Latin
-
పోప్ ఫ్రాన్సిస్ కీలక నిర్ణయం
రోమ్: క్రైస్తవుల ఆరాధనా పద్ధతికి సంబంధించిన వ్యవహారంపై పోప్ ఫ్రాన్సిస్ కీలక నిర్ణయం తీసుకున్నారు. చర్చిలో చీలికకు కారణమవుతోందనే కారణంతో ‘లాటిన్ మాస్’పై శుక్రవారం ఆంక్షలు పెట్టారు. ఈ ఆంక్షలు వెంటనే అమల్లోకి వస్తాయని స్పష్టం చేశారు. ఈ చర్యతో మాజీ పోప్ బెనెడిక్ట్16 తీసుకున్న నిర్ణయాన్ని ప్రస్తుత పోప్ ఫ్రాన్సిస్ వ్యతిరేకించినట్లు అయింది. ప్రస్తుతమున్న స్థానిక భాష ఆరాధనా క్రమాన్ని 1960లలో జరిగిన వాటికన్2 సమావేశం నుంచి పాటిస్తున్నారు. అంతకు ముందు ఆ కార్యక్రమాన్ని కేవలం లాటిన్ భాషలోనే ప్రపంచమంతటా నిర్వహించేవారు. అయితే కొన్ని చోట్ల లాటిన్ భాష ఇంకా కొనసాగుతుండగా, పోప్ దానిపై ఆంక్షలు పెట్టారు. ప్రపంచంలోని ఇతర ప్రాంతాల బిషప్లెవరూ వారి ప్రాంతాల్లో లాటిన్ మాస్ గ్రూపులు ఏర్పడకుండా చూసుకోవాల్సిన బాధ్యతను కూడా ఈ ఆంక్షల్లో పోప్ ప్రస్తావించారు. అంతర్గతంగా చర్చిలో జరుగుతున్న వ్యవహారాలపై పోప్ నివేదిక తెప్పించుకోగా, అందులో లాటిన్ మాస్ వ్యవహారంపై ప్రత్యేక గ్రూపులు ఉన్నట్లు తేలింది. దీంతో తప్పక జోక్యం చేసుకోవాల్సిన బాధ్యత తనపై పడిందని పోప్ పేర్కొన్నారు. ప్రస్తుత పోప్‌పై సంప్రదాయవాదులు ఆయన నిర్ణయంపై వ్యతిరేకత వెలిబుచ్చుతున్నారు. -
మరో కాపీ వివాదంలో థమన్..?!
ప్రస్తుతం తెలుగు ఇండస్ట్రీలో మంచి ఫామ్‌లో ఉన్నారు సంగీత దర్శకుడు థమన్. అల వైకుంఠపురం హిట్‌తో దూసుకుపోతున్న తమన్ స్పీడ్‌కి క్రాక్ సినిమా బ్రేకులు వేసేలా కనిపిస్తుంది. రవితేజ హీరోగా గోపిచంద్ మలినేని దర్శకత్వంలో క్రాక్ సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఈ సినిమా నుంచి బల్లేగా దొరికావే బంగారం పాట రిలీజ్ అయ్యింది. సూపర్.. ఫెంటాస్టిక్ అంటూ రవితేజ ఫ్యాన్స్, తమన్ ఫ్యాన్స్ ఫుల్లు ఖుషి అవుతున్నారు. కానీ వారి ఆనందం ఎక్కువ సేపు నిలవలేదు. తమన్ ఈ ట్యూన్‌ని లాటిన్ చిత్రం నుంచి కాపీ చేశారంటూ నెటిజనులు ట్రోల్ చేస్తున్నారు. ఒరిజనల్ ‘సెల్వా ఎల్ నియాన్’ ట్యూన్‌ని కూడా షేర్ చేస్తున్నారు. ( థమన్ కాపీ కొట్టలేదు: వి దర్శకుడు ) ఇక బల్లే దొరికిపోయావ్ తమన్ అంటూ మీమ్స్ షేర్ చేస్తున్నారు నెటిజనులు. ఒక యూజర్ అయితే ‘‘థ్యాంక్స్ అన్న రెండు నెలలుగా కేవలం 47 మాత్రమే ఉన్న వ్యూస్ నీ వల్ల రాత్రికి రాత్రే 17కే అయ్యాయ్’’ అని కామెంట్ చేయగా.. మరి కొందరు ‘‘సాంగ్ లాటిన్.. కామెంట్స్ తెలుగు.. క్రెడిట్స్ తమన్.. ఎవరు గుర్తు పట్టరు అనుకున్నారు... కానీ దొరికిపోయారు.. ఈ వీడియో తప్పకుండా వైరల్ అవుతుంది’’ అంటూ నెటిజనులు తెగ ట్రోల్ చేస్తున్నారు. ఇక మరి కొందరు థమన్ పరిస్థితిని కింగ్ సినిమాలో నాగార్జున-బ్రహ్మానందం మధ్య వచ్చే కామేడీ సీన్‌తో పొలుస్తున్నారు. ఇక గతంలో ‘వి’ సినిమా బ్యాక్‌గ్రౌండ్ మ్యూజిక్ విషయంలో కూడా థమన్ కాపీ కొట్టాడనే ఆరోపణలు వచ్చిన సంగతి తెలిసిందే. -
ఎందుకు ఓడారంటే
వాషింగ్టన్: హిల్లరీదే గెలుపు అంటూ సర్వేలు, పోల్స్ ఘంటాపథంగా చెప్పినా ఆమె ఓటమికి కారణాలేంటి? ట్రంప్‌పై మహిళలు, లాటిన్ అమెరికన్ ఓటర్ల వ్యతిరేకతను హిల్లరీ ఎందుకు ఓట్ల రూపంలో మలుచుకోలేకపోయారు. కర్ణుడి చావుకు సవాలక్ష కారణాలన్నట్లు హిల్లరీ ఓటమికి అనేక అంశాలు పనిచేశాయని విశ్లేషకులు చెబుతున్నారు. ముఖ్యంగా ఆఫ్రో-అమెరికన్, లాటిన్, ఆసియన్ ఓటర్లతో పాటు యువ ఓటర్లను ఆకట్టుకోవడంలో హిల్లరీ విఫలమయ్యారు. దీంతో ఆ వర్గాలకు చెందిన ఓటర్లు ఓటింగ్‌లో ఎక్కువగా పాల్గొనలేదని సీఎన్ఎన్ చానల్ పేర్కొంది. 2012లో రిపబ్లికన్ అభ్యర్థి మిట్ రోమ్నీకి పడ్డ నల్లజాతీయుల, లాటిన్ ఓట్ల కంటే ట్రంప్‌కు ఈ సారి ఎక్కువ వచ్చాయి. హిల్లరీ ప్రచారం చేసిన ప్రాంతాల్లో ఆమెకు ఓట్లు బాగానే పడ్డా... అధ్యక్షుడు ఒబామా ప్రచారం నిర్వహించిన చోట్ల డెమోక్రాట్లకు ఓట్ల శాతం తగ్గడం