land right
-
రెండో దశ భూ హక్కు పత్రాల పంపిణీ
సాక్షి, అమరావతి: భూముల రీ సర్వే పూర్తయిన రెండో దశలోని 2 వేల గ్రామాల్లో భూ హక్కు పత్రాల పంపిణీని రెవెన్యూ శాఖ ప్రారంభించింది. మొదటి దశ సర్వే పూర్తయిన 2 వేల గ్రామాల్లో 7.50 లక్షలకుపైగా భూ హక్కు పత్రాలను ఇప్పటికే రైతులకు అందించారు. ఇప్పుడు రెండో దశలోని 2 వేల గ్రామాల్లో సర్వే చివరి దశకు చేరుకోవడంతో ఆ గ్రామాల్లోని రైతులకు విడతల వారీగా భూ హక్కు పత్రాల పంపిణీకి ఏర్పాట్లు చేస్తున్నారు. 26 జిల్లాల్లో 8.68 లక్షల భూ హక్కు పత్రాలు పంపిణీ చేయాల్సివుండగా ఇప్పటికే 5.12 లక్షల పత్రాలను ముద్రించి ఆయా జిల్లాలకు పంపారు. ఇందులో 2.48 లక్షల పత్రాలు ఈ–కేవైసీ పూర్తి చేసి పంపిణీ కూడా చేశారు. మిగిలిన పత్రాలను పంపిణీ చేసేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఎన్టీఆర్, అనంతపురం జిల్లాల్లో పంపిణీ దాదాపు పూర్తయింది. గుంటూరు, శ్రీ సత్యసాయి జిల్లాల్లో ఇంకా 5 శాతం లోపు పంపిణీ చేయాల్సి ఉంది. బాపట్ల, వైఎస్సార్, పార్వతీపురం మన్యం, అన్నమయ్య, శ్రీకాకుళం, తిరుపతి జిల్లాల్లో ఇంకా 30 శాతం వరకు పూర్తి చేయాల్సివుంది. పశ్చిమగోదావరి, కర్నూలు, అనకాపల్లి, విజయనగరం జిల్లాల్లో 90 శాతం పెండింగ్ ఉండటంతో అక్కడ భూ హక్కు పత్రాల పంపిణీపై ప్రత్యేక దృష్టి పెట్టారు. మరో నెల రోజుల్లో పంపిణీ పూర్తి చేసేందుకు కసరత్తు చేస్తున్నారు. -
డిసెంబర్ 21న సమగ్ర భూ సర్వే ప్రారంభం
-
ఆ రాతలపై అప్రమత్తంగా ఉండాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: సమగ్ర సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రతిపక్ష పార్టీకి చెందిన పత్రికలు ప్రచారం చేస్తున్నాయని.. సర్వే వల్ల కలిగే ప్రయోజనాలేంటో ప్రజలకు చెప్పాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. ‘జగనన్న శాశ్వత భూ హక్కు-భూరక్ష’ కార్యక్రమంపై మంగళవారం తన క్యాంపు కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు. రెవిన్యూ మంత్రి ధర్మాన కృష్ణదాస్, సీఎస్ నీలం సాహ్న, సీసీఎల్ఏ నీరబ్‌కుమార్ ప్రసాద్, సీఎం ప్రధాన సలహాదారు అజేయ కల్లం ఉన్నతాధికారులు హాజరయ్యారు. భూ సర్వేపై.. సర్వే ఆఫ్ ఇండియా శిక్షణ ఇస్తోందని ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. ప్రతి మండలానికి ఒక డ్రోన్ బృందం, డేటా ప్రాససింగ్ టీం, రీసర్వే టీం ఉంటాయని తెలిపారు. 