landlord
-
ఇది మామూలు ర్యాగింగ్ కాదుగా.. ఆ ఇంటి ఓనర్ పరిస్థితి ఏంటో?
నా డబుల్ బెడ్రూం ఫ్లాట్‌ను అద్దెకిస్తానంటూ ఓ ఇంటి యజమాని సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అంతే ఆ పోస్ట్ క్షణాల్లో వైరల్ కావడంతో..నెటిజన్లు సైతం తమదైన స్టైల్లో కౌంటర్ ఇస్తూ పోస్ట్‌లు పెడుతున్నారు. ఇంతకీ ఏం జరిగిందంటే? బెంగళూరులో ప్రముఖ ప్రాంతాలుగా పేరున్న ఇందిరానగర్‌కు చెందిన భరత్_ఎంజీ ఎక్స్.కామ్‌లో తన డబుల్ బెడ్రూం ఫ్లాట్‌లో ఉండేందుకు కిరాయి దారులు కావాలని పోస్ట్ చేశాడు. ఆ పోస్ట్‌లో ‘ఇందిరానగర్ 80 అడుగుల రోడ్డులో లేజీ సుజీ పక్కన ,12వ మెయిన్‌కి కుడివైపున నా 2 BHK ఫ్లాట్‌ని అద్దెకు ఇస్తున్నాను. ఇటీవలే ఇంటీరియర్స్ చేశారు. బెడ్రూమ్లో ప్రొజెక్టర్, మోటరైజ్డ్ స్క్రీన్‌తో హోమ్ థియేటర్ సెటప్ ఉంది. ఎలాంటి పరిమితులు లేవు. అక్టోబర్ 15 ఇంట్లో అద్దెకు జాయిన్ అవ్వొచ్చు. రెంట్ రూ. 45 వేలు, రెంట్‌కు ఇల్లు కావాలంటే డైరెక్ట్‌గా మెసేజ్ చేయండి’ అని పేర్కొంటూ ఆ ఇంటి ఫోటోల్ని జత చేశారు. మురిసి పోయి.. రెంటు పెంచేసి అసలే ఇందిరా నగర్, పైగా చూడటానికి ఇల్లు బాగుంది. అద్దె ఇంటి కోసం వెతుకుతున్న వారు సైలెంట్‌గా ఉంటారా? ఏ మాత్రం ఆలస్యం చేయకుండా ఆ ఇంటి ఓనర్ పెట్టిన సోషల్ మీడియా పోస్ట్‌కి వందల మంది తమకు ఆ ఇల్లు అద్దెకు కావాలని రిప్లయి ఇచ్చారు. తాను పెట్టిన పోస్ట్‌కి ఊహించని స్పందన చూసిన యజమాని మురిసిపోయాడు. గంటలోనే అద్దె రూ.45 వేలు కాదని, రూ.55 వేలంటూ మరో పోస్ట్ పెట్టాడు. మా ఇంటిని అద్దెకిస్తున్నాం దీంతో యాజమాని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేసిన నెటిజన్లు గట్టిగా కౌంటర్ ఇస్తూ ప్రపంచ దేశాల్లో ప్రముఖ మైన ఇళ్లను, ప్రభుత్వ కార్యాలయాల్ని అద్దె ఇచ్చేందుకు సిద్దంగా ఉన్నాం. రెంట్ ఎంతో చెబుతూ సెటైరికల్‌గా కొన్ని పోస్ట్‌లు పెట్టారు. ఆ పోస్ట్‌లు సైతం నెటిజన్లను అలరించడంతో.. ఇంటి ఓనర్ తిక్క కుదురుతుందిలే అంటూ కామెంట్లు చేస్తున్నారు. నెటిజన్లు పెట్టిన పోస్ట్‌లను చూసి అలరించండి Story of bangalore rents these days covered in two images. 10k increase in just 6 hours. pic.twitter.com/j0VF44aZI5 — Nitin Kalra (@nkalra0123) September 3, 2023 అయ్యో పాపం అనుకున్నారు ఓ ఐపీఎల్ మ్యాచ్ సందర్భంగా చిన్న స్వామి స్టేడియంలో అతిన్ బోస్ అనే ఓ ప్రొడక్ట్ డిజైనర్ ‘ఇందిరానగర్ లో 2బీహెచ్ కే ఇంటి కోసం చూస్తున్నాను’ అని పేర్కొంటూ పింక్ ప్లకార్డుతో దర్శనమిచ్చాడు. ఇందిరా నగర్లో 2బీహెచ్‌కే బెడ్ రూంలో ఉంటున్నా. అద్దె రూ.35,000. ప్రస్తుతం నేను ఉంటున్న ఇంటి యజమాని అద్దెను ఒక్కసారిగా 60 శాతం పెంచేశాడు. ఇప్పుడు ఇందిరాగనర్ లో రూ.60 వేల లోపు అద్దెకు ఇల్లు లభించని పరిస్థితి ఉంది. రూ.80 వేలు పెట్టినా కష్టంగానే ఉంది’ అని బోస్ వాపోయాడు. అప్పట్లో అతిన్ బోస్ తీరుతో.. బెంగళూరులో అద్దె ఇల్లు దొరకడం ఇంత కష్టమా అంటూ నెటిజన్లు విస్మయానికి గురయ్యారు. ఇప్పుడు