అమరుల త్యాగాలు స్ఫూర్తి కావాలి
నిజామాబాద్ క్రైం, న్యూస్‌లైన్: సమాజ పరిరక్షణలో పోలీసు పాత్ర ఎంతో కీలకమైనదని కలెక్టర్ పీఎస్ ప్రద్యుమ్న అన్నారు. విధి నిర్వహణలో పోలీసుల ప్రాణ త్యాగాలను మరువలేమన్నా రు. సోమవారం జిల్లా కేంద్రంలోని పరేడ్ గ్రౌండ్లో నిర్వహించిన పోలీసు అమర వీరుల సంస్మరణ దినం కార్యక్రమానికి కలెక్టర్ ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. పోలీసులు విధి నిర్వహణలో అసువులు బాయ టం బాధాకరమన్నారు. ఇలాంటి సందర్భాల్లో నిరాశ కు గురికాకుండా అమరుల త్యాగాలను స్మరించుకుం టూ పోలీసులు విధులు నిర్విహ ంచాలన్నారు.
సాంకేతికంగా వచ్చిన మార్పుల కారణంగా గత పదేళ్ల నుం చి పోలీసు శాఖను సవాలు చేసే రీతిలో నేరాలు జరుగుతున్నాయన్నారు. వీటిని తిప్పికొట్టేందుకు పోలీసు లు సరికొత్త టెక్నాలజీని వినియోగించుకోవాలన్నారు. ప్రజల వద్దకు పోలీసులు వెళ్లి వారి సమస్యలు పరిష్కరించే పరిస్థితులు రావాలన్నారు. జిల్లా ఎస్పీ కేవీ మోహన్‌రావు మాట్లాడుతూ 1959 అక్టోబర్ 21న విధి నిర్వహణలో ఉన్న 10 మంది సీఆర్పీఎఫ్ జవాన్లు చైనా దురాక్రమణలో చనిపోయిన ఘటన మొదలుకుని పోలీసు అమర వీరుల సంస్మరణ దినం జరుపుతున్నామన్నారు.
ఏడాది కాలంలో దేశ వ్యాప్తంగా 579 మంది పోలీసులు విధి నిర్వహణలో అమరులు అయ్యారని తెలిపారు. అదేవిధంగా రాష్ట్రంలోని విశాఖపట్నం జిల్లా అనకాపల్లి మం డలం మార్టూర్ గ్రామానికి చెందిన రిజర్వుడు ఇన్స్పెక్టర్ ప్రసాద్‌బాబు ఏప్రిల్ 17న ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రం సుకుమా జిల్లాలోని బొట్టుగుడా, కారుగుట్టా ప్రాంతంలో నక్సల్స్‌తో పోరాడుతూ మరణించాడని పేర్కొన్నారు. వీరి సేవాలకు గుర్తింపుగా కేంద్ర ప్రభుత్వం ‘అశోకచక్ర ’ ప్రకటించినట్లు ఎస్పీ తెలిపారు. అనంతరం దేశ వ్యాప్తంగా విధి నిర్వహణ లో చనిపోయిన వారి పేర్లను నిజామాబాద్ డీఎస్పీ అనిల్‌కుమార్ చదివారు.
వారందరిని స్మరించుకుంటూ రెండు నిమిషాలు మౌనం పాటించారు. పోలీస్‌పరేడ్ మైదానంలో నెలకొల్పిన పోలీసు అమర వీరుల స్థూపానికి కలెక్టర్,ఎస్పీ,డీఎస్పీ,సీఐలు,ఎస్సైలు పూలమాలలు వేసి నివాళు లు అర్పించారు. కార్యక్రమంలో ఎస్బీ సీఐలు ఆంజనేయు లు, ప్రభాకర్, రిటైర్టు డీఎస్పీ దయానంద్ నాయుడు, నగ ర సీఐ సైదులు, ఎస్హెచ్ఓలు నర్సింగ్‌యాదవ్, సోమనాథం, ఏఆర్ ఎస్సై మల్లిఖార్జున్, నగర ఎస్సైలు, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు షకీల్పాష తదితరులు పాల్గొన్నారు.