Large majority
-
ఛత్తీస్‌గఢ్: గిరిజన ప్రాంతాల్లో స్వీప్
ఛత్తీస్‌గఢ్ అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ అధికారాన్ని నిలబెట్టుకుంటుందన్న పోల్ పండితుల అంచనాలను, ఎగ్జిట్ పోల్స్‌ను బీజేపీ తలకిందులు చేసింది. సునాయాసంగా మెజారిటీ మార్కు దాటేసి భూపేశ్ బఘేల్ సర్కారును గద్దె దించింది. ఐదు సంవత్సరాల విరామం అనంతరం తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయనుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకుగాను ఏకంగా 54 సీట్లు నెగ్గింది. రాష్ట్రంలో బీజేపీకి ఇదే అత్యధిక మెజారిటీ కావడం విశేషం. గిరిజన ప్రాంతాలైన సర్గుజా, బస్తర్‌లను ఏకపక్షంగా కొల్లగొట్టడమే బీజేపీ విజయానికి ప్రధాన కారణంగా నిలిచింది. బస్తర్, సర్గుజాలో హవా ఛత్తీస్‌గఢ్‌లో తాజాగా వెల్లడైన అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు కాంగ్రెస్‌కు షాకివ్వడం నిజమే అయినా బీజేపీని కూడా ఒకింత విస్మయపరిచాయనే చెప్పాలి. ఎందుకంటే బఘేల్ సర్కారు ఐదేళ్ల పాలనపై ప్రజల్లో ఎక్కడా పెద్దగా వ్యతిరేకత వ్యక్తం కాలేదు. అందుకు ప్రధానంగా ఆయన పక్కాగా అమలు చేసిన పలు సంక్షేమ, ప్రజాకర్షక పథకాలే కారణంగా నిలిచాయి. ముఖ్యంగా 2018లో రాష్ట్ర చరిత్రలోనే భారీ మెజారిటీతో అధికారంలోకి రాగానే బఘెల్ ప్రవేశపెట్టిన వరికి బోనస్ పథకం రాష్ట్రంలో సూపర్‌హిట్టయింది. వరికి దేశంలోనే అత్యధిక బోనస్ ఇస్తున్న రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. పారీ్టలకతీతంగా అర్హులందరికీ పథకం ఫలాలు అందేలా బఘేల్ జాగ్రత్తలు తీసుకున్నారు. ఈ నేపథ్యాన్ని బట్టి చూస్తే ఈసారి బీజేపీ గెలుపు అందరినీ ఆశ్చర్యపరిచిన పరిణామమే. గిరిజన ప్రాంతాల్లో అసెంబ్లీ స్థానాలన్నింటినీ ఈసారి బీజేపీ ఏకపక్షంగా ఒడిసిపట్టడమే దాని మెజారిటీకి ప్రధాన కారణంగా నిలిచింది. దక్షిణ ఛత్తీస్‌గఢ్‌లోని బస్తర్, ఉత్తరాదిన ఉన్న సర్గుజా రెండూ బీజేపీకి జైకొట్టాయి. బస్తర్‌లోని 12 స్థానాలకు గాను బీజేపీకి 9 స్థానాలు దఖలుపడ్డాయి. సర్గుజాలోనైతే మొత్తం 14 సీట్లను గాను బీజేపీ ఏకంగా 13 స్థానాలను దక్కించుకుంది. ఈ ప్రాంతం ఉప ముఖ్యమంత్రి టీఎస్ సింగ్‌దేవ్ కంచుకోట కావడం విశేషం. రాజవంశీకుడైన ఆయన 2018 అసెంబ్లీ ఎన్నికల్లో ఆయన ప్రభావంతో సర్గుజా ప్రాంతంలో కాంగ్రెస్ హవా కొనసాగింది. ఆనాడు 14 స్థానాలకుకుగాను కాంగ్రెస్‌కు 12 సీట్లు దక్కాయి. ఈసారి పరిస్థితి దాదాపుగా తారుమారవడం విశేషం. ఇక్కడ బీజేపీ హవా దెబ్బకు చివరికి సింగ్‌దేవ్ సైతం ఓటమి చవిచూశారు. బస్తర్‌లో మాత్రం 3 స్థానాలతో కాంగ్రెస్ ఉనికి నిలుపుకోగలిగింది. రాజధాని ప్రాంతంలో కాంగ్రెస్‌కు మొగ్గు ► గిరిజన ప్రాంతాలతో పోలిస్తే రాజధాని రాయ్‌పూర్ ప్రాంతంలో మాత్రం కాంగ్రెస్ మెరుగైన ప్రదర్శనే చేసింది. ►ఇక్కడి 20 స్థానాల్లో ఆ పార్టీ 11 సీట్లు నెగ్గింది. బీజేపీకి 9 స్థానాలు దక్కాయి. ►బిలాస్పూర్ ప్రాంతంలో బీజేపీ 13, కాంగ్రెస్ 10 చోట్ల గెలిచింది. పాలి తనఖర్లో గోండ్వానా గణతంత్ర పార్టీ గెలిచింది. ►దుర్గ్ ప్రాంతంలోనూ 20 స్థానాలుండగా బీజేపీ, కాంగ్రెస్ చెరో పదింటిని గెలుచుకున్నాయి. – సాక్షి, నేషనల్ డెస్క్ -
తాటాకు చప్పుళ్లకు బెదరం: కిషన్‌రెడ్డి
సంగారెడ్డి/రామచంద్రాపురం: టీఆర్ఎస్ తాటాకు చప్పుళ్లకు భయపడబోమని, మెదక్ లోక్‌సభ ఉప ఎన్నికలో తమ పార్టీ అభ్యర్థి భారీ మెజార్టీతో గెలుపొందడం ఖాయమని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. మెదక్ జిల్లా సంగారెడ్డి, రామచంద్రాపురంలలో బుధవారం జరిగిన కార్యక్రమాల్లో ఆయన మాట్లాడారు. వంద రోజుల టీఆర్ఎస్ పాలనలో ప్రజలకు ఏం చేసిందో కేసీఆర్ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సర్వేల పేరుతో తెలంగాణ ప్రజల్లో భయానక వాతావరణం సృష్టించారన్నారు. కొత్త సంక్షేమ పథకాలు అమలు కాకపోగా ఉన్న రేషన్‌కార్డులు, పింఛన్లు, ఇళ్లు తొలగించడానికి కుట్ర పన్నుతున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి సొంత జిల్లాలోనే రైతులు ఆత్మహత్యలు చేసుకోవడం సిగ్గుచేటని కిషన్‌రెడ్డి పేర్కొన్నారు. -
వార్ వన్ సైడే..
సాక్షి, మచిలీపట్నం/ అవనిగడ్డ, న్యూస్‌లైన్ : వార్ వన్‌సైడ్ అయ్యింది.. మెజార్టీ కూడా బాగానే వచ్చింది.. సాధించిన విజయంతో టీడీపీ జబ్బలు చరుచుకుంటోంది.. అసలు సంగతేంటంటే అవనిగడ్డలో తెలుగుదేశం పార్టీకి రానున్నది గడ్డుకాలమేనన్న సంగతి తేటతెల్లమవుతోంది. ఎన్నికలు జరిగిన తీరును, స్వతంత్రులకు పోలైన ఓట్లను నిశితంగా గమనిస్తే టీడీపీకి రానున్న కాలంలో ఎదురుగాలి తప్పదనే సంకేతాలు వెలువడినట్టు అయ్యింది. తమ స్థానాన్ని పదిలపర్చుకునేందుకు సానుభూతి మంత్రాన్ని జపించినా, టీడీపీకి ప్రధాన పార్టీలు పోటీ లేకపోయినా స్వతంత్రులతో అవస్థలు తప్పలేదు. నామమాత్రపు పోటీలోనూ దివిసీమలోని ఒక కీలక సామాజిక వర్గం స్వతంత్రులకు అనుకూలంగా ఓటేసింది. అదే ప్రధాన పార్టీలు బరిలో ఉంటే టీడీపీకి అడ్రస్ గల్లంతయ్యే ప్రమాదం కూడా ఉందన్న సంగతిని ఉప ఎన్నికల ఫలితాలు చెప్పకనే చెబుతున్నాయి. భారీ మెజారిటీ.. అవనిగడ్డ ఉప ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుపొందింది. టీడీపీ అభ్యర్థి అంబటి శ్రీహరిప్రసాద్‌కు 75,282 ఓట్లు వచ్చాయి. స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు పోలయ్యాయి. మరో స్వతంత్ర అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యంకు 3,389 ఓట్లు వచ్చాయి. గత సార్వత్రిక ఎన్నికల్లో అంబటి బ్రహ్మణయ్యకు పోలైన మొత్తం ఓట్లకంటే ప్రస్తుత ఉప ఎన్నికల్లో శ్రీహరిప్రసాద్‌కు వచ్చిన మెజార్టీయే ఎక్కువని, పోటీ ఏకపక్షం అయ్యిందని టీడీపీ శ్రేణులు ఆనందోత్సాహాల్లో మునిగిపోయాయి. 