అదే నెటిజన్లు ఇంటి యజమానులు గంటలోనే రెంటు రూ.10వేల పెంచడంపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ మీమ్స్ షేర్ చేస్తున్నారు. Renting my 20 BHK villa also known as 'raichand house' with private helicopter in Indiranagar. No restrictions Move in date: Oct 15 Rent: 200K Attached pic DMs are open pic.twitter.com/7yh3g8VbqC — Jagdish Patil (@jagdishpatil02) September 3, 2023 Renting my New Delhi apartment Just off Kingsway road, next to Raisina Hill Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open pic.twitter.com/V3HXkbG9gE — Sumit Sharma (@Sumitkrsharma) September 3, 2023 Renting my Delhi bungalow nearby Raisina hills 340 BHK Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open https://t.co/RJlbLLJc9Y pic.twitter.com/raBbjqKOhI — Аshish Pradhan 🇮🇳🇺🇦🕉️⚕️🩺 (@DrAshishPradhan) September 3, 2023 Renting my West Delhi bungalow. Interiors done recently Bedroom has a home theater setup with a projector and motorized screen No restrictions Move in date: Oct 15 Rent: 45K Attached pics DMs are open pic.twitter.com/Q5P8XUX0FR — Anmol (@anmolm_) September 3, 2023 -
అప్పు చెల్లించలేదని ఇంటికి తాళం.. పంచాయితీ తీర్పు, రాత్రంతా చీకట్లోనే
ఇచ్చోడ: అప్పు చెల్లించేవరకు ఇంటికి తాళం వేసి ఉంచాలన్న పంచాయితీ పెద్దల తీర్పు కారణంగా బాధిత కుటుంబం రాత్రంతా చీకట్లోనే ఇంటి ముందు జాగరణ చేసిన ఘటన ఆదిలాబాద్ జిల్లాలో చోటుచేసుకుంది. ఇచ్చోడ మండలం సిరిచెల్మకు చెందిన రాజేందర్ అనే ఆసామి వద్ద అదే గ్రామానికి చెందిన తాత్ర శీను పాలేరుగా పనిచేసేందుకు మూడునెలల క్రితం ఒప్పందం చేసుకున్నాడు. నెలకు రూ.7 వేల చొప్పున ఒప్పందం కుదుర్చుకుని రూ.34 వేలు అడ్వాన్స్ తీసుకున్నాడు. గత జూలై 30వ తేదీ వరకు (దాదాపు మూడు నెలలపాటు) పనిచేశాడు. అయితే ఎడ్లజత సరిగా లేక, వాటితో వేగలేక తాను పనిచేయలేకపోతున్నానని యజమానికి పలుమార్లు చెప్పాడు. కానీ, రాజేందర్ స్పందించకపోవడంతో శీను సోమవారం పనికి వెళ్లలేదు. రాజేందర్ ఫిర్యాదు మేరకు సర్పంచ్ భర్త కన్నమయ్యతోపాటు గ్రామానికి చెందిన కుమ్మరి సాయన్న, కాళ్ల భూమయ్య పంచాయితీ పెట్టారు. శీను పనికి రాకుంటే తీసుకున్న డబ్బులు వెంటనే ఇవ్వా లని తీర్పు చెప్పారు. కొంత సమయం ఇవ్వాలని బాధితుడు ప్రాధేయపడినా వారు పట్టించుకోలేదు. డబ్బులు చెల్లించేవరకు ఇంటికి తాళం వేస్తామని చెప్పా రు. పంచాయితీ పెద్దల తీర్పు మేరకు ఇంటికి తాళం వేయడంతో శీను భార్య గంగమణి, తల్లి పోసాని, కుమారులు మల్లేశ్, నవీన్‌తోపాటు కోడలు లక్ష్మి ఇంటి ఆవరణలోనే సోమవారం రాత్రంతా జాగరణ చేశారు. బాధితుడు శీను మంగళవారం ఇచి్చన ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై నరేశ్ తెలిపారు. -
లూడో గేమ్‌లో ఓటమి.. తనను తాను కుదువ పెట్టుకున్న మహిళ!
