వైఎస్సార్సీపీలోకి బైరెడ్డి వర్గీయులు
పగిడ్యాల: 50 ఏళ్లుగా బైరెడ్డి కుటుంబానికి రాజకీయంగా సేవలు చేస్తూ వచ్చిన ఆయన వర్గీయులు నందిగారి పక్కిరెడ్డి, చిన్నమాబుసాహెబ్, బెస్త వెంకటేశ్వర్లు, ఈశ్వరప్పతో పాటు మరి కొందరు గురువారం వైఎస్సార్సీపీలోకి చేరారు. వారందరికి మండల కన్వీనర్ రమాదేవి కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ప్రజల కష్టాలను తన కష్టాలుగా భావించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి వాటి పరిష్కారానికి ప్రభుత్వంతో పోరాడుతున్నట్లు పార్టీలో చేరిన వారు తెలిపారు. ఆయన సిద్ధాంతాలు నచ్చి పార్టీలోకి చేరుతున్నట్లు పేర్కొన్నారు. 50 ఏళ్లుగా బైరెడ్డి వర్గీయులుగా ముద్ర వేసుకున్నా తమకు సరైన గుర్తింపు లేదన్నారు. అందువల్లే మండల కన్వీనర్ రమాదేవి ఆహ్వానం మేరకు వైఎస్సార్సీపీలోకి చేరామని వెల్లడించారు. మండలంలో తమకు ఏలాంటి బాధ్యతలు అప్పగించిన సమర్థంగా నిర్వహిస్తామని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చిట్టిరెడ్డి, రమణారెడ్డి, గోవిందరెడ్డి, లక్ష్మిరెడ్డి, మహేశ్వరరెడ్డి, రామసుబ్బారెడ్డి, భూపాల్‌రెడ్డి, డీలర్ నారాయణ, ఇస్మాయిల్, వెంకటేశ్వర్లు, అంబటి రాముడు, కోట్ల గోవిందు, చాకలి వెంకటేశ్వర్లు, శేషన్న, పుల్లన్న, క్రీస్తుదాసు, టైలర్ నాగన్న, బడికెల సవారి, రమణయ్య తదితరులు పాల్గొన్నారు.