విశేషం. ట్రంప్‌పై వ్యతిరేకత ఓట్లుగా మలచుకోవడంలో విఫలం 4 శాతంగా ఉన్న ఆసియన్ ఓటర్ల మద్దతు తగ్గడం కూడా హిల్లరీకి నష్టం కలిగించింది. మెక్సికో సరిహద్దుల్లో గోడ కడతానంటూ ట్రంప్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసినా... ఆ దేశస్తుల ఓట్లు పూర్తిగా హిల్లరీకి పడలేదు. 65 శాతం మంది హిల్లరీకి ఓటు వేయగా... 29 శాతం ట్రంప్‌కు ఓటేయడం అందరినీ ఆశ్చర్యపరచింది. 2012లో ఒబామాకు 71 శాతం మంది మెక్సికన్లు ఓటేశారు. ఇక స్పానిష్ మాట్లాడే ప్రజలు 2012తో పోల్చితే ఒక శాతం తక్కువగా హిల్లరీకి మద్దతిచ్చారు. యువ ఓటర్లును ఆకట్టుకోవడంలో హిల్లరీ విఫలమయ్యారు. 18 నుంచి 29 మధ్య వయసున్న వారిలో 55 శాతం మంది హిల్లరీకి ఓటేయగా... ట్రంప్‌కు 37 శాతం మంది ఓటేశారు. 2012లో ఒబామాకు 60 శాతం యువ ఓటర్లు మద్దతు పలికారు. మహిళల ఓట్లలో హిల్లరీకి 54 శాతం, ట్రంప్‌కు 42 శాతం పడ్డాయా. 2012లో ఒబామాకు 55 శాతం మహిళల ఓట్లు దక్కాయా. ట్రంప్ పట్ల 70 శాతం మహిళలు వ్యతిరేకత వ్యక్తం చేసినా 42 శాతం ఓటేయడం విశేషం. -
ఎస్ఓఎస్ అంటే అర్థం ఏమిటి?
మెడి క్షనరీ డాక్టర్లు మందులు రాసినప్పుడు కొన్ని అవసరమైతేనే అని రాస్తుంటారు. అప్పుడు ఆ మందును ఎస్ఓఎస్ అని సూచిస్తుంటారు. ఎస్ఓఎస్ అంటే ఏమిటన్నది చాలా ఆసక్తికరం. వైద్యశాస్త్రంలోని చాలా పదాలు లాటిన్ భాషకు చెందినవే. అలాగే ఎస్ఓఎస్ అనేది కూడా లాటిన్ పదబంధమే. ‘సి ఓపస్ సిట్’ అనే లాటిన్ మాటకు ఎస్ఓఎస్ అన్నది సంక్షిప్తరూపం. ‘సి ఓపస్ సిట్’ అంటే లాటిన్లో ‘అవరమైతేనే’ అని అర్థం. ఏదైనా మందును ‘అవసరం ఉంటే మాత్రమే తీసుకోండి’ అని సూచించేందుకు ఎస్ఓఎస్ అనే మాటను వైద్యులు వాడుతుంటారు. లక్షణాలు కనిపించినప్పుడు మాత్రమే వాడాల్సిన మందులకు (ఉదాహరణకు నొప్పినివారణ మందుల వంటివి) డాక్టర్లు ప్రిస్క్రిప్షన్పై ఎస్ఓఎస్ అని రాస్తుంటారన్నమాట. -
ఇంతకీ, ఏమాశిస్తున్నామ్?