పిల్లలు, పెద్దలు అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ స్మార్ట్ ఫోన్లలో మునిగిపోతున్నారు. చుట్టుపక్కల పరిస్థితులను మర్చిపోయేంతలా అందులో లీనమైపోతున్నారు. సమయం సందర్భం లేకుండా సోషల్ మీడియాను విచ్చిలవిడిగా ఉపయోగిస్తున్నారు. ఆన్లైన్ గేమ్స్‌కు బానిసలుగా మారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారు. తాజాగా ఓ మహిళ జూద వ్యసనంతో తనను తాను కుదవపెట్టుకుంది. పందెంలో యజమాని చేతిలో ఓడిపోవడంతొ అతనికి సొంతం అయిపోయింది. ఈ వింత సంఘటన ఉత్తర ప్రదేశ్‌లో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళితే.. ప్రతాప్‌గఢ్‌లోని కొత్వాలి నగర్ దేవ్ కలి ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తికి రేణు అనే మహిళతో వివాహం జరిగింది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. ఆరు నెలల క్రితం భర్త పనికోసం రాజస్థాన్‌లోని జైపూర్‌కు వెళ్లాడు. అక్కడే ఇటుకలు తయారు చేసే కార్మికుడిగా పని చేస్తున్నాడు. అక్కడి నుంచి భార్యకు నిత్యం డబ్బులు పంపేవాడు. భర్త ఇచ్చిన డబ్బుతో వివాహిత తన ఇంటి యజమానితో రోజూ ఆన్లైన్ గేమ్ లూడోకు ఆడేది. మెల్లమెల్లగా ఆమె ఆ ఆటకు బానిసగా మారిపోయింది. అలా ఓ రోజు ఇద్దరి కలిసి ఆడుతూ పందెం వేసుకున్నారు. ఈ క్రమంలో మహిళ తన వద్ద ఉన్న డబ్బు మొత్తం అయిపోవడంతో ఏం చేయాలో తెలియక యజమానికి తనను తాకట్టు పెట్టి మరీ లూడో ఆడింది. తనపై తానే పందెం కాసిన ఈ ఆటలోనూ మహిళ ఓడిపోవడంతో చివరికి యజమాని దగ్గరే ఉండిపోవాల్సి వచ్చింది. ఈ విషయాన్ని భర్తకు ఫోన్ చేసి చెప్పింది. దీంతో షాక్‌కు గురైన ఆమె భర్త ప్రతాప్‌గఢ్‌కు వచ్చి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య నిత్యం జూదం, ఆన్లైన్ గేమ్స్ ఆడుతుండేదని ఫిర్యాదులో పేర్కొన్నాడు. బెట్టింగ్‌లో ఓడిపోవడంతో తన భార్య ఇప్పుడు ఇంటి యజమానితో కలిసి జీవిస్తోందని తెలిపాడు. అతన్ని విడిచిపెట్టి రావాలని కోరగా.. అందుకు ఆమె ఒప్పుకోవడం లేదని వాపోయాడు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు.. దర్యాప్తు చేపట్టారు. ఈ ఘటన ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. చదవండి: విశాఖలో దారుణం.. మహిళను ముక్కలుగా నరికి, డ్రమ్ములో కుక్కి -
రెండేళ్ల క్రితమే మృతి.. ఇప్పటికీ ప్రతినెలా ఇంటి రెంట్ చెల్లిస్తున్న మహిళ!
