కాపురానికి రావడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి భర్త హల్‌చల్‌ | Husband Climbed Cell Tower In Kuntala | Sakshi
Sakshi News home page

కాపురానికి రావడం లేదని సెల్‌టవర్‌ ఎక్కి భర్త హల్‌చల్‌

Aug 31 2021 7:54 AM | Updated on Aug 31 2021 8:45 AM

Husband Climbed Cell Tower In Kuntala - Sakshi

భార్య కాపురానికి రావడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల మండలం లింబా (కే) గ్రామంలో భర్త టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన చోటుచేసుకుంది.

కుంటాల: భార్య కాపురానికి రావడం లేదని ఉమ్మడి ఆదిలాబాద్‌ జిల్లాలోని కుంటాల మండలం లింబా (కే) గ్రామంలో భర్త టవర్‌ ఎక్కి హల్‌చల్‌ చేసిన ఘటన చోటుచేసుకుంది. వివరాలు.. లింబా (కే) గ్రామానికి చెందిన అశ్మినికి లోకేశ్వరం మండలం నగర్‌ గ్రామానికి చెందిన కొత్తూరు శ్రీనుతో ఆరునెలల క్రితం వివాహం జరిగింది. తరచూ భర్త వేధిస్తుండడంతో భార్య అశ్మిని ఇటీవల పుట్టింటికి వెళ్లిపోయింది. భార్య కాపురానికి రావాలని కోరుతూ శ్రీనివాస్‌ సోమవారం ఉదయం 10.30 గంటలకు సెల్‌ టవర్‌ ఎక్కాడు. దీంతో గ్రామస్తులు 100 నంబర్‌కు సమాచారం అందజేయడంతో ఎస్సై శ్రీకాంత్, ప్రొహిబిషినరీ ఎస్సై షరీఫ్‌లు ఘటన స్థలానికి చేరుకుని శ్రీనుకు నచ్చజెప్పారు. దీంతో సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో సెల్‌ టవర్‌ దిగాడు. పెట్రో కార్‌ సిబ్బంది ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై శ్రీకాంత్‌ తెలిపారు.

చదవండి: తెలంగాణ సిగలో మరో అందం.. వెలుగులోకి కొత్త జలపాతం
చదవండి: తీజ్‌ సంబరాల్లో విషాదం: వ్యక్తి ఆత్మహత్య

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement