LAS
-
వందల సంఖ్యల్లో రాతి బంతులు..అవి ఏంటన్నది నేటికి అంతుచిక్కని మిస్టరీ!
స్పష్టత లేని ప్రతి ఆధారం.. సమాధానం లేని ప్రశ్నే అవుతుంది. అలాంటి అంతుబట్టిన ఆనవాళ్లు.. అంతుచిక్కని ఆకారాలు ఈ ప్రపంచంలో చాలానే ఉన్నాయి. అందులో ‘బోలాస్ డి పిడ్రా’ హిస్టరీ ఒకటి. బోలాస్ డి పిడ్రా అంటే ‘అక్షరాలా రాతి బంతులు’ అని అర్థం. కోస్టారికా అనేక రహస్యాలకు అసలైన స్థావరం. ఈ దేశం.. సముద్రతీరాలకు, విశాలమైన వర్షారణ్యాలకు, జలపాతాలకు, అగ్నిపర్వతాలకు ఉనికిపట్టే కాదు, ఎన్నో మిస్టరీల సొత్తు. ‘యునైటెడ్ ఫ్రూట్’ అనే ఓ కంపెనీ.. 1930లో కోస్టారికా అటవీ ప్రాంతాన్ని కొంతభాగం శుభ్రపరచి.. అరటి తోటలు వేయాలని నిర్ణయించింది. ఆ సమయంలో కొందరు కూలీలకు ఆ కాంట్రాక్ట్‌ని అప్పగించింది. అయితే కూలీలు చెట్లను కొట్టి.. చెత్తను శుభ్రపరుస్తున్న క్రమంలో పెద్ద పెద్ద గుండ్రాళ్లను కనుగొన్నారు. నున్నగా గోళాకారంలో ఉన్న ఆ రాళ్లు ఒక్కొక్కటీ ఒక్కో పరిమాణంలో బయటపడ్డాయి. అవేంటో అర్థంకాని కొందరు కూలీలు.. ఆ పరిసరాలను మొత్తం వెతకడం మొదలుపెట్టారు. అప్పుడే కొన్ని వందల సంఖ్యలో ఈ గోళాలు బయటపడ్డాయి. అయితే వాటిని స్థానికులు దేవుడు రాళ్లుగా భావించి పూజించడం మొదలుపెడితే.. కొందరుమాత్రం ఆ గోళాల్లో విలువైన బంగారం ఉంటుందనే పుకార్లను నమ్మి పగలగొట్టే పనిలో పడ్డారు. అయితే పగలగొట్టిన ఏ రాయిలోనూ ఒక్క విలువైన వస్తువూ దొరకలేదు. కానీ దొరికిన ప్రతి గోళం టన్నుల బరువుతో వింతగా తోచింది. కొన్నాళ్లకు ఆ నోటా ఈ నోటా సమాచారం అందటంతో ఈ రాళ్లపై దృష్టిసారించారు పురావస్తు శాఖవారు. కొన్ని.. సెంటీ మీటర్ల పరిమాణంలో ఉంటే.. ఇంకొన్ని అడుగుల ఎత్తులో ఉన్నాయి. పెద్దపెద్ద గోళాలు.. సుమారు 6 అడుగుల కంటే ఎక్కువ వ్యాసార్ధంతో.. 15 టన్నుల బరువుతో కదిలించడానికి కష్టంగా ఉంటే.. కొన్ని అందులో సగం పరిమాణంతో ఆకట్టుకున్నాయి. అయితే ఇవి తయారు చేసిన రాళ్లలా ఉన్నాయని కొందరు సైంటిస్టులు ఊహించారు. అవి మానవ నిర్మితమా? కాదా? వాటి వెనుక ఉన్న కథేంటీ? అసలు ఎందుకు వాటిని ఒకే చోట ఉంచారు? వాటిని రూపొందించడంలో ఉన్న ఉద్దేశం ఏంటీ? వంటి సందేహాలన్నీ ప్రశ్నార్థకంగానే మిగిలాయి. అయితే కొందరు పరిశోధకులు మాత్రం.. వాటిని క్రీస్తుపూర్వం 800 నుంచి 