Land Records Updation
-
స్వతంత్ర భారతదేశ చరిత్రలో ప్రప్రథమం... భూవివాదాలకు చెక్..!
బ్రిటీష్ ప్రభుత్వ హయాం నుంచి మొన్నటి వరకూ గొలుసులతో సర్వే చేసేవారు. అందువల్ల ఎకరానికి కొన్ని అడుగులు/ కొన్ని గజాలు తేడా వచ్చేది. అధికారికంగానే కొంత అటూ ఇటూగా అనుమతించేవారు. దీంతో ఎప్పుడైనా క్రయవిక్రయాలు జరిగినప్పుడు హద్దుల విషయంలో అక్కడక్కడ గొడవలు చోటుచేసుకునేవి. ఇకపై ఇలాంటి గొడవలకు తావే ఉండదు. ఇప్పుడు అత్యాధునిక పరికరాలతో రీ సర్వే చేస్తుండటం వల్ల సెంటీమీటర్లతో సహా లెక్క తేలుతోంది. సాక్షి, అమరావతి: దేశ చరిత్రలో ఎక్కడా లేని విధంగా వందేళ్ల తర్వాత రాష్ట్రంలో వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన సమగ్ర భూ సర్వే విజయవంతంగా కొనసాగుతోంది. అస్తవ్యస్తంగా, తప్పుల తడకగా ఉన్న భూ రికార్డులను స్వచ్ఛీకరణ చేసి, వివాదాలను పూర్తిగా రూపు మాపడమే లక్ష్యంగా చేపట్టిన వైఎస్సార్ జగనన్న శాశ్వత భూ హక్కు, భూరక్ష పథకం కింద చేపట్టిన రీ సర్వే వెయ్యికిపైగా గ్రామాల్లో దాదాపు పూర్తయింది. రెవెన్యూ డివిజన్‌కు ఒక గ్రామం చొప్పున 51 గ్రామాల్లో పైలట్ ప్రాజెక్టుగా చేపట్టిన రీసర్వేను ఎలాంటి ఇబ్బందులు లేకుండా సజావుగా పూర్తి చేశారు. వీటి ఆధారంగా మిగిలిన గ్రామాల్లో వేగంగా సర్వే ప్రక్రియ మొదలు పెట్టారు. దీంతో ఇప్పటి వరకు 529 గ్రామాల్లో రీ సర్వే పూర్తయింది. ఆ గ్రామాల్లో పాత భూముల రికార్డుల స్థానంలో ట్యాంపరింగ్‌కు అవకాశం లేని విధంగా కొత్త భూముల రికార్డులు తయారయ్యాయి. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలను కూడా పరిష్కరించి సరిహద్దులు నిర్ణయించారు. వాటి ప్రకారం గ్రానైట్ రాళ్లు కూడా పాతారు. తద్వారా ఆయా భూ యజమానులకు వారి భూములపై శాశ్వత హక్కులు కల్పించారు. ఆ గ్రామాల్లో పక్కాగా రెవెన్యూ రికార్డులు రీ సర్వే పూర్తయిన గ్రామాల్లో డిజిటలైజ్డ్ రెవెన్యూ రికార్డులు పక్కాగా రూపొందాయి. ఎఫ్ఎంబీ (ఫీల్డ్ మెజర్మెంట్ బుక్) స్థానంలో ల్యాండ్ పార్సిల్ మ్యాప్ (ఎల్పీఎం – భూ కమతాల మ్యాప్) పుస్తకం, ఆర్ఎస్ఆర్ స్థానంలో రీసర్వే ల్యాండ్ రిజిçస్టర్, కొత్త 1బి రిజిస్టర్, అడంగల్ రిజిస్టర్, రెవెన్యూ గ్రామ మ్యాప్‌లు రూపొందాయి. ఇవన్నీ తాజా వివరాలు, తాజా భూ యజమానుల వివరాలతో నమోదయ్యాయి. ఇప్పటి వరకు ఉన్న రికార్డుల్లో 1928లో బ్రిటీష్ ప్రభుత్వం సర్వే చేసి నిర్ధారించిన వివరాలు, అప్పటి భూ యజమానుల పేర్లు ఉన్నాయి.. ఇప్పటి వరకు సర్వే నంబర్లు ఉండగా, రీసర్వే తర్వాత ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు ఉంటాయి. ఎల్పీఎం పుస్తకంలో ప్రతి భూమికి సంబంధించిన మ్యాప్, యజమాని వివరాలు ఉంటాయి. క్యూ ఆర్ కోడ్ జియో కో ఆర్డినేట్స్‌తో ఎల్పీఎంలను ముద్రించారు. క్యూఆర్ కోడ్‌ను స్కాన్ చేస్తే ఆ భూమి వివరాలు తెలుస్తాయి. ఈ గ్రామాల్లో చనిపోయిన వారి పేర్లతో ఉన్న భూములను హక్కుదారుల పేర్లతో మ్యుటేషన్ చేశారు. ప్రతి ల్యాండ్ పార్సిల్ (ల్యాండ్ బిట్)కు త్వరలో ఆధార్ తరహాలో ఒక విశేష గుర్తింపు సంఖ్య ఇవ్వనున్నారు. రీ సర్వే తర్వాత గ్రామ, వార్డు సచివాలయాల్లోనే రిజిస్ట్రేషన్ సేవలు కూడా అందుబాటులోకి తెస్తున్నారు. ప్రస్తుతం 37 గ్రామ సచివాలయాల్లో రిజిస్ట్రేషన్లు సైతం ప్రారంభించారు. ఇదిలా ఉండగా మరో 652 గ్రామాల్లో రీ సర్వే తుది దశకు చేరుకుంది. రాష్ట్ర వ్యాప్తంగా 17,460 రెవెన్యూ గ్రామాలు (సర్వే పూర్తయినవి మినహా), 47,861 ఆవాసాలు, 110 పట్టణ, నగరాభివృద్ధి సంస్థల పరిధిలోని (అటవీ భూములు మినహా) భూములు, స్థలాలు, ఇళ్లు సర్వే చేసి, హద్దులు నిర్ణయించే మహా యజ్ఞాన్ని 2023 ఆగస్టు నాటికి పూర్తి చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అత్యాధునిక విధానంలో రీ సర్వే – ప్రపంచంలోనే అత్యంత ఆధునిక విధానంలో హైబ్రిడ్ తరహాలో కంటిన్యూస్ ఆపరేటింగ్ రిఫరెన్స్ స్టేషన్స్ (కార్స్), డ్రోన్లతో అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో సర్వే నిర్వహిస్తున్నారు. డ్రోన్ సర్వే కోసం సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నారు. – వేలాది గ్రామాల్లో సర్వే చేయాల్సి ఉండడంతో ప్రైవేటు కంపెనీల నుంచి కూడా డ్రోన్లను సమకూర్చుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటి వరకు 26 జిల్లాల్లో 2,155 గ్రామాల్లో డ్రోన్ సర్వే పూర్తయింది. మిగిలిన గ్రామాల్లోను వేగంగా డ్రోన్ సర్వే చేయడానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. – 782 గ్రామాలకు సంబంధించిన 7.76 లక్షల ఎకరాల్లో క్షేత్ర స్థాయి నిజనిర్ధారణ అంటే డ్రోన్ చిత్రాలతో, భూ యజమానుల సమక్షంలో వాస్తవ హద్దులను పోల్చి చూసే ప్రక్రియ పూర్తయింది. సర్వే నిర్వహణలో గ్రామ సచివాలయ వ్యవస్థలోని గ్రామ సర్వేయర్లు కీలకపాత్ర పోషిస్తున్నారు. 11,128 గ్రామ సర్వేయర్లకు సర్వే సెటిల్మెంట్ శాఖ సంప్రదాయ, ఆధునిక సర్వే విధానాలపై శిక్షణ ఇవ్వడంతో వారు చురుగ్గా పని చేçస్తున్నారు. ఆ గ్రామ సచివాలయంలో 102 రిజిస్ట్రేషన్లు – ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట మండలం షేర్ మహ్మద్పేటలో రీ సర్వే పూర్తయింది. ఇప్పుడు ఈ గ్రామంలో రిజిస్ట్రేషన్లు కూడా జరుగుతున్నాయి. గ్రామానికి చెందిన ఎవరూ రిజిస్ట్రార్ ఆఫీస్‌కు వెళ్లడం లేదు. భూములు, ఇళ్ల అమ్మకాలు, గిఫ్ట్ డీడ్లు వంటి రిజిస్ట్రేషన్లన్నీ గ్రామ సచివాలయంలోనే చేయించుకుంటున్నారు. – ఇప్పటి వరకు అక్కడ 102 రిజిస్ట్రేషన్లు జరగడం విశేషం. రీసర్వే పక్కాగా జరగడంతో గ్రామ సచివాలయంలో పాత భూముల రికార్డుల స్థానంలో కొత్త రికార్డులు అందుబాటులోకి వచ్చాయి. 1928లో బ్రిటీష్ హయాంలో చేసిన సర్వే ప్రకారం గ్రామంలో 1,251.37 ఎకరాల భూమి ఉంది. రీ సర్వే తర్వాత 1,253.35 ఎకరాలు ఉన్నట్లు తేలింది. – గతంలో గ్రామ కంఠం 54 ఎకరాలు ఉండగా, ఇప్పుడు 187 ఎకరాలకు పెరిగింది. వందేళ్లలో ఆ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పడడం, పారిశ్రామిక ఇతర అభివృద్ధితో గ్రామ కంఠం పెరిగింది. ఫలితంగా పట్టా భూమి తగ్గినట్లు మండల సర్వేయర్ అనీష్ తెలిపారు. సర్వేకు ముందు భూ వివరాలు – మొత్తం భూమి : 1,251.37 ఎకరాలు – పట్టా భూమి : 889.38 ఎకరాలు – ప్రభుత్వ భూమి : 297.87 ఎకరాలు – గ్రామ కంఠం : 54.11 ఎకరాలు – అసైన్డ్ భూమి : 10.01 ఎకరాలు – మొత్తం సర్వే నంబర్లు : 240 – సబ్ డివిజన్లు : 467 రీ సర్వే తర్వాత.. – మొత్తం భూమి : 1,253.35 ఎకరాలు – పట్టా భూమి : 758.56 ఎకరాలు – ప్రభుత్వ భూమి : 297.87 ఎకరాలు – గ్రామ కంఠం : 187.23 ఎకరాలు – అసైన్డ్ భూమి : 9.69 ఎకరాలు – మొత్తం ఎల్పీఎం (ల్యాండ్ పార్సిల్ మ్యాప్‌లు) : 610 ఏపీ రీసర్వేపై ఇతర రాష్ట్రాల ఆసక్తి ఏపీలో రీసర్వే గురించి తెలుసుకునేందుకు ఇతర రాష్ట్రాలు ఆసక్తి చూపుతున్నాయి. మహారాష్ట్ర సర్వే సెటిల్మెంట్ అధికారుల బృందం రాష్ట్రానికి వచ్చి రీ సర్వేపై వివరాలు సేకరించింది. క్షేత్ర స్థాయికి వెళ్లి మరీ వాస్తవాలు తెలుసుకుని హర్షం వ్యక్తం చేసింది. అనుకున్నదానికంటే రీ సర్వే చక్కగా సాగుతోంది. వెయ్యికి పైగా గ్రామాల్లో సర్వే పూర్తయింది. రికార్డుల స్వచ్ఛీకరణ నుంచి కొత్త భూ రికార్డులు రూపొందించే వరకు 16 దశల ప్రక్రియను ఎంతో పకడ్బందీగా నిర్వహిస్తున్నాం. సీఎం వైఎస్ జగన్ నిర్దేశించిన గడువులోపు రాష్ట్ర వ్యాప్తంగా సర్వే పూర్తవుతుంది. – కెజియా కుమారి, రీజినల్ డిప్యూటీ డైరెక్టర్, సర్వే సెటిల్మెంట్, భూ రికార్డుల శాఖ అధికారులే హద్దులు నిర్ణయించి రాళ్లు పాతారు నాకు, నా తమ్ముడికి కలిపి 4.17 ఎకరాల పొలం ఉంది. సర్వేలో కొలతలు బాగా వచ్చాయి. సర్వే చేశాక అధికారులే హద్దులు నిర్ణయించి రాళ్లు పాతించారు. మేమే రాళ్లు కొనుక్కోవాలంటే రూ.4, 