kurla railway station
-
Video: ఏకంగా రైల్వే ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో.. తరువాత ఏం జరిగిందంటే.
మహారాష్ట్రలో వింత ఘటన చోటుచేసుకుంది. ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో ఓ ఆటో డ్రైవర్ తన వాహనంతో రైల్వేస్టేషన్‌లోకి వచ్చాడు. ప్రయాణికులతో రైల్వే స్టేషన్‌కు వచ్చిన ఆటో డ్రైవర్ ఏకంగా ఏకంగా తన ఆటోను ప్లాట్‌ఫామ్ మీదకే పోనిచ్చాడు. ఈ దృశ్యాలు రైల్వేస్టేషన్‌లోని సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియో చివరికి రైల్వే పోలీసులు దృష్టికి చేరింది. దీంతో వారు ట్విటర్ ద్వారా వివరణ ఇచ్చారు. కుర్లా రైల్వే స్టేషన్లో ప్లాట్‌ఫామ్ మీదకు ఆటో తీసుకొచ్చిన డ్రైవర్‌పై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. డ్రైవర్‌ను అదుపులోకి తీసుకున్నారు. రైల్వే యాక్ట్ ప్రకారం నిందితుడిపై తగిన చర్యలు తీసుకుంటామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన శనివారం జరగ్గా.. తాజాగా నెట్టింట్లో చక్కర్లు కొడుతుంది. దీనిపై నెటిజన్లు భిన్నంగా స్పందిస్తున్నారు. కొంతమంది ఫన్నీగా కామెంట్ పెడుతుంటే మరికొందరు రైల్వే అధికారులను తీరును తప్పబడుతున్నారు. ఆటో ఏకంగా ప్లాట్‌ఫామ్‌పైకి వచ్చేదాక రైల్వే సిబ్బంది ఏం చేస్తున్నారని మండిడుతున్నారు. Kurla station auto mafia on the platform. Please check & verify this. Too much freedom given by Kurla @MTPHereToHelp & @RPFCRBB Coincidentally on the first day of new @drmmumbaicr Isn't this a safety hazard for trains? @SrdsoM @RailMinIndia @RPF_INDIA pic.twitter.com/dXGd95jkHL — Rajendra B. Aklekar (@rajtoday) October 15, 2022 -
ఫోన్లో మాట్లాడుతూ నేరుగా రైలుకెదురెళ్లింది
ముంబయి: ఈ సంఘటన నిజంగా ఓ మిరాకిల్. భూమ్మీద నూకలుంటే బతికేస్తారంతే అనే మాట కచ్చితంగా ఈ సంఘటనకు, ఇక్కడ పేర్కొంటున్న అమ్మాయికి సరిగ్గా సరిపోతుంది. ఓ గూడ్స్ రైలు కింద పడిన యువతి క్షేమంగా ప్రాణాలతో బయటపడి అందరినీ ఆశ్చర్యపోయేలా చేసింది. వివరాల్లోకి వెళితే.. భందప్ ప్రాంత నివాసి అయిన ప్రతిక్ష నతేకర్ (19) అనే యువతి కుర్లాలోని తన స్నేహితురాలి ఇంటికెళ్లింది. ఉదయం 11గంటల ప్రాంతంలో తిరిగొస్తూ కుర్లా రైల్వే స్టేషన్‌లోని ఏడో నెంబర్ ప్లాట్ మీదకు చేరుకునేందుకు పట్టాలపైకి దిగి అవతలి ప్లాట్‌ఫాం నుంచి దిగి వస్తోంది. ఆ సమయంలో ఆమె చెవిలో హెడ్‌ఫోన్స్ ఉన్నాయి. ఫోన్లో తన స్నేహితురాలితో మాట్లాడుతూ గూడ్సు రైలు వస్తుండటాన్ని గమనించలేదు. ఒక్కసారిగా ఆమె తల పైకెత్తగా ఎదురుగా రైలు రావడంతో భయంతో ప్లాట్‌పైకి పరుగెత్తే లోగానే నేరుగా రైలుకెదురెళ్లిన పరిస్థితి కనిపించింది. ఇది చూసిన పైలట్.. ఆ తర్వాత బ్రేకులు వేశాడు. గూడ్సు బండి కావడంతో పెద్ద శబ్దం చేస్తూ కాస్త నెమ్మదిగానే ఆమెను ఢీకొట్టింది. ఆమె మీద నుంచి రెండు మూడు బోగీలు కూడా పోయాయి. దీంతో ప్లాట్‌ఫాంపై ఉన్న వాళ్లంతా కూడా ఆ యువతి చనిపోయిందని అనుకున్నారు. అయితే, తన ఎడమ కంటికి చిన్న గాయంతో తప్ప దాదాపు ఎలాంటి హానీ లేకుండానే ఆమె బయటపడింది. దీంతో అక్కడ ఉన్నవారంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. కుర్లా రైల్వే స్టేషన్‌లోని సీసీటీవీలో రికార్డయిన ఈ సంఘటన గత నెల 13న చోటు చేసుకుంది. -
