Large Cap Fund
-
పాతికేళ్ల ట్రాక్ రికార్డ్.. మంచి రాబడులు ఇస్తున్న ఈ ఫండ్ గురించి తెలుసా?
స్మాల్‌క్యాప్ ఫండ్స్, మిడ్‌క్యాప్ ఫండ్స్, లార్జ్‌క్యాప్ ఫండ్స్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కానీ, ఎక్కువ మంది ఇన్వెస్టర్లకు పెద్దగా పరిచయం లేని, పట్టించుకోని విభాగం ఒకటి ఉంది. అదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం. దీర్ఘకాలంలో ఈ విభాగం మంచి సంపద సృష్టిస్తుందని చెప్పడానికి ఇప్పటి వరకు ఉన్న గణాంకాలు ఆధారంగా నిలుస్తాయి. లార్జ్‌క్యాప్ స్థిరత్వానికి, రిస్క్ తక్కువకు వీలు కల్పిస్తుంది. మిడ్‌క్యాప్ మోస్తరు రిస్క్‌తో, అధిక రాబడులకు మార్గం కల్పిస్తుంది. ఈ రెండు రకాల విభాగాల్లో పెట్టుబడులకు వీలు కల్పించేదే లార్జ్ అండ్ మిడ్‌క్యాప్. ఈ విభాగంలో సుదీర్ఘకాల చరిత్ర (25 ఏళ్లకు పైగా) ఉండి, మంచి రాబడులను అందిస్తున్న పథకంగా ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్‌కు ట్రాక్ రికార్డు ఉంది. పెట్టుబడుల విధానం.. సెబీ నిబంధనల ప్రకారం ఈ పథకం లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్‌లో 35 శాతం చొప్పున ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. కానీ, కొన్ని సందర్భాల్లో విభాగాల వారీ కేటాయింపుల్లో పరిమిత కాలం స్వేచ్ఛ ఉంటుంది. ఈ పథకం మేనేజర్ టాప్డౌన్, బోటమ్ అప్ విధానాలను స్టాక్ ఎంపికకు వినియోగించుకోవడాన్ని గమనించొచ్చు. ఈ విధానాల ద్వారా లార్జ్‌క్యాప్, మిడ్‌క్యాప్ విభాగాల నుంచి స్టాక్స్ ఎంపిక చేసుకుని ఇన్వెస్ట్ చేస్తుంటారు. ఆకర్షణీయమైన అవకాశాలు ఎక్కడ కనిపించినా, ఫండ్ మేనేజర్ గుర్తించి అందులో ఇన్వెస్ట్ చేస్తుంటారు. స్మాల్‌క్యాప్‌లో ఆకర్షణీయమైన అవకాశాలు కనిపించినా సొంతం చేసుకునే విధంగా ఈ పథకం పనిచేస్తుంటుంది. ఇన్వెస్టర్లకు అదనపు ఆల్ఫా అందించడమే దీని ఉద్దేశ్యం. ఈక్విటీల్లో తీవ్ర అస్థిరతలు ఉన్న సందర్భాల్లో 30 శాతం వరకు డెట్ సాధనాలకు సైతం కేటాయించగలదు. పోర్ట్‌ఫోలియో డిసెంబర్ 31 నాటికి చూసుకుంటే ఈ పథకం నిర్వహణలో రూ.10,268 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. ఇందులో 93.74 శాతాన్ని ఈక్విటీలకు కేటాయించగా, డెట్ సాధనాల్లో 0.87 శాతం, నగదు, నగదు సమానాల్లో 5.4 శాతం మేర కలిగి ఉంది. ప్రస్తుతం ఈక్విటీ కేటాయింపులను పరిశీలించగా, 70.42 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ కంపెనీల్లో 26 శాతం మేర ఇన్వెస్ట్ చేయగా, స్మాల్‌క్యాప్ కంపెనీలకు కేవలం 2 శాతాన్నే కేటాయించింది. ప్రస్తుతం స్మాల్‌క్యాప్ కంపెనీల వ్యాల్యూషన్లు చారిత్రక గరిష్ట స్థాయిలో ఉన్నందున అప్రమత్త ధోరణితో ఉన్నట్టు తెలుస్తోంది. ఆర్థిక వ్యవస్థ రికవరీతో లాభపడే రంగాలు, స్టాక్స్‌కు ఎక్కువ కేటాయింపులు చేసినట్టు ప్రస్తుత పోర్ట్‌ఫోలియోను గమనిస్తే తెలుస్తుంది. అంటే ఆర్థిక వ్యవస్థ మెరుగైన వృద్ధికి అనుగుణంగా ఆయా స్టాక్స్ ర్యాలీకి అవకాశాలు మెరుగ్గా ఉంటాయని భావించొచ్చు. రాబడులు ఈ పథకం 1998 నవంబర్ 30న ప్రారంభమైనంది. నాటి నుంచి చూసుకుంటే ఇప్పటి వరకు వార్షిక రాబడి 18.60 శాతంగా ఉంది. ఈ పథకం ఎక్స్పెన్స్ రేషియో 1.80 శాతంగా ఉంది. అంటే ఇన్వెస్టర్ తన పెట్టుబడుల విలువపై ఏటా ఈ మేరకు చార్జీల రూపంలో కోల్పోవాల్సి ఉంటుంది. ఈ పథకాన్ని ప్రస్తుతం ఇహబ్ దల్వాయ్ నిర్వహిస్తున్నారు. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకం 33 శాతం రాబడిని అందించింది. మూడేళ్లలో 25.63 శాతం, ఐదేళ్లలో 20 శాతం, ఏడేళ్లలో 16.44 శాతం, పదేళ్లలో 16.62 శాతం చొప్పున రాబడుల చరిత్ర ఈ పథకానికి ఉంది. ఈ పథకం ప్రారంభమైన నాడు ఏకమొత్తంలో రూ.లక్ష ఇన్వెస్ట్ చేసి ఉంటే, అది ఇప్పుడు రూ.72.15 లక్షలు అయి ఉండేది. ఈ కాలంలో బెంచ్‌మార్క్ నిఫ్టీ లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ 250 టీఆర్ఐ కంటే మెరుగైన పనితీరు చూపించింది. పథకం ఆరంభం నుంచి ప్రతి నెలా రూ.10వేల చొప్పున ఇన్వెస్ట్ చేస్తూ వస్తే రూ.4.03 కోట్లు సమకూరి ఉండేది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఐసీఐసీఐ బ్యాంక్ 6.84 మారుతి సుజుకీ 4.50 ఎన్టీపీసీ 3.79 భారతీ ఎయిర్టెల్ 3.22 ఇన్ఫోసిస్ 3.14 హెచ్డీఎఫ్సీ బ్యాంక్ 2.89 ఎస్బీఐ కార్డ్స్ 2.83 రిలయన్స్ 2.53 ఎన్‌హెచ్‌పీసీ 2.36 ముత్తూట్ ఫైనాన్స్ 2.35 -
Fund Review: స్థిరత్వంతో కూడిన రాబడులు.. మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్
అంతర్జాతీయంగా, దేశీయంగా లిక్విడిటీ (నిధులు) మద్దతుతో ఈక్విటీ మార్కెట్లు గత ఏడాదిన్నర కాలంలో గణనీయంగా ర్యాలీ చేశాయి. ఈ పరిస్థితుల్లో ఈక్విటీల్లో ఇన్వెస్ట్ చేయాలనుకునే వారు అస్థిరతలు తక్కువగా ఉండే లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇవ్వొచ్చు. ఎందుకంటే ఇవి స్థిరమైనవే కాకుండా, మార్కెట్లు కుదుటపడిన వెంటనే వేగంగా రికవరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది. కునుక మూడు నుంచి ఐదేళ్లు అంతకంటే ఎక్కువ కాలం కోసం పెట్టుబడులు పెట్టాలనుకుంటే లార్జ్‌క్యాప్ స్టాక్స్‌ను ఎంపిక చేసుకోవచ్చు. ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ మరే ఇతర పెట్టుబడి సాధనంతో పోల్చి చూసినా.. రాబడుల విషయంలో మెరుగ్గా కనిపిస్తాయి. ముఖ్యంగా ద్రవ్యోల్బణాన్ని అధిగమించి మెరుగైన రాబడులు వీటి నుంచి ఆశించొచ్చు. లార్జ్‌క్యాప్ విభాగంలో మంచి పనితీరు చూపిస్తున్న ఫండ్స్‌లో మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ కూడా ఒకటి. రాబడులు ఈ పథకం నిర్వహణలో ప్రస్తుతానికి రనూ.30,804 కోట్ల పెట్టుబడులు ఉన్నాయి. నిర్వహణ ఆస్తుల పరంగా పెద్ద పథకాల్లో ఇదీ ఒకటి. గడిచిన ఏడాది కాలంలో ఈ పథకంలో ట్రెయిలింగ్ రాబడులు 39 శాతంగా ఉన్నాయి. మూడేళ్లలోనూ వార్షికంగా సగటు రాబడులు 19 శాతానికిపైనే ఉన్నాయి. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 14.53 శాతం, పదేళ్లలో 18.47 శాతం చొప్పున రాబడులను (ట్రెయిలింగ్) అందించింది. దీర్ఘకాలంలో సగటున 18 శాతాని ్జటపైనే రాబడులు ఇవ్వడాన్ని చక్కని పనీతీరుగానే పరిగణించాలి. పెట్టుబడుల విధానం.. గౌరవ్ మిశ్రా ఫండ్ మేనేజర్‌గా వ్యవహరిస్తున్నారు. పథకం పెట్టుబడుల విధానాలకు అనుగుణంగా ఫండ్ నిర్వహణ, పరిశోధన బృందం వ్యూహాలు ఉండడం సానుకూలం. నాణ్యమైన కంపెనీలను పథకం ఎంపిక చేసుకుంటుంది. అలాగే, స్థిరమైన ఆదాయం, లాభాలను నమోదు చేస్తున్న వాటికి ప్రాముఖ్యం ఇస్తుంది. కంపెనీ యాజమాన్యం బలమైనదా? కాదా? అని చూస్తుంది. చివరిగా స్టాక్ వ్యాల్యూషన్ ఆకర్షణీయ స్థాయిలోనే ఉందా? లేక ఖరీదుగా మారిందా? అన్న అంశాలకు పెట్టుబడుల విషయంలో ఈ పథకం పరిశోధన బృందం ప్రాధాన్యం ఇస్తుంది. బోటమ్, టాప్డౌన్ రెండు రకాల విధానాలను అనుసరిస్తుంది. కీలకమైన రేషియోలను కూడా ప్రాధాన్యం ఇస్తుంది. గడిచిన పదేళ్ల కాలంలో కంపెనీ ఏ విధంగా వృద్ధి చెందింది, ఆయా రంగంలో వచ్చిన మార్పులు, కంపెనీ యాజమాన్యం అనుసరించిన విధానాలను అన్నింటినీ విశ్లేషించి.. రానున్న