5 వేలు ఖర్చవుతుంది. ప్రభుత్వమే రాళ్లు పాతించడం పట్ల ఆనందంగా ఉంది. – మోచర్ల నాగయ్య, రైతు, షేర్ మహ్మద్‌పేట, జగ్గయ్యపేట మండలం ఖర్చు లేకుండా సర్వే చేశారు సర్వే నంబర్ 45లో నాకు ఉన్న 6 ఎకరాల పొలాన్ని రూపాయి ఖర్చు లేకుండా సర్వే చేసి, హద్దులు నిర్ణయించారు. నేను సర్వే చేయించుకోవాలంటే చాలా రోజులు పట్టేది. డబ్బూ ఖర్చయ్యేది. కానీ అధికారులే స్వయంగా వచ్చి సర్వే పూర్తి చేసి, హద్దు రాళ్లు పాతారు. చాలా సంతోషంగా ఉంది. – కాకనబోయిన బిక్షమయ్య, రైతు, షేర్ మహ్మద్‌పేట, జగ్గయ్యపేట మండలం -
ఆధార్ నంబర్‌తో.. భూమిని కొట్టేసేందుకు కుట్ర
సాక్షి, హైదరాబాద్: భూమి ఉన్నది 20 గుంటలే... కానీ మార్కెట్లో దాని ధర కోట్లు పలుకుతోంది. ఆ భూమి యజమాని దాదాపు రెండేళ్ల క్రితం మరణించారు. సదరు యజమాని కుటుంబీకులు ఆ భూమిని తమ పేరు మీద బదలాయించుకోలేదు. దీన్ని గమనించిన కొందరు ప్రబుద్ధులు భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నారు. ఒక్క ఆధార్ నంబర్‌తో అప్పనంగా భూమిని సొంతం చేసుకుందామనుకున్నారు. రెవెన్యూ అధికారుల విచారణలో అసలు విషయం తేలడంతో అడ్డంగా బుక్కయ్యారు. సంగారెడ్డి జిల్లా పటాన్చెరు మండలం భానూర్ గ్రామంలో సర్వే నంబర్ 497/ఇలో 20 గుంటల భూమి ఉంది. గత ఏప్రిల్ 19న తోట హనుమంతరావు పేరుతో ధరణి పోర్టల్‌కు ఒక దరఖాస్తు వచ్చింది. ఆ భూమికి ఈకేవైసీ కోసం తన ఆధార్ నంబర్‌ను నమోదు చేయాలని ఆ దరఖాస్తులో కోరారు. దీన్ని విచారిస్తుండగానే మే 6న తోట కనకదుర్గ పేరుతో మరో దరఖాస్తు వచ్చింది. తన భర్త తోట హనుమంతరావు 2019, ఆగస్టు 9న మరణించారని, ఆయన పేరు మీద ఉన్న భూమిని తనకు వారసత్వ మార్పు చేయాలని కనకదుర్గ కోరారు. రెండు దరఖాస్తుల్లోని సర్వే నంబర్లు, ఖాతా నంబర్లు ఒకటే ఉండటంతో జూన్ 5న విచారణకు రావాలని ఇరుపార్టీలకు రెవెన్యూ అధికారులు నోటీసులు పంపారు. ధ్రువీకరణలు తీసుకుని సదరు భూమిని క్లెయిమ్ చేసుకోవాలని కోరారు. పౌరసరఫరాల డేటా బేస్‌తో.. విచారణ సమయంలో తోట హనుమంతరావు పేరు మీద దరఖాస్తు చేసుకున్న వ్యక్తి ఆ భూమికి సంబంధించిన ధ్రువీకరణలు చూపలేకపోయాడు. ఆ వ్యక్తి నమోదు చేయాలని కోరిన ఆధార్ కార్డులోని చిరునామాలో ఎంక్వైరీ చేయగా సదరు పేరున్న వ్యక్తి అక్కడ లేడని తేలింది. పౌరసరఫరాల డేటాలో వెతకగా ఆ ఆధార్ నంబర్‌తో లింక్ అయి ఉన్న రేషన్‌కార్డు దొరికింది. ఈ కార్డులో తోట హనుమంతరావు కాకుండా గుర్రం పాండు అనే పేరు వచ్చింది. ఇతనిది యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ కాగా, ఆ రేషన్‌కార్డుపై తన బయోమెట్రిక్ వివరాలను నమోదు చేసి 2020, నవంబర్‌లో రేషన్ బియ్యం తీసుకున్నాడని, ఆ తర్వాత వరుసగా అతని భార్య ఈ రేషన్ తీసుకుంటున్నట్లు వెల్లడైంది. రెవెన్యూ అధికారులు మరింత విచారించగా, గుర్రం పాండు తన ఆధార్ కార్డులోని పేరును తోట హనుమంతరావుగా 2021లో మార్చుకున్నాడని, ఆ తర్వాత అదే పేరుతో ఆ కార్డులోని నంబర్‌ను నమోదు చేసుకుని విలువైన భూమిని కొట్టేసేందుకు కుట్రపన్నాడని తేలింది. దీంతో గుర్రం పాండుపై చీటింగ్ కేసు నమోదు చేయాలని సంబంధిత తహశీల్దార్ సోమవారం పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. రెండు దరఖాస్తులు రావడంతోనే.. వాస్తవానికి రెండు దరఖాస్తులు ఒకే సమయంలో రావడంతోనే ఇది గుర్తించగలిగాం. లేదంటే ఆధార్‌కార్డులోని పేరు, పహాణీలో పేరు చూసి ఆ దరఖాస్తును ఆమోదించడమో, తిరస్కరించడమో జరిగేది. విచారణలో తప్పని తేలడంతో పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాం. ఇలాంటి వాటిపై ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలి. ఎప్పటికప్పుడు తమ భూమి రికార్డులను ఆన్లైన్లో అయినా చెక్ చేసుకుంటూ ఉండాలి. –కె. మహిపాల్‌రెడ్డి, పటాన్చెరు తహశీల్దార్ -
ఇదో రకం...‘భూకంపం’
