Kushagra Mohan
-
విజేత మౌనిక అక్షయ.. కుశాగ్ర మోహన్‌కు రజతం
జంషెడ్పూర్: టాటా స్టీల్ ఆసియా జూనియర్ చెస్ చాంపియన్‌షిప్ మహిళల బ్లిట్జ్ ఈవెంట్లో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన బొమ్మిని మౌనిక అక్షయ విజేతగా అవతరించింది. గుంటూరు జిల్లాకు చెందిన 20 ఏళ్ల మౌనిక అక్షయ నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత 7.5 పాయింట్లు సాధించి అగ్రస్థానంలో నిలిచింది. మౌనిక అక్షయ ఏడు గేముల్లో గెలిచి, ఒక గేమ్‌ను ‘డ్రా’ చేసుకొని, మరో గేమ్‌లో ఓడి స్వర్ణ పతకాన్ని కైవసం చేసుకుంది. భారత్‌కే చెందిన భాగ్యశ్రీ పాటిల్, బ్రిస్టీ ముఖర్జీ వరుసగా రెండు, మూడు స్థానాల్లో నిలిచి రజత, కాంస్య పతకాలను దక్కించుకున్నారు. కుశాగ్ర మోహన్‌కు రజతం బ్లిట్జ్ ఓపెన్ విభాగంలో తెలంగాణకు చెందిన కుశాగ్ర మోహన్ రజత పతకం సాధించాడు. నిర్ణీత తొమ్మిది రౌండ్ల తర్వాత అలెక్సీ గ్రెబనోవ్ (రష్యా), కుశాగ్ర మోహన్ 7.5 పాయింట్లతో సంయుక్తంగా అగ్రస్థానంలో నిలిచారు. అయితే మెరుగైన టైబ్రేక్ స్కోరు ఆధారంగా ర్యాంక్‌ను వర్గీకరించగా... గ్రెబనోవ్కు స్వర్ణం ఖరారైంది. కుశాగ్ర మోహన్‌కు రజతం లభించింది. క్వార్టర్స్‌లో ఓడిన అభిమన్యు బెల్గ్రేడ్: ప్రపంచ సీనియర్ రెజ్లింగ్ చాంపియన్‌షిప్‌లో తొలి రోజు నలుగురు భారత రెజ్లర్లు నిరాశపరిచారు. ఆకాశ్ దహియా (61 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో, అభిమన్యు (70 కేజీలు) క్వార్టర్ ఫైనల్లో... సందీప్ మాన్ (86 కేజీలు) రెండో రౌండ్లో... సుమిత్ మలిక్ (125 కేజీలు) ప్రిక్వార్టర్ ఫైనల్లో ఓడిపోయారు. ఒలింపిక్ వెయిట్ కేటగిరీల్లో సందీప్, సుమిత్‌లపై నెగ్గిన రెజ్లర్లు ఫైనల్ చేరుకోకపోవడంతో భారత రెజ్లర్లకు ‘రెపిచాజ్’ రౌండ్లలో ఆడే అవకాశం కూడా రాలేదు. అభిమన్యు క్వార్టర్ ఫైనల్లో 2–9తో అలెన్ రూథర్‌ఫర్డ్ (అమెరికా) చేతిలో ఓడిపోయాడు. అలెన్ ఫైనల్ చేరుకోవడంతో అభిమన్యుకు నేడు ‘రెపిచాజ్’ బౌట్లలో పోటీపడే అవకాశం లభించింది. -
కుశాగ్ర మోహన్ గెలుపు
కవాడిగూడ: అంతర్జాతీయ ఓపెన్ ఫిడే రేటింగ్ చెస్ టోర్నీ బుధవారం ఘనంగా ప్రారంభమైంది. హోటల్ మారియట్ వేదికగా జరుగుతోన్న ఈ టోర్నీలో తెలంగాణ ప్లేయర్, క్యాండిడేట్ మాస్టర్ కుశాగ్ర మోహన్ శుభారంభం చేశాడు. తొలిరౌండ్ గేమ్‌లో వశిష్ట రమణరావు (తెలంగాణ)పై కుశాగ్ర మోహన్ విజయం సాధించాడు. ఇతర మ్యాచ్‌ల్లో అద్రిజా సిన్హా (అస్సాం)పై ఫిడే మాస్టర్ మట్టా వినయ్ కుమార్ (ఆంధ్రప్రదేశ్), సెరా డగారియా (మధ్యప్రదేశ్)పై జె. రామకృష్ణ (ఆంధ్రాబ్యాంక్), మీర్ మాహిర్ అలీ (తెలంగాణ)పై వెంకట కృష్ణ కార్తీక్ (ఆంధ్రప్రదేశ్) విజయం సాధించారు. అంతర్జాతీయ మాస్టర్లు కె. రత్నాకరన్ (కేరళ), రవితేజ (ఆంధ్రప్రదేశ్), సమీర్ (మహారాష్ట్ర), శరవణ కృష్ణన్ (తమిళనాడు), సంగ్మా రాహుల్ (ఢిల్లీ)... గ్రాండ్‌మాస్టర్లు ఘోష్ దీప్తయాన్ (పశ్చిమ బెంగాల్), దీపన్ చక్రవర్తి (ఐసీఎఫ్), లక్ష్మణ్ (ఐసీఎఫ్), శ్రీరామ్ ఝా (ఢిల్లీ) ఎలాంటి సంచలనాలకు తావివ్వకుండా తమ ప్రత్యర్థులపై గెలుపొందారు. ఈనెల 23 వరకు జరుగనున్న ఈ టోర్నీలో దేశవ్యాప్తంగా 280 మంది క్రీడాకారులు తలపడుతున్నారు. 85 ఏళ్ల టి.వి సుబ్రమణియన్ టోర్నీలో అతిపెద్ద వయస్కుడు కాగా... 4 ఏళ్ల చిన్నారి సంహిత (తెలంగాణ) అతి పిన్న వయస్కురాలు. పోటీలకు ముందు జరిగిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో టెట్రాసాఫ్ట్ సంస్థ ఉపాధ్యక్షులు జయపాల్ రెడ్డి, సురేన్... డైరెక్టర్లు దుర్గా ప్రసాద్, విజయ్, శ్రీనివాస్, సురేష్, అనిల్, దీప్తి, శ్రీకాంత్, ప్రవీణ్, శ్రీరాం తదితరులు పాల్గొన్నారు.