కాలంలోనూ చక్కని వృద్ధి దిశగా ప్రయాణించే వాటిని ఎంపిక చేసుకుంటుంది. మార్కెట్ విలువ పరంగా అగ్రగామి 100 కంపెనీలను లార్జ్‌క్యాప్ కంపెనీలుగా పేర్కొంటారు. మిరే అస్సెట్ లార్జ్‌క్యాప్ ఫండ్ తన నిర్వహణలోని పెట్టుబడుల్లో 80 శాతానికి పైగా అధిక నాణ్యతతో కూడిన లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఇన్వెస్ట్చేస్తుంది. మరో 20 శాతం పెట్టుబడులను అధిక వృద్ధి అవకాశాలు కలిగిన మిడ్‌క్యాప్, స్మాల్ క్యాప్ కంపెనీలకు కేటాయిస్తుంది. లార్జ్‌క్యాప్ కంపెనీలు ఇన్వెస్టర్ పోర్ట్‌ఫోలియోకు స్థిరత్వాన్ని, వృద్ధిని ఇస్తాయి. స్మాల్‌క్యాప్, మిడ్‌క్యాప్ కంపెనీలు వృద్ధితోపాటు, అధిక రాబడులు తెచ్చేందుకు సాయపడతాయి. పోర్ట్‌ఫోలియో తన నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో 99.20 శాతాన్ని ప్రస్తుతానికి ఈక్విటీలకు కేటాయించింది. పోర్ట్‌ఫోలియోలో 61 స్టాక్స్‌ను కలిగి ఉంది. ప్రస్తుతానికి మొత్తం పెట్టుబడుల్లో 84 శాతం లార్జ్‌క్యాప్ కంపెనీల్లోనే ఉన్నాయి. మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 13.89 శాతం, స్మాల్‌క్యాప్‌లో 2 శాతం వరకు పెట్టుబడులను కేటాయించింది. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ రంగానికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తూ.. 32.31 శాతం పెట్టుబడులను ఈ రంగాలకు చెందిన కంపెనీల్లోనే పెట్టి ఉంది. ఆ తర్వాత టెక్నాలజీ రంగ కంపెనీలకు 15 శాతం వరకు కేటాయింపులు చేసింది. ఆ తర్వాత ఇంధన రంగ కంపెనీలకు ఎక్కువ వెయిటేజీ ఇచ్చింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం ఇన్ఫోసిస్ 8.83 ఐసీఐసీఐ బ్యాంకు 8.68 హెచ్డీఎఫ్సీ బ్యాంకు 8.49 రిలయన్స్ ఇండస్ట్రీస్ 6.60 ఎస్బీఐ 4.62 యాక్సిస్ బ్యాంకు 4.40 టీసీఎస్ 3.24 భారతీ ఎయిర్టెల్ 3.04 ఎల్అండ్టీ 2.31 -
ఒకే పథకం.. ఒకటికి మించి ప్రయోజనాలు
Canara Robeco Emerging Equity Fund: లార్జ్‌క్యాప్ కంపెనీల్లో స్థిరత్వం ఎక్కువగా ఉంటుంది. మిడ్‌క్యాప్ కంపెనీల్లో వృద్ధి సామర్థ్యాలు అధికంగా ఉంటాయి. అందుకే లార్జ్‌క్యాప్‌లో రిస్క్ తక్కువ. మిడ్‌క్యాప్‌లో స్వల్పకాలానికి కొంత రిస్క్ ఉన్నా కానీ, దీర్ఘకాలంలో రాబడులు అధికంగా ఉంటాయి. ఈ రెండు రకాల ప్రయోజనాలను ఒకే మ్యూచువల్ ఫండ్ పథకంలో పొందాలంటే అందుకు.. కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీ ఫండ్‌ను పరిశీలించొచ్చు. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ ఫండ్ విభాగంలో ఈ పథకం మెరుగ్గా పనిచేస్తోంది. 2018కి ముందు ఈ పథకం మిడ్‌క్యాప్ ఫండ్‌గా కొనసాగగా.. సెబీ మ్యూచువల్ ఫండ్స్ పథకాల పునర్వ్యవస్థీకరణ నిబంధనల తర్వాత లార్జ్‌అండ్ మిడ్‌క్యాప్ పథకంగా మారింది. లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ పథకాలు తమ నిర్వహణలోని మొత్తం పెట్టుబడుల్లో కనీసం 35 శాతం చొప్పున లార్జ్‌క్యాప్‌లో, మిడ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన పెట్టుబడులను భిన్న మార్కెట్ కేటగిరీల్లోని స్టాక్స్‌కు కేటాయించుకోవచ్చు. పనితీరు పోటీ పథకాల కంటే ఈ విభాగంలో కెనరా రొబెకో ఎమర్జింగ్ ఈక్విటీస్ మెరుగైన పనితీరును గత కొన్ని సంవత్సరాలుగా నమోదు చేస్తోంది. 