1500 మధ్య తయారుచేసి ఉంటారని నమ్మారు. ఈ రాళ్ల ఉనికి చుట్టూ అనేక అనేక కథలు వినిపించసాగాయి. ఇవి ఎత్తైన చోటు నుంచి దొర్లుకుంటూ వచ్చాయని కొందరు, వాటిని ప్రకృతే సృష్టించిందని మరికొందరు భావించారు. రాతి గోళాలు ‘తారా ఫిరంగి బంతులు’ అని స్థానిక పురాణం చెప్పుకొచ్చింది. గాడ్ ఆఫ్ థండర్.. గాలీ, తుఫానులను తరిమి కొట్టాడానికి బ్లోపైప్ సాయంతో ఈ బంతులను వినియోగించాడని చెప్పగా.. సౌరకుటుంబాన్ని ఊహాత్మకంగా ఈ గోళాలతో రూపొందించి ఉండొచ్చని, ఖగోళ పరిశీలనలు చేయడానికి లేదా దిక్సూచిగా ఉపయోగించుకోవడానికి వీటిని రూపొందించి ఉంటారని చాలామంది నమ్మారు. ఈ రాళ్ల విషయంలో ఊహలు, నమ్మకాలు తప్ప సరైన సాక్ష్యాధారాలు లేవు. నిజానికి కూలీలు వీటిని కనుగొన్నప్పుడు.. ఉన్నచోట నుంచి తొలగించి మరోచోటకు మళ్లించినప్పుడు.. వాటి అసలు స్థానాలపై పరిశోధకులకు స్పష్టత లేకపోవడం కూడా ఈ మిస్టరీని ఛేదించలేకపోవడానికి ఒక కారణం. ఈ గోళాలను జాతీయ చిహ్నాలుగా.. కోస్టారికా సంస్కృతిలో భాగంగా పరిగణించారు. అందుకే ఇవి ప్రభుత్వ కార్యాలయాల్లో అలంకరణలుగా కనిపిస్తాయి. ప్రస్తుతం ఈ మిస్టరీ గోళాలు.. చాలా వరకు అమెరికన్ మ్యూజియమ్స్‌లో దర్శనమిస్తుంటే.. కొన్ని వాగుల్లో, తీరాల్లో పర్యాటకులను అలరిస్తున్నాయి. సంహిత నిమ్మన (చదవండి: అద్భుతమైన డెవిల్స్ బ్రిడ్జ్! ఆ నిర్మాణం ఓ అంతుచిక్కని మిస్టరీ!) -
ఐసీఐసీఐ కస్టమర్లకు కొత్త సర్వీసు
సాక్షి, ముంబై: ప్రైవేటు రంగ బ్యాంకింగ్ దిగ్గజం ఐసీఐసీఐ తమ కస్టమర్ల కోసం కొత్త సర్వీసును ప్రవేశపెట్టింది. ఐసీఐసీఐ బ్యాంకు నుంచి రుణాలు పొందిన కస్టమర్ల కోసం లోన్ఎగైనెస్ట్ సెక్యూరిటీస్ (లాస్) డెబిట్ కార్డు సౌకర్యాన్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందిన కస్టమర్లకు ఎలక్ట్రానిక్ కార్డులను జారీ చేయొచ్చని రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్బీఐ) ఆదేశాల నేపథ్యంలో బ్యాంకు ఈ నిర్ణయం తీసుకుంది. తద్వారా ఈ సౌకర్యాన్ని కస్టమర్లకు అందుబాటులోకి తీసుకొచ్చిన దేశంలో మొట్టమొదటి బ్యాంకుగా ఐసీఐసీఐ అవతరించింది. వీసా ప్లాట్ఫామ్లో డెబిట్ కార్డుద్వారా దేశీయ వ్యాపార సంస్థల కొనుగోళ్ళతోపాటు, పీఓఎస్ మెషీన్లు, ఆన్లైన్ లావాదేవీలను ఇ-కామర్స్ పోర్టల్‌పై