last place
-
మనుష్యులు చూడని ప్రాంతాలివే
-
ఉత్తమ ‘జీవన’ నగరం.. వియన్నా
న్యూఢిల్లీ: ప్రపంచంలో జీవించదగ్గ అత్యుత్తమ నగరాల జాబితాలో ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారి 118వ స్థానంలో నిలచింది. గతేడాది మొదటి స్థానంలో నిలిచిన వియన్నా తన స్థానాన్ని నిలబెట్టుకుంది. అత్యుత్తమ నగరాన్ని ఎంపిక చేసేందుకు ఎకనమిక్స్ ఇంటెలిజెన్స్ ప్రపంచవ్యాప్తంగా 140 నగరాల్లో సర్వే నిర్వహించింది. ఈ సర్వే వివరాలను బుధవారం వెల్లడించింది. నేరాలు పెరగడం, ప్రాణవాయువు నాణ్యత తగ్గడం వంటి కారణాల రీత్యా ఢిల్లీ ఆరు స్థానాలు దిగజారింది. సాంస్కృతిక విభాగంలో తక్కువ పాయింట్లు రావడంతో ముంబై రెండు స్థానాలు దిగజారి 119వ స్థానంలో నిలిచింది. ఆస్ట్రియా రాజధాని వియన్నా జీవించదగ్గ ఉత్తమ నగరంగా ఎంపికై మొదటి స్థానంలో నిలిచింది. కెనాడాలోని సిడ్నీ, జపాన్‌లోని ఒసాకాలు తర్వాతి స్థానాల్లో నిలిచాయి. ఫస్ట్ వియన్నా.. లాస్ట్ డమాస్కస్ నివాసానికి ఆమోదయోగ్య నగరాల జాబితాలో 99.1 పాయింట్లతో వియన్నా తొలిస్థానంలో నిలిచింది. ఇందులో న్యూఢిల్లీకి 56.3 పాయింట్లు రాగా, ముంబైకి 56.2 పాయింట్లు వచ్చాయి. చివరి స్థానంలో నిలిచిన సిరియాలోని డమాస్కస్ పట్టణానికి 30.7 పాయింట్లు లభించాయి. పాకిస్తాన్‌లోని కరాచీ 136వ స్థానంలో నిలవగా, బంగ్లాదేశ్ రాజధాని ఢాకా 138వ స్థానంలో నిలిచింది. చైనా రాజధాని బీజింగ్ 76వ స్థానంలో నిలవగా, లండన్ 48, న్యూయార్క్ 58వ స్థానాల్లో నిలిచాయి. మీడియా స్వేచ్ఛ విషయంలో కూడా భారత్ మరింత దిగజారిందని నివేదిక తెలిపింది. -
‘పది’లో పతనం
నెల్లూరు(టౌన్): పదో తరగతి పరీక్ష ఫలితాల్లో జిల్లా రాష్ట్రంలో అట్టడుగు స్థాయికి పతనమైంది. గతేడాది నాలుగో స్థానాన్ని చేజిక్కించుకున్న జిల్లా ఈ ఏడాది క్షీణించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలచింది. రాష్ట్రంలో ప్రకాశం జిల్లా 97.93 శాతం ఫలితాలతో ప్రథమ స్థానంలో నిలవగా 80.37 శాతం సాధించి నెల్లూరు జిల్లా చివరి స్థానానికి చేరుకుంది. జిల్లా వ్యాప్తంగా పది పరీక్షలకు మొత్తం 32,854 మంది హాజరయ్యారు. వీరిలో 26,404 మంది ఉత్తీర్ణత సాధించారు. ఇందులో బాలురు 16,964 మంది హాజరు కాగా 13,570 మంది ఉత్తీర్ణులై 79.99 ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 15,890 మంది హాజరు కాగా 12,834 మంది పాసై 80.77 శాతం ఉత్తీర్ణత సాధించారు. బాలుర కంటే బాలికలు 0.78 శాతం అధికంగా ఉత్తీర్ణత పొందారు. 1001 మందికి పదికి పది జీపీఏ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో కలిపి 1001 మంది 10కి 10 జీపీఏ సాధించారు. గతేడాది 1008 మంది పదికి పది జీపీఏ సాధించారు. ఈ దఫా ఉత్తీర్ణత శాతం, జీపీఏ తగ్గినా కేవలం నాణ్యత మీద దృష్టి సారించడంతోనే ఈ ఫలితాలు వచ్చాయని విద్యాశాఖ అధికారులు చెబుతున్నారు. కేఎన్నాఆర్ మున్సిపల్ స్కూల్లో ఆర్.