ఒక్క చూపుతో పెను ప్రమాదం తప్పించాడు
ముంబయి: ఆ యువ ఇంజినీర్. అతడికి రైలన్నా.. రైల్వే వ్యవస్థ అన్న ఎంతో ఆసక్తి. రైలుకు సంబంధించిన ప్రతి అంశాన్ని క్షుణ్ణంగా పరిశీలిస్తాడు. అలా అతడు సహజంగా చేసుకున్న అలవాటే వేలమంది ప్రాణాలు కాపాడింది. పెద్ద రైల్వే ప్రమాదాన్ని నివారించగలిగేలా చేసింది. రెండు రైళ్లు ఢీకొట్టుకునే ప్రమాదం నుంచి తప్పించింది. జీ సక్పాల్ (23) అనే ఇంజినీర్ అంధేరిలోని తన ఆఫీసుకు వెళ్లేందుకు ఉదయం 7.30గంటలకు కుర్లా రైల్వే స్టేషన్‌కు రైలెక్కెందుకు వచ్చాడు. 7వ నెంబర్ ప్లాట్ పాంపై నిల్చుని అతడికి సహజంగానే ఉన్న అలవాటు ప్రకారం రైల్వే పట్టాల వైపు పరిశీలనగా చూస్తున్నాడు. హార్బర్ లైను వెంట ఉన్న పట్టాల్లో అతడికి సరిగ్గా మూడు నాలుగు మీటర్ల దూరంలో ఫిష్ ప్లేట్ ఊడిపోయి పైకి పొడుచుకొని కనిపించింది. దాని వల్ల జరిగే ఘోర విపత్తును ముందే ఊహించిన అతడు వెంటనే రైలు మోటర్ మేన్ కు సమాచారం అందించాడు. రైల్వే హెల్ప్ లైన్ కు ఫోన్ చేశాడు. అతడు అలా సమాచారం అందించగానే గ్యాంగ్ మెన్ ను అక్కడికి పంపించి ట్రాక్ ను సరిచేశారు. అక్కడే వదులుగా ఉన్న మరో ఫిష్ ప్లేట్ ను సరి చేశారు. దీంతో ఆ లైన్ లో కాసేపు రైళ్లు ఆలస్యంగా నడిచాయి. ట్రాక్ సమస్య తెలిసిన తర్వాత అన్ని రైళ్లకు 10 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించాలని ఆదేశాలు జారీ చేశారు. తిరిగి ఉదయం ఎనిమిదిగంటల ప్రాంతంలో యథావిధిగా రైల్లు ప్రయాణం ప్రారంభించాయి. వందల ప్రాణాలు రక్షించడమే కాకుండా ఒక రోజు మొత్తాన్ని కాపాడాడంటూ పలువురు సక్పాల్‌ను అభినందించారు. -
పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలు
ముంబైలోని కుర్లా రైల్వే స్టేషన్లో బుధవారం అర్ధరాత్రి ఓ గూడ్సు రైలుకు చెందిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయి. ఎనిమిదో నెంబరు ప్లాట్ఫారం వద్ద జరిగిన ఈ సంఘటన ఫలితంగా హార్బర్ మార్గంలో రైళ్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వెంటనే రైల్వే సిబ్బంది రంగంలోకి దిగి, పట్టాలు తప్పిన గూడ్స్ బోగీలను అక్కడినుంచి తొలగించారు. ఇంజన్ నుంచి విడిపోయిన ఐదు బోగీలు పట్టాలు తప్పాయిన రైల్వే వర్గాలు తెలిపాయి. దీంతో హార్బర్ మార్గంలో వెళ్లి, వచ్చే రైళ్ల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలిగింది. కొన్ని గంటల పాటు అవి పూర్తిగానిలిచిపోయాయి. దీనివల్ల ప్రయాణికులు కూడా తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు.