kusbhu
-
సినీ వర్గాల్లోనూ చిన్నమ్మపై వ్యతిరేకత
తమిళసినిమా : చిన్నమ్మ (శశికళ) సీఎం కావడాన్ని రాజకీయాల్లో ఒక వర్గం స్వాగతిస్తున్నా, మరో వర్గం నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తం అవుతోంది. రాజకీయ విశ్లేషకుల నుంచి మిశ్రమ స్పందన వస్తోంది. ఇక రాజకీయాలతో దగ్గర సంబంధాలున్న చిత్ర పరిశ్రమ నుంచి చిన్నమ్మకు సీఎం పీఠం కట్టబెట్టడంపై ఆక్షేపణలు వ్యక్తం అవుతున్నాయి. విశ్వనటుడు కమలహాసన్ వంటి వారు శశికళకు ముఖ్యమంత్రి బాధ్యతలు భారం అవుతాయనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇటీవల జరుగుతున్న సంఘటనలకు ట్విట్టర్లో స్పందిస్తున్న కమలహాసన్ ఆ మధ్య జయలలిత మరణించినప్పుడు ఆమె పేరు ప్రస్తావించకుండా సంబంధించిన వారికి సంతాపాలు అంటూ క్లుప్తంగా పేర్కొన్నారు. తాజాగా శశికళను ముఖ్యమంత్రిగా ఎన్నుకున్న సందర్భాన్ని పురస్కరించుకుని మోయదగ్గ బరువు మించితే ఏ బండి అయినా కప్పకూలిపోతుందని తిరుక్కురల్‌లో పేర్కొన్నారు.. అంటూ ట్వీట్ చేశారు. ముఖ్యమంత్రి పదవి శశికళకు భారం అవుతుందనే భావాన్ని ఆయన వ్యక్తం చేశారు. ఇక నటి, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ప్రచారకర్త కుష్బూ తీవ్రంగానే ఆరోపణలు చేశారు. తమిళనాడు నిస్సత్తువగా మారిపోయిందన్నారు. శశికళ ముఖ్యమంత్రి కావడం ద్వారా ప్రజాస్వామ్యం ఖూనీ చేయబడిందని పేర్కొన్నారు. ఏదేమైనా ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికయిన వారే ముఖ్యమంత్రి కావాలని అన్నారు. జల్లికట్టు క్రీడ కోసం విద్యార్థులు, యువత పోరాడారని, అదే విధంగా ఇప్పుడు శశికళకు వ్యతిరేకంగా పోరాడాలని కుష్భూ తన ట్విట్టర్లో పేర్కొన్నారు. అన్నాడీఎంకే నుంచి బయటకు వచ్చిన ఆ పార్టీ ప్రచార కర్త, నటుడు ఆనందరాజ్ ఒక ప్రకటన విడుదల చేస్తూ రాష్ట్రంలో పాలన ప్రశాంతంగా సాగుతోందని, ఇలాంటి పరిస్థితుల్లో నూతన ముఖ్యమంత్రిని ఎన్నుకోవలసిన అవసరం ఏమొచ్చిందని ప్రశ్నించారు. ఒక పార్టీకి నాయకులను ఎన్నుకోవడానికి ఆ పార్టీ కార్యవర్గ సభ్యులకు హక్కు ఉంటుందని, అదే విధంగా ముఖ్యమంత్రిని ఎంపిక చేసుకునే హక్కు శాసన సభ్యులకు ఉంటుదని పేర్కొన్నారు. అయితే ముఖ్యమంత్రి రాష్ట్రానికే కాదు. తమిళ ప్రజలకు కూడా అని, తమ ఓట్లతో ముఖ్యమంత్రిని ఎన్నుకునే హక్కు ప్రజలకు ఉంటుందని, అనవసర నిర్ణయాలు ఉండకూడదని ప్రకటనలో పేర్కొన్నారు. -