5స్టార్ రేటింగ్ పథకం ఇది. గడిచిన ఏడాది కాలంలో ఇన్వెస్టర్లకు పెట్టుబడులపై 61 శాతం రాబడులను అందించింది. ఇదే కాలంలో లార్జ్‌అండ్ మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడులు కూడా ఇదే స్థాయిలో ఉన్నాయి. మూడేళ్ల కాలంలోనూ వార్షిక రాబడుల చరిత్ర 24 శాతంగా ఉంది. కానీ, ఇదే కాలంలో లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ విభాగం సగటు రాబడులు 20.51 శాతంగానే ఉన్నాయి. ఐదేళ్లలో 18 శాతం, ఏడేళ్లలో 18 శాతం, పదేళ్లలో 23 శాతం చొప్పున వార్షిక రాబడులను ఈ పథకం ఇచ్చింది. 2005 మార్చిలో ఈ పథకం ప్రారంభం కాగా, నాటి నుంచి చూసుకున్నా వార్షిక రాబడుల రేటు 18.35 శాతంగా ఉంది. పాయింట్ టు పాయింట్ రాబడులను పరిశీలించినా.. మూడేళ్లు, ఐదేళ్ల కాలంలో టాప్–3లో ఈ పథకం ఒకటిగా కనిపిస్తుంది. గడిచిన మూడేళ్లలో మార్కెట్లు నష్టపోయిన సమయంలో ఈ పథకం నష్టాలను పరిమితం చేయడాన్ని కూడా గమనించాలి. అంతేకాదు, మార్కెట్ ర్యాలీల్లోనూ ముందుంది. పోర్ట్‌ఫోలియో బలమైన వృద్ధి అవకాశాలున్న కంపెనీలను పెట్టుబడులకు ఎంపిక చేసుకుంటుంది. మంచి పోటీనిచ్చే సత్తా, సహేతుక వ్యాల్యూషన్ల వద్దనున్న స్టాక్స్‌ను గుర్తించి ఇన్వెస్ట్ చేస్తుంది. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌కు కేటాయింపులు చేయడం వల్ల పథకం పనితీరుకు స్థిరత్వాన్నిస్తుంది. గడిచిన మూడేళ్లలో ఈ పథకం సగటున లార్జ్ అండ్ మిడ్‌క్యాప్ స్టాక్స్‌కు 84–95 శాతం మధ్య కేటాయింపులు చేసింది. ప్రస్తుతం కూడా లార్జ్, మిడ్‌క్యాప్ స్టాక్స్‌లో 97 శాతం పెట్టుబడులు పెట్టి ఉంది. స్మాల్‌క్యాప్ విభాగానికి కేటాయింపులు 3 శాతంగా ఉన్నాయి. పెట్టుబడుల పరంగా బ్యాంకింగ్ అండ్ ఫైనాన్షియల్ స్టాక్స్‌కు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చింది. 28 శాతం ఈ రంగాల స్టాక్స్‌కు కేటాయించింది. ఆ తర్వాత హెల్త్‌కేర్, సేవలు, ఆటోమొబైల్, టెక్నాలజీ కంపెనీలకు ఎక్కువ కేటాయింపులు చేసింది. టాప్ ఈక్విటీ హోల్డింగ్స్ కంపెనీ పెట్టుబడుల శాతం హెచ్డీఎఫ్సీ బ్యాంకు 5.31 ఐసీఐసీఐ బ్యాంకు 4.65 ఇన్ఫోసిస్ 4.03 రిలయన్స్ ఇండస్ట్రీస్ 3.70 బజాజ్ ఫైనాన్స్ 3.37 యాక్సిస్బ్యాంకు 3.25 ఎస్బీఐ 2.75 మ్యాక్స్ హెల్త్‌కేర్ 2.36 మిండా ఇండస్ట్రీస్ 2.36 అవెన్యూ సూపర్‌మార్ట్స్ 2.11 -
దీర్ఘకాలానికి సురక్షితం!
ఇది దీర్ఘకాలికంగా మంచి పనితీరు కలిగిన లార్జ్‌క్యాప్ ఫండ్. గత ఐదేళ్ల పనితీరు కూడా ఆశాజనకంగానే ఉంది. 2008, 2011, 2013, 2016లో మార్కెట్ల డౌన్‌ట్రెండ్‌లో ఉన్నప్పుడు కూడా రాబడులు పడిపోకుండా చూసిన పథకమిది. అయితే మార్కెట్లు ర్యాలీ చేసినపుడు కూడా ఇది మరీ భారీ రాబడులేమీ ఇవ్వలేదు. పర్వాలేదనిపించే రాబడులనిచ్చింది. మోస్తరు రిస్క్ భరించేవారు, దీర్ఘకాలం పాటు ఇన్వెస్ట్ చేయాలని భావించే వారు పరిశీలించదగిన పథకాల్లో ఇదీ ఒకటి. పనితీరు ఎలా ఉందంటే... దీర్ఘకాలంలో ఈ పథకం పనితీరు బావుంది. కాకపోతే ఏడాది, రెండేళ్ల కాలంలో మాత్రం ఆశించిన మేర లేదు. లార్జ్‌క్యాప్ స్టాక్స్‌లో 80 శాతం వరకు పెట్టుబడులు పెడుతుంది. మిగిలిన నిధుల్ని మిడ్‌క్యాప్స్‌కు కేటాయిస్తుంది. రాబడుల కోసం అధిక వృద్ధికి అవకాశం ఉన్న బలమైన కంపెనీల్లో ఇన్వెస్ట్ చేస్తుంది. 