9400 మంది సర్వేయర్లకు శిక్షణ ఇచ్చామని, మిగిలిన వారికీ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నారు. సర్వే ఆఫ్ ఇండియాతో రేపు (బుధవారం) అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదర్చుకుంటున్నామని వెల్లడించారు. (చదవండి: ఏలూరు: వైద్య పరీక్షలపై సీఎం జగన్ ఆరా) గ్రామస్థాయిలోనే రెవెన్యూ సర్వీసులు: ఒక గ్రామంలో సర్వే పూర్తై, మ్యాపులుసిద్ధం కాగానే అదే గ్రామ సచివాలయంలో ల్యాండ్ రిజిస్ట్రేషన్ సేవలు అందాలని సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశించారు. ఆ మేరకు గ్రామ సచివాలయంలో ఏమైనా మార్పులు కావాలంటే చేయాలని, భూ వివాదాల పరిష్కారానికి మొబైల్ ట్రైబ్యునళ్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. దీనికి అవసరమైన వాహనాలు సహా అన్ని సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సీఎం సూచించారు. (చదవండి: పులివెందులలో అపాచీ లెదర్ కంపెనీ) సమగ్ర భూ సర్వేపై తప్పుడు ఆలోచనలు కలిగించేలా ప్రచారం: ‘‘సమగ్ర భూ సర్వే ద్వారా ప్రజలకు మంచి జరుగుతుంది. అయితే ప్రజల్లో సందేహాలు రేకెత్తించి ఈ కార్యక్రమానికి అవాంతరాలు కలిగించడానికి విష ప్రచారాలు చేస్తున్న సందర్భాలు చూస్తున్నాం. సమగ్ర సర్వేపై కచ్చితమైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయాలి. అనుమానాలకు దారి తీస్తున్న అంశాలను గుర్తించి వారికి సరైన సమాచారాన్ని చేరవేయాలి. కొన్ని పత్రికలు (ప్రతిపక్ష పార్టీ అధికార పత్రికలు) సమగ్ర సర్వే మీద తప్పుడు ఆలోచనలు కలిగించేలా రాతలు రాస్తున్నారు. ఆ తప్పుడు సమాచారం, ప్రచారం పట్ల అప్రమత్తంగా ఉండాలి. సమగ్ర సర్వే ద్వారా ఏ రకంగా మంచి జరుగుతుందో ప్రజలకు వివరించాలి. సమగ్ర సర్వేలో భాగస్వాములు అవుతున్న సిబ్బందికి మంచి శిక్షణ, ఓరియెంటేషన్ ఇవ్వండి. సర్వే పూర్తయ్యాక ఆ రికార్డులను మరెవ్వరూ టాంపర్ చేయలేని రీతిలో భద్రపరచాలి. సెక్యూరిటీ ఫీచర్స్ పటిష్టంగా ఉండాలి. ఆ మేరకు సర్వే వ్యవస్థను తీర్చిదిద్దాలి. భూ యజమానుల వద్ద హార్డ్ కాపీ ఉండేలా చూడాలని’’ సీఎం ఆదేశించారు. సర్వే శిక్షణకోసం తిరుపతిలో కొత్త కాలేజీ: సర్వే శిక్షణ కోసం కొత్తగా ఒక కాలేజీని ఏర్పాటుకు సీఎం ఆదేశించారు. కనీసం 50 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేయాలన్నారు. సమగ్ర సర్వే సందర్భంలోనే ఈ కాలేజీ నిర్మాణం కూడా జరగాలని సీఎం వైఎస్ జగన్ ఆదేశించారు. సర్వే ఇలా: ♦గ్రామాలు, ఆవాసాలు, పట్టణాలు, నగరాలతో కలిపి అటవీ ప్రాంతాలు మినహా 1.26 లక్షల చదరపు కిలోమీటర్ల మేర సర్వే, 17,460 గ్రామాల్లో సర్వే ♦మొదటి విడతలో 5 వేలు, రెండో విడతలో 6,500, మూడో విడతలో 5,500 గ్రామాల్లో సర్వే ♦పట్టణాలు, నగరాల్లోని 3345.93 చదరపు కిలోమీటర్ల పరిధిలో సర్వే ♦10 లక్షల ఓపెన్ ప్లాట్లు, 