lakshmi prasad
-
ప్రిన్సిపాల్ వేధిస్తున్నాడని..
రామన్నపేట: నగరంలోని ములుగు రోడ్డు సమీపంలోని లాల్ బహదూర్ కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మీప్రసాద్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడని ఆరోపిస్తూ అదే కళాశాలలోని మహిళా అసిస్టెంట్ ప్రొఫెసర్ రాధ శుక్రవారం కళాశాల భవనం ఎదుట నిరసన తెలిపారు. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. ఇటీవల కళాశాలలో జరిగిన టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇండిపెండెంట్ అభ్యర్థి గాలి హర్షవర్ధన్‌రెడ్డిని టీచర్ల సమస్యలపై ప్రశ్నించినందుకు కళాశాల యాజమాన్యం తనను వేధిస్తున్నట్లు పేర్కొన్నారు. టీచర్ల సమస్యలు తీర్చాలని అడిగినందుకు తనకు కళాశాల యాజమాన్యం నోటీసులు ఇవ్వగా తీసుకోకపోవడంతో, కళాశాల నుంచి వెళ్లిపోవాలని ప్రిన్సిపాల్ హుకుం జారీ చేశారని తెలిపారు. ఏడు సంవత్సరాలుగా కళాశాలలో ఫిలాసఫీ సబ్జెక్టు అసిస్టెంట్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నానని, ఉస్మానియా గ్రాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ కింద నడుస్తున్న కళాశాలలో ప్రిన్సిపాల్ ఏకపక్షంగా వ్యహరిస్తున్నారని ఆరోపించారు. కళాశాలలో పలు అభివృద్ధి కార్యక్రమాల పేరిట ప్రిన్సిపాల్ నిధులు దుర్వినియోగం చేస్తున్నారని, కళాశాలలో అధ్యాపకులు చాలా ఇబ్బందులకు గురవుతున్నారని, ప్రిన్సిపాల్‌కి భయపడి ఎవరూ బయటికి చెప్పుకోవడంలేదని వివరించారు. కళాశాలలో జరుగుతున్న అన్యాయాలపై ఉస్మానియా గ్యాడ్యుయేట్ అసోసియేషన్ సొసైటీ దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. -
నిబద్ధతకు చిరునామా సీఎం జగన్
సాక్షి, ఏయూ క్యాంపస్ (విశాఖ తూర్పు): నిబద్ధతకు నిలువుటద్దంగా సీఎం వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి నిలుస్తారని అధికార భాషా సంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ అన్నారు. ఏయూ టీఎల్ఎన్ సభా మందిరంలో డాక్టర్ జీకేడీ ప్రసాద్ వ్యాస సంకలనం ‘జనం కంటిరెప్ప జగన్’ పుస్తకాన్ని శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. అనంతరం మాట్లాడుతూ.. పుస్తక రచయిత జీకేడీని అభినందించారు. అధికార భాషా సంఘం సభ్యుడు, ఏయూ విశ్రాంత ఆచార్యులు ఆచార్య చందు సుబ్బారావు మాట్లాడుతూ రెండేళ్ల జగన్మోహన్రెడ్డి పరిపాలనపై విశ్లేషణాత్మక వ్యాసాల సంకలనంగా పుస్తకం తీసుకురావడం మంచి పరిణామమన్నారు. ఏయూ పాలక మండలి సభ్యురాలు గిరిజా అగస్టీన్ మాట్లాడుతూ.. వారి కుటుంబంతో తనకున్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. మేఘం వర్షాన్ని, విత్తు పంటని, వైఎస్ రాజశేఖర రెడ్డి వైఎస్ జగన్ మోహన రెడ్డిని మనకు ఇచ్చారని చెప్పారు. రాజ్యాంగ స్ఫూర్తిని కాపాడుతూ పరిపాలన అందిస్తున్నారన్నారు. పుస్తక రచయిత డాక్టర్ జీకేడీ ప్రసాద్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ప్రజా సంక్షేమ పరిపాలనపై ప్రత్యేక కవితా సంపుటిని త్వరలో తీసుకొస్తామన్నారు. ఇందుకోసం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన నవరత్నాలపై కవితలు ఆహ్వానిస్తున్నామన్నారు. ఉత్తమ కవితలకు నగదు పురస్కారాలను అందజేస్తామని చెప్పారు. సంబంధిత పోస్టర్‌ను ఆచార్య యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ ఆవిష్కరించారు. సెంటర్ ఫర్ డెమొక్రసీ పబ్లికేషన్ చైర్మన్ కె.వెస్లీ, ఏయూ హెచ్ఆర్డీసీ సంచాలకులు ఆచార్య ఎన్ఏడీ పాల్, న్యాయ కళాశాల ఆచార్యులు డి.సూర్యప్రకాశ రావు, పుస్తక ప్రచురణకర్త, బీహెచ్.ఎస్.ఆర్ అండ్ వి.ఎల్ డిగ్రీ కళాశాల సెక్రటరీ–కరస్పాండెంట్ డి.సువర్ణరాజు పాల్గొన్నారు. -
కానిస్టేబుల్ అభ్యర్థులకు శిక్షణ
ఏలూరు సిటీ : పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్కు హాజరయ్యే అభ్యర్థులు ఉచిత శిక్షణకు అర్హులైన బీసీ, ఎస్సీ, ఎస్టీలు దరఖాస్తు చేసుకోవాలని బీసీ స్టడీ సర్కిల్ డైరెక్టర్ జి.లక్ష్మీప్రసాద్ బుధవారం ఓప్రకటనలో తెలిపారు. ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తులు స్టడీ సర్కిల్ కార్యాలయంలో అందజేయాలని సూచించారు. బీసీ అభ్యర్థుల కుటుంబ వార్షిక ఆదాయం రూ.లక్ష, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు రూ .2 లక్షలలోపు కలిగి ఉండాలని, జిల్లా అభ్యర్థులు మాత్రమే అర్హులని తెలిపారు. వివరాలకు ఏలూరు గవరవరంలోని బీసీ స్టడీ సర్కిల్ కార్యాలయం 08812–232477, 99667 76077లో సంప్రదించాలని సూచించారు.