ఐక్యతతో
► ఒకే వేదిక మీద ప్రత్యక్షం ► కాంగ్రెస్‌లో ఆనందం ► కుష్భు, నగ్మాల ప్రత్యేక ఆకర్షణ ► రాహుల్ అరెస్టుకు వ్యతిరేకంగా నిరసన ► ఇక, రాష్ట్ర పర్యటనలో తిరునావుక్కరసర్ రాష్ట్ర కాంగ్రెస్‌లో ఐక్యత రాగాలు వెల్లి విరిశాయి. ఒకే వేదిక మీద గ్రూపు నేతలందరూ ప్రత్యక్షం కావడం కాంగ్రెస్ వర్గాలకు ఆనందమే. ఇక, నగ్మా, కుష్భు ప్రత్యేక ఆకర్షణగా వేదిక మీద కన్పించడంతో ఉత్సాహం పెరిగింది. రాహుల్ అరెస్టును వ్యతిరేకిస్తూ శుక్రవారం చెన్నైలో సాగిన నిరసనలో ఐక్యత అంటే తమదే.. అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ వ్యాఖ్యానించడం కేడర్‌లో జోష్‌ను నింపింది. సాక్షి, చెన్నై : రాష్ట్ర కాంగ్రెస్‌లోని గ్రూపుల గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అధ్యక్ష పగ్గాలు ఎవరు చేపట్టినా, ఈ గ్రూపులతో సతమతం కావాల్సిందే. ఇటీవల తిరునావుక్కరసర్ అధ్యక్ష పగ్గాలు చేపట్టినానంతరం అందర్నీ ఒకే వేదిక మీదకు తెచ్చేందుకు తీవ్రంగానే ప్రయత్నిస్తున్నారు. తిరుచ్చి వేదికగా గత నెల జరిగిన కావేరి దీక్షలో కొంత మేరకు నేతల్ని ఏకం చేయడంలో సఫలీకృతులయ్యారు. మరి కొందరు దూరంగా ఉండడంతో, వారిని కూడా తాజాగా, ఏకం చేసి ఐక్యత అంటే, తమదే అన్న ధీమాను తిరునావుక్కరసర్ వ్యక్తం చేయడం విశేషం. కావేరి దీక్షకు దూరంగా ఉన్న నేతలు, ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ విషయానికి వచ్చే కొద్ది ఏకం కావడం ఆలోచించాల్సిందే. కాగా, మహిళా నేతలు కుష్భు, నగ్మా సైతం ఇన్నాళ్లు అంటి ముట్టనట్టుగా ఉన్న విషయం తెలిసిందే. ఈ ఇద్దర్నీ కూడా ఒకే వేదిక మీదకు తీసుకురావడంలో తిరునావుక్కరసర్ సఫలీకృతులయ్యారు. ఐక్యత రాగం : రాహుల్‌గాంధీని అరెస్టు చేసి, ఢిల్లీ పోలీసులు ముప్పుతిప్పలు పెట్టడాన్ని ఖండిస్తూ తమిళనాడు కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఉదయం వళ్లువర్‌కోట్టం వేదికగా నిరసన కార్యక్రమం జరిగింది. ఇందులో రాష్ట్ర పార్టీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్, మాజీ అధ్యక్షులు ఈవీకేఎస్ ఇళంగోవన్, తంగబాలు, కృష్ణస్వామి, కుమరి ఆనందన్, కేంద్ర మాజీ మంత్రి చిదంబరం తనయుడు కార్తీ చిదంబరంలతో పాటు పార్టీఅధికార ప్రతినిధి కుష్భు, మహిళా విభాగం జాతీయ ప్రధాన కార్యదర్శి నగ్మా ప్రత్యక్షం అయ్యారు. నగ్మా, కుష్భు పక్క పక్కనే కూర్చుని ముచ్చటించుకోవడం కన్పించడం ఆ నిరసనలో ప్రత్యేక ఆకర్షణగా మారింది. మోదీపై సెటైర్లు : తిరునావుక్కరసర్ తన ప్రసంగంలో ప్రధాని నరేంద్ర మోదీని గురి పెట్టి తీవ్రంగా విరుచుకు పడ్డారు. రాహుల్‌ను అడ్డుకునేందుకు తీవ్ర కుట్రలు చేస్తున్నారని మండిపడ్డారు. ఇక, కాంగ్రెస్‌లో ఐక్యత అంటే ఇదే...అనుమానాలు ఉంటే, నివృతి చేసుకోండంటూ వ్యాఖ్యానించారు. ఈవీకేఎస్ ఇళంగోవన్ ప్రసంగిస్తూ, ఆర్ఎస్ఎస్ నుంచి వచ్చిన మోదీకి అక్కడి బుద్దులు వంట బట్టినట్టుందని మండిపడ్డారు. సర్వాధికారిగా పెత్తనం చెలారుుంచేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. కాంగ్రెస్‌తో చెలాగాటాలు ఆడిన వాళ్ల పరిస్థితి ఏమిటో ఓ మారు గుర్తు చేసుకుంటే మంచిదని హితవు పలికారు. దేశాన్ని ఏలేందుకు అన్ని అర్హతలు రాహుల్‌కు ఉన్నాయన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని హెచ్చరించారు. కుష్భు, నగ్మా ప్రసంగిస్తూ, కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ తీరును ఎండగట్టే విధంగా స్పందించారు. ప్రజల మీద చిత్తశుద్ధిలేదని, విదేశాలను చుట్టి రావడం మీదే ప్రధాని దృష్టి అంతా అంటూ ఎద్దేవా చేశారు. రాష్ట్ర పర్యటన : ఈ నిరసనానంతరం తిరునావుక్కరసర్, నగ్మా సత్యమూర్తి భవన్లో మీడియాతో మాట్లాడారు. పార్టీ బలోపేతం లక్ష్యంగా తనతో పాటు అందరూ నాయకులు రాష్ట్రంలో పర్యటించనున్నట్టు ప్రకటించారు. ఉప ఎన్నికల్లో డీఎంకే అభ్యర్థులకు మద్దతుగా కాంగ్రెస్ స్థానిక నేతలు ప్రచారంలో దూసుకెళుతున్నట్టు పేర్కొన్నారు. స్థానిక ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని, ముందుగానే, అందరు నేతల సమన్వయంతో రాష్ట్ర పర్యటన సాగుతుందని వివరించారు. కోయంబత్తూరు, తిరునల్వేలి, తంజావూరు, తిరువణ్ణామలై, చెన్నై, మదురై డివిజన్లలో ఆయా ప్రాంతాల్ని కలుపుతూ పార్టీ వర్గాలతో సమీక్షలు, సమావేశాలు, సంప్రదింపులు సాగుతాయని పేర్కొన్నారు. ఇదిలా ఉండగా, సివిల్ చట్టానికి మద్దతుగా కుష్బు చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ వర్గాల్ని ఇరకాటంలో పడేస్తుండడం గమనార్హం. నేతల మధ్య ఐక్యత కుదిరినా, ఈ మద్దతు వ్యవహారం చర్చకు వచ్చినట్టు సంకేతాలు ఉన్నారుు. అదే సమయంలో కుష్భుకు వ్యతిరేకంగా సోషల్ మీడియాల్లో స్పందించే వాళ్లూ పెరిగారు. -
మళ్లీ రచ్చకెక్కిన కుష్భు...
► కాంగ్రెస్‌లో కుష్భు చర్చ ► ఆమె వ్యక్తిగతమన్న తిరునావుక్కరసర్ ► ఆహ్వానించిన తమిళి సై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంలో, వివాదాలు కొని తెచ్చుకోవడం, చర్చల్లోకి ఎక్కడం సినీ నటి,కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్బుకు కొత్తమీ కాదు. తాజాగా దేశ వ్యాప్తంగా మైనారిటీ సంఘాలు, పార్టీలు, కాంగ్రెస్‌తో పాటుగా కొన్ని ప్రతి పక్ష పార్టీలు వ్యతిరేకిస్తున్న అంశంలోకి తలదూర్చి రచ్చకెక్కారు. సాక్షి, చెన్నై: యూనిఫాం సివిల్ కోడ్ (యూసీసీ- ఉమ్మడి పౌరసృ్మతి)కి కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు మద్దతు పలికారు. అయితే అత్యవసరంగా ఆ చట్టం తీసుకురావడం సమంజసం కాదని వ్యాఖ్యానించారు. కుష్భు వ్యాఖ్యలు కాంగ్రెస్‌లో చర్చకు దారి తీశాయి. ఆమె వ్యక్తిగత అభిప్రాయమే గానీ, పార్టీతో సంబంధం లేదని టీఎన్‌సీసీ అధ్యక్షుడు తిరునావుక్కరసర్ దాట వేశారు. ఆమె వ్యాఖ్యల్ని బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ ఆహ్వానించారు. దేశంలోని వివాహ వ్యవస్థలో ఉమ్మడి పౌరసృ్మతిని ప్రవేశ పెట్టేందుకు కేంద్రం చర్యల్ని వేగవంతం చేసి ఉన్న విషయం తెలిసిందే. ట్రిపుల్ తలాక్‌ను ఇక దేశం నుంచి సాగనంపినట్టే అన్నట్టుగా కేంద్రంలోని పాలకుల వ్యాఖ్యలు దేశంలోని మైనారిటీల్లో ఆక్రోశాన్ని రగిల్చి ఉన్నాయి. ముస్లిం వ్యక్తిగత చట్టాలను సమీక్షించి, వివాహం, విడాకుల విషయంలో ప్రత్యేక నిబంధనల్ని అమలు చేయడానికి కేంద్రం ప్రయత్నిస్తున్నదన్న ఆగ్రహం బయల్దేరింది. కేంద్రం చర్యలకు వ్యతిరేకంగా తమిళనాడులోని వివిధ పార్టీల్లో ఉన్న మైనారిటీ సంఘాల నాయకులు, పలు మైనారిటీ పార్టీలు ఏకమై ఉద్యమించే పనిలో పడ్డాయి. ఈ పరిస్థితుల్లో కుష్భు యూసీసీకి మద్దతుగా స్పందించడం ఆ సంఘాలకు పుండుమీద కారం చల్లినట్టు అయింది. కాంగ్రెస్ వర్గాలు అయోమయంలో పడ్డాయి. పార్టీలో చర్చకు దారి తీయడంతో ఢిల్లీ వరకు పయనించే అవకాశాలు ఎక్కువే. ఓ మీడియాకు ఇచ్చిన ఇంటర్వ్యూలో యూసీసీకి మద్దతు ఇచ్చినట్టు ఇచ్చిన కుష్భు, అమల్లో అంత అవసరం ఎందుకో అని కేంద్రాన్ని ప్రశ్నించడం గమనార్హం. మీడియా ముందు వెల్లడి ఓ మీడియాతో కుష్భు మాట్లాడుతూ, ప్రపంచంలో అనేక దేశాలు యూసీసీని అమల్లోకి తెచ్చినట్టు వివరించారు. అన్ని మతాలకు వ్యక్తిగత చట్టాలు ఉంటాయని, కాలానుగుణంగా మార్పులు రావాల్సిన అవసరం ఉందన్నారు. అందుకు తగ్గట్టుగా కొత్త చట్టాలు తీసుకురావాలని, స్వతంత్రంగా మహిళలు ముందుకు సాగే పరిస్థితుల్ని కల్పించాలని సూచించారు. ఇందుకు తగ్గట్టుగా కేంద్రం తీసుకుంటున్న చర్యల్ని సమర్థిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. యూసీసీని తాను ఆహ్వానిస్తున్నానని, మద్దతు పలుకుతున్నట్టు స్పందించారు. అయితే ఆగమేఘాలపై చట్టం తీసుకురావాల్సిన అవసరం కేంద్రానికి ఎందుకో అని ప్రశ్నించారు. అన్ని మతాల పెద్దల్ని ఒక చోట కూర్చొబెట్టి, అందుకు తగ్గ చర్చ, సమీక్షల అనంతరం తుది నిర్ణయం తీసుకోవాలే గానీ, ఇలా ఆగమేఘాలపై చట్టం తీసుకు వచ్చేందుకు ఉరకలు తీయడాన్ని ఖండిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. ప్రధాని నరేంద్ర మోదీ తాజా చర్యలను చూస్తుంటే, కేవలం యూపీ ఎన్నికల్ని దృష్టిలో పెట్టుకుని సాగిస్తున్నట్టుందని విమర్శించారు. యూసీసీకి తాను మద్దతు అని కుష్భు స్పందించడం కాంగ్రెస్ వర్గాల్లో చర్చ బయలుదేరింది. ఈ విషయంగా ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు తిరునావుక్కరసర్‌ను ప్రశ్నించగా, ఆమె వ్యక్తిగత అభిప్రాయమే గానీ, పార్టీ నిర్ణయం కాదంటూ దాట వేశారు. ఇక, వీసీకే నేత తిరుమావళవన్ స్పందిస్తూ, కుష్భు అవగాహన లోపంతో స్పందించి ఉన్నారని విమర్శించారు. మైనారిటీ సంఘాలు, పార్టీల నా యకులు కుష్భు వ్యాఖ్యల్ని ఖండించే పనిలో పడ్డారు. అయితే, బీజేపీ రాష్ట్ర అధ్యక్షురాలు తమిళి సై సౌందరరాజన్ కుష్భుకు మద్దతుగా నిలిచారు. మైనారిటీ సామాజిక వర్గం నుంచి వచ్చిన కుష్భు యూసీసీకి మద్దతుగా స్పందించడం ఆహ్వానిస్తున్నట్టు వ్యాఖ్యానించారు. -
నేను పులిని.. రెచ్చగొడితే పంజా విసురుతా
" నేను పులిని...నన్ను రెచ్చగొట్టొదు...పంజా విసురుతా.."అని పార్టీలో తనను విమర్శిస్తున్న వారిని కాంగ్రెస్ అధికార ప్రతినిధి కుష్భు హెచ్చరించారు. ఆమె ఖ్యలతో గ్రూపు నేతల మద్దతు మహిళా నాయకులు కారాలు మిరియాలు నూరుతున్నారు. రాష్ట్ర కాంగ్రెస్‌లో గ్రూపు రాజకీయ వివాదం తెలిసిందే. పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇలంగోవన్‌ను పదవీచ్యుతుడ్ని చేయడానికి గ్రూపు నేతలు రచించిన పథకం అధికార ప్రతినిధి కుష్భు రూపంలో బెడిసి కొట్టిందని చెప్పవచ్చు. కాంగ్రెస్‌లో కీలక నేతగా అవతరిస్తున్న కుష్భుకు ఢిల్లీ పెద్దల వద్ద మంచి గుర్తింపు ఉంది. ఆమె సేవల్ని పూర్తి స్థాయిలో వినియోగించుకునేందుకు ఏఐసీసీ సిద్ధం అయింది. ఈ సమయంలో ఈవీకేఎస్‌కు అండగా అధిష్టానం పెద్దల వద్ద కుష్భు వాదన విన్పించినట్టు సమాచారం. కుష్భు అండతో ఈవీకేఎస్‌కు పదవీ గండం తాత్కాలికంగా తప్పినట్టు అయింది. కుష్భు మీద విమర్శలు ఎక్కుపెట్టే పనిలో గ్రూపుల నేతల మద్దతు మహిళా నాయకులు సిద్ధమయ్యారు. కొందరు మహిళా నాయకులు కుష్భుకు వ్యతిరేకంగా వ్యాఖ్యలను సంధించారు. వారికి సమాధానం ఇస్తూ 'నేను పులిని...