40 లక్షల అసెస్మెంట్ల భూముల్లో సర్వే ♦2.26 కోట్ల ఎకరాలు ఉన్న 90 లక్షల మంది పట్టాదారుల భూములూ సర్వే ♦సర్వే తర్వాత ల్యాండ్ టైటిలింగ్ కార్డు, కార్డులో యూనిక్ ఐడెంటిఫికేషన్ నంబర్ ప్రాపర్టీ (భూమి) కొలతలు మొత్తం ఏరియా, యజమాని పేరు, ఫొటో ఉంటుంది. క్యూ ఆర్ కోడ్ కూడా ఉంటుంది ♦సర్వే పూర్తైనతర్వాత డిజిటైజ్డ్ కాడస్ట్రల్ మ్యాప్‌లు తయారీ ♦గ్రామంలోని ప్రతి కమతం, భూమి వివరాలు మ్యాప్‌లో ఉంటాయి. ♦భూ కొలతలు పూర్తైనతర్వాత సర్వే రాళ్లు పాతుతారు ♦గ్రామ సచివాలయంలో డిజిటైజ్డ్ ప్రాపర్టీ రిజిస్టర్, టైటిల్ రిజిస్టర్, వివాదాల నమోదుకూ రిజిస్టర్లు ఏర్పాటు చేస్తారు. -
అడవి బిడ్డే హక్కుదారు
సాక్షి, అమరావతి: అడవుల్లో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులందరికీ భూమి హక్కు పత్రాలు (పట్టాలు) మరోసారి ఇవ్వాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఆదివాసీ దినోత్సవమైన ఆగస్టు 9వ తేదీన పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతులకు 50 వేల ఎకరాలు పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. వైఎస్సార్ అనంతరం 12 ఏళ్ల తరువాత గిరిజనులకు భూమి హక్కు పత్రాలు ఇచ్చేందుకు ముఖ్యమంత్రి జగన్ అడుగు ముందుకు వేశారు. పట్టాలు పొందడం ద్వారా గిరిజనులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వ్యవసాయం చేసుకునేందుకు వీలు కలుగుతుంది. గిరిజనుల కష్టాలను తెలుసుకుని... దివంగత వైఎస్సార్ రైతును రాజు చేయాలన్న ఆలోచనతో పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనులందరికీ భూమి హక్కు పత్రాలు ఇచ్చారు. ఆ తరువాత వచ్చిన పాలకులు ఆదివాసీల గురించి పట్టించుకోలేదు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన తరువాత గిరిజనులు నమ్ముకున్న పోడు వ్యవసాయంపై ప్రత్యేక దృష్టి పెట్టారు. తన పాదయాత్రలో గిరిజనుల సమస్యను తెలుసుకున్న ఆయన అటవీ శాఖ అధికారుల నుంచి ఇబ్బందులు ఎదురుకాకుండా పోడు వ్యవసాయం చేస్తున్న రైతులందరికీ ఆర్వోఎఫ్ఆర్ (రికార్డ్స్ ఆఫ్ ఫారెస్ట్ రైట్స్) కింద పట్టాలివ్వాలని ఆదేశించారు. ఇప్పటి వరకు 87,166 మంది గిరిజన రైతులు 1,64,616 ఎకరాలపై సాగు హక్కు కోసం దరఖాస్తు చేసుకున్నారు. వీటిపై పరిశీలన కొనసాగుతోంది. ఆ భూమిలో ఎవరు వ్యవసాయం చేస్తుంటే వారి పేరుతోనే పట్టా ఇస్తారు. ఈ సర్వే ఇప్పటికే మొదలైంది. అడవి బిడ్డలకు ఇబ్బంది లేకుండా... పోడు వ్యవసాయం వల్ల అడవులు దెబ్బతింటున్నాయని అటవీ శాఖ అధికారులు అడ్డుకుంటున్నారు. అయితే అడవితల్లినే నమ్ముకున్న గిరిజన రైతులకు ఆర్వోఎఫ్ఆర్ చట్టం కింద