చెల్లింపులు చేసుకోవచ్చు. కొత్త వినియోగదారులకు 24 గంటల అనంతరం డిజిటల్ డెబిట్ కార్డు జారీ అవుతుంది. ఈ కార్డును బ్యాంకుకు చెందిన ఐమొబైల్ యాప్ ద్వారా యాక్సస్ చేసుకోవచ్చు. అలాగే ఏడు పనిదినాల్లో ఫిజికల్ డెబిట్ కార్డు కూడా వస్తుంది. అయితే పాత లాస్ కస్టమర్లు ఈ కార్డును వెంటనే పొందవచ్చు. వీరికి కార్డు ఆటోమేటిక్‌గానే రెన్యూవల్ అవుతుంది. ప్రయోజనాలు ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ అనేది పర్సనల్ లోన్ లానే వినియోగించుకోవచ్చు. డెబిట్ కార్డుకు లోన్ క్రెడిట్ అవుతుంది. నిబంధనల ప్రకారం ఈ డబ్బులు తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ కొత్త డెబిట్ కార్డు ద్వారా రోజుకు రూ.3 లక్షల వరకు పీఓఎస్ మిషన్లతో పాటు అన్ని ఆన్ లైన్ ట్రాన్సాక్షన్లు చేసుకోవచ్చు. కస్టమర్ సౌలభ్యం, వారి వైవిధ్యమైన అవసరాలను తీర్చే నిమిత్తం డిజిటల్ యుగంలో ఇది ఒక కొత్త అడుగు అని బ్యాంకు అన్ సెక్యూర్డ్ ఎసెట్స్ హెడ్ సుదీప్తా రాయ్ తెలిపారు. కరోనాకాలంలో వ్యాపార కార్యకలాపాలు తిరిగి పుంజుకునేలా ఐసీఐసీఐ బ్యాంక్ భాగస్వామ్యంతో ఓవర్‌డ్రాఫ్ట్ ఖాతాతో అనుసంధానించిన ఈ వినూత్న డెబిట్ కార్డ్ ప్రారంభించడం సంతోషంగా ఉందని వీసా ఇండియా అండ్ సౌత్ ఆసియా గ్రూప్ కంట్రీ మేనేజర్ టీఆర్ రామచంద్రన్ తెలిపారు. -
వెల్కమ్ పాపనగరం లాస్ వేగాస్
-
సెక్యూరిటీలపై రుణం కాస్త బెటర్!
రుణాలు రకరకాలు. వ్యక్తుల ఆర్థిక స్తోమత, తిరిగి చెల్లించే సామర్థ్యం, వారి అవసరాలను బట్టి బ్యాంకులు, ఆర్థిక సంస్థలు రకరకాల రుణాలిస్తున్నాయి. బంగారంపై రుణం, సెక్యూరిటీలపై రుణం(ఎల్ఏఎస్)... ఇవన్నీ ఇలాంటివే. ఎల్ఏఎస్ కింద షేర్లు, బీమా పాలసీ, మ్యూచువల్ ఫండ్ యూనిట్లు, నేషనల్ సేవింగ్స్ సర్టిఫికెట్లు తనఖా ఉంచుకుని వాటిపై రుణ మంజూరు చేస్తారు. ఏఏ సెక్యూరిటీలను అంగీకరిస్తారనేది బ్యాంకును బట్టి మారుతుంటుంది. ప్రాథమికంగా మాత్రం... నాన్-కన్వర్టబుల్ డిబెంచర్లు, మ్యూచ్‌వల్ ఫండ్ యూనిట్లు, నాబార్డ్ బాండ్లు, డీమ్యాట్ షేర్లు, యూటీఐ బాండ్లు, ఎన్ఎస్సీ/కేవీపీ సర్టిఫికెట్లు (డీమ్యాట్ రూపంలో ఉంటేనే...), బీమా పాలసీలను అంగీకరిస్తుంటారు. ఎల్ఏఎస్ వల్ల అప్పటికప్పుడు మన దగ్గర అందుబాటులో ఉండే సెక్యూరిటీల్ని