Lashkar terrorist
-
ఒకే వేదికపై ముఖ్యమంత్రి, ఉగ్రవాది
న్యూఢిల్లీ: ఉగ్రవాద గ్రూపులకు మద్దతునివ్వడంపై అమెరికా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నా పాకిస్థాన్ రాజకీయ నాయకుల తీరు మారడం లేదు. బాహాటంగా పాక్ నాయకులు ఉగ్ర మూకలతో అంటకాగుతున్నారు. తాజాగా ఖైబర్ పఖ్తూన్ఖ్వా ముఖ్యమంత్రి పర్వేజ్ ఖట్టక్ లష్కరే ఉగ్రవాది అబ్దుల్ రహమాన్ మక్కీతో వేదిక పంచుకోవడం గమనార్హం. ఒకప్పటి క్రికెటర్ ఇమ్రాన్ ఖాన్ నేతృత్వంలోని పాకిస్థాన్ తెహ్రీక్ ఎ ఇన్సాఫ్ (పీటీఐ) పార్టీకి చెందిన పర్వేజ్ ఖట్టక్ ఆదివారం పెషావర్‌లో జరిగిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ భేటీలో పాల్గొన్నాడు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారిలో మక్కీ కూడా ఉన్నారు. మక్కీ బావ, ముంబై దాడుల సూత్రధారి అయిన హాఫీజ్ సయీద్. మక్కీ కూడా ఉగ్రవాద కేసులలో నిందితుడిగా ఉన్నాడు. ఈ సమావేశంలో సయీద్ పాల్గొనకుండా పాక్‌లోని పంజాబ్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది. కరుడుగట్టిన మతవాద గ్రూపులను మచ్చిక చేసుకునేందుకు సీఎం పర్వేజ్ ఖట్టక్ ఈ భేటీలో పాల్గొన్నట్టు స్థానిక డాన్ పత్రిక వ్యాఖ్యానించింది. దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్‌ను పీటీఐ చీఫ్ ఇమ్రాన్ ఖాన్ బాహాటంగా విమర్శిస్తున్న నేపథ్యంలో ఈ భేటీలో ఖట్టక్ పాల్గొనడం పలువురిని ఆశ్చర్యపరిచింది. 40కిపైగా ఇస్లామిక్ అతివాద రాజకీయ పార్టీలతో కూడిన దిఫా ఇ పాకిస్థాన్ కౌన్సిల్ దేశంలో సంప్రదాయ విధానాలను పాటించాలని ప్రవచిస్తూ ఉంటుంది. ఈ గ్రూప్ తరచూగా భారత్‌కు వ్యతిరేకంగా ప్రచారం చేస్తుంది. -
లఖ్వీ మళ్లీ నిర్బంధంలోకి..
ఇస్లామాబాద్: ముంబై దాడుల సూత్రధారి లష్కరే ఉగ్రవాది లఖ్వీని పాకిస్తాన్ ప్రభుత్వం తిరిగి నిర్బంధించింది. శాంతిభద్రతల చట్టం కింద జైలులో ఉన్న అతడిని విడుదల చేయాలని ఇస్లామాబాద్ హైకోర్టు శుక్రవారం ఆదేశించడం తెలిసిందే. దీనిపై భారత్ నిరసన వ్యక్తం చేయడంతో... పాక్ తిరిగి నిర్బంధంలోకి తీసుకుంది. కోర్టు ఆదేశాలపై శనివారం లఖ్వీని విడుదల చేసిన వెంటనే తిరిగి శాంతి భద్రతల చట్టం కింద అదుపులోకి తీసుకుంది. మరో 30 రోజులు లఖ్వీని రావల్పిండి జైల్లోనే ఉంచనున్నట్లు ప్రకటించింది. ఇదే చట్టం కింద ప్రభుత్వం లఖ్వీని రెండుసార్లు అదుపులోకి తీసుకోగా.. ఆ రెండు సార్లూ కోర్టులు నిర్బంధాన్ని తప్పుబట్టి విడుదల చేయాల్సిందిగా ఆదేశించాయి. -
వైదిక్, హఫీజ్ భేటీపై ఆగని రభస
పార్లమెంటులో విపక్షాల నిరసన న్యూఢిల్లీ: లష్కరే ఉగ్రవాదనేత హఫీజ్ సయీద్‌తో యోగా గురువు బాబా రామ్‌దేవ్ సన్నిహితుడైన జర్నలిస్టు వేద్ ప్రతాప్ వైదిక్ భేటీ కావడంపై ప్రతిపక్షం నిరసనతో పార్లమెంటు వరుసగా రెండవరోజు మంగళవారం కూడా స్తంభించింది. రాజ్యసభ మూడుసార్లు, లోక్‌సభ ఒకసారి స్తంభించాయి. సమస్య తీవ్రత దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం ప్రశ్నోత్తరాలను రద్దుచేసి, వెంటనే స్పందించాలని కాంగ్రెస్ పట్టుబట్టడంతో పార్లమెంటు ఉభయసభలకూ ఉదయంనుంచే అంతరాయం కలిగింది. వైదిక్, హఫీజ్ భేటీపై ఆందోళన వ్యక్తంచేస్తూ కాంగ్రెస్, ఎస్పీ, బీఎస్పీ సభ్యులు వెల్‌లోకి దూసుకెళ్లడంతో జీరో అవర్‌లోనూ మరోసారి అంతరాయం కలిగింది. లోక్‌సభలో విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ దీనిపై మాట్లాడుతూ, పాకిస్థాన్‌లోని ఉగ్రవాది, ఒక జర్నలిస్టుల భేటీతో ప్రభుత్వానికి ఎలాంటి సంబంధంలేదని అన్నారు. హఫీజ్‌ను కలుసుకోబోతున్నట్టు వైదిక్ ఏ దశలోనూ తమకు తెలియజేయలేదని, సమావేశం ఆయన వ్యక్తిగతమని చెప్పారు. వైదిక్ ఆర్ఎస్ఎస్ వ్యక్తి.. రాహుల్.. మరోపక్క.. వైదిక్ ఆరెస్సెస్ వ్యక్తి అని కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ఆరోపించారు. దీన్ని వైదిక్ ఖండించారు. వైదిక్‌కు ఆర్ఎస్ఎస్తో సంబంధమే లేదని ఇటీవలే బీజేపీలో చేరిన ఆర్‌ఎస్‌ఎఎస్ నేత రామ్ మాధవ్ చెప్పారు.