సాగు చేసుకుంటున్న భూములకు హక్కు పత్రాలివ్వడం ద్వారా పోడు వ్యవసాయానికి అడ్డంకులు లేకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. గిరిజనులు చేతుల్లో భూమి హక్కు పత్రాలుంటే అటవీ అధికారుల నుంచి ఇబ్బందులుండవు. ప్రభుత్వ సాయం పొందేందుకు అర్హత గిరిజనులకు ఆర్వోఎఫ్ఆర్ పట్టాలివ్వడం ద్వారా ప్రభుత్వ నుంచి సాయం పొందేందుకు వీలు కలుగుతుంది. ప్రభుత్వం ఇప్పటికే రైతు భరోసా కార్యక్రమాన్ని ప్రారంభించి పెట్టుబడి సాయాన్ని అందిస్తున్న విషయం తెలిసిందే. ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు పొందిన రైతులు కూడా రైతు భరోసా అందుకుంటున్నారు. బ్యాంకుల నుంచి వ్యవసాయ రుణాలు కూడా తీసుకుంటున్నారు. గడువు పెంచాలని కేంద్రాన్ని కోరిన సీఎం ఇప్పటివరకు 2005 డిసెంబరు 13వతేదీ నాటికి ముందు నుంచి సాగు చేస్తున్నవారికే ఆర్వోఎఫ్ఆర్ పట్టాలు ఇవ్వాలని, ఆ తరువాత సాగు చేపట్టిన వారికి పట్టాలిచ్చేందుకు వీలు లేదని కేంద్ర ప్రభుత్వం నిబంధన విధించింది. అయితే ఈ నిబంధనను 2008 జనవరి 1వతేదీ వరకు పొడిగించాలని కోరుతూ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇప్పటికే కేంద్ర ప్రభుత్వానికి లేఖ కూడా రాశారు. వైఎస్సార్ హయాంలో 2.22 లక్షల ఎకరాలకుపైగా పంపిణీ దివంగత వైఎస్సార్ ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో 2,22,383.02 ఎకరాల భూమిని గిరిజన రైతులకు పంపిణీ చేశారు. దీనిద్వారా మొత్తం 88,991 మంది గిరిజన రైతులకు ప్రయోజనం చేకూరింది. వైఎస్సార్ వారికి హక్కు పత్రాలు ఇవ్వడంతో అటవీ అధికారుల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా గిరిజన రైతులు స్వేచ్ఛగా వ్యవసాయం చేసుకోగలుగుతున్నారు. 15 మందితో కమిటీ సర్వే... ‘పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజన రైతుల దరఖాస్తులపై ప్రస్తుతం సర్వే జరుగుతోంది. 15 మందితో ఫారెస్ట్, రెవెన్యూ శాఖ నుంచి వీఆర్వో, గిరిజన సంక్షేమ శాఖ నుంచి అసిస్టెంట్ సోషల్ వెల్ఫేర్ అధికారితో కూడిన కమిటీ సర్వే చేస్తోంది. పట్టా కోసం దరఖాస్తు చేసుకున్న గిరిజనులు ఎంత కాలం నుంచి భూమిలో వ్యవసాయం చేస్తున్నారనేది ప్రధానంగా పరిశీలిస్తారు. జూన్ 25 నాటికి తుది జాబితా తయారవుతుంది. ఆర్వోఎఫ్ఆర్ పట్టాల పంపిణీపై సోమవారం జరిగే సమావేశంలో ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు ముందుకు వెళతాం’ – పి రంజిత్‌బాషా, డైరెక్టర్, గిరిజన సంక్షేమ శాఖ. చాలా సంతోషంగా ఉంది ‘దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి ఎంతోమంది గిరిజన రైతులకు పట్టాలిచ్చారు. ఆయన