2009 సార్వత్రిక ఎన్నికల్లో అంబటి బ్రాహ్మణయ్యకు మొత్తం 55,314 ఓట్లు వచ్చాయి. అంతకంటే ఎక్కువగా ఇప్పుడు శ్రీహరిప్రసాద్‌కు 61,644 ఓట్ల మెజార్టీ వచ్చింది. చెమటోడ్చిన నేతలు.. అంబటి బ్రాహ్మణయ్య మృతితో జరిగిన ఈ ఎన్నికల్లో సానుభూతి మంత్రాన్ని జపించిన టీడీపీ తొలి నుంచి ఏకగ్రీవం పైనే ఆశపెట్టుకున్నా ఫలించలేదు. ప్రధాన పార్టీలు పోటీచేయకపోయినా స్వతంత్రులు మాత్రం పోటీకి నిలిచారు. కొంతమందిని బతిమాలో, బుజ్జగించో ఉపసంహరింపజేసినా ఇద్దరు అభ్యర్థులు మాత్రం బరిలో కొనసాగారు. ఏకగ్రీవం కావాల్సిన స్థానం ఎన్నికల వరకు రావడంతో టీడీపీ నేతల్లో గుబులు మొదలైంది. గెలుపు ఖాయం కావాల్సిన స్థానంలో అనుకోనిది ఏదైనా జరిగినా, మెజారిటీ తగ్గినా పార్టీ పరువు పోతుందనే సంశయంతో ఆ పార్టీ నేతలు చెమటోడ్చాల్సి వచ్చింది. పార్టీ జిల్లా కన్వీనర్ ఉమ సహా జిల్లా స్థాయి నాయకులు ఆరు మండలాల బాధ్యతలు ఒక్కొక్కరు తీసుకుని ప్రచారం, పర్యవేక్షణ చేశారు. ఇక్కడ పోటీలో లేని కాంగ్రెస్ పార్టీ ఎన్నికల బహిష్కరణ పిలుపు ఇచ్చినప్పటికీ కాంగ్రెస్, టీడీపీ వ్యతిరేక ఓటర్లు మాత్రం పోలింగ్‌కు దూరంగా ఉండిపోయారు. సమైక్యాంధ్ర ఉద్యమం, ఎన్నికల బహిష్కరణ, మాగాణి పనులు వంటి కారణాలతో టీడీపీపై ఆసక్తిలేని వారంతా ఓటు హక్కు వినియోగించుకోలేదు. పోలైన మొత్తం ఓట్లలో అత్యధికం తెలుగుదేశం పార్టీ శ్రేణులు అత్యంత శ్రద్ధగా తమకు అనుకూలంగా వేయించుకున్నవే కావడం గమనార్హం. చివరికి సానుభూతి పవనాలు వీయడం, ప్రధాన పార్టీలు పోటీ చేయకపోవడం, ఇద్దరు స్వతంత్రులతో నామమాత్రంగానే పోటీ ఉండటం వంటి అంశాలు తెలుగుదేశం పార్టీకి కలిసి వచ్చాయి. పోటీ నామమాత్రమే అయినా.. నియోజకవర్గంలో అంబటి కుటుంబాన్ని, టీడీపీని వ్యతిరేకిస్తున్నవారు ఎన్నికలు జరగాలని కోరుకున్నా, ప్రధాన పార్టీలు పోటీ లేకపోవడంతో స్వతంత్రులను రంగంలోకి దించారు. స్వతంత్రులు సైతం గట్టి పోటీ ఇవ్వలేకపోవడంతో పోరు నామమాత్రంగానే మారింది. అయినా స్వతంత్రులకు ఇక్కడ పోలైన ఓట్లు కూడా చర్చనీయాంశమయ్యాయి. నామమాత్రపు పోటీలోనే స్వతంత్ర అభ్యర్థి సైకం రాజశేఖర్‌కు 13,638 ఓట్లు వచ్చాయి. నియోజకవర్గంలో ఒక సామాజికవర్గం ఓట్లు టీడీపీకి దూరమవుతున్నాయన్న వాదనను స్వతంత్ర అభ్యర్థికి వచ్చిన ఓట్లు తేటతెల్లం చేశాయి. వైఎస్సార్సీపీ గుర్తుగా ప్రచారంలో ఉన్న ఫ్యాన్‌ను ఈ ఎన్నికల్లో మరో స్వతంత్ర అభ్యర్థి రావు సుబ్రహ్మణ్యానికి ఎన్నికల అధికారులు కేటాయించారు. పెద్దగా ప్రయత్నం చేయకుండానే ఆ అభ్యర్థికి 3,389 ఓట్లు పడటం గమనార్హం.