5–10 ఏళ్ల కాలంలో రాబడులు బెంచ్ మార్క్‌తో ఇండెక్స్‌లతో పోలిస్తే 3–4 శాతం అధికంగానే ఉన్నాయి. అదే స్వల్పకాలంలో చూస్తే మాత్రం ఒకటి, రెండు శాతం తక్కువగా ఉన్నాయి. ఏడాది కాలంలో ఈ పథకం రాబడులు వార్షికంగా 9.5 శాతంగా ఉంటే, బెంచ్‌మార్క్ రాబడులు వార్షికంగా 14 శాతంగా ఉన్నాయి. మూడేళ్ల కాలంలో ఈ పథకం రాబడులు 9.2 శాతం కాగా, బెంచ్ మార్క్ రాబడులు 10.2 శాతంగా ఉన్నాయి. ఇక ఐదేళ్ల కాలంలో పథకం రాబడులు 16.4 శాతం అయితే, బెంచ్ మార్క్ రాబడులు 15.2 శాతమే. అంటే దీర్ఘకాలంలో ఈ పథకం బెంచ్‌మార్క్‌కు తగ్గకుండా రాబడులను ఇస్తుందని ఆశించవచ్చు. ఫైనాన్స్ షేర్లకు పెద్దపీట... ఈ పథకం ఎక్కువగా బ్యాంకులకు, ఫైనాన్స్ స్టాక్స్‌కు ప్రాధాన్యం ఇచ్చింది. బ్యాంకుల్లో 22.9 శాతం, ఫైనాన్స్ స్టాక్స్‌లో 11.8 శాతం, సాఫ్ట్‌వేర్‌లో 10.4 శాతం, కన్జూమర్ నాన్ డ్యూరబుల్ రంగం స్టాక్స్‌లో 10.3 శాతం, ఆటోమొబైల్స్‌లో 7.2 శాతం, ఫార్మాలో 4.8 శాతం చొప్పున ఎక్స్పోజర్ కలిగి ఉంది. ఈ పథకం పోర్ట్‌ఫోలియోలో భిన్న రంగాలకు చెందిన మొత్తం 77 స్టాక్స్ ఉన్నాయి. దీనివల్ల ఈ పథకం రిస్క్ తక్కువే అని చెప్పుకోవచ్చు. గత ఏడాది కాలంలో డాబర్ ఇండియా, ఇమామి, పీఎన్బీ, పీఎన్బీ హౌసింగ్ ఫైనాన్స్, ఓఎన్జీసీ తదితర కంపెనీలను పోర్ట్‌ఫోలియోకు యాడ్ చేసింది. గత ఏడాది కాలంలో బజాజ్ ఫైనాన్స్, చోళమండలం ఇన్వెస్ట్మెంట్, హెచ్‌యూఎల్, బ్రిటానియా, టైటాన్లో పెట్టుబడుల కారణంగా మంచి రాబడులను అందుకుంది. సెబీ మార్గదర్శకాలు సెబీ మార్గదర్శకాల ప్రకారం ఈ పథకం 80 శాతం నిధుల్ని లార్జ్‌క్యాప్‌లో ఇన్వెస్ట్ చేయాల్సి ఉంటుంది. మిగిలిన నిధుల్ని మిడ్‌క్యాప్, స్మాల్‌క్యాప్ స్టాక్స్, డెట్ సాధనాల్లో ఇన్వెస్ట్ చేయవచ్చు. గతంలో బీఎస్ఈ 200 ఈ పథకానికి ప్రామాణిక సూచీగా ఉంటే, మార్పుల అనంతరం జూన్ 4 నుంచి నిఫ్టీ 50 బెంచ్‌మార్క్‌గా మారింది. సెబీ మార్గదర్శకాలతో రిస్క్ ఇంకాస్త తగ్గింది. -
టర్మ్ పాలసీ ఎంతమొత్తానికి తీసుకోవాలి?
నా వయస్సు 47 సంవత్సరాలు. నాకు ముగ్గురు పిల్లలున్నారు. నేను టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలనుకుంటున్నాను. ఎంత మొత్తానికి తీసుకోవాలి? టర్మ్ బీమా ఎంచుకోవడానికి ఏ అంశాలను ముఖ్యంగా పరిగణనలోకి తీసుకోవాలి? –విరాట్ సాయి విశాఖపట్టణం టర్మ్ బీమా ఎంత మొత్తానికి తీసుకోవాలనే విషయం వ్యక్తికి, వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఒక్కో వ్యక్తి ఆదాయం, ఆర్థిక అవసరాలు, ఆ వ్యక్తిపై ఆర్థికంగా ఆధారపడి ఉన్న వ్యక్తులు, వారి ఆర్థిక అవసరాలు ఇలా వివిధ విషయాలను పరిగణనలోకి తీసుకొని ఎంత మొత్తానికి బీమా తీసుకోవాలో నిర్ణయించుకోవాలి. ఒక బండ సూత్రం ఏమిటంటే, మీ పదేళ్ల ఆదాయం ఎంత ఉంటుందో, అంత మొత్తానికి టర్మ్ బీమా తీసుకోవాలి. మీ విషయానికొస్తే, పదేళ్ల ఆదాయంతో పాటు, మీ ముగ్గురు పిల్లల చదువులకయ్యే ఖర్చులు, మీకు ఏమైనా రుణాలు ఉంటే వాటిని కూడా పరిగణనలోకి తీసుకోవాలి. ఇక మంచి టర్మ్ ప్లాన్‌ను ఎంచుకోవడానికి రెండు ముఖ్యమైన అంశాలు చూడాలి. మొదటిది క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియా. ఏ బీమా కంపెనీ క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో అధికంగా ఉంటుందో ఆ కంపెనీ నుంచి టర్మ్ బీమా పాలసీ తీసుకోవాలి. ఇక రెండో అంశం.. చెల్లించాల్సిన ప్రీమియమ్. సాధారణంగా టర్మ్ బీమా పాలసీల ప్రీమియమ్‌లు తక్కువగానే ఉంటాయి. ఒకే బీమా మొత్తానికి వివిధ బీమా కంపెనీల ప్రీమియమ్‌లు వేర్వేరుగా ఉంటాయి. తక్కువ ప్రీమియమ్‌తో కూడిన బీమా పాలసీలను ఆఫర్ చేసే కంపెనీని ఎంచుకోవాలి. వివిధ బీమా సంస్థల క్లెయిమ్స్ సెటిల్మెంట్ రేషియో, ప్రీమియమ్ విషయాలను సులభంగా పోల్చి చూసుకునే వెసులుబాటు ఇప్పుడు ఆన్లైన్లో అందుబాటులో ఉంది. ఇలా పోల్చిచూసుకుని మీ ఆర్థిక అవసరాలకు తగ్గట్లుగా మంచి టర్మ్ బీమా పాలసీని ఎంచుకోండి. టర్నోవర్ రేషియో అంటే ఏమిటి? ఇన్వెస్ట్మెంట్ కోసం ఒక ఫండ్‌ను ఎంచుకునేటప్పుడు ఈ టర్నోవర్ రేషియోను కూడా పరిగణనలోకి తీసుకోవాలా ? –ఆనంద్, విజయవాడ ఒక మ్యూచువల్ ఫండ్..