kv rangareddy
-
'మిషన్ భగీరథతో మంచినీళ్లిస్తాం'
హైదరాబాద్: మరో రెండేళ్లలో మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన కేవీ రంగారెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఈ సందర్బంగా మాట్లాడుతూ కేవీ రంగారెడ్డి పుస్తకాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. కేవీ రంగారెడ్డి సూచించిన బాటలో తామంతా నడుస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రూ.20 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారని, కచ్చితంగా 100శాతం బంగారు తెలంగాణ సాధిస్తామని తెలిపారు. -
రాష్ట్రాభివృద్ధే ఆయనకు నిజమైన నివాళి
చేవెళ్ల: అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించడమే కొండా వెంకట రంగారెడ్డికి నిజమైన నివాళి అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి 125 వ జయంతి సందర్భంగా శనివారం చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు. కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించిన అనంతరం ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపేటప్పుడే కేవీ రంగారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అనంతరం తెలంగాణను సాధించుకోవడానికి ఆరు దశాబ్దాలు పోరాడాల్సి వచ్చిందన్నారు.