సాక్షి, హైదరాబాద్: స్వాదీనంలో భూమి, చేతిలో పట్టా, రికార్డుల్లో పేరుంటేనే భూ హక్కుకి భద్రత. రాష్ట్రంలో అలా ఉన్న భూ యజమానులు పది శాతంలోపే. ఈ పరిస్థితిని అధిగమించేందుకు ప్రభుత్వం రెవెన్యూ వ్యవస్థలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టింది. అదే భూ రికార్డుల ప్రక్షాళన. సమస్యలన్నీ వెలికి తీసే ప్రయత్నం చేసింది. ఆచరణలో హడావుడి ప్రదర్శించింది. అయితే రెండేళ్లయినా.. భూ రికార్డుల నవీకరణ కొలిక్కిరాలేదు. అన్ని సమస్యలు పరిష్కారం కాకపోగా.. అపరిష్కృత సమస్యలు రైతులను ఇబ్బందుల్లోకి నెట్టింది. అంతిమంగా రెవెన్యూ యంత్రాంగాన్ని ఒత్తిడికి గురిచేస్తోంది. దశాబ్దాలుగా పెండింగ్‌లో ఉన్న రక్షిత కౌలుదారు, ఇనాం, సీలింగ్ చట్టాలపై స్పష్టత లేకపోవడంతో రైతులను తహసీల్దార్ల చుట్టూ తిరిగేలా చేస్తోంది. సాంకేతిక సమస్యలు సరేసరి. ఇటు రైతులు.. అటు అధికారులను ఉక్కిరిబిక్కిరి చేస్తున్న ఈ వ్యవహారం పలువురి ప్రాణాల మీదకు తెస్తోంది. చిక్కుముడిగా ‘పార్ట్–బీ’ వివాదాస్పద/అభ్యంతరకర భూములుగా పరిగణించిన వాటిని పార్ట్–బీ కేటగిరీగా పరిగణించిన ప్రభుత్వం వాటికి పట్టాదార్ పాస్‌పుస్తకాలను జారీ చేయలేదు. ఈ జాబితాలో చేర్చిన భూములకు రైతుబంధు కూడా నిలిపేసింది. పెట్టుబడి సాయానికి పాస్‌బుక్కును ప్రాతిపదికగా తీసుకోవడంతో ఈ పరిస్థితి ఎదురైంది. దీంతో రాష్ట్రవ్యాప్తంగా 3,43,983 ఖాతాల్లోని సుమారు 4 లక్షల ఎకరాల మేర భూములను పరిగణనలోకి తీసుకోలేదు. పార్ట్–బీ కేటగిరీలో కోర్టు కేసులు, అటవీ, దేవాదాయ, వక్ఫ్, భూదాన్ భూములను చేర్చింది. భూవిస్తీర్ణంలో తేడా, అన్నదమ్ముల భూ పంపకాల విస్తీర్ణంలో వ్యత్యాసం, అసైన్డ్ చేసిన భూమికి, క్షేత్రస్థాయిలో ఉన్న భూమికి తేడా, ఫారెస్టు, రెవెన్యూ శాఖల మధ్య తగాదా, ఫారెస్టు–పట్టా భూముల మధ్య వివాదాస్పదమైనవి ఇందులో నమోదు చేసింది. భూ రికార్డుల నవీకరణకు ప్రభుత్వం డెడ్‌లైన్ విధించడం, ఖరీఫ్‌లోపు కొత్త పాస్‌పుస్తకాలను జారీ చేసి రైతుబంధు పథకాన్ని ప్రవేశపెట్టాలనే ఒత్తిడి మూలంగా క్షేత్రస్థాయిలో రికార్డులను పరిశీలించలేదు సరికదా ఎవరైనా అభ్యంతరం తెలుపుతూ పిటిషన్ ఇస్తే చాలు పార్ట్–బీలో చేర్చింది. ఇదే ఇప్పుడు రెవెన్యూ అధికారులకు తలనొప్పిగా పరిణమించింది. ఎడిట్‌కు అనుమతి ఇవ్వకపోవడం, ఒకసారి నమోదు చేసిన తర్వాత మార్పులు, చేర్పులు చేసే అధికారం లేకపోవడంతో సమస్య మరింత జటిలంగా మారింది. ప్రతి చిన్నదానికి జేసీకి అప్పీల్‌కు చేసుకోవాల్సిరావడంతో కుప్పలు తెప్పలుగా ఫైళ్లు పేరుకుపోయాయి. రెండేళ్ల తర్వాత మేలుకున్న ప్రభుత్వం ఇటీవలనే ఆర్డీఓలకు ఎడిట్ ఆప్షన్ ఇచి్చంది. పారాచూట్‌లా.. వాలారు! భూ రికార్డుల గందరగోళంలో ప్రధాన పాత్ర వక్ఫ్, దేవాదాయ, భూదాన్ బోర్డు, అటవీ శాఖలదే. ఇన్నాళ్లు కనీసం గ్రామ, మండలం, జిల్లా స్థాయిల్లో రికార్డులను అప్డేట్ చేయని ఈ విభాగాలు భూ రికార్డుల ప్రక్షాళన మొదలుకాగానే.. బూజుపట్టిన గెజిట్ నోటిఫికేషన్లతో వాలాయి. దశాబ్దాలుగా సాగు చేసుకుంటున్న రైతాంగాన్ని కాదని.. ఈ భూమి తమదేనని పేచీ పెట్టాయి. చట్ట ప్రకారం ఈ భూమి ఆయా విభాగాలకే చెందుతుందని 22 (ఏ) కేటగిరీలో (ప్రభుత్వ భూములుగా) నమోదు చేసింది. ఇన్నాళ్లు తమ అ«దీనంలో ఉన్న భూమిని తన్నుకుపోవడంతో దిక్కుతోచని రైతాంగం తహశీల్ కార్యాలయాల చుట్టూ చక్కర్లు కొడుతోంది. ఇక సాంకేతిక లోపాలు కూడా రికార్డుల ప్రక్షాళనకు చెడ్డపేరు తెచి్చపెట్టాయి. తప్పుల తడకగా నమోదు చేసిన పేర్లను సవరించే వెసులుబాటు లేకపోవడం.. మ్యుటేషన్ జరిగినా... మూడు నెలల వరకు పాస్‌బుక్ చేతికి రాకపోవడం కూడా చికాకు కలిగించింది. నాలుగేళ్లుగా పహణీలోకి ఎక్కించడం లేదు.. ‘1981లో శివలింగం రామయ్య వద్ద నుంచి సర్వే నం.689, 690/2లలో 2.19 ఎకరాలను కొన్నాం. అప్పటినుంచి సాగు చేస్తున్నాం. 2009లో నాన్న చౌకి బాలయ్య నుంచి నా పేరిట మారి్పడి చేసుకున్నాను. పాస్ పుస్తకం వచి్చంది. ఆర్థిక పరిస్థితుల కారణంగా విదేశాలకు వెళ్లి వస్తున్నాను. భూమి ఎక్కడికి పోతుందనే ఉద్దేశంతో భూమి వద్దకు వెళ్లి చూడలేదు. 2010లో 689 సర్వేనంబర్‌లో 1.04 ఎకరాల భూమిని సదాశివనగర్‌కు చెందిన సుతారి రాజమణి పేరు మీద సాదాబైనామా చేసినట్లు ఉంది. అదే 690/2 సర్వే నంబర్లో 1.15 ఎకరాలను సుతారి సుధాకర్ పేరు మీద పట్టా చేశారు. ఈ భూమిని నా పేరు మీదికి మార్చాలని రెవెన్యూ అధికారుల చుట్టూ కొన్నాళ్లుగా తిరుగుతున్నాను. పాస్ పుస్తకమున్న పహణీలోకి ఎక్కించడం లేదు. సమస్యను జేసీకి వివరించినా రికార్డుల్లో సరిచేయడం లేదు.’ – చౌకి భాస్కర్, సదాశివనగర్, కామారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన కనువిప్పు కావాలి సమస్యలకు పరిష్కారం.. చంపడమో, చావడమో కాకూడదు. భూ సమస్యల పరిష్కారానికి, మెరుగైన భూపరిపాలన కోసం తక్షణ చర్యలు అవసరం. అలా జరగకపోతే, రైతుల కష్టాలు తీరవు. రెవెన్యూ ఇక్కట్లు తొలగవు. ఏ భూరికార్డు భూమిపై హక్కుల నిరూపణకు పూర్తి సాక్ష్యం కాదు. ఏ భూమి రికార్డునైనా ఎప్పుడైనా సవరించవచ్చు. భూమి హద్దులు తెలిపే పటాలు లేవు. ఉన్న భూములకు హద్దు రాళ్లు లేవు. భూ సమస్యలపై ఎవరిని కలవాలి.. ఎంతకాలంలో ఆ సమస్యను పరిష్కరించాలి అనే విషయాలపై స్పష్టత లేదు. అపరిష్కృత భూ సమస్యలకు ఎన్నో కారణాలు.. అన్ని కోణాలు చూడాలి.. సమస్యకు సమగ్ర పరిష్కారం వెతకాలి. భూమి సమస్యలతో రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్న విషాద ఘటనలు, హత్యలకు కూడా దారితీస్తున్న దుర్ఘటనలు.. మరోపక్క తీవ్ర ఒత్తిడిలో రెవెన్యూ యంత్రాంగం. ఇకనైనా పరిష్కారాలపై చర్చ జరగాలి. అబ్దుల్లాపూర్‌మెట్ ఘటన ఒక కనువిప్పు కావాలి. – ఎం.సునీల్ కుమార్, భూచట్టాల నిపుణుడు, న్యాయవాది క్రమబద్ధీకరణతో వివాదాలకు ఫుల్స్టాప్ భూ రికార్డుల ప్రక్షాళనతో ప్రభుత్వం తేనె తుట్టెను కదిలించింది. రికార్డుల నవీకరణ కంటే ముందు సమగ్ర భూసర్వే చేస్తే ఈ సమస్యలు వచ్చేవి కావు. దేవాదాయ, వక్ఫ్, అటవీ, భూదాన్ బోర్డులు ఇన్నాళ్లు తమ భూములెక్కడ ఉన్నాయో పట్టించుకోకుండా.. ఒకేసారి ఈ భూములన్నీ మావేనని వాదించడం అత్యధిక వివాదాలకు కారణం. దశాబ్దాలుగా ఆ భూమిని అనుభవిస్తూ... పాస్బుక్కు కలిగి ఉన్నవారిని కాదని.. 22(ఏ)లో ఆ భూమిని చేర్చడం ఎంతవరకు న్యాయం. ఈ సమస్యకు పరిష్కారం ఒకటే. ఎవరైతే పొజిషన్లో ఉన్నారో వారి పేరిట క్రమబద్ధీకరిస్తే.. ప్రభుత్వానికి ఆదాయం వస్తుంది.. రైతాంగానికి లాభం కలుగుతుంది. – సురేశ్ పొద్దార్, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) రికార్డుల ప్రక్షాళనలో ఒత్తిడి ఎక్కువైంది.. రికార్డుల ప్రక్షాళన మొదలైన నుంచి రెవెన్యూ అధికారులు, ఉద్యోగుల్లో ఒత్తిడి పెరిగింది. సమస్యలను పరిష్కరించే ప్రయత్నం జరిగినప్పటికీ సమయం సరిపోక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ప్రక్షాళనకు డెడ్లైన్లు విధించడంతో సిబ్బంది ఒత్తిడికి గురయ్యారు. అధికారులు క్షేత్రస్థాయికి వెళ్లడానికి సరిపడా సమయం దొరకలేదు. దీంతో కిందిస్థాయి సిబ్బంది చెప్పిందే వినాల్సి వచి్చంది. రికార్డులో సాదాబైనామాలకు సంబంధించి తప్పుడు కాగితాలతో చాలా మంది భూములను తమపేరిట నమోదు చేయించుకునే ప్రయత్నాలు చేశారు. దానికి తోడు రాజకీయ జోక్యం కూడా ఉండటం ఒత్తిడిని పెంచింది. – సత్తయ్య, జాయింట్ కలెక్టర్ (రిటైర్డ్) సమస్యకు పరిష్కారాలు.. సమగ్ర భూ సర్వే జరగాలి. భూచట్టాలను సమీక్షించి ఒక సమగ్ర రెవెన్యూ కోడ్‌ను రూపొందించాలి. టైటిల్ గ్యారంటీ చట్టం తేవాలి. భూ వివాదాల పరిష్కారానికి ట్రిబ్యునళ్లను ఏర్పాటు చేయాలి. ప్రజల భాగస్వామ్యంతో భూరికార్డుల సవరణ చేయాలి. భూ సమస్యలున్న పేదవారికి సహాయం చేసే పారాలీగల్, కమ్యూనిటీ సర్వేయర్ల వ్యవస్థను కొనసాగించాలి. -
కాళ్లు మొక్కి ప్రాధేయపడినా కనికరించలేదు..
-
వైరల్ : కాళ్లు మొక్కినా కనికరించలే..
సాక్షి, చేవెళ్ల: భూ సమస్యను పరిష్కరించాలని కలెక్టర్ సూచించినా, బాధిత రైతులు కాళ్లు మొక్కి ప్రాధేయపడినా ఆ తహసీల్దార్ కనికరించలేదు. కొన్ని నెలలుగా బాధిత రైతులను తన కార్యాలయం చుట్టూ తిప్పించుకుంటున్నారు. వారంరోజుల క్రితం రైతులు చేవెళ్ల తహసీల్దార్ పురుషోత్తం కాళ్లు మొక్కుతున్న వీడియో ఆదివారం ఆలస్యంగా సోషల్ మీడియాలో వైరల్ అయింది. రెవెన్యూ అధికారుల తీరుపై నెటిజన్లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వివరాల్లోకి వెళ్తే .. చేవెళ్ల మండలం ఆలూరు గ్రామానికి చెందిన అన్నదమ్ములు జంగిలి లింగయ్య, జంగలి సత్తయ్యల తండ్రి చిన్న మల్లయ్యకు సర్వే నెం 326లో 2 ఎకరాల 4 గుంటల భూమికి 2001లో ఓఆర్సీ వచి్చంది. వీరితోపాటు ఈ సర్వే నెంబర్లో మరో ఐదు మందికి కూడా గతంలోనే ఓఆర్సీలు రావడంతో సాగు చేసుకుంటున్నారు. బాధిత రైతులు లింగయ్య, సత్తకు సంబంధించిన భూమికి పాత పాస్‌పుస్తకాలు ఉన్నాయి. భూ ప్రక్షాళన సమయంలో 1బీ రికార్డు కూడా సక్రమంగానే వచి్చంది. అనంతరం కొత్త పాస్‌బుక్‌లో వీరికి 2 ఎకరాల 4 గుంటలకు బదులుగా కేవలం 1 ఎకరం భూమి మాత్రమే నమోదైంది. రైతులు అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. వీరితోపాటుగా మండలంలోని మీర్జాగూడ(ఆలూరు రెవెన్యూ)కు చెందిన పర్వేద మల్లయ్యకు సైతం ఇదే సర్వే నంబర్లో ఉండాల్సిన 34 గుంటల భూమికి బదులుగా కేవలం 13 గుంటలు మాత్రమే కొత్తపాస్‌బుక్‌లో నమోదైంది. పక్కపక్కన భూమి కావడంతో పాటు ఒకేసర్వే నంబర్ భూమి కావడంతో ముగ్గురు రైతులు రికార్డు సరిచేయించుకునేందుకు తహసీల్దార్ కార్యాలయం చుట్టూ దాదాపు ఏడాది నుంచి తిరుగుతున్నారు. సమస్య పరిష్కరిస్తామని వీఆర్ఓలు, తహసీల్దార్ చెప్పుకుంటూ కాలం వెల్లదీస్తున్నారు. కొత్త పాస్‌బుక్‌లో తక్కువ భూమి నమోదైందని చూపిస్తున్న రైతు కలెక్టర్‌కు విన్నవించిన రైతులు ఇటీవల కలెక్టర్ లోకేష్‌కుమార్ చేవెళ్లలో ప్రజావాణి నిర్వహించగా బాధితులు ఆయనకు మొరపెట్టుకున్నారు. సమస్య పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను అదేశించారు. నెలరోజులు దాటినా అధికారులు పట్టించుకోలేదు. నెల తర్వాత రెండోసారి ప్రజావాణికి కలెక్టర్, జేసీ హజరవగా బాధితులు మరోమారు కలిశారు. కలెక్టర్ అర్డీఓను ఆదేశించగా ఆయన తహసీల్దార్ పురుషోత్తంకు సూచించారు. అయినా సమస్య పరిష్కారం కాలేదు. అనంతరం కలెక్టర్ ఆలూరు గ్రామంలో ప్రత్యేకంగా వారంపాటు రెవెన్యూ సదస్సును ఏర్పాటు చేసినా సమస్యను పరిష్కరించలేదు. దీంతో బాధిత రైతులు వారం రోజుల క్రితం తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి తహసీల్దార్ పురుషోత్తం కాళ్లమీద పడి ‘మా పని చేయండి సార్’ అని వేడుకున్నారు. అక్కడే ఉన్న వారి గ్రామస్తులు దీనిని వీడియో తీయగా గమనించిన తహసీల్దార్ వారిని లోపలికి పిలిచి మూడు రోజుల్లో సమస్య పరిష్కరిస్తాను.. వీడియో మాత్రం బయటకు రానివ్వవద్దని చెప్పారు. అయితే, ఇటీవల ఆలూరుకు వచి్చన చేవెళ్ల ఎంపీ రంజిత్‌రెడ్డికి ఈ వీడియోను బాధితులు చూపించారు. దీంతో ఆయన తహసీల్దార్‌తో ఫోన్లో మాట్లాడి హెచ్చరించినా ఫలితం లేదు. దీంతో గ్రామస్తులు వీడియోను సోషల్‌మీడియాలో పోస్టు చేయడంతో ఆదివారం వైరల్‌గా మారింది. తహసీల్దార్ తీరుపై తీవ్ర విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. గతంలో బాధితులు కేశంపేట తహసీల్దార్ కాళ్లు మొక్కిన వీడియో బయటకు వచ్చింది. అనంతరం ఆమె ఏసీబీ అధికారులకు పట్టుబడింది. ఉద్దేశపూర్వకంగా రెవెన్యూ అ«ధికారులు తమ సమస్యను పరిష్కరించడం లేదని బాధితులు ఆరోపించారు. కలెక్టర్ చెప్పినా పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమవద్ద కట్ అయిన ఎకరం 25 గుంటల భూమి ఆన్లైన్లో మరో వ్యక్తి పేరుమీద కనిపిస్తుందని రైతులు తెలిపారు. ఇలాంటి తహసీల్దార్‌ను ఎక్కడా చూడలేదు బాధిత రైతులు లింగమయ్య, సత్యయ్య, పర్వేద మల్లయ్య తమ సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లడంతో సరిచేయాలని తహసీల్దార్‌ను అదేశించినా ఆయన పనిచేయడం లేదు. ఉన్నతాధికారులు సూచించిన తర్వాత కూడా మళ్లీ నాకు ఫైల్ పంపించి ఓఆర్సీ సరైనదా కాదా చెప్పాలని పంపాడు. పలు సమస్యల్లో కూడా ఆయన తీరు ఇలాగే ఉంది. గతంలో బాధిత రైతుల రికార్డులు ఎందుకు మారాయనే విషయం తహసీల్దార్ పరిశీలించాలి. అది వదిలేసి ఓఆర్సీలు సరైనవా కాదా అని తహసీల్దార్ ఫైల్ తిరిగి నాకు పంపుతున్నాడు. ఇలాంటి తహసీల్దార్‌ను నేను ఎక్కడా చూడలేదు. మంగళవారం కలెక్టర్ చేవెళ్లకు వస్తున్నారు. అక్కడే ఈ సమస్యను పరిష్కరిస్తాం.. రైతులు కూడా రావాలని సూచించాను. – హన్మంత్‌రెడ్డి, ఆర్డీఓ చేవెళ్ల ఆర్డీఓకు ఫైల్ పంపాను బాధిత రైతులు కావాలనే కాళ్లు మొక్కి వీడియో తీయించి ప్రచారం చేస్తున్నారు. సంబంధిత ఓఆర్సీ ముందుగానే వచి్చంది. అ తరువాత అదే గ్రామానికి చెందిన మరో రైతుకు కూడా ఓఆర్సీ ఇవ్వడంతో వారి భూమి కొత్త పాస్ పుస్తకంలో రాలేదు. ఈవిషయాన్ని నేను పరిశీలించగా బాధిత రైతుల వైపే న్యాయం ఉంది. అయితే, ఓఆర్సీని రద్దు చేసే అధికారం నాకు లేదు. ఓఆర్సీలను పరిశీలించాలని అర్డీఓకు ఫైల్ పంపాను. అనంతరం ఆర్డీఓ సూచన మేరకు చర్యలు తీసుకుంటాను. ఇందులో నా తప్పిదం ఏమి లేదు. – పురుషోత్తం, తహసీల్దార్, చేవెళ్ల -
హక్కులు తేలని భూమి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో మొత్తం 92 లక్షల ఎకరాల భూములకు యాజమాన్య హక్కులు తేలాల్సి ఉంది. రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన భూరికార్డుల ప్రక్షాళన కార్యక్రమంలో ఇప్పటివరకు మొత్తం 2,38,56, 322. 25 ఎకరాల భూరికార్డులను పరిశీలించగా, 1.46 లక్షల ఎకరాలకు యాజమాన్య హక్కులు కల్పించినట్టు రెవెన్యూ వర్గాలు ధ్రువీకరిస్తున్నాయి. మిగిలిన 92 లక్షల ఎకరాల భూములకు గాను 4.3 లక్షలకు పైగా ఖాతాల్లోని 12 లక్షల ఎకరాల వివాదాస్పద భూములను పార్ట్–బీలో చేర్చారు. ఇందులో వివాదాలు, కోర్టు కేసులు, సర్వే చేయాల్సిన భూములున్నాయి. మరో 8.4 లక్షల ఖాతాలకు సంబంధించిన దాదాపు 24 లక్షల ఎకరాల భూముల రికార్డులను క్లియర్ చేసినా వాటిని పాసుపుస్తకాల కోసం ఇంకా సిఫారసు చేయలేదు. ఖాతాలతో పాటు పాసుపుస్తకాల క్లియరెన్స్ వచ్చినప్పటికీ డిజిటల్ సంతకాలు కాని భూములు 5.3 లక్షల ఖాతాల్లో 15 లక్షలకు పైగా ఉంటాయని రెవెన్యూ గణాంకాలు చెబుతున్నాయి. తొలిసారి డిజిటల్ సంతకం కాని ఖాతాలు 18 లక్షలకు పైగా ఉండగా, అందులో 50 లక్షలకు పైగా ఎకరాల భూములున్నాయి. భూరికార్డుల ప్రక్షాళన ప్రారంభమయిన తర్వాత 16 నెలలు గా రెవెన్యూ యంత్రాంగం భూరికార్డులను వడపోస్తున్నప్పటికీ ఇంకా ప్రక్షాళన పూర్తికాకపోవడంతో 25 లక్షల మంది రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని తెలుస్తోంది. ఇప్పటికే ఖరీఫ్‌లో సాయాన్ని నష్టపోగా, మరింత సమయం తీసుకుంటే రబీలోనూ, కేంద్రం ఇచ్చే సాయం కూడా ఆలస్యమయ్యే అవకాశాలున్నాయి. రెవెన్యూ వర్గాలు మాత్రం ఎప్పుడు సమయం చిక్కినా ఈ పనిలోనే తమ సిబ్బంది నిమగ్నమవుతున్నారని అంటున్నాయి. సిద్ధమవుతున్న గ్రామాల వారీ రికార్డులు భూరికార్డుల ప్రక్షాళనలో లెక్క తేలిన భూముల వివరాలను సమగ్రంగా రూపొందించాలని, గ్రామాల వారీ రికార్డులను సిద్ధం చేయాలని ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఈనెల 4 న భూపరిపాలన ప్రధాన కమిషనర్, రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రాజేశ్వర్‌తివారీ అన్ని జిల్లాల కలెక్టర్లకు ఉత్తర్వులు పంపా రు. ఈ సర్క్యులర్ ప్రకారం గ్రామాల వారీగా కొత్త పహాణీలు తయారు చేయాల్సి ఉంది. ఈ పహాణీలోని ప్రతి సర్వే నంబర్ మీద డిజిటల్ సంతకం కనిపించేలా రూపొందించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. దీంతో పాటు తాజా 1బీ ఫారాలు, పహాణీ ఫార్మాట్లో సర్వే నంబర్ల వారీగా ప్రభుత్వ భూముల వివరాలను పేర్కొనాలని, ప్రభుత్వ ఆస్తుల పట్టిక కూడా తయారు చేయాలని సూచించారు. పార్ట్–బీలో చేర్చిన వివాదాస్పద భూములను కూడా సర్వే నంబర్ల వారీగా ప్రత్యేకంగా రూపొందించాలని తెలిపారు. -
‘రైతు బంధు’ ఆలస్యం!
ఇప్పటివరకు రెవెన్యూరికార్డుల సమాచారంప్రభుత్వానికి చేరని కారణంగానిర్ణీత వ్యవధిలో చెక్కుల పంపిణీ ఉండకపోవచ్చనితెలుస్తోంది. సాక్షి, రంగారెడ్డి జిల్లా ప్రతినిధి:‘రైతు బంధు’కు ఆదిలోనే అడ్డంకులు ఎదురవుతున్నాయి. భూ రికార్డుల అప్డేషన్ ప్రక్రియ ఇంకా కొలిక్కిరాకపోవడంతో చెక్కుల పంపిణీ ఆలస్యమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఎకరాకు రూ.4వేల చొప్పున రైతాంగానికి పెట్టుబడి సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ నెల 19 నుంచి దశలవారీగా గ్రామాల్లో రైతు బంధు పథకం వర్తింపజేయాలని సంకల్పించింది. భూ రికార్డుల ప్రక్షాళన పర్వానికి తెరపడిన అనంతరం ఆ సమాచారాన్ని అప్డేట్ చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ సమాచారానికి అనుగుణంగా రైతులకు చెక్కులను పంపిణీ చేయాలని భావించింది. అయితే, రికార్డుల సమాచారం ఇప్పటివరకు ప్రభుత్వానికి చేరకపోవడంతో చెక్కుల ముద్రణ జాప్యమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. జిల్లావ్యాప్తంగా దాదాపు 7.10 లక్షల ఎకరాలకు పెట్టుబడి సాయం అందించాలని నిర్ణయించిన రెవెన్యూయంత్రాంగం.. ఈమేరకు 2,87,768 పట్టాదారు పాస్‌పుస్తకాల ముద్రణకు రంగం సిద్ధం చేసింది. వాస్తవానికి రెవెన్యూ రికార్డుల ప్రక్రియ పూర్తికాగానే సేకరించిన సమాచారాన్ని అప్డేట్ చేయాల్సివుంటుంది. ఈ సమాచారాన్ని సీసీఎల్ఏకు నివేదించి.. అక్కడినుంచి ఎన్ఐసీ(నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్)లో మరోసారి వివరాలను సరిచూసుకొని వాటిని బ్యాంకులకు పంపించాల్సివుంటుంది. ఈ మేరకు నిర్దేశించిన బ్యాంకులు చెక్కులు ముద్రించాలి. ప్రక్రియ ఇలా కొనసాగాల్సివుండగా మంగళవారం నాటికి జిల్లాకు సంబంధించిన సమాచారం సీసీఎల్ఏకు చేరలేదు. దీంతో చెక్కుల పంపిణీపై ప్రభావం పడుతోందని వ్యవసాయ శాఖ ఉన్నతాధికారి ఒకరు ‘సాక్షి’కి తెలిపారు. ఈక్రతువు నెల 15వ తేదీలోపు పూర్తయితే తప్ప ఖరారు చేసిన ముహూర్తం(19వ తేదీ) రోజున చెక్కుల పంపిణీ జరిగే అవకాశం లేదని అంటున్నారు. ఈ నెల 12 నుంచి 14వ తేదీల్లో మొదటి విడత చెక్కుల పరిశీలనకు రావాలని ఇప్పటికే వ్యవసాయ శాఖ అధికారులను ప్రభుత్వం ఆదేశించింది. అయితే, మన జిల్లాకు ఈ పిలుపు రాకపోవడం.. ఇప్పటివరకు రెవెన్యూ రికార్డుల సమాచారం ప్రభుత్వానికి చేరలేదనే సమాచారంతో నిర్ణీత వ్యవధిలో చెక్కుల పంపిణీ ఉండకపోవచ్చని తెలుస్తోంది. మరోవైపు రికార్డుల్లో వ్యవసాయ భూములుగానే నమోదైనా క్షేత్రస్థాయిలో అవి వ్యవసాయేతర అవసరాలకు వినియోగిస్తుండడంతో పెట్టుబడి సాయం వర్తింపుపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టిసారించింది. వ్యవసాయేతర భూములను రైతుబంధు పథకం నుంచి మినహాయింపునిచ్చే అంశాన్ని పరిశీలిస్తోంది.