తన పోర్ట్‌ఫోలియోతో ప్రతి ఏడాది మార్చిన షేర్ హోల్డింగ్స్ శాతాన్ని టర్నోవర్ రేషియోగా పరిగణిస్తారు. ఉదాహరణకు ఒక మ్యూచువల్ ఫండ్ టర్నోవర్ రేషియో 31 శాతంగా ఉందనుకోండి. అంటే దానర్ధం.. ఒక ఏడాది కాలంలో ఆ ఫండ్ షేర్‌హోల్డింగ్స్‌లో మార్పులు 31 శాతం వున్నాయని అర్థం. టర్నోవర్ రేషియో అధికంగా ఉంటే.., ఇన్వెస్టర్లపై వ్యయాల భారం అధికంగా ఉంటుంది. షేర్ల కొనుగోళ్లు, విక్రయాలపై కొన్ని చార్జీలు, వ్యయాలు, పన్నులు ఉంటాయి కదా! అయితే ఈక్విటీ ఫండ్స్ విషయానికొస్తే, సరైన ధరలో సరైన షేర్లను ఎంచుకోవడం, ఏ ధర వద్ద ఏ ఏ షేర్ల నుంచి వైదొలగడం.. ఇవన్నీ కీలకమైన అంశాలు. ఇవన్నీ సమర్థవంతంగా జరిగితే ఇన్వెస్టర్లకు మంచి రాబడులు వస్తాయి. టర్నోవర్ రేషియో తక్కువగా ఉండి, మంచి రాబడులు వస్తే.. అది ఒక ఫండ్‌ను ఎంచుకోవడానికి ముఖ్యమైన అంశంగా పరిగణించవచ్చు. కానీ ఒక్కోసారి టర్నోవర్ రేషియో ఎక్కువగా ఉండే అవకాశాలు ఉండొచ్చు. ఉదాహరణకు ఒక ఫండ్‌ను ఇన్వెస్టర్లు తరచుగా అమ్మకాలు, కొనుగోళ్లు చేస్తూ ఉంటే, ఫండ్ మేనేజర్స్ తప్పనిసరిగా ఫండ్ పోర్ట్‌ఫోలియోలో ఉండే షేర్లను మార్చాల్సి రావచ్చు. అయితే ఒక మ్యూచువల్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయడానికి టర్నోవర్ రేషియో అంత కీలకమైన అంశం కాదు. ఆ ఫండ్ గత కొన్నేళ్లలో ఎలాంటి రాబడులు ఇచ్చింది, ఇదే కేటగిరీలోని ఇతర ఫండ్స్ ఎలాంటి రాబడులు ఇచ్చాయి. తదితర అంశాలను బేరీజు వేసుకొని నిర్ణయం తీసుకోవాలి. పన్ను ప్రయోజనాల కోసం పలువురు ఇన్వెస్టర్లు ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)లో ఇన్వెస్ట్ చేస్తారు. అయితే నాకు పన్ను ప్రయోజనాలు అవసరం లేదు. పన్ను ప్రయోజనాలు ప్రాధాన్యత అంశంగా కాకుండా ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. నాది సరైన నిర్ణయమేనా ? –నాగేశ్వరరావు, హైదరాబాద్ పన్ను ప్రయోజనాలు ప్రాధాన్యత అంశం కానప్పుడు ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేయడం సరైన నిర్ణయం కాదని చెప్పవచ్చు. ఎందుకంటే ఈఎల్ఎస్ఎస్లకు లాక్ ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంటుంది. మూడేళ్లలోపు ఇన్వెస్టర్లు తమ పెట్టుబడులను ఉపసంహరించుకోరు, కాబట్టి దీర్ఘకాలం దృష్టిలో పెట్టుకొని ఫండ్ మేనేజర్ పెట్టుబడి నిర్ణయాలు తీసుకుంటారు. అయితే ఇలాంటి పన్ను ఆదాయ ఫండ్స్, సాధారణ ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్ కంటే మంచి రాబడులను ఇచ్చిన దాఖలాలు అయితే లేవు. ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేస్తే..మీ పెట్టుబడులు అనవసరంగా మూడేళ్లు లాక్ అవుతాయి. మీ పెట్టుబడులకు ఈ అనవసర లాక్ ఇన్ పీరియడ్ అవసరమా అని మీరు ఆలోచించుకోండి. పన్ను ఆదా, పన్ను ప్రయోజనాలు మీకు అవసరం లేనప్పుడు, మీరు ఇన్వెస్ట్ చేయడానికి ఈఎల్ఎస్ఎస్ కాకుండా మరెన్నో ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. ఏదైనా మంచి ఈక్విటీ లేదా బ్యాలన్స్డ్ ఫండ్స్‌ను ఎంచుకొని, దాంట్లో ఇన్వెస్ట్ చేయండి. సంవత్సరం దాటిన తర్వాత కావాలనుకుంటే ఈ ఫండ్ యూనిట్లను విక్రయించి, మీ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను వెనక్కి తీసుకోవచ్చు. పైగా ఎలాంటి పన్ను భారం ఉండదు. అదే ఈఎల్ఎస్ఎస్ల్లో ఇన్వెస్ట్ చేశారనుకోండి. మూడేళ్ల తర్వాతనే మీ ఇన్వెస్ట్మెంట్స్ మీరు తీసుకోవడానికి వీలుంటుంది. -
లార్జ్ క్యాప్ ఫండ్‌ను ఎంచుకోవడం ఎలా?
