lanka people
-
Sri Lanka Crisis: ప్రధాని బెడ్‌పై నిరసనకారుల రెజ్లింగ్.. వీడియో వైరల్
కొలంబో: దేశాన్ని తీవ్ర సంక్షోభంలోకి నెట్టినందుకు అధ్యక్షుడు, ప్రధాని రాజీనామా చేయాలని లంకేయుల కొంతకాలంగా ఆందోళనలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో గతవారం అధ్యక్ష భవనాన్ని ముట్టడించి ఆక్రమించారు. అనంతరం అక్కడి విలాస సదుపాయాలను కొందరు ఆందోళనకారులు ఆస్వాదించారు. భవనంలోని స్విమ్మింగ్‌పూల్‌లో దూకి ఈత కొట్టారు. కిచెన్‌లో వండుకుని తిన్నారు. బెడ్రూంలలో హాయిగా సేదతీరారు. జిమ్‌లో వర్కౌట్లు చేశారు. ఇందుకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్‌గా మారాయి. వాటిని చూసి నెటిజన్లు తెగ కామెంట్లు చేశారు. ఇప్పుడు ఇలాంటి వీడియోనే మరొకటి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ప్రధాని అధికారిక నివాసంలోకి ప్రవేశించిన నిరసనకారులు ఆయన బెడ్‌పై సరదాగా రెజ్లింగ్ చేశారు. ప్రొఫెషనల్ రెజ్లర్లను తలపించేలా స్టంట్లతో రెచ్చిపోయారు. అంతేకాదు ఈ వీడియోను కాస్త ఎడిట్ చేసి దానికి బ్యాగ్రౌండ్లో నిజమైన రెజ్లింగ్ మ్యాచ్ కామెంటరీని కూడా జోడించారు. ఇందుకు సంబందించిన వీడియోను ఓ శ్రీలంక యూజర్ ట్విట్టర్లో షేర్ చేశాడు. ప్రొఫెషనల్ రెజ్లర్లలా మారి ఆందోళనకారులు ఫుల్‌గా ఎంజాయ్ చేశారు. నిజమైన మ్యాచ్‌ను తలపించేలా బెడ్‌పై ‘కుమ్మేసుకున్నారు’. వీడియోలో ఓ ఆందోళనకారుడు డబ్ల్యూడబ్ల్యూఈ స్టార్ రెజ్లర్ ర్యాండీ ఆర్టన్లా పోజులివ్వడం ఆకట్టుకుంది. Video - #WWE Wrestling on Prime Minister's bed at Temple Trees 😃#LKA #SriLanka #SriLankaCrisis #SriLankaProtests pic.twitter.com/5f2zE9uqLD — Sri Lanka Tweet 🇱🇰 💉 (@SriLankaTweet) July 10, 2022 అంతకుముందు అధ్యక్షుడు గొటబాయ, ప్రధాని విక్రమ సింఘే రాజీనామా చేయాలని ఆందోళనకారులు విధ్వంసం సృష్టించారు. ప్రధాని ప్రైవేటు నివాసానికి నిప్పంటించారు. ప్రజల ఆగ్రహావేశాలు చూసి అధ్యక్షుడు గొటబాయ పారిపోయారు. ప్రస్తుతం ఆయన శ్రీలంక నేవీ ఓడలో ఉన్నట్లు తెలుస్తోంది. లంకేయుల ఆందోళనల నేపథ్యంలో పదవుల నుంచి తప్పుకుంటామని అధ్యక్షుడు, ప్రధాని ఇప్పటికే ప్రకటించారు. చదవండి: అధ్యక్షుడి భవనంలో కరెన్సీ కట్టల గుట్టలు.. ఆశ్చర్యంలో లంకేయులు -
లంకలోకి రావొద్దు