లండన్: రెండేళ్ల క్రితమే మృతి చెందిన ఓ మహిళ నుంచి ఇప్పటికీ ఇంటి రెంటు తీసుకుంటున్నారు ఆ ఇంటి యజమాని. ఈ సంఘటన బ్రిటన్ రాజధాని లండన్‌లో వెలుగు చూసింది. ఇంతకీ ఏం జరిగింది. మృతి చెందిన మహిళ నుంచి ఇంటి రెంటు ఎలా తీసుకోగలుగుతున్నారు? అనే అంశాన్ని తెలుసుకున్న పోలీసులు అవాక్కయ్యారు. లండన్, పెఖమ్ నగరంలోని ఓ అపార్ట్ మెంట్లో 61 ఏళ్ల శీలా సెలియోవన్ అనే మహిళ అస్తికలను గుర్తించారు పోలీసులు. మూడో అంతస్తులో ఉంటున్న ఆమె ఇంటి తలుపులు బద్ధలు కొట్టి లోపలికి వెళ్లిన పోలీసులకు ఆమె ఎముకలు మాత్రమే కనిపించాయి. డెంటల్ రికార్డ్స్ ప్రకారం బాధితురాలిని గుర్తించారు పోలీసులు. ఆమె మరణానికి ఎలాంటి అనుమానాస్పద కారణాలు కనిపించలేదన్నారు. 2019, ఆగస్టులో ఆమె మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. రెండేళ్లుగా కనిపించకపోయినా.. అవివాహిత అయిన 61 శీలా కుటుంబం దక్షిణాఫ్రికాలో ఉంటోంది. ఆమె మృతి చెందినట్లు 2022, ఫిబ్రవరిలో గుర్తించినట్లు డైలీ మెయిల్ నివేదించింది. 2019, అక్టోబర్‌లో ఆమె ఫ్లాట్ నుంచి కుల్లిపోయిన వాసన విపరీతంగా వచ్చినట్లు ఇరుగు పొరుగువారు తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు సార్లు ఆమె ఫ్లాట్ వద్దకు వచ్చినా తెరిచేందుకు సరైన కారణం లేదని తిరిగి వెళ్లిపోయారు పోలీసులు. ఆమెను చివరి సారిగా 2019, ఏప్రిల్‌లో చూసినట్లు స్థానికులు తెలిపారు. అదే ఏడాది ఆగస్టులో చివరిసారిగా ఇంటి రెంటు చెల్లించారు శీలా. ఆ తర్వాత చెల్లించకపోవటం వల్ల ఆమె యూనివర్సల్ క్రెడిట్ పేమెంట్స్ నుంచి ఆటోమెటిక్‌గా రెంట్ పే చేసేందుకు హౌసింగ్ గ్రూప్ అంగీకరించింది. ఆ తర్వాత 2020, మార్చి నుంచి ప్రతి నెలా యజమానికి ఆటోమేటిక్‌గా రెంటు అందుతోంది. అయితే.. ఆమెను పలకరించేందుకు ఏ ఒక్కరు ప్రయత్నించకపోవటం గమనార్హం. 2020, జూన్‌లో గ్యాస్ తనిఖీల్లో భాగంగా అధికారులు ఫ్లాట్‌కు వెళ్లగా.. ఎవరూ స్పందించలేదు. దీంతో శీలా ఉండే ఇంటికి గ్యాస్ కనెక్షన్ తొలగించారు. ఆమె ఫ్రిడ్జ్‌లో ఉన్న ఆహారపదార్థాలపై తేదీల ఆధారంగా ఆమె 2019, ఆగస్టులో చనిపోయి ఉంటారని అధికారులు అంచనా వేశారు. ఆమె 2019, ఆగస్టు 14న టెలిఫోన్ ద్వారా వైద్యుడితో మాట్లాడారు. తనకు ఇబ్బందిగా ఉందని, ఒక్కోసారి శ్వాస తీసుకోలేకపోతున్నట్లు తెలిపింది. ఆ తర్వాతి రోజు వైద్యుడిని కలవాల్సి ఉంది. కానీ ఆమె హాజరవ్వలేదు. ఇదీ చూడండి: స్విమ్మింగ్‌పూల్ సింక్‌హోల్‌లో పడి వ్యక్తి మృతి.. వీడియో వైరల్! -
పాపం: 175 ఎకరాల ఆసామి నేడు కూలీగా..