నేను 2004లో నా కొడుకు పేరు మీద బిర్లా సన్ లైఫ్ ఫ్లెక్సి సేవ్ ప్లస్ ఎండోమెంట్ ప్లాన్‌ను తీసుకున్నాను. ఏడాదికి రూ.50,000 చొప్పున 19 సంవత్సరాల పాటు ప్రీమియమ్ చెల్లించాల్సి ఉంటుంది. గత మూడేళ్ల నుంచి ప్రీమియమ్ చెల్లించడం లేదు. ఇప్పటిదాకా రూ.6 లక్షల వరకూ ప్రీమియమ్ చెల్లించాను. ఈ ప్లాన్‌ను సరెండర్ చేస్తే ఇప్పుడు నాకు రూ.6,70,000 వస్తాయి. ఈ ప్లాన్‌ను సరెండర్ చేయమంటారా? లేక కొనసాగించమంటారా? –రమేశ్, విజయవాడ బీమా తీసుకున్న వ్యక్తి మరణిస్తే, ఆ వ్యక్తిపై ఆధారపడిన కుటుంబం ఆర్థిక అవసరాలు తీర్చడం బీమా ముఖ్య ఉద్దేశం. అందుకని మీ కొడుకు పేర బీమా పాలసీ తీసుకోవడం సరైనది కాదు. బీమా కావలసినది మీకు. మీ కొడుకు ఆర్థికంగా ప్రయోజకుడు అయ్యేంత వరకూ మీ కుటుంబం, అతడి ఆర్థిక అవసరాలు తీర్చడం కోసం మీకు బీమా అవసరం. అందుకుని మీరు తక్షణం టర్మ్ బీమా ప్లాన్ తీసుకోండి. ఇక బిర్లా సన్‌లైఫ్ ఎండోమెంట్ ప్లాన్ విషయానికొస్తే, ఇదొక యూనిట్ లింక్డ్ ఇన్కమ్ ప్లాన్(యులిప్). ఇన్వెస్ట్మెంట్ కలగలసిన బీమా ప్లాన్ ఇది. ఇవి తక్కువ బీమా కవరేజ్‌ను, తక్కువ రాబడులను ఇస్తాయి. మీ విషయమై తీసుకుంటే పన్నేండేళ్ల కాలంలో మీరు ఇప్పటిదాకా రూ.6 లక్షల వరకూ ప్రీమియమ్ చెల్లించారు. మీ ఇన్వెస్ట్మెంట్ విలువ రూ.6.70,000గానే ఉంది. ఇది బ్యాంక్ సేవింగ్స్ ఖాతా కంటే తక్కువ రాబడి. అందుకని ఈ పాలసీని సరెండర్ చేయడమే ఉత్తమం. మీరు ఈ ప్లాన్ తీసుకొని ఐదేళ్లు దాటినందున ఎలాంటి సరెండర్ చార్జీలు లేకుండానే ఈ ప్లాన్‌ను సరెండర్ చేయవచ్చు. మీరు సరెండర్ చేసేటప్పుడు ఈ ఫండ్ విలువ ఎంత ఉంటుందో అదే మీ సరెండర్ వేల్యూ అవుతుంది. ఈ పాలసీని సరెండర్ చేసి దీనికి చెల్లించే రూ.50,000 మొత్తాన్ని ఈక్విటీ మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయండి. ఏదైనా 2–4 డైవర్సిఫైడ్ మ్యూచువల్ ఫండ్స్‌ను ఎంచుకొని వాటిల్లో ఈ మొత్తాన్ని ఇన్వెస్ట్ చేస్తే దీర్ఘకాలంలో మంచి రాబడులు పొందవచ్చు. ఇప్పుడు మీరు ఫండ్స్‌లో చేసే ఈ ఇన్వెస్ట్మెంట్స్.. రేపు మీ అబ్బాయి ఉన్నత విద్యాభ్యాసానికి, ఇతర అవసరాలకు పనికివస్తాయి. నేను నెలకు రూ.10,000 చొప్పున ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)ల్లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే వీటికి మూడేళ్ల లాక్–ఇన్ పీరియడ్ ఉంటుంది కదా! ఒకవేళ ఈ లాక్ ఇన్ పీరియడ్ కంటే ముందే నాకు డబ్బులు అవసరమైతే నేను విత్‌డ్రా చేసుకునే వీలు ఉందా? –రాఘవ, విశాఖ పట్టణం పన్ను ఆదా చేసే ప్రతి ఇన్వెస్ట్మెంట్ ప్లాన్‌కు లాక్–ఇన్ పీరియడ్ తప్పనిసరి. మీరు ఇన్వెస్ట్ చేయాలనుకుంటున్న ఈక్విటీ లింక్డ్ సేవింగ్స్ స్కీమ్స్(ఈఎల్ఎస్ఎస్)కు లాక్–ఇన్ పీరియడ్ మూడేళ్లుగా ఉంది. అంటే మీరు ఇన్వెస్ట్ చేసిన మూడేళ్ల తర్వాత మాత్రమే ఈ ఇన్వెస్ట్మెంట్స్ ఉపసంహరించుకునే వీలు ఉంది. అంతకంటే ముందే ఈ ఇన్వెస్ట్‌మెంట్స్‌ను ఉపసంహరించుకునే వీలు లేదు. నేను కొంత మొత్తం ప్రతి నెలా ఏదైనా ఒక లార్జ్ క్యాప్ ఫండ్‌లో ఇన్వెస్ట్ చేద్దామనుకుంటున్నాను. అయితే ప్రతి లార్జ్ క్యాప్ ఫండ్స్ పోర్ట్‌ఫోలియో దాదాపు ఒకే విధంగా ఉంటున్నాయి. వీటిల్లోంచి ఉత్తమమైన ఫండ్‌ను ఎలా ఎంచుకోవాలి? –నాని, హైదరాబాద్ ఏదైనా ఫండ్‌లో ఇన్వెస్ట్ చేయాలనుకుంటే, ఆ ఫండ్ పోర్ట్‌ఫోలియోను బట్టి ఇన్వెస్ట్ చేయకూడదు. దీర్ఘకాలంలో ఆయా ఫండ్స్ ఇచ్చిన రాబడులను పరిశీలించాలి. అంతేకాకుండా దీర్ఘకాలంలో ఆ ఫండ్స్ ఏ మేరకు ఒడిదుడుకులకు గురయ్యాయో చూడాలి. దాదాపు 70–80 వరకూ లార్జ్‌క్యాప్ ఫండ్స్ అందుబాటులో ఉన్నాయి. అయితే వీటిల్లో 20–30 వరకూ ఫండ్స్ ఇండెక్స్ స్థాయి రాబడులను కూడా ఇవ్వడం లేదు. కేవలం కొన్ని ఫండ్స్ మాత్రమే 5–10 ఏళ్ల కాలానికి 10 శాతానికి మించి రాబడులనిస్తున్నాయి. ఈ ఫండ్స్ పోర్ట్‌ఫోలియోలు ఒకే విధంగా ఉన్నప్పటికీ, రాబడుల్లో తేడాలుంటున్నాయి. ఒక షేర్‌ను ఎప్పుడు కొనాలో, ఎప్పుడు అమ్మేయాలో, ఎంత కాలం పోర్ట్‌ఫోలియోలో కొనసాగించాలో.. తదితర అంశాలన్నీ ఫండ్ పనితీరుపై ప్రభావం చూపుతాయి. కాబట్టి ఫండ్ పోర్ట్‌ఫోలియోను కాకుండా, ఫండ్ గత కాలపు పనితీరును బట్టి ఇన్వెస్ట్మెంట్ నిర్ణయాలు తీసుకోవాలి. నేను కెనాడాలో పనిచేస్తున్నాను. ఒక ప్రవాస భారతీయుడిగా నేను భారత మ్యూచువల్ ఫండ్స్‌లో ఇన్వెస్ట్ చేయవచ్చా? –అగర్వాల్, ఈ మెయిల్ ద్వారా చాలా మ్యూచువల్ ఫండ్స్ అమెరికా, కెనడాల్లో పనిచేస్తున్న ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్మెంట్స్ తీసుకోవడం ఆపేస్తున్నాయి. కొన్ని శాసనపరమైన నిబంధనల వల్ల పలు మ్యూచువల్ ఫండ్స్ అమెరికా, కెనడాల్లో ఉంటున్న ప్రవాస భారతీయుల ఇన్వెస్ట్‌మెంట్స్‌ను అంగీకరించడం లేదు. ప్రవాస భారతీయులతో సహా అమెరికా, కెనడాల్లో నివసించే వ్యక్తులు జరిపే ఆర్థిక లావాదేవీలను ప్రపంచంలోని అన్ని ఆర్థిక సంస్థలు అమెరికా, కెనడా ప్రభుత్వాలకు నివేదించాలని ఫారిన్ అకౌంట్ ట్యాక్స్ కంప్లయన్సెస్ యాక్ట్(ఫ్యాట్కా) తప్పనిసరి చేసింది. అయితే గత ఏడాది డిసెంబర్ నాటికి అమెరికా, కెనడాల్లోని ప్రవాస భారతీయుల నుంచి ఇన్వెస్ట్‌మెంట్స్‌ను కొన్ని భారత ఫండ్స్ అంగీకరిస్తున్నాయి. ఆ ఫండ్స్ వివరాలు.., బిర్లా సన్‌లైఫ్ మ్యూచువల్ ఫండ్, ఎస్బీఐ మ్యూచువల్ ఫండ్, యూటీఐ మ్యూచువల్ ఫండ్, ఐసీఐసీఐ ప్రుడెన్షియల్ మ్యూచువల్ ఫండ్, డీహెచ్ఎఫ్ఎల్ ప్రమెరికా మ్యూచువల్ ఫండ్, ఎల్ అండ్ టీ మ్యూచువల్ ఫండ్, పీపీఎఫ్ఏఎస్ మ్యూచువల్ ఫండ్, సుందరమ్ మ్యూచువల్ ఫండ్.