► సర్వే చేయటానికి మేం ఒప్పుకోం ► అధికారులపై రాజధాని రైతుల ఆగ్రహం ► సర్వే అధికారులను అడ్డుకున్న కర్షకులు ► వచ్చిన దారినే వెనుదిరిగిన అధికారులు సాక్షి, అమరావతి బ్యూరో : ‘లంకలోకి ఎన్ని పర్యాయాలు వస్తారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. ఇకపై లంకలోకి రావొద్దు. అందరితో సమానంగా ప్యాకేజీ ఇచ్చేలా ఉంటే రండి. ఈ లోపు లంకలో అడుగుపెడితే ఒప్పుకునేది లేదు’ అంటూ ఉద్దండ్రాయునిపాలెం రైతులు రెవెన్యూ అధికారులను అడ్డుకున్నారు. లింగాయపాలెం పంచాయతీ పరిధిలో లంక భూముల వద్ద కాపురం ఉంటున్న నివాసాల వివరాలు సేకరించేందుకు సోమవారం తుళ్లూరు తహసీల్దార్ సుధీర్‌బాబు, ముగ్గురు సర్వేయర్లు ఉద్దండ్రాయునిపాలెంకు చేరుకున్నారు. విషయం తెలుసుక్ను స్థానికులు వారిని అడ్డుకున్నారు. ‘ఎందుకొచ్చారు? ఇప్పటికి ఎన్ని పర్యాయాలు వచ్చి సర్వే చేసి ఉంటారు. మమ్మల్ని ఏం చేయాలనుకుంటున్నారు. లంకలో సర్వే చేయటానికి వీల్లేదు. అందరితో సమాన ప్యాకేజీ ఇస్తామని ప్రభుత్వం నుంచి గట్టి హామీ ఇస్తేనే లోనికి వెళ్లండి. లేకపోతే వచ్చిన దారినే వెళ్లిపోండి’ అంటూ ఎదురు తిరిగారు. అంటరానివారిలా చూస్తున్నారు..: ప్రజా రాజధాని అని చెప్పి దళితులకు చోటు లేకుండా చేయటం మంచిదేనా? అని రైతులు ప్రశ్నించారు. ప్రభుత్వం లంక రైతుల పట్ల వివక్ష ప్రదర్శిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. భూముల కోసం మంత్రులు, ఎమ్మెల్యేలు అందరూ రైతుల నివాసాలకు వెళ్లి బతిమలాడారని గుర్తుచేశారు. అయితే లంక రైతులను అంటరాని వారిలా చూస్తున్నారని మండిపడ్డారు. లంకలో నివాసాలు ఏర్పాటు చేసుకున్న వారిపట్లా వివక్ష చూపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేవలం నివాసాలకు మాత్రమే పరిహారం ఇచ్చి... చుట్టూ ఉన్న ఖాళీ స్థలాన్ని లెక్కలోకి ఎందుకు తీసుకోరని ప్రశ్నించారు. సమాన ప్యాకేజీ ఇవ్వొద్దని ఏ చట్టం చెప్పింది: దళిత రైతులకు సమాన ప్యాకేజీ ఇవ్వకూడదని ఏ చట్టం చెప్పిందని తహసీల్దార్ సుధీర్‌బాబును రైతులు నిలదీశారు. రాజధాని నిర్మాణం కోసం ఇప్పటి వరకు భూములు ఇచ్చిన వారంతా కన్నీరుపెడుతున్నారని గుర్తుచేశారు. గజం స్థలం ఇస్తే పరిహారం కింద గజం ఇస్తామని హామీ ఇచ్చి... అవసరం తీరాక మాట మారుస్తున్నారని ధ్వజమెత్తారు. లంక భూముల రైతులకు సమాన ప్యాకేజీ ఇచ్చేవరకు సర్వే చేయటానికి ఒప్పుకునేది లేదని తేల్చిచెప్పటంతో తహసీల్దార్, సర్వేయర్లు వచ్చినదారినే వెనుదిరిగి వెళ్లిపోయారు.