Last ODI
-
భారత్ 0... ఆసీస్ 3
ముంబై: భారత మహిళల జట్టు కొత్త ఏడాదిని భారీ పరాజయంతో ప్రారంభించింది. ఆ్రస్టేలియాతో మంగళవారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో టీమిండియా ఏకంగా 190 పరుగుల తేడాతో ఓడిపోయింది. వరుసగా మూడో విజయంతో ఆస్ట్రేలియా సిరీస్‌ను 3–0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆ్రస్టేలియా 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 338 పరుగుల భారీస్కోరు చేసింది. భారత జట్టుపై ఆ్రస్టేలియాకిదే అత్యధిక స్కోరు కావడం విశేషం. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’... ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ ఫోబీ లిచ్‌ఫీల్డ్ (125 బంతుల్లో 119; 16 ఫోర్లు, 1 సిక్స్), కెప్టెన్ అలీసా హీలీ (85 బంతుల్లో 82; 4 ఫోర్లు, 3 సిక్స్‌లు) చెలరేగి తొలి వికెట్‌కు 189 పరుగులు జోడించారు. వన్డేల్లో భారత జట్టుపై ఏ వికెట్‌కైనా ఇదే అత్యధిక భాగస్వామ్యం కావడం గమనార్హం. భారత బౌలర్లలో శ్రేయాంక 3, అమన్‌జోత్ 2 వికెట్లు తీశారు. 339 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 32.4 ఓవర్లలోనే 148 పరుగులకే కుప్పకూలింది. బ్యాటర్లు మూకుమ్మడిగా చేతులెత్తేశారు. స్మృతి మంధాన (29; 5 ఫోర్లు) టాప్ స్కోరర్ కాగా, జెమీమా రోడ్రిగ్స్ (25; 3 ఫోర్లు), దీప్తి శర్మ (25 నాటౌట్; 2 ఫోర్లు)లు 20 పైచిలుకు స్కోర్లు చేశారంతే! కెపె్టన్ హర్మన్‌ప్రీత్ కౌర్ (3) వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమైంది. వేర్హమ్ 3, మేగన్ షుట్, అలానా కింగ్, అనాబెల్ సదర్లాండ్ తలా 2 వికెట్లు తీశారు. -
IND vs AUS 3rd Odi: ఓటమితో ముగింపు.. సిరీస్ భారత్ సొంతం
ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో భారత్ విజయలక్ష్యం 353 పరుగులు... టీమ్ తాజా ఫామ్, పిచ్‌ను బట్టి చూస్తే అసాధ్యమేమీ అనిపించలేదు. అయితే చివరకు భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది. రోహిత్, కోహ్లిలు బరిలోకి దిగి సత్తా చాటినా గెలుపు దక్కలేదు. వరుస విజయాల ఊపులో మరో మ్యాచ్ గెలిచి ఆ్రస్టేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా కోరిక నెరవేరలేదు. ఆ్రస్టేలియా సమష్టి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని తమ వరుస ఐదు పరాజయాలకు బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు ఈ వామప్ తరహా మ్యాచ్‌కంటే మరో పది రోజుల తర్వాత జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ మ్యాచ్ కోసం ఇక ఎదురు చూడండి. రాజ్‌కోట్: ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా ఆ్రస్టేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 66 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. టాప్–4 బ్యాటర్లు అర్ధసెంచరీలు సాధించారు. మిచెల్ మార్ష్ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (61 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), లబుõÙన్ (58 బంతుల్లో 72; 9 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక పరుగులు చేశారు. మార్ష్, స్మిత్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (57 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (61 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 48; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. ఓవరాల్‌గా 178 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది. స్కోరు వివరాలు ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 56; మార్ష్ (సి) ప్రసిధ్ (బి) కుల్దీప్ 96; స్మిత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 74; లబుషేన్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 72; క్యారీ (సి) కోహ్లి (బి) బుమ్రా 11; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 5; గ్రీన్ (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 9; కమిన్స్ (నాటౌట్) 19; స్టార్క్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 352. వికెట్ల పతనం: 1–78, 2–215, 3–242, 4–267, 5–281, 6–299, 7–345. బౌలింగ్: బుమ్రా 10–0–81–3, సిరాజ్ 9–0–68–1, ప్రసి«ధ్ కృష్ణ 5–0–45–1, జడేజా 10–0–61–0, వాషింగ్టన్ సుందర్ 10–0–48–0, కుల్దీప్ యాదవ్ 6–0–48–2. భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) మ్యాక్స్‌వెల్ 81; సుందర్ (సి) లబుõÙన్ (బి) మ్యాక్స్‌వెల్ 18; కోహ్లి (సి) స్మిత్ (బి) మ్యాక్స్‌వెల్ 56; శ్రేయస్ (బి) మ్యాక్స్‌వెల్ 48; కేఎల్ రాహుల్ (సి) క్యారీ (బి) స్టార్క్ 26; సూర్యకుమార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హాజల్‌వుడ్ 8; జడేజా (ఎల్బీ) (బి) సంఘా 35; కుల్దీప్ (బి) హాజల్‌వుడ్ 2; బుమ్రా (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 5; సిరాజ్ (సి) కమిన్స్ (బి) గ్రీన్ 1; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–74, 2–144, 3–171, 4–223, 5–233, 6–249, 7–257, 8–270, 9–286, 10–286. బౌలింగ్: స్టార్క్ 7–0–53–1, హాజల్‌వుడ్ 8–0–42–2, కమిన్స్ 8–0–59–1, గ్రీన్ 6.4–0–30–1, మ్యాక్స్‌వెల్ 10–0–40–4, తన్వీర్ సంఘా 10–0–61–1. -
‘ప్రపంచకప్ గెలవకపోవడమే లోటు’
లండన్: రెండు దశాబ్దాలకు పైగా భారత మహిళా క్రికెట్ మూలస్థంభాల్లో ఒకరిగా నిలిచిన దిగ్గజ పేస్ బౌలర్ జులన్ గోస్వామి ఆటకు ముగింపు పలుకుతోంది. నేడు భారత్, ఇంగ్లండ్ మధ్య జరిగే చివరి వన్డేతో రిటైర్ కానున్న జులన్ ఆఖరిసారిగా లార్డ్స్ మైదానంలో బరిలోకి దిగనుంది. భారత్ ఇప్పటికే సిరీస్‌ను గెలుచుకున్న నేపథ్యంలో అందరి దృష్టీ జులన్పైనే ఉంది. ఆమెకు విజయంతో ఘనంగా వీడ్కోలు ఇవ్వాలని హర్మన్ బృందం భావిస్తోంది. ఈ నేపథ్యంలో తన కెరీర్ విశేషాల గురించి జులన్ శుక్రవారం మీడియాతో మాట్లాడింది. వన్డే లేదా టి20 ప్రపంచకప్‌లలో తాము ఒకటి గెలిచి ఉంటే బాగుండేదని ఆమె వ్యాఖ్యానించింది. ‘2005, 2017 వన్డే వరల్డ్‌కప్‌లలో మేం ఫైనల్ చేరాం. వీటిలో ఒకటి గెలిచి ఉండాల్సింది. ప్రతీ క్రికెటర్‌కి అదే లక్ష్యం ఉంటుంది. నాలుగేళ్ల పాటు ఎంతో కష్టపడి అక్కడి దాకా వచ్చాక కప్ గెలిస్తే కల నిజమయ్యేది. టి20 ప్రపంచకప్ సహా మేం మూడు ఫైనల్స్ ఆడినా ఒక్కటి గెలవలేకపోయాం. అది చాలా బాధిస్తుంది. నా కెరీర్లో అదే లోటు’ అని జులన్ చెప్పింది. గత రెండేళ్లుగా చాలా సార్లు రిటైర్మెంట్ గురించి ఆలోచిస్తూ వచ్చానని, చివరకు ఇప్పుడు తప్పుకుంటున్నానని జులన్ భావోద్వేగంతో చెప్పింది. ‘రెండేళ్లుగా ప్రతీ సిరీస్ నాకు చివరి సిరీస్‌లాగానే అనిపించేది. కోవిడ్ వల్ల మ్యాచ్‌లు వాయిదాపడుతూ రావడంతో పాటు వరుసగా గాయాలపాలయ్యాను. శ్రీలంక సిరీస్‌తోనే ముగిద్దామనుకున్నా. అయితే ఫిట్‌గా లేక ఆ సిరీస్ ఆడలేదు. దాంతో మళ్లీ ఎన్సీఏకు వెళ్లాను. రాబోయే టి20 వరల్డ్‌కప్‌కు ముందు ఇదే చివరి వన్డే సిరీస్ కాబట్టి ఆటను ముగిస్తున్నా’ అని ఈ బెంగాల్ పేసర్ పేర్కొంది. కోల్‌కతాలో 1997 వన్డే వరల్డ్‌కప్ ఫైనల్లో బాల్‌బాయ్‌గా పని చేసిన తర్వాత దేశానికి ఆడాలని లక్ష్యంగా పెట్టుకున్నానని, ఇన్నేళ్లు కొనసాగగలనని అనుకోలేదన్న జులన్... కెరీర్లో తొలి మ్యాచే అన్నింటికంటే ప్రత్యేకమైందని గుర్తు చేసుకుంది. వచ్చే ఏడాది జరి గే తొలి మహిళల ఐపీఎల్లో పాల్గొనడం గురించి తాను ఇప్పుడే చెప్పలేనని జులన్ స్పష్టం చేసింది. -
IND vs ENG 3rd ODI: ఆఖరి పోరాటం
స్వదేశంలో వన్డేల్లో ఎంత స్కోరు చేస్తే భారత జట్టు సురక్షితంగా ఉండవచ్చు? ఇంగ్లండ్ లాంటి మేటి జట్టు ముందు 336 పరుగుల స్కోరు కూడా సరిపోదని రెండో వన్డేలోనే అర్థమైంది. బ్యాటింగ్‌లో రాణించిన టీమిండియా భారీ స్కోరు చేస్తే... ప్రపంచ చాంపియన్ జట్టు తమ స్థాయికి తగ్గట్లుగా ఆడి దానిని అలవోకగా ఛేదించింది. ఈ నేపథ్యంలో మరోసారి పరుగుల పండగకు భారత్, ఇంగ్లండ్ జట్లు సన్నద్ధమయ్యాయి. గత మ్యాచ్ అనుభవంతో వ్యూహం మార్చి విజయాన్ని అందుకోవాలని భారత్ ఆశిస్తుండగా... ఈ పర్యటనలో చివరి మ్యాచ్‌లో నెగ్గి ఒక్క ఫార్మాట్లోనైనా విజేతగా వెనుదిరగాలని ఇంగ్లండ్ కోరుకుంటోంది. పుణే: భారత్‌లో ఇంగ్లండ్ జట్టు పర్యటన చివరి ఘట్టానికి చేరింది. టెస్టు, టి20 సిరీస్‌ల తర్వాత వన్డే సిరీస్‌లో ఆఖరి మ్యాచ్‌కు రంగం సిద్ధమైంది. నేడు జరిగే మూడో వన్డేలో భారత్, ఇంగ్లండ్ తలపడనున్నాయి. ఇరు జట్లు 1–1తో సమంగా ఉండగా ... ఈ పోరుతో అంతిమ విజయం ఎవరిదో తేల నుంది. గత మ్యాచ్ అందించిన ఫలితంతో ఇంగ్లండ్ జట్టులో ఉత్సాహం పెరగ్గా... భారత్ కొన్ని వ్యూహాత్మక మార్పులు చేయాల్సిన స్థితిలో నిలిచింది. చహల్‌కు చాన్స్! 336 పరుగులు సాధించిన జట్టులో బ్యాటింగ్ లోపాల గురించి చెప్పడానికేమీ ఉండదు. అయితే తుది ఫలితం చూస్తే భారత జట్టు మరిన్ని పరుగులు చేసే అవకాశాన్ని కోల్పోయిందని అనిపించింది. మధ్య ఓవర్లలో కాస్త నెమ్మదిగా ఆడటం కూడా ఇందుకు కారణం. ముఖ్యంగా మొయిన్ అలీలాంటి సాధారణ స్పిన్నర్ బౌలింగ్‌లో అతి జాగ్రత్తగా ఆడటం కూడా కొంప ముంచింది. చివరి ఓవర్లలోనే కాకుండా అంతకుముందు నుంచే దూకుడు కనబర్చాలని భారత్ భావిస్తోంది. టాప్–3 రోహిత్ శర్మ, శిఖర్ ధావన్, కోహ్లిలతో బ్యాటింగ్ బలంగా కనిపిస్తుండగా... కేఎల్ రాహుల్ సెంచరీతో సత్తా చాటడం జట్టుకు అదనపు బలాన్నిచ్చింది. ఇక రిషభ్ పంత్ తనదైన శైలిలో చెలరేగి ఆడుతుండటం, హార్దిక్ పాండ్యా మెరుపు ప్రదర్శనలు కూడా జట్టు భారీ స్కోరులో కీలకపాత్ర పోషించడం ఖాయం. పేస్ బౌలింగ్‌లో మరోసారి భువనేశ్వర్‌పైనే భారం ఉంది. ప్రసిధ్ కృష్ణ, శార్దుల్ ఠాకూర్ కూడా నిలకడగా రాణిస్తున్నారు. అయితే చివరి మ్యాచ్‌లో వైవిధ్యం కోసం వీరిద్దరిలో ఒకరిని తప్పించి నటరాజన్‌ను తీసుకునే అవకాశం ఉంది. లెఫ్టార్మ్ పేస్‌తో పాటు యార్కర్ల బలంతో నటరాజన్ ప్రత్యర్థి బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టగలడని మేనేజ్మెంట్ నమ్ముతోంది. అయితే అన్నింటికంటే భారత్‌కు ఆందోళన కలిగించే అంశం స్పిన్ విభాగం. గత మ్యాచ్‌లో ఇద్దరు స్పిన్నర్లు కుల్దీప్, కృనాల్ పాండ్యా కలిసి 16 ఓవర్లలో 156 పరుగులిచ్చి ఒక్క వికెట్ కూడా తీయలేకపోగా, 14 సిక్సర్లు సమర్పించుకున్నారు! ఈ నేపథ్యంలో కుల్దీప్ స్థానంలో యజువేంద్ర చహల్ రావడం ఖాయమైంది. టి20ల్లో చహల్‌ను చితక్కొట్టినా... ప్రస్తుతం కుల్దీప్ పరిస్థితి చూస్తే అంతకంటే కొంతైనా మెరుగ్గా బౌలింగ్ చేయగలడని అనిపిస్తోంది. కృనాల్ స్థానంలో సుందర్ జట్టులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వికెట్లు పడగొట్టకపోయినా... బ్యాట్స్‌మెన్‌ను కట్టడి చేయగల సామర్థ్యం సుందర్‌కు ఉంది. మరోవైపు హార్దిక్‌తో బౌలింగ్ చేయించే ఆలోచన లేదని కోహ్లి స్పష్టంగా చెప్పేయడంతో ప్రత్యామ్నాయానికి అవకాశం లేకుండా ఐదుగురు బౌలర్లే పూర్తి కోటాతో జట్టును నడిపించాల్సి ఉంది. ఓపెనర్లపైనే దృష్టి... ‘భారీ లక్ష్యాలను నిర్దేశించడంలోనూ, ఛేదించడంలోనూ మేం చాలా కాలంగా ఒక శైలిని ఏర్పరుచుకున్నాం. ఫలితాలతో సంబంధం లేకుండా వాటిని కొనసాగిస్తాం’ ఇంగ్లండ్ రెగ్యులర్ కెప్టెన్ ఇయాన్ మోర్గాన్ వ్యాఖ్య ఇది. గత మ్యాచ్‌లో అతను ఆడకపోయినా బట్లర్ నేతృత్వంలోని టీమ్ దానిని కొనసాగించి విజయాన్ని అందుకుంది. ప్రస్తుతం వన్డే క్రికెట్లో అత్యుత్తమ ఓపెనింగ్ జోడీగా ఉన్న జేసన్ రాయ్, బెయిర్‌స్టో జోరుతో ఇంగ్లండ్‌కు అద్భుత ఆరంభాలు లభిస్తున్నాయి. తొలి వన్డేలో గెలుపు అవకాశాన్ని వృథా చేసుకున్న ఆ జట్టు రెండో మ్యాచ్‌లో మాత్రం అదే పునాదిపై చెలరేగి గెలుపు తీరం చేరింది. ఒక్కసారి కుదురుకుంటే తాను ఎంత ప్రమాదకారినో స్టోక్స్ చూపించాడు. మలాన్, బట్లర్, లివింగ్‌స్టోన్‌లు బ్యాటింగ్‌లో ప్రధాన పాత్ర పోషించగలరు. తర్వాత వచ్చే ఇద్దరు ఆల్‌రౌండర్లు అలీ, స్యామ్ కరన్‌లు కూడా పరుగులు సాధించగలరు కాబట్టి జట్టు బ్యాటింగ్ లోతు ఎలాంటిదో తెలుస్తోంది. బౌలింగ్‌లో ఇద్దరు స్పిన్నర్లు అలీ, రషీద్ తమ వంతు బాధ్యతలు సమర్థంగా పోషిస్తున్నారు. స్యామ్ కరన్, టాప్లీలు పేస్ భారం మోస్తారు. ఫిట్నెస్ సమస్యలతో రెండో మ్యాచ్ ఆడని మార్క్ వుడ్ మళ్లీ బరిలోకి దిగితే అతని పేస్ భారత బ్యాట్స్‌మెన్‌ను ఇబ్బంది పెట్టవచ్చు. గత మ్యాచ్‌లో భారీగా పరుగులిచ్చిన టామ్ కరన్ స్థానంలో వుడ్ ఆడతాడు. మొత్తంగా చూస్తే బౌలింగ్‌లో కొన్ని సమస్యలు ఉన్నా...బ్యాటింగ్ బలగం ఇంగ్లండ్‌దే పైచేయిగా నిలబెడుతోంది. పిచ్, వాతావరణం పూర్తిగా బ్యాటింగ్‌కు అనుకూలమైన పిచ్. గత రెండు వన్డేల్లాగే మళ్లీ భారీ స్కోర్లకు మంచి అవకాశం ఉంది. రెండో ఇన్నింగ్స్ సమయంలో బ్యాటింగ్ మరీ సులువుగా మారిపోతోంది కాబట్టి మరోసారి టాస్ గెలిచిన జట్టు ఫీల్డింగ్ ఎంచుకోవచ్చు. తుది జట్లు (అంచనా) భారత్: కోహ్లి (కెప్టెన్), రోహిత్, ధావన్, రాహుల్, పంత్, హార్దిక్, సుందర్, శార్దుల్/నటరాజన్, భువనేశ్వర్, కుల్దీప్/చహల్, ప్రసిధ్ కృష్ణ. ఇంగ్లండ్: బట్లర్ (కెప్టెన్), జేసన్ రాయ్, బెయిర్‌స్టో, స్టోక్స్, మలాన్, లివింగ్‌స్టోన్, అలీ, స్యామ్ కరన్, ఆదిల్ రషీద్, టాప్లీ, వుడ్. -