భువనేశ్వర్ : ఒకప్పుడు ఆకలి చావులు, పిల్లల ఆమ్మకాలకు పేరుగాంచి పత్రికల పతాక శీర్షికల్లో నిత్యం నిలిచేది రాష్ట్రంలోని కలహండి జిల్లా. కరువు రక్కసి కబంధహస్తాల్లో నలిగిపోతున్న కలహండి జిల్లాను పచ్చగా మార్చేందుకు, సాగునీటి వనరుల కోసం బృహత్తర ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. అప్పటికి ఆ ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి 175 ఎకరాలకు పైగా భూస్వామి. ఆ గ్రామమంతా ఆయన ఆధీనంలో ఉండేది. ఇంద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు నిర్మాణం కోసం తన యావదాస్తి (భూమి) కోల్పోయాడు. అందుకు తగిన పరిహారం కూడా లభించలేదు. ఇంద్రావతి ప్రాజెక్టు వల్ల కలహండి జిల్లా నేడు కళకళ లాడుతుండగా ఆ ప్రాజెక్టు కోసం ఆస్తులు పోగొట్టుకున్న బ్రజ సుదర బిశాయి జీవితం సున్నం వెలిసిపోయిన గోడలా తయారైంది. ఆయన నేడు ఇంద్రావతి ప్రాజెక్టు బాధితుడు. ఆయన కొడుకు పొట్ట నింపుకొనేందుకు పరాయి రాష్ట్రానికి వలస పోయాడు. ఒకనాటి జమీందారు బిశాయి నేడు కూలీగా మారి పార చేత పట్టి జీవనం గడుపుతున్నాడు. 70 యేళ్లు పైబడిన ఆయన ఒక గడ్డి ఇంటిలో భార్యతో ఉంటున్నాడు. గతంలో ఇంటిలో అనేకమంది పనివారుండేవారు. పనివారిని అజమాయిషీ చేసే ఆయన భార్య నేడు కర్రల పొయ్యిపై వంటచేస్తూ గత జ్ఞాపకాలతో కన్నీరు కారుస్తోంది. కొన్ని సమయాల్లో భర్తతో పాటు పనులకు వెళ్తోంది. కూలి పనులకు వెళ్తున్న బిశాయి దంపతులు కొండంత భూమి..గోరంత పరిహారం ఆయన పూర్వీకుల భూమి తెంతులికుంఠి సమితి ముండిగుడ గ్రామంలో 5.52 ఎకరాలు, ముడిగుమ్మ గ్రామంలో 90 ఎకరాలు, కొరాపుట్ జిల్లా దశమంతపూర్ సమితి అంబాగుడ గ్రామంలో 80 ఎకరాలు ఉండేవి. ఆ నాడు వందలాది మంది పనివారితో ఆయన ఇల్లు సందడిగా ఉండేది. పాడి పంటలతో లక్ష్మి తాండవించేది. ఆ భూములన్నీ ఇంద్రావతి ప్రాజెక్టులో విలీనమయ్యాయి. ఆనాడు తెంతులికుంఠి సమితిలో ఆయన భూమికి రూ.1,42,387, దశమంతపూర్ సమితిలో భూమికి రూ.64, 861 పరిహారంగా అందింది. ప్రభుత్వం తనకు ఇచ్చిన పరిహారం సముద్రంలో నీటిబొట్టు అని, హారతి కర్పూరంలా ఖర్చయిపోయిందని బ్రజ సుందర బిశాయి వాపోయాడు. ఇంద్రావతి ప్రాజెక్టుకు వల్ల తన సర్వస్వాన్ని కోల్పోయానని, ప్రాజెక్టు తనకు పేదరికం మిగిలి్చందని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ప్రాజెక్టు నిర్వాసితులకు తగిన పరిహారంతో పాటు, పునరావాసం కల్పిస్తామని పాలకులు ఎన్నో హామీలు ఇచ్చి, చివరికి మొండి చెయ్యి చూపారని