మరో రెండేళ్లలో మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన కేవీ రంగారెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
హైదరాబాద్: మరో రెండేళ్లలో మిషన్ భగీరథ తో ప్రతి ఇంటికి మంచినీరు అందిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. శనివారం ఆయన కేవీ రంగారెడ్డి జయంతి ఉత్సవాల్లో పాల్గొన్నారు.
ఈ సందర్బంగా మాట్లాడుతూ కేవీ రంగారెడ్డి పుస్తకాలు ప్రజలను ఎంతో ప్రభావితం చేశాయని చెప్పారు. కేవీ రంగారెడ్డి సూచించిన బాటలో తామంతా నడుస్తామని కేసీఆర్ అన్నారు. తెలంగాణలో రూ.20 వేల కోట్లతో పెట్టుబడులు పెట్టేందుకు పారిశ్రామిక వేత్తలు ముందుకొచ్చారని, కచ్చితంగా 100శాతం బంగారు తెలంగాణ సాధిస్తామని తెలిపారు.