Larson and Toubro
-
కార్పొరేట్ కంపెనీల్లో మాజీ బ్యూరోక్రాట్లు
న్యూఢిల్లీ: ప్రభుత్వ వర్గాల్లో పరపతి పెంచుకునే దిశగా కార్పొరేట్ కంపెనీలు మాజీ బ్యూరోక్రాట్లపై దృష్టి పెడుతున్నాయి. వ్యూహాత్మకంగా వారిని తమ సంస్థల్లో స్వతంత్ర డైరెక్టర్లుగా నియమించుకుంటున్నాయి. తాజాగా ఎఫ్ఎంసీజీ దిగ్గజం హిందుస్తాన్ యూనిలీవర్ (హెచ్‌యూఎల్) మాజీ రెవెన్యూ కార్యదర్శి తరుణ్ బజాజ్‌ను స్వతంత్ర డైరెక్టరుగా నియమించుకుంది. తద్వారా గత ఆరు నెలల వ్యవధిలో ఇలా ఒక మాజీ బ్యూరోక్రాట్‌ను నియమించుకున్న నిఫ్టీ 50 కంపెనీల్లో రెండోదిగాను, ఎఫ్ఎంసీజీ కంపెనీల్లో మూడోదిగాను నిలి్చంది. నిఫ్టీ కంపెనీ అయిన లార్సన్ అండ్ టూబ్రో అక్టోబర్‌లో ఇలా ఒకరిని తీసుకోగా, హెచ్‌యూఎల్ పోటీ సంస్థలైన డాబర్, కోల్గేట్–పామోలివ్ కూడా అదే బాటలో నడిచాయి. హెచ్‌యూఎల్‌లో ఇప్పటికే మాజీ బ్యూరోక్రాట్ అయిన సంజీవ్ మిశ్రా, ప్రభుత్వ రంగ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మాజీ చైర్మన్ ఓపీ భట్ స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. మాజీ బ్యూరోక్రాట్లకు ప్రభుత్వ వర్గాలతో ఉండే సన్నిహిత సంబంధాలను ఉపయోగించుకుని తమ పనులు జరిపించుకునే ఉద్దేశంతో కంపెనీలు ఇలా వారిని నియమించుకుంటూ ఉంటాయని సంబంధిత వర్గాలు తెలిపాయి. అన్ని లిస్టెడ్ కంపెనీల్లో 6 శాతం.. తగినంత స్థాయిలో స్వతంత్ర డైరెక్టర్లను నియమించుకోనందుకు గాను ప్రభుత్వ రంగ కంపెనీలకు ఒకవైపు అక్షింతలు పడుతుండగా.. మరోవైపు ప్రైవేట్ కంపెనీలు మాత్రం రిటైరైన బ్యూరోక్రాట్లను జోరుగా నియమించుకుంటున్నాయి. ప్రైమ్ డేటాబేస్ ప్రకారం ఈ ఆర్థిక సంవత్సరంలో ఇప్పటివరకు అన్ని లిస్టెడ్ కంపెనీల్లోని స్వతంత్ర డైరెక్టర్లలో మాజీ బ్యూరోక్రాట్ల వాటా 6 శాతంగా ఉంది. అదే మార్కెట్ క్యాపిటలైజేషన్‌పరంగా టాప్ 200 కంపెనీలను మాత్రమే తీసుకుంటే ఇది మరింత అధికంగా 13 శాతంగా ఉంది. నిఫ్టీ 50లో 26 పైచిలుకు సంస్థలు రిటైరైన బ్యూరోక్రాట్లను నియమించుకున్నాయి. ఐటీసీ, మారుతీ సుజుకీ, అదానీ ఎంటర్ప్రైజెస్, అదానీ పోర్ట్స్ అండ్ సెజ్, భారతి ఎయిర్టెల్, హిందాల్కో, హెచ్‌యూఎల్ మొదలైన సంస్థల్లో అత్యధిక సంఖ్యలో మాజీ బ్యూరోక్రాట్లు స్వతంత్ర డైరెక్టర్లుగా ఉన్నారు. వ్యక్తులవారీగా చూస్తే ఏఎన్ రాయ్ 7 సంస్థల్లో స్వతంత్ర డైరెక్టరుగా ఉండగా అమిత్ కిరణ్ దేవ్ (6 సంస్థల్లో), దీపా గోపాలన్ వాధ్వా.. దినేష్ కుమార్ మిట్టల్.. యూకే సిన్హా ..సుమిత్ బోస్ .. వీరయ్య చౌదరి కొసరాజు తలో అయిదు సంస్థల్లో, సుధా పిళ్లయ్ .. మీరా శంకర్ .. నిరుపమా రావు తలో 4 సంస్థల్లో ఇండిపెండెంట్ డైరెక్టర్లుగా ఉన్నారు. ఇక, అత్యధికంగా మాజీ బ్యూరోక్రాట్లు ఉన్న ప్రభుత్వ రంగయేతర సంస్థలను చూస్తే డాబర్ ఇండియాలో ఆరుగురు ఉన్నారు. ఐటీసీ, భారత్ రోడ్ నెట్వర్క్, అపోలో టైర్స్, సీసీఎల్ ప్రోడక్ట్స్ (ఇండియా)లో నలుగురు చొప్పున .. సెంచరీ ప్లైబోర్డ్స్ (ఐ), వెల్స్పన్ ఎంటర్ప్రైజెస్, లార్సన్ అండ్ టూబ్రో, రెలిగేర్ ఎంటర్‌ప్రైజెస్‌లో ముగ్గురు చొప్పున ఉన్నారు. -
ఎల్అండ్టీకి భోగాపురం ఎయిర్పోర్ట్ కాంట్రాక్ట్
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌లో భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయ ప్రాజెక్టు నిర్మాణ పనులకు సంబంధించి భారీ ఆర్డరు దక్కించుకున్నట్లు లార్సన్ అండ్ టూబ్రో (ఎల్అండ్టీ) ఒక ప్రకటనలో వెల్లడించింది. జీఎంఆర్ విశాఖపట్నం ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టు నుంచి విమానాశ్రయ ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, నిర్మాణ (ఈపీసీ) కాంట్రాక్టు తమ అనుబంధ సంస్థ ఎల్అండ్టీ కన్స్ట్రక్షన్కి లభించినట్లు వివరించింది. అయితే, కాంట్రాక్టు విలువ మాత్రం వెల్లడించలేదు. సాధారణంగా రూ. 2,500 కోట్ల నుంచి రూ. 5,000 కోట్ల శ్రేణిలోని కాంట్రాక్టులను కంపెనీ భారీ ఆర్డర్లుగా పరిగణిస్తుంది. ప్రాథమికంగా ఏటా 60 లక్షల మంది ప్రయాణికుల (ఎంపీఏ) హ్యాండ్లింగ్ సామర్థ్యంతో ప్రాజెక్టు నిర్మాణం ఉంటుందని, తర్వాత ఇది 12 ఎంపీఏకి పెరుగుతుందని సంస్థ తెలిపింది. కాంట్రాక్టు ప్రకారం ఏటీసీ టవర్, ఎయిర్‌ఫీల్డ్ అభివృద్ధి (3,800 మీటర్ల దక్షిణ రన్‌వే, ట్యాక్సీవే, యాప్రాన్, ఎయిర్‌ఫీల్డ్ గ్రౌండ్ లైటింగ్) మొదలైన పనులు చేయాల్సి ఉంటుందని ఎల్అండ్టీ పేర్కొంది. కంపెనీ ప్రస్తుతం హైదరాబాద్‌తో పాటు ఢిల్లీ, బెంగళూరు, చెన్నై వంటి నగరాల్లో భారీ విమానాశ్రయాల్లో నిర్మాణ పనులను నిర్వహిస్తోంది. -