పద్యానవనం విద్యనిగూఢ గుప్తమగు విత్తము, రూపము మానవాళికిన్ విద్యయశస్సు, భోగకరి, విద్య గురుండు, విదేశ బంధుడున్ విద్య విశిష్ట దైవతము, విద్యకు సాటి ధనంబు లేదిలన్, విద్య నృపాల పూజితము, విద్య నెరుంగని వాడు మర్త్యుడే! విద్య... ఇది విచిత్రమైన, విస్తృతార్థం కలిగిన పదమనిపిస్తుంది. ఇంతకీ విద్య అంటే ఏంటి? ‘విద్య అంటే తెలియదా! అవ్వ!! విద్య అంటే... చదువు’ అంటారు. చదువు అంటే ఏంటి? మళ్లీ ప్రశ్న. జ్ఞానాన్ని చదువంటారా? అదీ సంపూర్ణార్థం కాదేమో? చదువుకు ఎందరెందరో, ఎన్నెన్నో నిర్వచనాలిచ్చారు. ఒక పదబంధంలో చెప్పజాలనంత, ఒక వాక్యంలో బంధించజాలనంత విస్తృతార్థం ఉంది కనుకే సర్వకాలాల్లోనూ ఇదెంతో ప్రాధాన్యత సంతరించుకుంది. ‘‘పెద్ద పెద్ద చదువులు చదివావ్ ఏం లాభం?’’ అని పెదవి విరిచే సందర్భాలు, ‘‘చదవక ముందు కాకరకాయ, చదివాక గీకరకాయ’’ అనే దెప్పిపొడుపులు వింటూనే ఉంటాం. కానీ, ఇవి అరుదయిన విలోమ సందర్భాలు మాత్రమే! అత్యధిక సందర్భాల్లో విద్య మనిషికి ఒక దోహదకారిని గానే ఉంటూ వస్తోంది. విద్య అంటే ఏంటో సంపూర్ణంగా నిర్వచించలేనపుడు, ఒకింత తెలివిగా కన్యాశుల్కంలో గిరీషం చెప్పినట్టు, ‘నాతో మాట్లాడటమే ఓ ఎడ్యుకేషన్’ అని సాపేక్షంగా చెప్పాలి. మనకున్న పాటి తెలివితేటలు ఎదుటివాడికి లేవనిపించినపుడు, ‘విద్య రాని వాడు వింత పశువు’ అని ఓ సామెత వదలాలి. లాటిన్లో ‘ఎడ్యూస్’ అంటే మనిషి తనలోకి తాను చూసుకొని తనను తాను సమగ్రంగా అర్థం చేసుకోవడం. దాన్నుంచి పుట్టిందే ‘ఎడ్యుకేషన్’ అంటారు. ‘మనిషిలో ఉండే దైవత్వపు బహుముఖీన ఆవిష్కరణే విద్య’ అని వివేకానంద స్వామి వివరించారు. ఆధునికుల నిర్వచనాలకు ఏ మాత్రం తీసిపోని, సమగ్రమైన, సముచితమైన నిర్వచనాలు, వివరణలు ఎంతో పూర్వకాలం నుంచే భారతీయ సంస్కృతిలో నిక్షిప్తమై ఉన్నాయి. మచ్ఛుకు ఈ పద్యమే చూడండి! భర్తృహరి సంస్కృత సుభాషితాలను ఏనుగులక్ష్మణ కవి తెలుగులోకి అనువదించినపుడు చెప్పారీ పద్యాన్ని. పండంటి విద్యకు పది లక్షణాలన్నట్టు ముఖ్యమైన విశేషాలను చెప్పాడు. విద్య రహస్యంగా దాటిపెట్టిన నిధి అంటాడు. అప్పుడున్న పరిస్థితుల్లో, నాటి స్త్రీ-పురుష సంబంధాలు, హెచ్చు-తగ్గు భావనల వల్లనేమో విద్య పురుషులకు సౌందర్యం వంటిదంటాడు. ఏ రంగంలోనూ స్త్రీలు పురుషులకు తీసిపోని ఈ రోజుల్లో ఆ పదాన్ని పురుషులకే