రాష్ట్రాభివృద్ధే ఆయనకు నిజమైన నివాళి
చేవెళ్ల: అన్ని రంగాలలో తెలంగాణ అభివృద్ధి సాధించడమే కొండా వెంకట రంగారెడ్డికి నిజమైన నివాళి అని చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి పేర్కొన్నారు. తెలంగాణ పోరాట యోధుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి కేవీ రంగారెడ్డి 125 వ జయంతి సందర్భంగా శనివారం చేవెళ్లలోని ఆయన విగ్రహానికి పూలమాలు వేసి నివాళులర్పించారు.
కుటుంబసభ్యులతో కలిసి నివాళులర్పించిన అనంతరం ఎంపీ విశ్వేశ్వర్‌రెడ్డి విలేకరులతో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్రాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కలిపేటప్పుడే కేవీ రంగారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారని తెలిపారు. అనంతరం తెలంగాణను సాధించుకోవడానికి ఆరు దశాబ్దాలు పోరాడాల్సి వచ్చిందన్నారు.