kurugunta
-
3న కురుగుంటలో సైన్స్ ఎగ్జిబిషన్
అనంతపురం రూరల్ : కురుగుంట సాంఘిక సంక్షేమ గురుకుల కళాశాలలో నవంబర్ 3 నుంచి రెండు రోజులపాటు జోనల్ స్థాయి సైన్స్ ఎగ్జిబిషన్ నిర్వహిస్తున్నట్లు కళాశాల కన్వీనర్ ఉషారాణి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ ఎగ్జిబిషన్‌కు రాయలసీమ జిల్లాల విద్యార్థులు హాజరు అవుతున్నట్లు ఆమె తెలిపారు. -
కురుకుంట పీహెచ్సీ ప్రారంభానికి గ్రీన్‌సిగ్నల్
అనంతపురం సిటీ : అనంతపురం రూరల్ పరిధిలోని కురుకుంట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని మరో నాలుగు రోజుల్లో ప్రారంభిస్తున్నట్లు డీఎంహెచ్ఓ వెంటకరమణ బుధవారం తెలిపారు. చాలా రోజుల క్రితమే ఈ కేంద్రాన్ని ప్రారంభించాల్సి ఉన్నప్పటికీ అనివార్యకారణాల వాయిదా పడుతూ వస్తోందన్నారు. ఈ పీహెచ్సీ కోసం సిబ్బంది నియామకాలు చేసినట్లు ఆయన తెలిపారు. జిల్లాలో మెత్తం 7 పీహెచ్‌సీలను కొత్తగా ప్రారంభించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు తెలిపారు.