పరిమితం చేయకుండా, స్వల్పంగా మార్చి, ‘పూరుషాళికిన్’ అనే చోట ‘మానవాళికిన్’ అనే పాఠబేధంతో చెప్పుకుంటే నష్టం లేదనిపిస్తుంది. విద్య వల్ల కీర్తీ, సౌఖ్యం లభిస్తాయంటాడు. విద్య గురుడని కూడా చెబుతాడు. ‘గు’ అంటే చీకటి, ‘రు’అంటే తొలగించేవాడు, అంటే అజ్ఞానాంధకారం నుంచి జ్ఞానమనే వెలుగువైపు మనిషిని నడిపించడంలో విద్య కీలక భూమిక నిర్వహిస్తుంది కనుక దీన్ని నేరుగా గురువు అవవచ్చు. అప్పటివరకు పరిచయం లేని పరాయిదేశాల్లో కూడా పనికానిచ్చుకోవాలన్నా, రాణించాలన్నా.... కాస్త తెలివి తేటలు, కొంచెం చదువు ఉండాల్సిందే అనటంలో ఏ సందేహమూ లేదు. ఈ రోజున మన భారతీయ యువత ప్రపంచం నలుమూలలా విస్తరించి మంచి మంచి హోదాల్లో ఉన్నారంటే, అందుకు వారి కఠోర శ్రమ, విద్యావికాసం, తెలివితేటలే కారణం అన్నది సుస్పష్టం. విద్యతో పోల్చదగిన ధనమేదీ ఈ భూమ్మీద లేదంటారు విజ్ఞులు, ఆ మాటకూడా చెప్పారిక్కడ. నాటి రాజులే కాదు, నేటి పాలకులు కూడా విద్యాబుద్ధులు కలిగిన వారిని తప్పనిసరిగా ఆదరించాల్సి ఉంటుంది. అందుకే, మారుతున్న ప్రస్తుత సమాజంలోనూ విద్య లేని వాడినసలు మనిషి గానే పరిగణించరు. ‘‘ఎన్ని చదువులు చదివి, ఎంత నేర్చినగాని హీనుడవగుణంబు మానలేదు’ అన్న శతకకారుని మాటల్ని బట్టి, అప్పటివరకున్న అవగుణాలు చదువు వల్ల తొలగిపోవాల్సిందే(హీనుని విషయంలో తప్ప)అని కూడా మనం గ్రహించాలి. ‘‘చదువది ఎంత గల్గిన రసజ్ఞత ఇంచుక చాలకున్న నా చదవునిరర్థకంబు, గుణ సంయుతులెవ్వరు మెచ్చరెచ్చటన్’’ అని మారద వెంకయ్య కవి భాస్కర శతకంలో చెప్పిన మాట అక్షర సత్యం. చదవుకు ఓ గొప్ప నిర్వచనం అయిదారు వందల ఏళ్ల కింద శ్రీమద్భాగవతంలో పొతన చెప్పాడు. రాక్షస రాజైన హిరణ్యకశ్యపుడు తన కుమారుడు ప్రహ్లాదుడిని గురువుల వద్ద విద్యాభ్యాసానికి పంపుతూ ఒక మాటంటాడు. ‘‘చదువని వాడజ్ఞుండగు, చదివిన సదసద్వివేక చతురత గల్గున్....’’ ఎంత గొప్ప మాట! చదువని వాడు అజ్ఞానిగా నలుగురు దృష్టిలో పడిపోతాడనే కాకుండా చదువు యొక్క అంతిమ లక్ష్యమేమిటో కూడా చెప్పాడు పోతన. చదువు కేవలం ఉద్యోగం కోసమో, ఉపాధికోసమో, మరో సంపాదన కోసమో కాదట! ‘‘చదివిన సత్, అసద్ వివేక చతురత కల్గున్....’’ అంటే, ఏది మంచి-ఏది చెడు తేల్చుకోగలిగిన చాతుర్యం మనిషికి చదువు వల్ల అబ్బుతుందట! భేష్!! విద్య ఉద్దేశం, అంతిమ లక్ష్యం కూడా ఇదే!! - దిలీప్‌రెడ్డి -