నాతో పరాచకాలు వద్దు...రెచ్చగొడితే పంజా విసురుతా' అంటూ కాంగ్రెస్ కొంగు మహానాడులో కుష్బు తీవ్రంగానే స్పందించారు. ఈరోడ్ వేదికగా శుక్రవారం జరిగి మహానాడులో కుష్భు తనదైన శైలిలో తీవ్రంగానే స్పందించారు. ఒకప్పుడు రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ కార్యాలయం సత్యమూర్తి భవన్లో కార్యకర్తల సందడే కన్పించేది కాదని, ఈవీకేఎస్ అధ్యక్ష పగ్గాలు చేపట్టిన తర్వాత రోజుకు మూడు వందల మంది వరకు కార్యకర్తలు వచ్చి వెళ్తున్నారని వివరించారు. పార్టీ బలోపేతం కోసం శ్రమిస్తున్నందునే ఈవీకేఎస్‌కు తాను అండగా నిలిచానని స్పష్టం చేశారు. సొంత డబ్బులు ఖర్చు పెట్టి మరీ కార్యకర్తలు సభలు, సమావేశాలు నిర్వహిస్తున్నారంటే, రాష్ట్రంలో కాంగ్రెస్ బలోపేతం కావాలన్న కాంక్ష వారిలో ఏ మేరకు ఉన్నదో అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన సత్తాను చాటుకునే రీతిలో ప్రతి ఒక్కరూ శ్రమించాల్సిన అవసరం ఉందని పిలుపునిచ్చారు. తమ నేత రాహుల్ గాంధీ ప్రజల్లో తిరుగుతుంటే ప్రధాని నరేంద్రమోదీ విదేశీ పర్యటనల్లో మునిగి ఉన్నారని విమర్శించారు. డీఎంకే అధినేత కరుణానిధి అంటే తనకు ఎంతో మర్యాద అని, తాను ఆ పార్టీలో నుంచి ఎందుకు బయటకు వచ్చాననే విషయం ఆయనకు తెలుసునని, ప్రత్యేకంగా అందరికీ చెప్పుకోవాల్సిన అవసరం లేదని అన్నారు. ఈ నెలాఖరు నుంచి రాష్ట్ర వ్యాప్తంగా పర్యటనకు సిద్ధమవుతున్నానని చెప్పారు. కుష్భు ప్రసంగానికి మహానాడులో హర్షధ్వానాలు ప్రతిధ్వనించాయి. ఈవీకేఎస్ మద్దతు వర్గం ఆనందం వ్యక్తం చేసింది. -
కుష్భుకు అందలం
* జయంతి ఎక్కడ * ఈవీకేఎస్ వ్యూహం ఫలించేనా? సాక్షి, చెన్నై: కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్న కుష్భును అందలం ఎక్కిం చేందుకు ఏఐసీసీ కసరత్తుల్లో పడింది. ఆమెకు అధికార ప్రతినిధి లేదా, పార్టీ మహిళా అధ్యక్షురాలు పదవి అప్పగించే అవకాశాలు ఉన్నట్టు టీఎన్‌సీసీ వర్గాలు పేర్కొంటున్నాయి. సినీ గ్లామర్ ద్వారా పార్టీ బలోపేతం లక్ష్యంగా టీఎన్‌సీసీ అధ్యక్షుడు ఈవీకేఎస్ ఇళంగోవన్ రచిస్తున్న వ్యూహాలు ఏ మేరకు ఫలితాన్ని ఇస్తాయోనన్న చర్చ ఆరంభం అయింది. చక్కటి వాక్ చాతుర్యం, అనర్గళంగా పలు భాషల్ని మాట్లాడగలిగిన కుష్భు డీఎంకేలో రాణించినా, అక్కడి రాజకీయాలకు తట్టుకోలేని పరిస్థితి. ఎట్టకేలకు అక్కడి నుంచి బయటకు వచ్చిన ఆమె కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు. తానేమీ ఆషామాషీ నాయకురాలు కాదన్నట్టుగా ఆమె ప్రవేశం ఢిల్లీ పెద్దల సమక్షంలో జరగడం ఇక్కడి కాంగ్రెస్ వాదులను విస్మయంలో పడేసింది. టెన్ జన్‌పథ్ ఆశీర్వాదం, ఆహ్వానం కోసం ఇక్కడి నేతలు నెలల తరబడి ఎదురు చూడటం సహజం. అయితే, పార్టీలోకి వచ్చీరాగానే, టెన్ జన్‌పథ్ మెట్లు ఎక్కడం అధినేత్రి సోనియా గాంధీతో ముచ్చటించడం, వెను వెంటనే ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని కలుసుకోవడం, జాతీయ స్థాయి నాయకులు ఆమె ప్రెస్ మీట్లో కూర్చోవడం వంటి పరిణామాల్ని చూసిన ఇక్కడి కాంగ్రెస్‌వాదులు, కుష్భు రాష్ర్ట పార్టీలో అధినాయకురాలు అయినట్టున్నారేనని పెదవి విప్పుతున్నారు. ఇందుకు అద్దం పట్టే విధంగానే కుష్భుకు మంచి గుర్తింపు ఇవ్వడానికి ఏఐసీసీ నిర్ణయించింది. జయంతి ఎక్కడ: కాంగ్రెస్ పార్టీలో తీవ్ర పరి ణామాలు చోటు చేసుకుంటుంటే, ఆ పార్టీ సీనియర్ నాయకురాలు, కేంద్ర మాజీ మంత్రి జయంతి నటరాజన్ ఏమయ్యారోనన్న ప్రశ్న బయలు దేరింది. ఆమెకు చెక్ పెట్టడం లక్ష్యం గానే కుష్భును తెర మీదకు ఈవీకేఎస్ తీసుకొచ్చినట్టుగా ప్రచారం మొదలైంది. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటూ, కేవలం ఢిల్లీ పరిచయాలతో పదవులను దక్కించుకుంటున్న ఆమెను పక్కన పెట్టేందుకు ఏఐసీసీ ఉపాధ్యక్షుడు రాహుల్ సైతం సిద్ధమయ్యారన్న సంకేతాలు వెలువడుతున్నాయి. ఈవీకేఎస్ వ్యూహాలు ఫలించేనా : కుష్భుకు బలమైన పదవి అప్పగించడం ద్వారా ఆమె సేవల్ని రాష్ట్ర వ్యాప్తంగా పార్టీ బలోపేతానికి ఉపయోగించుకునేందుకు నిర్ణయించిన ఏఐసీసీ అధిష్టానం, ఇక నటుడు కార్తీక్‌ను త్వరితగతిన పార్టీలోకి తీసుకొచ్చే విధంగా ఆదేశాలను ఇచ్చింది. వీరితో పార్టీని ప్రజల్లోకి తీసుకెళ్లడంతో పాటుగా అవసరం అయితే, ఎన్నికల వేళ కుష్భును అందలం ఎక్కించి మహిళా ఓటు బ్యాంక్‌ను కొల్లగొట్టేందుకు ఈవీకేఎస్ వ్యూహ రచనలు చేసి ఉన్నట్టుగా ఆయన మద్దతు దారులు పేర్కొంటున్నారు. గ్రూపు రాజకీయాలకు పెట్టింది పేరుగా ఉన్న రాష్ట్ర కాంగ్రెస్‌లో జీకే వాసన్ వర్గం బయటకు వెళ్లింది. ఇక చిదంబరం, తంగబాలు, ఆర్ ప్రభు తదితర గ్రూపుల్ని కుష్భు ఏ మేరకు అధిగమించి రాష్ట్ర కాంగ్రెస్‌లో రాణిస్తారోనన్నది వేచి చూడాల్సిందే.