కళ్లనీళ్లు కార్చాడు. ఎన్నో పోరాటాలు, ఆందోళనలు చేశాక ఒక రేషన్ కార్డు, వృద్ధాప్య పెన్షన్లు ప్రభుత్వం సమకూర్చిందని వెల్లడించాడు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నమ్మి యావదాస్తిని ధారబోసి నిరుపేదల్లా మిగిలామని బ్రజసుందర బిశాయి భోరుమన్నాడు. ఆయన మాట గ్రామస్తులకు వేదవాక్కు. గ్రామస్తులే కాకుండా పరిసర ప్రాంతాల ప్రజలు కూడా ఆయనను జమీందారు అనే పిలిచేవారు. ఆయన వద్ద వందలాదిమంది పనిచేసేవారు. ఒకప్పుడు పదిమందికి దాతగా ఉన్న ఆయన నేడు పిడికెడు బియ్యం కోసం చేతులు చాచే పరిస్థితిలో ఉన్నాడు. రూపాయి కేజీ బియ్యం కోసం పడిగాపులు కాస్తున్నాడు. అందుకు కారణం ఇం«ద్రావతి జలవిద్యుత్ ప్రాజెక్టు. ఇంద్రావతి ప్రాజెక్టు పూర్తయింది. కలహండి జిల్లా సస్యశ్యామలమైంది. పేదరికం కొంత దూరమైంది. అయితే ఆనాటి భూస్వామి నేడు నిరుపేద అయిపోయాడు. అంతే కాదు వృద్ధాప్యంలో కూలిగా మారాడు. నవరంగపూర్ జిల్లా ఇంద్రావతి ప్రాంతంలోని ఫటాగుడ గ్రామానికి చెందిన బ్రజ సుందర బిశాయి దీనగాథ ఇది. -
మైనర్ అక్కా చెల్లెళ్లపై సామూహిక అత్యాచారం!
మధ్యప్రదేశ్‌కు చెందిన ఇద్దరు మైనర్ అక్కాచెల్లెళ్లపై వాళ్ల ఇంటి యజమాని, మరో ముగ్గురు కలిసి సామూహిక అత్యాచారం చేశారు. ఈ దారుణం గుర్గావ్లోని బినోలా గ్రామంలో జరిగింది. 13, 16 సంవత్సరాల వయసున్న ఆ ఇద్దరు అక్కా చెల్లెళ్లు నెల రోజుల క్రితమే మధ్యప్రదేశ్ నుంచి తమ తల్లి, సోదరుడితో కలిసి పని వెతుక్కోడానికి గుర్గావ్ ప్రాంతానికి వచ్చారు. వాళ్లు బినోలా గ్రామంలో రామావతార్ (50) అనే వ్యక్తికి చెందిన ఇంటిని అద్దెకు తీసుకున్నారు. శనివారం రాత్రి నలుగురు నిందితులు పూటుగా మద్యం తాగి, వాళ్ల ఇంటికి వచ్చారు. ముందుగా తల్లి, సోదరుడిపై దాడిచేసి, వాళ్లను కొట్టి ఓ గదిలో పెట్టి బంధించారు. తర్వాత ఆడపిల్లలిద్దరినీ గుర్తుతెలియని ప్రదేశానికి తీసుకెళ్లి అక్కడ ఒకరి తర్వాత ఒకరుగా పదే పదే అత్యాచారం చేశారు. తాము ఆ ఇంటికి వచ్చినప్పటినుంచే తన కూతుళ్లపై ఇంటి యజమాని కళ్లు పడ్డాయని బాధితుల తల్లి వాపోయింది. ఈ మేరకు ఆమె పోలీసులకు ఫిర్యాదుచేసింది. బాధితులకు వైద్యపరీక్షలు జరిపేందుకు ప్రత్యేకంగా వైద్యుల బృందాన్ని ఏర్పాటుచేశారు. నిందితులు రామావతార్, రామ్ కిషన్ (30), మంతోష్, ఓంబీర్ (22)లను పోలీసులు అరెస్టు చేశారు. అయితే.. ఇల్లు ఖాళీ చేయమని చెప్పినందుకే తమపై ఈ తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని నిందితులు విచారణలో చెప్పారు.