kurumaiah
-
ఓపెన్ నాలాలో పడి ఒకరు మృతి
కూకట్పల్లి: కూకట్పల్లి పరిధిలోని ప్రశాంత్‌నగర్ ఓపెన్ నాలాలో పడి ఓ వ్యక్తి మృతి చెందాడు. ఇందిరా గాంధీ బస్తీకి చెందిన కురుమయ్య(40) క్రేన్ ఆపరేటర్‌గా పనిచేస్తున్నాడు. ఆయన శుక్రవారం ప్రమాదవశాత్తూ ఓపెన్ నాలాలో పడి మృతి చెందాడు. అయితే అతను అనారోగ్యంతో ఉన్నాడని, ప్రమాదవశాత్తు కాలు జారి పడిపోయి ఉండొచ్చని పోలీసులు అంటున్నారు. కాగా, అధికారుల నిర్లక్ష్యంతోనే తమ వ్యక్తి చనిపోయాడని ఆరోపిస్తూ మృతదేహంతో అతని బంధువులు ఆందోళనకు దిగారు. అధికారులు వచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. -
ఏసీబీకి చిక్కిన బ్యాంక్ మేనేజర్
మంజూరు అయినా లోన్ డబ్బులు ఇవ్వడానికి లంచం తీసుకుంటున్న బ్యాంక్ మేనేజర్‌ను ఏసీబీ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. మహబూబ్‌నగర్ జిల్లా బల్మూరు మండలం తుమ్మన్పేట్ గ్రామంలోని గ్రామీణ బ్యాంక్‌లో మేనేజర్‌గా పని చేస్తున్న సాయిబాబా.. లింగాల మండలం మానాజిపేటకు చెందిన కురుమయ్య అనే వ్యక్తికి మంజూరైన లోన్ ఇవ్వడానికి రూ. 5 వేలు లంచం అడిగాడు. దీంతో ఆ వ్యక్తి ఏసీబీ అధికారులకు సమాచారం అందించాడు. అనంతరం అచ్చంపేటలోని ఆయన స్వగృహంలో ఆయనకు డబ్బులు ఇస్తుండగా.. దాడి చేసిన ఏసీబీ అధికారులు అతన్ని అదుపులోకి తీసుకొని విచారణ చేపడుతున్నారు.