అకాల మరణం తర్వాత పోడు సాగుదారుల గోడు విన్న నాథుడే లేడు. మళ్లీ సీఎం జగన్ చొరవతో పోడు భూములపై అధికారులు దరఖాస్తులను పరిశీలిస్తున్నారు. త్వరలోనే ఆదివాసీలకు అటవీ హక్కుల చట్టం ద్వారా పట్టాలు పంపిణి చేయబోతున్నందుకు చాలా ఆనందంగా ఉంది’ – కాకి మధు, ఆదివాసీ సంక్షేమ పరిషత్ రాష్ట్ర అధ్యక్షుడు, బుట్టాయిగూడెం మండలం, పశ్చిమ గోదావరి జిల్లా. వైఎస్సార్ తరువాత నిర్లక్ష్యం... ‘దివంగత వైఎస్సార్ గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పించడంతో జీడి మామిడి మొక్కలు పెంచుకున్నారు. ఆ తరువాత ప్రభుత్వాలు నిర్లక్ష్యం వహించాయి. ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్ తరఫున గత ప్రభుత్వంలో గిరిజన మంత్రిని అనేకసార్లు కలిసినా ప్రయోజనం లేదు. గిరిజనులకు పోడు భూములపై హక్కులు కల్పిస్తున్న ఘనత వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వానికే దక్కుతుంది’ – కర్రి అబ్బాయిరెడ్డి, రాష్ట్ర అధ్యక్షుడు, ఏపీ ఫోరం ఫర్ ల్యాండ్ రైట్స్. కల నెరవేరుతోంది... ‘గిరిజనులు ఎన్నో ఏళ్లుగా కొండపోడు వ్యవసాయం చేసుకుంటూ జీవిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదీవాసీ దినోత్సవం సందర్భంగా ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలను అందచేయనుండటంతో గిరిజనుల సుదీర్ఘ కల నెరవేరనుంది. ఆ రోజు కోసం వేయి కళ్లతో ఎదురు చూస్తున్నారు’ – పాలక రంజిత్‌కుమార్ , గిరిజన సంక్షేమ సంఘం, విద్యార్థి సంఘాల నాయకుడు, పార్వతీపురం ఇప్పుడు అందరికీ న్యాయం ‘అటవీ భూములను సాగు చేసుకుంటున్న గిరిజనులకు పట్టాలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం ఎంతో సంతోషంంగా ఉంది. ఇప్పుడు అందరికీ న్యాయం జరుగుతుంది. గత ప్రభుత్వం ఐదేళ్ల పాలనలో సాగు భూమి పట్టాలను పంపిణీ చేయలేదు. ఎన్నికలకు ముందు కొంతమందికి మాత్రమే పట్టాలు పంపిణీ చేశారు. తీరా సంబంధిత భూములను వారికి స్వాధీనం చేయలేదు’ – పాచిపెంట అప్పలనర్స, గిరిజన సంఘం, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పాడేరు, విశాఖ జిల్లా రైతు భరోసాతో ఆదుకున్నారు.. ‘రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితులు మావి. అడవుల్లో పోడు వ్యవసాయం చేసుకుంటున్నాం. నిరుపేదలం కావడంతో పెట్టుబడి కోసం ఇబ్బందులు పడేవాళ్లం. ముఖ్యమంత్రి జగన్ రైతు భరోసా ద్వారా మాకు పెట్టుబడి సాయం అందించి ఆదుకున్నారు’ –కుంబి అప్పారావు, ఆర్ఒఎఫ్ఆర్ పట్టాదారు, రైతు భరోసా లబ్దిదారుడు,పనసలపాడు గ్రామం, ,పి.కోనవలస పంచాయతి, పాచిపెంట మండలం -
క్రమబద్ధీకరణకు మార్గం సుగమం!
డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు సర్కారు ఆమోదం చెల్లింపు కేటగిరీలో డిసెంబర్ 1 నుంచి భూముల రిజిస్ట్రేషన్లు సర్కారు ఖాతాకు చేరిన మొత్తం రూ. 162.79 కోట్లు సాక్షి, హైదరాబాద్: భూముల క్రమబద్ధీకరణ కోసం భూపరిపాలన విభాగం అధికారులు రూపొందించిన డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు రాష్ట్ర ఆమోదం తెలిపింది. దీంతో పూర్తి సొమ్ము చెల్లించిన లబ్ధిదారులకు సదరు భూమి హక్కులను వెంటనే బదలాయించేందుకు మార్గం సుగమమైంది. ఈ నేపథ్యంలో ఆయా భూములను లబ్ధిదారుల పేరిట రిజిస్ట్రేషన్ చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని భూపరిపాలన విభాగం ప్రధాన కమిషనర్ రేమండ్ పీట ర్ అన్ని జిల్లాల కలెక్టర్లకు తాజాగా ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్రవ్యాప్తంగా వివిధ జిల్లాల నుంచి చెల్లింపు కేటగిరీలో 28,233 దరఖాస్తులు రాగా.. ఉచిత కేటగిరీలో వచ్చిన 23,784 దరఖాస్తులను కూడా చెల్లింపు కేటగిరీ కింద అర్హమైనవిగా తేల్చారు. దీంతో చెల్లింపు కేటగిరీలో మొత్తం దరఖాస్తుల సంఖ్య 52,107కు చేరింది. ఈ ఏడాది డిసెంబర్ ఆఖరులోగా భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియను ముగించాలని నిర్ణయించారు. తాజాగా డీడ్ ఆఫ్ కన్వేయన్స్ నమూనాకు ప్రభుత్వం పచ్చజెండా ఊపడంతో రెవెన్యూ ఉన్నతాధికారులు ఊపిరి పీల్చుకున్నారు. దీనిని అన్ని మండలాల తహసీల్దార్లకు ఆన్లైన్లో పంపారని, డిసెంబర్ 1నుంచి అర్హులైన లబ్ధిదారులకు భూమి హక్కుల బదలాయింపు (రిజిస్ట్రేషన్) ప్రక్రియ ప్రారంభించాలని ఆదేశించారని సీసీఎల్ఏ అధికారులు చెబుతున్నారు. రూ. 162.79 కోట్లు జమ రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ భూముల్లో నివాసముంటున్న పేదలకు 125 గజాల్లోపు స్థలాలను ఉచితంగా, ఆపైన ఉన్న స్థలాలను చెల్లింపు కేటగిరీ కింద క్రమబద్ధీకరించాలని నిర్ణయిం చిన సంగతి తెలిసిందే. చెల్లింపు కేటగిరీలో సులభ వాయిదాలతో పాటు ఒకేసారి సొమ్ము చెల్లించిన వారికి రాయితీని కూడా కల్పించారు. ప్రస్తు తం చెల్లింపు కేటగిరీలో ఉన్న 52,017 దరఖాస్తుల్లో ఇప్పటివరకు 409 మంది ఏకమొత్తంలో సొమ్ము చెల్లించారు. మిగతా లబ్ధిదారులు డిసెంబర్‌లోగా పూర్తి సొమ్ము చెల్లించాలంటూ రెవెన్యూ అధికారులు డిమాండ్ నోటీసులు జా రీచేశారు. చెల్లింపు కేటగిరీ కింద సర్కారు ఖాతాలో రూ.162.79 కోట్లు జమ అయినట్లు ఉన్నతాధికారులు తెలిపారు. సంతకంపై సంశయం! లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే విషయమై తహసీల్దార్లు చేయాల్సిన సంతకంపై రెవెన్యూ యంత్రాంగంలో సంశయం ఏర్పడింది. డీడ్ ఆఫ్ కన్వేయన్స్పై డిజిటల్ సిగ్నేచర్ చేయాలా, ఇంకు సంతకం చేయాలా.. అన్న అంశంపై స్పష్టత రాలేదని క్షేత్రస్థాయి అధికారులు చెబుతున్నారు. లబ్ధిదారులకు భూమి హక్కులను బదలాయించే అధికారాన్ని తహసీల్దార్లకు అప్పగించిన సర్కారు... అవకతవక లు జరిగితే వారినే బాధ్యులుగా చేసేందుకు బయోమెట్రిక్ విధానాన్ని అవలంబిస్తే మేలని భావిస్తున్నట్లు తెలిసింది. ఈ విషయమై 2,3 రోజుల్లో స్పష్టత రానుందని సీసీఎల్ఏ కార్యాలయ వర్గాలు చెబుతున్నాయి.