హరిచందన, ఇ. జాషువాహడ్‌సన్‌కు 10కి10 పాయింట్లు వచ్చాయి. ప్రభుత్వ సెక్టార్ పాఠశాలల్లో 40 మందికి 10 జీపీఏ ప్రభుత్వ సెక్టార్‌ల్లోని పాఠశాలల్లో చదువుతున్న 40 మంది విద్యార్థులు 10కి10 జీపీఏ సాధించారు. ప్రభుత్వ పాఠశాలల్లో నలుగురు, మున్సిపాలిటీ స్కూల్స్‌లో ఏడుగురు, ఏపీ మోడల్స్ స్కూల్స్‌లో ఐదుగురు, ఏపీ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో ఇద్దరు, ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్స్ స్కూల్స్‌లో ఒకరు, జిల్లా పరిషత్ హైస్కూల్స్‌లో 21 మంది 10కి 10 జీపీఏ సాధించారు. ఐఐటీలో సీటు సాధించడమే లక్ష్యం తండ్రి వెంకటేశ్వర్లు బియ్యం వ్యాపారి. తల్లి కవిత గృహిణి. కేఎన్నార్ మున్సిపల్ స్కూల్లో 10వ తరగతి చదివి పది ఫలితాల్లో 10కి10 జీపీఏ సాధించడం గర్వంగా ఉంది. ఇంటర్లో మంచి మార్కులు సాధించిన జేఈఈ అడ్వాన్స్‌లో ర్యాంక్ సాధించి ఐఐటీలో సీటు సాధించాలన్నదే లక్ష్యం.– ఆర్ హరిచందన, నెల్లూరు, బంగ్లాతోట -
చివరి స్థానం ‘పది’లం
-
చివరి స్థానం ‘పది’లం
► పది ఫలితాల్లో మూడోసారీ ఆఖరిస్థానం ► జిల్లా ఉత్తీర్ణత 80.55 శాతం ► గత ఏడాది కంటే 9.56 శాతం తక్కువ ► ఉత్తీర్ణతలో బాలికలదే పైచేయి ► 978 మంది విద్యార్థులకు ‘పదికి పది’ ► 10,014 మంది ఫెయిల్ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు సొంత జిల్లా.. వరుసగా మూడో సంవత్సరం కూడా టెన్తు ఫలితాల్లో చతికిలబడింది. 80.55 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రంలో చివరి స్థానంలో నిలిచింది. ఉత్తీర్ణుల్లో అబ్బాయిలకంటే అమ్మాయిలే ఎక్కువగా ఉన్నారు. గత రెండు సంవత్సరాలుగా ఫలితాల్లో నిరాశే ఎదురవుతోంది. ఇంటర్నల్ మార్కులు ఈ ఏడాది ఫలితాలను ప్రభావితం చేశాయని అధికారులు చెబుతున్నారు. విధానాలేమైనప్పటికీ సరిదిద్దుకోకుండా ఫలితాల్లో వెనుకబడడాన్ని పిల్లల తల్లిదండ్రులు తప్పుబడుతున్నారు. చిత్తూరు ఎడ్యుకేషన్ : టెన్త్ ఫలితాలు మరోసారి నిరుత్సాహం కలిగించాయి. ఈ ఏడాది 26,807 మంది బాలురు పరీక్షలు రాయగా 21,471 మంది (80.08 శాతం) ఉత్తీర్ణులయ్యారు. 24,678 మంది బాలికలకు 20వేల మంది ఉత్తీర్ణులయ్యా రు. బాలికలు 81.04 శాతం ఉత్తీర్ణత సాధించి హవా చాటారు. 10,014 మంది విద్యార్థులు పరీక్ష ఫెయిలయ్యారు. నిరుడు జిల్లా 90.11 శాతం ఫలితాలు సాధించింది. గతేడాది కంటే ఈసారి 9.56 శాతం తగ్గింది. గతేడాది కంటే ఈ ఏడాది 10కి 10 గ్రేడ్ పాయింట్లను ఎక్కువ మంది సాధించడం విశేషం. గత సంవత్సరంలో 488 మంది విద్యార్థులు 10 పాయింట్లు పొందగా ఇప్పుడు 979 మంది సాధించారు. కస్తూర్బా పాఠశాలల డీలా జిల్లాలోని 20 కస్తూర్బా విద్యాలయాల్లో డీలా పడ్డాయి. గత ఏడాది 85.96 శాతం ఉత్తీర్ణత సాధించగా, ప్రస్తు తం 68.41 శాతంతో సరిపెట్టుకున్నా యి. బోధన సరిగా లేక ఫలితాల్లో వెనుకబడినట్లు విమర్శలు వినిపిస్తున్నాయి. ఆ పాఠశాలల్లో 698 మంది బాలికలు పరీక్షలు రాయగా పెద్దమండ్యం, కలకడ, తంబళ్లపల్లె కేజీబీవీ పాఠశాలల్లోని ఐదుగురు మాత్రమే 9.3 గ్రేడ్ సాధించారు. దెబ్బతీసిన ఇంటర్నల్ మార్కులు నిరంతర సమగ్ర మూల్యాంకన పద్ధతి (సీసీఈ) విధానంలో మొట్ట మొదటి సారిగా పరీక్షలు జరగడం వలన విద్యార్థుల్లో భయాందోళన నెలకుంది. ప్రతి సబ్జెక్టులో నూరు మార్కులకు పరీక్ష ఉండగా, 80 మార్కులకు పబ్లిక్ పరీక్షలు, 20 మార్కులు ఇంటర్నల్ మార్కులు ఉంటాయి. ఆ మార్కులను విద్యార్థి చదివే పాఠశాలల్లో సంబంధిత సబ్జెక్ట్ టీచర్ వేయాలి. ఆ పద్ధతిలో ప్రైవేటు పాఠశాల విద్యార్థులకు ఇష్టానుసారం మార్కులను వేసుకుని ఆన్లైన్లో నమోదు చేసుకున్నారు. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు నష్టపోయారు. ఇంటర్నల్ పద్ధతి మార్చాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాలు కోరుతున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలోని మోడల్ స్కూళ్లల్లో ఈ ఏడాది 80.78 శాతం ఉత్తీర్ణులయ్యారు. 16 మోడల్ స్కూళ్ల నుంచి 1004 మంది పరీక్ష రాయగా 811 మంది పాసయ్యారు. ఇద్దరు బాలురు, 13 మంది బాలికలు 10 కి 10 పాయింట్లు సాధించారు. తక్కువ వచ్చినా నాణ్యమైన ఫలితాలు విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలన్న ఉద్దేశంతో పరీక్షలు పకడ్బందీ గా నిర్వహించాం. జిల్లా చిట్టచివరి స్థానంలో నిలిచినప్పటికీ ఫలితాలు మాత్రం నాణ్యమైనవిగా భావిస్తున్నా. పరీక్షలు సజావుగా జరపడానికి సహకరించిన హెచ్ఎంలు, టీచర్లు, విద్యార్థుల తల్లిదండ్రులకు కృతజ్ఞతలు. వచ్చే ఏడాది ఫలితాల ఉత్తీర్ణత మరింత మెరుగుపడడానికి ప్రయత్నిస్తాం. - శామ్యూల్, ఇన్చార్జ్ డీఈఓ -
చివరి స్థానంలో నల్లగొండ
ఇంటర్ ఫలితాల్లో కొనసాగిన ఆనవాయితీ * తెలంగాణలో చివరి స్థానంలో నిలిచిన జిల్లా * గత ఏడాదితో పోలిస్తే ఫస్టియర్‌లో రెండు శాతం తగ్గిన ఉత్తీర్ణత * సెకండియర్‌లో ఒక శాతం పెరుగుదల.. రెండింటి ఫలితాల్లో బాలికలదే పైచేయి * వృత్తి విద్యాకోర్సుల్లో మాత్రం అగ్రస్థానం.. ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో మెరుగైన ఫలితాలు నల్లగొండ: ఇంటర్మీడియట్ ఫలితాల్లో నల్లగొండ జిల్లా గత ఏడాది ఆనవాయితీనే కొనసాగించింది. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాలకు సంబంధించి రాష్ట్రంలో జిల్లా చిట్ట చివరి స్థానంలో నిలిచింది. గత ఫలితాలతో పోలిస్తే విద్యార్థుల ఉత్తీర్ణత ఇంటర్ మొదటి సంవత్సరంలో రెండు శాతానికి పడిపోగా... ద్వితీయ సంవత్సరంలో మాత్రం ఒక శాతం పెరిగింది. వృత్తి విద్యాకోర్సుల ఫలితాలకు సంబంధించి జిల్లా... రాష్ట్రంలోనే అగ్రస్థానంలో నిలిచింది. గత సంవత్సరంతో పోలిస్తే ప్రైవేట్ జూనియర్ కాలేజీలకు దీటుగా ప్రభుత్వ జూనియర్ కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించాయి. అయితే.. ఎయిడెడ్ కాలేజీల్లో ఫలితాలు తీవ్ర నిరాశను మిగిల్చాయి. మొదటి, ద్వితీయ సంవత్సరం ఫలితాల్లో బాలురతో పోలిస్తే బాలికలు పైచేయి సాధించారు. ఫస్టియర్‌లో 41 శాతం ఉత్తీర్ణత మొదటి సంవత్సరం పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 33,775 మందివిద్యార్థులు హాజరుకాగా.. 13,879 మంది (41శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలికలు 17,522 మందికి గాను 8,139 మంది (46 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 16,253 మందికి గాను 5,740 మంది (35శాతం) ఉత్తీర్ణత పొందారు. ఒకేషనల్ విభాగంలో 3,966 మంది విద్యార్థులు పరీక్షకు హాజరుకాగా.. 2,333 మంది (59 శాతం) పాసయ్యారు. బాలికలు 1,584 మందికి గాను 1,025 (65శాతం), బాలురు 2,382 మందికిగాను 1,308 (55శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో 53 శాతం ఉత్తీర్ణత ద్వితీయ సంవత్సర పరీక్షలకు జిల్లావ్యాప్తంగా 34,354 మం ది విద్యార్థులు హాజరుకాగా.. 18,317 మంది (53 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలికలు 17,393 మందికి గాను 10,065 మంది (58 శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 17,393 మందికి 8,252 మంది (49శాతం) పాస్ అయ్యా రు. ఒకేషనల్ విభాగంలో 3,186 మంది విద్యార్థులు పరీక్షలకు హాజ రు కాగా.. 2,257 మంది (71శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలి కలు 1147మందికి 876 మంది (76శాతం) .. బాలురు 2,0 39 మందికి 1,381 (68శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ కాలేజీల ఫలితాలు.. జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కాలేజీ విద్యార్థుల ఉత్తీర్ణత శాతం గత ఏడాదితో పోలిస్తే మెరుగైంది. జిల్లావ్యాప్తంగా 29 ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. వీటిలో నుంచి ఫస్టియర్ విద్యార్థులు 4,917 మంది పరీక్షలకు హాజరు కాగా.. 1,899 మంది (39 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,486 మందికి గాను 856 మంది (34 శాతం).. బాలికలు 2,431 మందికి గాను 1,043 మంది (43 శాతం) ఉత్తీర్ణత సాధించారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణత శాతాన్ని పరిశీలిస్తే రాష్ట్రంలో నల్లగొండ జిల్లా ఏడో స్థానంలో నిలిచింది. అదేవిధంగా ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 4,126 మంది విద్యార్థులు హాజరుకాగా.. 2,871 మంది (70 శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 2,175 మందికిగాను 1,500 (69 శాతం).. బాలికలు 1951 మందికిగాను 1371 మంది (70 శాతం) మంది ఉత్తీర్ణత సాధించారు. సెకండియర్‌లో ప్రభుత్వ జూనియర్ కళాశాలల ఉత్తీర్ణతలో నల్లగొండ జిల్లా రాష్ట్రంలో నాలుగో స్థానంలో నిలిచింది. 29 కాలేజీల్లో పది మాత్రమే.. జిల్లాలోని 29 ప్రభుత్వ కాలేజీల్లో పది కళాశాలలు మెరుగైన ఫలితాలు సాధించి టాప్ టెన్‌లో నిలిచాయి. ప్రైవేట్ కాలేజీలకు దీటుగా ఫలితాలు రావడంపై ప్రభుత్వ కళాశాలల అధ్యాపకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఫస్టియర్ జనరల్ కేటగిరీలో... మొదటి సంవత్సరం ఫలితాల్లో నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 114 మంది విద్యార్థులకుగాను 109 మంది (96 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. భూదాన్‌పోచంపల్లి కాలేజీలో 137 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 117 మంది (85 శాతం) మంది.. తుంగతుర్తి కాలేజీలో 129 మందికి 109 మంది (84శాతం).. డిండి కాలేజీలో 168 మందికి 135 మంది (80శాతం), దేవరకొండ బాలికల జూనియర్ కాలేజీలో 129 మందికి 80 మంది (62 శాతం), నాంపల్లి కాలేజీలో 151 మందికి 90 మంది (60శాతం) విద్యార్థులు ఉత్తీర్ణులయ్యారు. సెకండియర్‌లో.. నాగార్జునసాగర్‌లోని ప్రభుత్వ జూనియర్ కాలేజీలో 153 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకాగా 150 మంది (98 శాతం), తుంగతుర్తి కాలేజీలో 174 మందికి 163 మంది (94 శాతం), భూదాన్‌పోచంపల్లి కాలేజీలో 90 మందికి గాను 84 మంది (93 శాతం), డిండి కాలేజీలో 177 మందికి 162 మంది (92శాతం), చింతపల్లి కాలేజీలో 195 మందికి 177 మంది (91 శాతం), నడిగూడెం కాలేజీ లో 121 మందికి 109 మంది (90 శాతం), దేవరకొండ బాలుర కాలేజీలో 145 మందికి 128 మంది (88 శాతం), దేవరకొండ బాలికల కాలేజీలో 142 మందికి 123 మంది (87 శాతం), యాదగిరిగుట్ట కాలేజీలో 191 మందికి 165 మంది (85 శాతం), రామన్నపేట కాలేజీలో 114 మందికి 95 మంది (83 శాతం) విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. ఫలితాల్లో ఎయి‘డెడ్’.... ఇంటర్ ఫలితాల్లో ఎయిడెడ్ కాలేజీలు చతికిలపడ్డాయి. మొదటి సంవత్సరం పరీక్షలకు 283 మంది విద్యార్థులు హాజరుకాగా.. కేవలం 30 మంది (11శాతం) ఉత్తీర్ణులయ్యారు. బాలురు 203 మందికి గాను 22 మంది (11శాతం), బాలికలు 80 మందికిగాను 8 మంది (10శాతం) ఉత్తీర్ణులయ్యారు. ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 241 మంది విద్యార్థులు హాజరు కాగా.. 55 మంది మాత్రమే (23శాతం) ఉత్తీర్ణత సాధించారు. బాలురు 168 మందికిగాను 42 మంది (25శాతం), బాలికలు 73 మందికి గాను 13 మంది (18శాతం) ఉత్తీర్ణులయ్యారు.