది. కుంటాల జలపాతంపై ఆరు మెగావాట్ల విద్యుత్తు ఉత్పత్తి కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు మూడు సంస్థలు తమ తమ నివేదికలను ఏపీఎస్‌ఈబీకి అందజేశాయి. మూడు ప్రాజెక్టుల నివేదికలను పరిశీలించిన అధికారులు ‘రాజీ విద్యుత్తు ఉత్పత్తి సంస్థ’కు దీని బాధ్యతలను అప్పగించారు. అయితే గిరిజన, ఆదివాసీ, ప్రజాసంఘాల ఆందోళనతో వెనక్కి తగ్గి మళ్లీ ప్రయత్నాలు సాగిస్తున్నాయి. ఆందోళనకు సిద్ధమైన ప్రజాసంఘాలు కుంటాల జలపాతంపై నిర్మించ తలపెట్టిన ఆరు మెగావాట్ల విద్యుత్తుకు 10 క్యూసెక్కుల నీరు అవసరం ఉంటుందని నిపుణులు లెక్కగట్టారు. 2.50 హెక్టార్ల విస్తీర్ణంలో ఏర్పాటు చేయదలచిన ఈ ప్రాజెక్టు కోసం నిర్మాణ సంస్థ మొదట గిరిజనులు, ఆదివాసీల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా ప్రయత్నాలు సాగించింది. పచ్చని అడవిలో చిచ్చుపెట్ట వద్దని అదివాసీ, గిరిజన సంఘాలు నిరసన గళం వినిపిస్తున్నా సదరు సంస్థ అధినేత కొందరు స్థానిక నేతల అండదండలతో హైదరాబాద్‌లో ‘పవర్’ ఉపయోగించారు. జిల్లాలో ఓ బ్యాంకు నుంచి రుణం పొందేందుకు అగ్రిమెంట్ కుదుర్చుకున్న సదరు కాంట్రాక్టరు సర్వే నివేదిక కోసం అటవీశాఖ ఉన్నతాధికారులపై తాజాగా ఒత్తిడి చేస్తుండటం వివాదాస్పదంగా మారింది. దీంతో రెండు రోజులుగా జిల్లాలో కుంటాల జలపాతం పరిరక్షణ కమిటీ, తెలంగాణ విద్యావంతుల వేదికలతోపాటు ఆదివాసీ, గిరిజన సంఘాలు ఆందోళనలకు శ్రీకారం చుట్టాయి. కుంటాలపై ఎట్టి పరిస్థితుల్లో హైడల్ ప్రాజెక్టు నిర్మాణానికి అంగీకరించేది లేదని శుక్రవారం విద్యావంతుల వేదిక రాష్ట్ర కో-కన్వీనర్ పిట్టల రవిందర్ నేరడిగొండ, కుంటాలలో ప్రజాసంఘాలతో సమావేశం నిర్వహించారు. గిరిజన, ఆదివాసీ, ప్రజలు, ప్రజాసంఘాలతో త్వరలోనే ఉద్యమ కార్యాచరణ తీసుకుంటామని ప్రకటించారు. -
నిరసనలు.. నిలదీతలు
కుంటాల/భైంసారూరల్, న్యూస్‌లైన్ : భైంసా మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో బుధవారం నిర్వహించిన భైంసా మండలం రచ్చబండ మూడో విడత కార్యక్రమం నిరసనలు, నిలదీతల మధ్య ముగిసింది. పింఛన్లు, ఇందిరమ్మ ఇళ్లు, రేషన్‌కార్డులు, బంగారుతల్లి పథకానికి దరఖాస్తు చేసుకునేందుకు వివిధ గ్రామాల నుంచి ప్రజలు అధిక సంఖ్యలో తరలివచ్చారు. కార్యక్రమం ప్రారంభంకాగానే కోతల్గాం గ్రామానికి చెందిన లక్ష్మి, హజ్గుల్ గ్రామానికి చెందిన అనురాధ పింఛన్లు ఎందుకు మంజూరు చేయడంలేదని అధికారులను నిలదీశారు. ఎన్నిసార్లు దరఖాస్తు చేసినా స్పందించడంలేదని మండిపడ్డారు. స్పందించిన అధికారులు అర్హులందరికీ మంజూరు చేస్తామని హామీ ఇచ్చారు. పింఛన్‌కు తాను అన్నివిధాలా అర్హుడినైనా మంజూరు చేయకపోవడంపై పేండ్‌పెల్లి గ్రామానికి చెందిన వికలాంగుడు సురేశ్ నిరసన వ్యక్తం చేశాడు. గ్రామాల్లో ప్రభుత్వ పథకాలపై ప్రజలకు అవగాహన కల్పించడం లేదని పలువురు ప్రశ్నించారు. ఎంతో ఆర్భాటంగా నిర్వహిస్తున్న రచ్చబండ కార్యక్రమంతో ప్రజలకు ఒనగూరేదేమీ లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. గంట ఆలస్యంగా ప్రారంభం... రచ్చబండ కార్యక్రమం ముందుగా ప్రకటించినదానికంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. మధ్యాహ్నం 2 గంటలకు బదులు మూడింటికి సభ మొదలైంది. దీంతో వివిధ గ్రామాల నుంచి వచ్చిన ప్రజలు అధికారుల కోసం ఎండలో నిరీక్షించారు. బంగారుతల్లి పథకం బాండ్ల కోసం వచ్చిన బాలింతలూ అవస్థలు పడ్డారు. తెలంగాణ నినాదాలు... రచ్చబండ సభలో తెలంగాణ నినాదాలు హోరెత్తాయి. పలువురు జెతైలంగాణ అంటూ నినదించారు. పార్లమెంట్ శీతాకాల సమావేశాల్లోనే ప్రభుత్వం తెలంగాణ బిల్లు పెట్టాలని కోరారు. అర్హులందరికీ సంక్షేమ ఫలాలు.. రచ్చబండ ద్వారా అర్హులందరికీ సంక్షేమ ఫలాలు అందేలా చర్యలు తీసుకుంటున్నట్లు ముథోల్ ఎమ్మెల్యే వేణుగోపాలాచారి పేర్కొన్నారు. దశలవారీగా ప్రజల సమస్యలు పరిష్కరిస్తామన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ ద్వారా గ్రామాల్లో అభివృద్ధి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. రచ్చబండలో వచ్చిన అర్జీలను పరిశీలించి పరిష్కారానికి చొరవ చూపుతానని చెప్పారు. ప్రత్యేక అధికారి పెర్క యాదయ్య మాట్లాడుతూ ప్రతీ ఇంటికి మరుగుదొడ్డి ఉండాలని, ప్రభుత్వ సాయంతో నిర్మించుకోవాలని కోరారు. అనంతరం వివిధ సంక్షేమ పథకాల మంజూరు పత్రాలు, బంగారుతల్లి బాండ్లు లబ్ధిదారులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో తహశీల్దార్ ప్రభాకర్, ఎంపీడీవో జియూవోద్దీన్, ఎంఈవో దయానంద్, పీఆర్ డిప్యూటీ ఈఈ రామకృష్ణారెడ్డి, హౌసింగ్ డీఈ శ్రీనివాస్, మాజీ కో ఆప్షన్ సభ్యుడు సోలంకి భీంరావు, మాజీ ఎంపీపీ రాంచంద్రారెడ్డి, ఐకేపీ ఏపీఎం వాణిశ్రీ, ఈజీఎస్ ఏపీవో నవీన్, ఆయా గ్రామాల సర్పంచులు పాల్గొన్నారు.