లద్దాఖ్‌లో ‘వజ్ర’ రెజిమెంట్
న్యూఢిల్లీ: చైనా కవ్వింపు చర్యలతో భారత్ అప్రమత్తమైంది. వాస్తవా«దీన రేఖ వెంబడి డ్రాగన్ దేశం భారీగా సైన్యాన్ని ఆయుధ సంపత్తిని మోహరిస్తుండగా దీటుగా ప్రతిచర్యలు ప్రారంభించింది. లద్దాఖ్ సెక్టార్‌లోని ఫార్వర్డ్ ప్రాంతాల్లో మొట్టమొదటి కె–9 వజ్ర శతఘ్నులతో కూడిన బలగాలను తరలించింది. ఈ సెల్ఫ్ ప్రొపెల్డ్ శతఘ్నులకు 50 కిలోమీటర్ల దూరంలోని శత్రు లక్ష్యాలను ఛేదించే శక్తి ఉంది. ‘పర్వతప్రాంతాల్లోనూ కె–9 వజ్ర విజయవంతంగా పనిచేస్తున్నట్లు ప్రయోగ పరీక్షల్లో రుజువైంది. ఇటీవలే ఉత్పత్తయిన ఈ హొవిట్జర్ల మొత్తం రెజిమెంట్‌ను ఇక్కడ మోహరించాం. ఇవి చాలా సహాయకారిగా ఉంటాయి’అని ఆర్మీ చీఫ్ జనరల్ మనోజ్ ముకుంద్ తెలిపారని ఏఎన్ఐ వార్తా సంస్థ వెల్లడించింది. ‘చైనా వైపు పరిణామాలను నిత్యం కనిపెట్టి చూస్తున్నాం. తూర్పులద్దాఖ్‌తోపాటు, మన తూర్పు కమాండ్ పరిధిలో చైనా గణనీయంగా బలగాలను మోహరించింది. ఇది చాలా ఆందోళన కలిగించే అంశం. ఈ పరిస్థితుల్లో ఎలాంటి దుందుడుకు చర్యనైనా తిప్పికొట్టేందుకు ఉపక్రమించాం. ఆర్మీ, ఆయుధ సంపత్తి మోహరింపుతోపాటు మౌలిక సౌకర్యాలను మెరుగుపరిచాం’అని ఆర్మీ చీఫ్ వెల్లడించారు. కాగా, దక్షిణకొరియా తయారీ కె–9 థండర్‌కు దేశీయంగా అభివృద్ధి చేసిన రూపమే కె–9 వజ్ర. ఈ శతఘ్నులను ముంబైకి చెందిన లార్సెన్ అండ్ టూబ్రో సంస్థ దక్షిణకొరియా సంస్థ భాగస్వామ్యంతో ఉత్పత్తి చేస్తోంది. భారత్–చైనాల మధ్య వాస్తవా«దీన రేఖ వెంబడి 3,488 కిలోమీటర్ల మేర వివాదం నడుస్తోంది. అరుణాచల్‌ప్రదేశ్ కూడా తనదేననీ, అది దక్షిణ టిబెట్‌లోని భాగమేనని చైనా వాదిస్తుండగా భారత్ ఖండిస్తోంది. గత ఏడాది పాంగాంగో సరస్సు ప్రాంతంలో జరిగిన తీవ్ర ఘర్షణల అనంతరం సరిహద్దుల్లో ప్రతిష్టంభన కొనసాగుతోంది. రెండు వైపులా వేలాదిగా బలగాలను సరిహద్దుల్లోకి తరలించాయి. -
ఎల్అండ్టీ లాభం 37 శాతం జూమ్..