ప్రేమ దక్కని తాత్వికుడు
ఇతరత్రా ప్రేమలకిది సందర్భం కాదు. అబ్బాయి తన నుదుటిని అమ్మాయి పాదాలకాన్చి ‘నువ్వు నాక్కావాలి’ అని కన్నీళ్లతో వేడుకునే ప్రేమకు, అమ్మాయి తన శక్తినంతా కూడగట్టుకుని చెయ్యి కందిపోయేలా అబ్బాయి ఆ చెంపా ఈ చెంపా పగలగొడుతూ, ‘‘నువ్వు నా జీవితంలోకి రాకుండా నేన్నొక్కదాన్నీ ఎలా బతికేస్తాననుకున్నావురా బుద్ధిహీనుడా’’ అని రోదిస్తూ మూర్ఛిల్లి పడిపోయే ప్రేమకు ఇది పుట్టినరోజు. అలాగైతే జర్మన్ తాత్వికుడు నీషే ప్రస్తావనకు ఇది సందర్భం కాదేమో. ‘దేవుడు చనిపోయాడు’ అని ప్రకటించినవాడు నీషే! పందొమ్మిదో శతాబ్దపు ఐరోపా ఉలిక్కిపడడానికి ఈ మాట చాలదా! ‘నీషేకు మతి చలించింది’ అన్నారు మతాధికారులు, రాజ్యాధినేతలు. ‘ఏమైనా అనండి, మీ విలువలకు విలువ లేదు, మీ విశ్వాసాలకు విశ్వసనీయత లేదు’ అన్నాడు నీషే. అతడేం చెప్పినా అందులో కవిత్వం ఉండేది. తత్వం ఉండేది. అవి రెండూ ఎవరికీ అర్థమయ్యేవి కావు! ‘‘ఏది నువ్వు కాదో అదే దైవం, అదే ఆదర్శం’’ అనేవాడు నీషే. ‘ఏమిటంటాడూ’ అన్నట్లు చూశారే తప్ప ఎవరూ అతడిని అర్థం చేసుకోలేదు. నిజానికి అతడే అర్థమయ్యే రూపంతో, రంగుతో, రుచితో లేడు. తండ్రికి మతిపోయినట్టే కొడుక్కీ పోయినట్లుంది అన్నారు కొందరు. నీషే తండ్రి మతి స్థిమితం తప్పి ముప్పై ఐదేళ్ల వయసుకే చనిపోయాడు. నీషేకీ అదే గతి పడుతుందనుకున్నారు. పట్టింది కానీ మరీ ముప్పై ఐదేళ్లకు పట్టలేదు. చివరి పదేళ్లూ మానసిక వైద్యుల చుట్టూ తిరిగాక తన 55వ యేట అన్ని విధాలా శల్యమై, శిథిలమై చనిపోయాడు నీషే. నీషే పూర్తి పేరు ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ నీషే. ప్రష్యాలో పుట్టాడు. ఫ్రీడ్రిక్ విల్హెల్మ్ అన్నది అప్పటి ప్రష్యా రాజు పేరు. ఆయన పుట్టిన రోజే (అక్టోబర్ 15) నీషే కూడా పుట్టడంతో తండ్రి అతడికి రాజుగారి పేరు జోడించాడు. తర్వాత రాజుగారు మతి చలించి మరణించడం, నీషే తండ్రి, నీషే కూడా మతిస్థిమితం కోల్పోయి చనిపోవడం ఒక చారిత్రక విచిత్రం. పెద్దయ్యాక చూడ్డానికి దున్నపోతు కొమ్ముల్లాంటి బలిష్ఠమైన మీసాలతో కరుకుగా కనిపించేవాడు కానీ... చిన్నప్పుడు నీషే కోమలంగా, కౌమారంలోని బాలికలా ఉండేవాడు. ఆడితే చెల్లితో, లేదంటే బయటి ఆడపిల్లలతో. వాళ్లూ ఖాళీగా లేకపోతే పుస్తకాలు. పోర్టా స్కూల్లో అతడు చదువుకున్నది