ఆ్రస్టేలియాతో చివరి వన్డేలో భారత్ విజయలక్ష్యం 353 పరుగులు... టీమ్ తాజా ఫామ్, పిచ్‌ను బట్టి చూస్తే అసాధ్యమేమీ అనిపించలేదు. అయితే చివరకు భారత్‌కు ప్రతికూల ఫలితమే వచ్చింది. రోహిత్, కోహ్లిలు బరిలోకి దిగి సత్తా చాటినా గెలుపు దక్కలేదు. వరుస విజయాల ఊపులో మరో మ్యాచ్ గెలిచి ఆ్రస్టేలియాపై తొలిసారి వన్డే సిరీస్‌ను క్లీన్‌స్వీప్ చేద్దామనుకున్న టీమిండియా కోరిక నెరవేరలేదు.
ఆ్రస్టేలియా సమష్టి ప్రదర్శనతో విజయాన్ని అందుకొని తమ వరుస ఐదు పరాజయాలకు బ్రేక్ వేసింది. అయితే ఇప్పుడు ఈ వామప్ తరహా మ్యాచ్‌కంటే మరో పది రోజుల తర్వాత జరిగే అసలు పోరుపైనే అందరి దృష్టీ నిలిచింది. అక్టోబర్ 8న భారత్, ఆస్ట్రేలియా వరల్డ్ మ్యాచ్ కోసం ఇక ఎదురు చూడండి.
రాజ్‌కోట్: ప్రపంచకప్‌కు ముందు సన్నాహకంగా ఆ్రస్టేలియాతో జరిగిన వన్డే సిరీస్‌ను భారత్ 2–1తో సొంతం చేసుకుంది. బుధవారం జరిగిన చివరి మ్యాచ్‌లో ఆ్రస్టేలియా 66 పరుగుల తేడాతో భారత్‌ను ఓడించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఆసీస్ 50 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 352 పరుగులు చేసింది. టాప్–4 బ్యాటర్లు అర్ధసెంచరీలు సాధించారు. మిచెల్ మార్ష్ (84 బంతుల్లో 96; 13 ఫోర్లు, 3 సిక్స్‌లు), స్టీవ్ స్మిత్ (61 బంతుల్లో 74; 8 ఫోర్లు, 1 సిక్స్), లబుõÙన్ (58 బంతుల్లో 72; 9 ఫోర్లు), డేవిడ్ వార్నర్ (34 బంతుల్లో 56; 6 ఫోర్లు, 4 సిక్స్‌లు) కీలక పరుగులు చేశారు.
మార్ష్, స్మిత్ రెండో వికెట్‌కు 137 పరుగులు జోడించారు. 353 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన భారత్ 49.4 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. కెప్టెన్ రోహిత్ శర్మ (57 బంతుల్లో 81; 5 ఫోర్లు, 6 సిక్స్‌లు), విరాట్ కోహ్లి (61 బంతుల్లో 56; 5 ఫోర్లు, 1 సిక్స్), శ్రేయస్ అయ్యర్ (43 బంతుల్లో 48; 1 ఫోర్, 2 సిక్స్‌లు) రాణించగా... ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ గ్లెన్ మ్యాక్స్‌వెల్ 4 వికెట్లతో భారత్‌ను దెబ్బ తీశాడు. ఓవరాల్‌గా 178 పరుగులు చేసిన శుబ్‌మన్ గిల్‌కు ‘ప్లేయర్ ఆఫ్ ద సిరీస్’ అవార్డు దక్కింది.
స్కోరు వివరాలు
ఆ్రస్టేలియా ఇన్నింగ్స్: వార్నర్ (సి) రాహుల్ (బి) ప్రసిధ్ 56; మార్ష్ (సి) ప్రసిధ్ (బి) కుల్దీప్ 96; స్మిత్ (ఎల్బీ) (బి) సిరాజ్ 74; లబుషేన్ (సి) శ్రేయస్ (బి) బుమ్రా 72; క్యారీ (సి) కోహ్లి (బి) బుమ్రా 11; మ్యాక్స్‌వెల్ (బి) బుమ్రా 5; గ్రీన్ (సి) శ్రేయస్ (బి) కుల్దీప్ 9; కమిన్స్ (నాటౌట్) 19; స్టార్క్ (నాటౌట్) 1; ఎక్స్‌ట్రాలు 9; మొత్తం (50 ఓవర్లలో 7 వికెట్లకు) 352. వికెట్ల పతనం: 1–78, 2–215, 3–242, 4–267, 5–281, 6–299, 7–345. బౌలింగ్: బుమ్రా 10–0–81–3, సిరాజ్ 9–0–68–1, ప్రసి«ధ్ కృష్ణ 5–0–45–1, జడేజా 10–0–61–0, వాషింగ్టన్ సుందర్ 10–0–48–0, కుల్దీప్ యాదవ్ 6–0–48–2.
భారత్ ఇన్నింగ్స్: రోహిత్ (సి అండ్ బి) మ్యాక్స్‌వెల్ 81; సుందర్ (సి) లబుõÙన్ (బి) మ్యాక్స్‌వెల్ 18; కోహ్లి (సి) స్మిత్ (బి) మ్యాక్స్‌వెల్ 56; శ్రేయస్ (బి) మ్యాక్స్‌వెల్ 48; కేఎల్ రాహుల్ (సి) క్యారీ (బి) స్టార్క్ 26; సూర్యకుమార్ (సి) మ్యాక్స్‌వెల్ (బి) హాజల్‌వుడ్ 8; జడేజా (ఎల్బీ) (బి) సంఘా 35; కుల్దీప్ (బి) హాజల్‌వుడ్ 2; బుమ్రా (సి) లబుõÙన్ (బి) కమిన్స్ 5; సిరాజ్ (సి) కమిన్స్ (బి) గ్రీన్ 1; ప్రసిధ్ (నాటౌట్) 0; ఎక్స్‌ట్రాలు 6; మొత్తం (49.4 ఓవర్లలో ఆలౌట్) 286. వికెట్ల పతనం: 1–74, 2–144, 3–171, 4–223, 5–233, 6–249, 7–257, 8–270, 9–286, 10–286. బౌలింగ్: స్టార్క్ 7–0–53–1, హాజల్‌వుడ్ 8–0–42–2, కమిన్స్ 8–0–59–1, గ్రీన్ 6.4–0–30–1, మ్యాక్స్‌వెల్ 10–0–40–4, తన్వీర్ సంఘా 10–0–61–1.
Comments
Please login to add a commentAdd a comment