టి20 సిరీస్‌కు వార్నర్ దూరం
సిడ్నీ: ఆస్ట్రేలియా ఓపెనర్ డేవిడ్ వార్నర్ భారత్‌తో రేపు జరిగే చివరి వన్డేతో పాటు 3 మ్యాచ్‌ల టి20 సిరీస్ నుంచి కూడా తప్పుకున్నాడు. రెండో వన్డేలో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో అతనికి గజ్జల్లో గాయమైంది. గాయానికి చికిత్సతో పాటు వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం కావాలని భావించిన క్రికెట్ ఆస్ట్రేలియా (సీఏ)... టెస్టు సిరీస్‌కల్లా అతను ఫిట్‌గా ఉండాలని కోరుకుంటోంది. వార్నర్ స్థానంలో డార్సీ షార్ట్‌ను ఆస్ట్రేలియా ఎంపిక చేసింది. మరోవైపు ప్రధాన పేసర్ ప్యాట్ కమిన్స్‌కు మిగిలిన పరిమిత ఓవర్ల మ్యాచ్‌ల నుంచి విశ్రాంతి కల్పించింది. అతను కూడా రేపు జరిగే వన్డేతో పాటు టి20 సిరీస్‌లో బరిలోకి దిగడు. ‘వార్నర్, కమిన్స్ మా టెస్టు జట్టు ప్రణాళికల్లో ఎంతో కీలక ఆటగాళ్లు. వార్నర్ కోలుకునేందుకు కొంత సమయం పడుతుంది. కమిన్స్‌కు మాత్రం ఫిట్‌గా ఉండేందుకు కొంత విరామం ఉండాలని ఈ నిర్ణయం తీసుకున్నాం’ అని జట్టు కోచ్ జస్టిన్ లాంగర్ వెల్లడించాడు. తల తిరిగినట్లనిపించింది: స్మిత్ వరుసగా రెండో సెంచరీతో ఆస్ట్రేలియాను గెలిపించిన స్టార్ బ్యాట్స్‌మన్ స్టీవ్ స్మిత్ అసలు రెండో వన్డేలో ఆడతాననుకోలేదని అన్నాడు. మ్యాచ్ రోజు ఉదయం చాలా తీవ్రమైన తలపోటుతో బాధ పడినట్లు అతను వెల్లడించాడు. ‘ఉదయం బాగా తల తిప్పినట్లనిపించింది. మ్యాచ్ రోజు ఉదయం మైదానానికి వచ్చిన సమయంలో కూడా ఇదే పరిస్థితి. అసలు రెండో వన్డే ఆడతానని భావించలేదు. అయితే టీమ్ డాక్టర్ పలు రకాల చికిత్సలతో నా పరిస్థితిని చక్కదిద్దారు. చెవి లోపలి భాగంలో బాగా నొప్పి అనిపించింది. దానిని చక్కదిద్దిన తర్వాతే పరిస్థితి మెరుగ్గా మారింది. ఒక కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టును గెలిపించడం సంతోషకరం’ అని స్మిత్ వ్యాఖ్యానించాడు. -
ఐదో వన్డే: మెరిసిన ఖవాజా.. మురిసిన ఆసీస్
న్యూఢిల్లీ: చావోరేవో తేల్చుకోవాల్సిన మ్యాచ్‌లో ఆసీస్ బ్యాట్స్‌మెన్ రాణించారు. సిరీస్‌లో మంచి ఫామ్‌లో ఉన్న కంగారూ ఓపెనర్ ఉస్మాన్ ఖవాజా సెంచరీతో ఆకట్టుకున్నాడు. అతడి జోరుకు 30 ఓవర్ల వరకూ ఆసీస్ స్కోరు బోర్డు జెట్ స్పీడుతో దూసుకెళ్లింది. అతడికి తోడుగా మరో ఓపెనర్ ఫించ్ (27 పరుగులు), హ్యాండ్స్కోంబ్ (52 పరుగులు) రాణించడంతో ఆస్ట్రేలియా మంచి స్కోరు చేయగలిగింది. 