గ్రీకు, లాటిన్, సైన్స్. బాన్, లీప్జిగ్ యూనివర్శిటీలలో భాషా శాస్త్రం. జీవితంలో పడ్డాక షోపెన్హోవర్ నిరాశావాదం. తర్వాత కొన్నాళ్లు బలవంతంగా సైన్యంలో. అక్కడి నుంచి తప్పించుకుని వచ్చాక బేసిల్ (స్విట్జర్లాండ్) విశ్వవిద్యాలయంలో ప్రొఫెసర్‌గా ఉద్యోగం. తర్వాత తన 39 వ ఏట ‘దజ్ స్పేక్ జరతూస్త్ర’ గ్రంథ రచన. దీనర్థం ‘జరతూస్త్ర ఇలా అన్నాడు’ అని. నీషే తను చెప్పదలచుకున్నవన్నీ జరతూస్త్ర చెప్పినట్లుగా చెప్పాడు. జరతూస్త్ర ప్రాచీన పర్షియన్ మత ప్రవక్త. ‘నేను చెబుతాను మీరు వినండి’ అంటే ఎవరూ వినరని అలా ఆ ప్రవక్తను అడ్డం పెట్టుకున్నాడు. ‘సాధనేచ్ఛే చోదకశక్తి’ అన్నది నీషే సిద్ధాంతం. కానీ అతడు మాత్రం తన ప్రేమను సాధించుకోలేకపోయాడు! (చూ: ఆండ్రూ షాఫర్ రాసిన ‘గ్రేట్ ఫిలాసఫర్స్ హూ ఫెయిల్డ్ ఎట్ లవ్’). జీవితమంతా ఒంటరిగానే గడిపాడు నీషే. స్నేహితులు లేరు. బంధువులు లేరు. ఉన్న ఒక్కగానొక్క స్నేహితుడు వాగ్నర్‌తో గొడవ పెట్టుకుని మాట్లాడ్డం మానేశాడు. వాగ్నర్ అకస్మాత్తుగా ఆస్తికుడిగా మారినందుకు నీషే పడిన గొడవ అది! శారీరకంగా కూడా నీషే బలహీనుడు. ఎప్పుడూ ఏదో ఒక అనారోగ్యం. ఒక దశలో అతడు స్త్రీ ప్రేమ కోసం పరితపించాడు. ఒకరి తర్వాత ఒకరుగా నలుగురు అమ్మాయిలను ప్రేమించాడు. తన ప్రేమ విషయం తెలియజేశాడు. ఒక్కరు కూడా అతడి ప్రేమను అంగీకరించలేదు. అందరికన్నా ఎక్కువగా అతడు ప్రేమించినది లూవాన్ సెలోమీ ని. చాలా అందంగా ఉండేది. ఫిన్లాండ్ అమ్మాయి. నీషే రోమ్‌లో ఉండగా ఆమె పరిచయం అయింది. ‘నిన్ను ప్రేమిస్తున్నా’ అన్నాడు. కానీ ఆమె అతడి రచనలను మాత్రమే ప్రేమించానని చెప్పి, ఒక సాదాసీదా యువకుడిని పెళ్లి చేసుకుని, ఈ తత్వవేత్తను వదిలేసింది. ఆ తర్వాత నీషే ఎవ్వర్నీ ప్రేమించలేదు. పైగా మొత్తం స్త్రీ జాతినే ద్వేషించడం మొదలు పెట్టాడు. స్త్రీలు మనుషులు కాదు.. పిల్లులు, పక్షులు అన్నాడు. వారిని నమ్మకూడదని ప్రబోధించాడు. నీషే భావాలలో కొన్ని నాజీల విశ్వాసాలకు దగ్గరగా ఉండేవి. అందుకేనేమో నీషే మరణించినప్పుడు వీమర్ నగరంలోని ఆయన ఇంటికి వెళ్లి మరీ హిట్లర్ నివాళులు అర్పించాడు. కనీసం ఒక్క అమ్మాయైనా నీషే ప్రేమను అంగీకరించి, బాహువులలోకి తీసుకుని ఉంటే తన స్నేహితుడు వాగ్నర్లా నీషే కూడా నాస్తికత్వం నుంచి ఆస్తికత్వం వైపు మళ్లి ఉండేవాడేమో!