తొందరపడి విక్రయించాల్సిన అవసరం లేకుండా తనఖా పెట్టి రుణం తీసుకోవటం వీలవుతుంది. సెక్యూరిటీల్ని తనఖా పెడితే సదరు బ్యాంకు లేదా ఆర్థిక సేవల సంస్థ ఓవర్‌డ్రాఫ్ట్ సౌకర్యాన్నిస్తుంది. ఓవర్‌డ్రాఫ్ట్ విలువ మాత్రం తను తనఖా ఉంచుకునే సెక్యూరిటీల విలువపై ఆధారపడి ఉంటుంది. లావాదేవీ సాఫీగా సాగాలంటే మీ పేరిట కరెంట్ ఖాతా తెరవాల్సి ఉంటుంది. ఆ ఖాతాలో పడే డబ్బును ఎప్పుడు ఎంత వాడుకోవచ్చు అన్నది మీ ఇష్టం. వడ్డీ కూడా విత్‌డ్రా చేసుకున్న సొమ్ముకే చెల్లించాల్సి ఉంటుంది. పెపైచ్చు ఎన్నాళ్లు ఆ సొమ్మును వాడితే ఆ కాలానికే వడ్డీ చెల్లించాలి. దీన్లో ఉన్న ప్రధాన ప్రయోజనమేంటంటే అవసరమైనపుడు కావలసిన సొమ్మును పొందటం. మరోవంక షేర్ హోల్డర్‌గా వచ్చే ప్రయోజనాల్ని కోల్పోకుండా ఉండటం. అంటే ఆ షేర్లపై మీకుండే హక్కులు, దానిపై వచ్చే డివిడెండ్లు, బోనస్‌లు, షేర్ ధర పెరిగితే ఆ ప్రయోజనం... వీటిలో దేన్నీ కోల్పోవాల్సిన అవసరం ఉండదు. పెపైచ్చు మిగతా రుణాలతో పోలిస్తే షేర్లపై తీసుకునే రుణానికి వడ్డీ తక్కువే. ఎల్ఏఎస్ ముఖ్యాంశాలు... మీ దగ్గరుండే బాండ్లు, షేర్లు, డిబెంచర్లు, మ్యూచువల్ ఫండ్లు తనఖాగా సెక్యూర్డ్ రుణాన్ని మంజూరు చేస్తారు. ఎల్ఏఎస్ రుణ వ్యవధి సాధారణంగా ఏడాది. అవసరాన్ని బట్టి దీన్ని రెన్యువల్ చేసుకోవచ్చు. సాధారణంగా ఎల్ఏఎస్ వడ్డీ రేట్లు 12 నుంచి 15 శాతం. కానీ ఇవి బ్యాంకును బట్టి మారుతుంటాయి. దీనిపై దాదాపు 2 % ప్రాసెసింగ్ ఫీజు ఉంటుంది. సాధారణంగా తనఖా పెట్టిన సెక్యూరిటీ విలువలో 50 శాతాన్ని రుణంగా మంజూరు చేస్తారు. కొన్ని సందర్భాల్లో ఇది పెరగవచ్చు కూడా. ఈ రుణాన్ని ముందుగా తీర్చేయాలనుకుంటే ఎలాంటి ప్రీపేమెంట్ చార్జీలూ ఉండవు. తీర్చాలనుకున్నపుడు తక్షణం చెల్లించేయొచ్చు. 18 నుంచి 65 ఏళ్ల మధ్యవారు ఎవరైనా ఈ రుణానికి దరఖాస్తు చేయొచ్చు. కావాల్సిన పత్రాలు: ఉద్యోగస్తులైతే పాన్ కార్డ్, గుర్తింపు పత్రం, ఫొటో, చిరునామా ధ్రువీకరణ, 6 నెలల బ్యాంకు స్టేట్మెంట్, చెక్కులు, డీమ్యాట్ ఖాతా స్టేట్మెంట్, ఆదాయ ధ్రువీకరణ అవసరం. స్వయం ఉపాధి పొందుతున్నవారికైతే పైన పేర్కొన్న వాటితో పాటు ఆదాయ ధ్రువీకరణ, ఆఫీసు చిరునామా ధ్రువీకరణ, వ్యాపార ధ్రువీకరణ, బ్యాలెన్స్ షీట్ అందజేయాల్సి ఉంటుంది.