32వ ఓవర్లో ఖవాజా ఔటైన తర్వాత ఆసీస్ స్కోరుకు బ్రేక్ పడింది. భారత బౌలర్లు చక్కని లైన్ అండ్ లైంగ్త్‌తో కూడిన పదునైన బంతులేసి కంగారూ బ్యాటర్ల పని పట్టారు. దాంతో 50 బంతుల వ్యవధిలో నలుగురు ఆస్ట్రేలియా బ్యాట్స్మెన్లు పెవిలియన్‌కు క్యూ కట్టారు. నాలుగో వన్డే హీరో టర్నర్‌కు తోడుగా చివరి వరస బ్యాట్స్‌మెన్ రిచర్డ్సన్, కమిన్స్‌ల రాణింపుతో ఆస్ట్రేలియా జట్టు 272 పరుగులు చేయగలిగింది. టీమిండియా బౌలర్లు చివరి 20 ఓవర్లలో కట్టుదిట్టమైన బౌలింగ్‌తో ఆసీస్‌ను భారీ స్కోరు చేయకుండా కట్టడి చేశారు. భారత్ లక్ష్యం 273 పరుగులు. భారత బ్యాట్స్మెన్లు రాణిస్తే ఈ స్కోరును ఛేదించడం కష్టం కాకపోవచ్చు. గత మ్యాచ్‌తో ఫామ్‌లోకి వచ్చిన ధావన్, మరో ఓపెనర్ రోహిత్‌లు కలసి శుభారంభాన్ని ఇవ్వాల్సి ఉంది. ఛేదనలో అదరగొట్టే కోహ్లీ ఉండనే ఉన్నాడు. వీరికి జతగా ఆల్‌రౌండర్లు జడేజా, విజయ్ శంకర్, హిట్టర్ రిషబ్ పంత్, కేదార్ జాదవ్‌లు రాణిస్తే ఛేదన సులువవుతుంది. -
భారత్‌ను గెలిపించిన మిథాలీ
* చివరి వన్డేలో టీమిండియా విజయం * ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్ హోబర్ట్: బ్యాటింగ్‌లో కెప్టెన్ మిథాలీ రాజ్ (113 బంతుల్లో 89; 12 ఫోర్లు) చెలరేగడంతో... ఆస్ట్రేలియా మహిళల జట్టుతో ఆదివారం జరిగిన చివరిదైన మూడో వన్డేలో భారత మహిళల జట్టు 5 వికెట్ల తేడాతో విజయం సాధించింది. దీంతో మూడు మ్యాచ్‌ల సిరీస్‌ను ఆస్ట్రేలియా 2-1తో దక్కించుకుంది. బెల్లెరివ్ ఓవల్ మైదానంలో ఆదివారం జరిగిన ఈ మ్యాచ్‌లో... టాస్ గెలిచి బ్యాటింగ్‌కు దిగిన ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్లకు 231 పరుగులు చేసింది. అలెక్స్ బ్లాక్వెల్ (60; 7 ఫోర్లు), ఎలీస్ పెర్రీ (50; 3 ఫోర్లు), జెస్ జొనాసేన్ (32 నాటౌట్)లు రాణించారు. భారత బౌలర్లలో శిఖా పాండే 3, రాజేశ్వరి 2 వికెట్లు తీశారు. తర్వాత భారత్ 47 ఓవర్లలో 5 వికెట్లకు 234 పరుగులు చేసి విజయాన్ని దక్కించుకుంది ఓపెనర్లలో వేద కృష్ణమూర్తి (12) విఫలమైనా... సృ్మతి మందన (52 బంతుల్లో 55; 7 ఫోర్లు) ఆకట్టుకుంది. వన్‌డౌన్‌లో చక్కని సమన్వయంతో ఆడిన మిథాలీ... సృ్మతితో కలిసి రెండో వికెట్‌కు 58; హర్మన్‌ప్రీత్ కౌర్ (22; 2 ఫోర్లు)తో కలిసి మూడో వికెట్‌కు 71 పరుగులు జోడించి ఇన్నింగ్స్‌ను కుదుటపర్చింది. చివర్లో పూనమ్ రౌత్ (24 నాటౌట్), శిఖా పాండే (17) సమయోచితంగా ఆడటంతో భారత్ విజయం ఖాయమైంది. మిథాలీకి ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు లభించింది.