ముంబై: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడో త్రైమాసికంలో ఇంజనీరింగ్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) నికర లాభం 37 శాతం ఎగిసి రూ. 1,490 కోట్ల నుంచి రూ. 2,042 కోట్లకు చేరింది. అటు ఆదాయం 24 శాతం వృద్ధితో రూ. 28,747 కోట్ల నుంచి రూ. 35,709 కోట్లకు పెరిగింది. సమీక్షాకాలంలో కొత్తగా రూ. 42,233 కోట్ల ఆర్డర్లు దక్కించుకున్నట్లు సంస్థ సీఎఫ్‌వో ఆర్ శంకర రామన్ తెలిపారు. గత ఆర్థిక సంవత్సరం ఇదే వ్యవధిలో వచ్చిన కొత్త ఆర్డర్లు రూ. 48,130 కోట్లని పేర్కొన్నారు. మూడో త్రైమాసికంలో కొత్త ఆర్డర్ల రాక 12 శాతం తగ్గినప్పటికీ.. తొమ్మిది నెలల వ్యవధిలో చూస్తే 16 శాతం వృద్ధి ఉందని ఆయన వివరించారు. అంతర్జాతీయంగా ఒడిదుడుకుల పరిస్థితులు ఉన్నప్పటికీ.. ఆర్డర్ల సంఖ్య 30 శాతం మేర పెరిగిందన్నారు. డిసెంబర్ 31 నాటికి మొత్తం రూ. 2,84,049 కోట్ల ఆర్డర్లు చేతిలో ఉన్నాయని చెప్పారు. మరోవైపు, ప్రతిపాదిత రూ. 9,000 కోట్ల షేర్ల బైబ్యాక్ ఆఫర్‌ను సెబీ తిరస్కరించడంపై స్పందించిన సీఈవో ఎస్ఎన్ సుబ్రమణ్యన్.. ఈ విషయంపై సెబీతో చర్చించనున్నట్లు తెలిపారు. వాటాదారులకు అధిక ప్రయోజనం చేకూర్చడమే తమ ఉద్దేశమన్నారు. బీఎస్ఈలో సంస్థ షేరు 0.85 శాతం క్షీణించి రూ. 1,285.55 వద్ద క్లోజయ్యింది. -
ఎల్ అండ్ టీ లాభం 29 శాతం అప్
న్యూఢిల్లీ: ఇంజనీరింగ్, కన్స్ట్రక్షన్ దిగ్గజం లార్సన్ అండ్ టూబ్రో (ఎల్ అండ్ టీ) కన్సాలిడేటెడ్ నికరలాభం 2017 మార్చితో ముగిసిన త్రైమాసికంలో 29.5 శాతం వృద్ధిచెంది రూ. 3,025 కోట్లకు చేరింది. గతేడాది ఇదేకాలంలో కంపెనీ రూ. 2,335 కోట్ల కన్సాలిడేటెడ్ నికరలాభాన్ని ఆర్జించింది. తాజాగా ముగిసిన త్రైమాసికంలో కన్సాలిడేటెడ్ స్థూల ఆదాయం 12 శాతం వృద్ధితో రూ. 36,828 కోట్లకు పెరిగినట్లు కంపెనీ విడుదల చేసిన ప్రకటన తెలిపింది. సోమవారం సమావేశమైన కంపెనీ డైరెక్టర్ల బోర్డు 1:2 నిష్పత్తిలో బోనస్ షేర్లను (2 షేర్లకు ఒక బోనస్ షేరు) సిఫార్సుచేసింది. కొత్త ఆర్డర్ల విలువ చూస్తే.. 2017 మార్చి క్వార్టర్లలో తమకు రూ. 47,289 కోట్ల విలువైన ఆర్డర్లు వచ్చాయని, ఆర్డర్ ఫ్లో 9 శాతం పెరిగిందని కంపెనీ పేర్కొంది. ఇందులో అంతర్జాతీయ ఆర్డర్ల విలువ రూ. 9,044 కోట్లు వుంది. దీంతో తమ కన్సాలిడేటెడ్ ఆర్డర్ బుక్ 5% వృద్ధితో రూ. 2,61,341 కోట్లకు చేరినట్లు కంపెనీ వివరించింది. ఆర్థిక వ్యవస్థ మెరుగుదల..: డీమోనిటైజేషన్‌తో ఇబ్బందులను అధిగమించడంతో పాటు వ్యవస్థాగత సంస్కరణల తోడ్పాటుతో భార త్ ఆర్థిక వ్యవస్థ రికవరీ అవుతున్నదని ఎల్ అండ్ టీ అభిప్రాయపడింది. తమ ఇన్ఫ్రా విభాగం ముగిసిన ఆర్థిక సంవత్సరంలో 8%వృద్ధితో రూ. 52,924 కోట్ల ఆదాయాన్ని సాధించిందని ఎల్ అండ్ టీ వివరించింది. మార్కెట్ ముగిసిన తర్వాత ఎల్ అండ్ టీ ఫలితాలు వెల్లడికాగా, ఫలితాల నేపథ్యంలో ఈ షేరు స్వల్ప పెరుగుదలతో రూ. 1,788 వద్ద ముగిసింది.