laxmi prasanna
-
కుమార్తెను హతమార్చిన తండ్రి అరెస్టు
చిత్తూరు, ములకలచెరువు: కన్నకూతురుని హతమార్చిన తండ్రిని పోలీసులు అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఎస్ఐ ఈశ్వరయ్య కథనం మేరకు.. ములకలచెరువు మండలం బోరెడ్డిగారిపల్లెలో చెందిన శ్రీకాంత్‌రెడ్డి(44), పుణ్యవతి దంపతులకు లక్ష్మీప్రసన్న (14) ఒక్కగానొక్క కుమార్తె. బాలిక ములకలచెరువులోని కస్తూర్బాగాంధీ పాఠశాలలో తొమ్మిదో తరగతి చదువుతోంది. శ్రీకాంత్‌రెడ్డి బోర్‌వెల్‌లో పనిచేస్తున్నాడు. భర్త తరచూ గొడవ పడుతుండడంతో పుణ్యవతి ఎనిమిదేళ్లుగా భర్తకు దూరంగా బెంగళూరులో ఉంటోంది. పెద్ద మనుషులు పంచాయితీ చేసినా ప్రయోజనం లేదు. శ్రీకాంత్‌రెడ్డి గత ఏడాది బోర్‌వెల్‌లో పనిచేస్తూ నాలుగు నెలలు మెదక్ జిల్లా తుఫ్రాన్‌లో ఉన్నాడు. ఈ క్రమంలో కుమార్తెను కూడా అక్కడికే తీసుకెళ్లి ప్రశాంతంగా జీవించాలని భావించాడు. ఈ నెల 2వ తేదీన కుమార్తెను తీసుకుని స్వగ్రామం నుంచి మెదక్ బయలుదేరాడు. 4వ తేదీ రాత్రి 10 గంటల సమయంలో తుఫ్రాన్కి రెండు కిలోమీటర్ల దూరంలోనే బస్సు దిగేశారు. అక్కడి నుంచి నడుచుకుంటూ వెళదామని కుమార్తెతో చెప్పాడు. చీకటిలో ఎలా వెళ్లేదని కుమార్తె నిలదీయడం, ఇంటికి వెళ్లిపోదామని గట్టిగా కోరడంతో ఇద్దరు ఘర్షణ పడ్డారు. ఆగ్రహించిన తండ్రి గతంలో భార్య దూరమైందని, ఇప్పుడు కుమార్తె కూడా దూరమవుతుందేమోనని భావించాడు. దారి పక్కనే ఉన్న క్వారీలో బండరాయితో బాలిక తలమీద బాది చనిపోయిందనుకుని అక్కడి నుంచి పరారయ్యాడు. 5వ తేదీ ఉదయం క్వారీలోకి రాళ్లు కొట్టడానికి వెళ్లిన కూలీలు కొన ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్న బాలికను గమనించి తుఫ్రాన్ పోలీసులకు సమాచారం అందించారు. తుఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు అక్కడికి చేరుకుని బాలికను 108 ద్వారా సికింద్రాబాదు గాంధీ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బాలిక మృతిచెందింది. గుర్తు తెలియని వ్యక్తులు బాలికను హత్య చేసి ఉంటారని భావించిన పోలీసులు పోస్టుమార్టం నిర్వహించి మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో ఉంచారు. అరెస్టు చూపించిన తుఫ్రాన్ పోలీసులు కుమార్తె హత్యకు కారణమైన శ్రీకాంత్‌రెడ్డిని తుఫ్రాన్ సీఐ లింగేశ్వరరావు సోమవారం అరెస్టు చూపించారు. పలు సెక్షన్లు నమోదు చేసి రిమాండ్ తరలించినట్టు ఎస్ఐ ఈశ్వరయ్య పేర్కొన్నారు. కేసు ఛేదించిన ఎస్ఐ ఈశ్వరయ్య, సిబ్బంది వెంకటేష్, కుమార్‌ను అక్కడి ఉన్నతాధికారులు అభినందించారు. హత్య బయటపడతాదనిపారిపోయిన నిందితుడు శ్రీకాంత్‌రెడ్డి ఈ నెల 7వ తేదీన బోరెడ్డివారిపల్లెకు వచ్చాడు. కుటుంబ సభ్యులు కుమార్తె గురించి ఆరా తీయగా పొంతనలేని సమాధానం చెప్పడంతో అనుమానం వచ్చింది. అతను కుమార్తె హత్య విషయం బయటపడతుందని గ్రహించి పారిపోయాడు. అనంతరం కుటుంబ సభ్యులు శ్రీకాంత్‌రెడ్డి భార్య పుణ్యవతిని బెంగళూరు నుంచి పిలిపించి ములకలచెరువు పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఎస్ఐ ఈశ్వరయ్య బాలిక అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొబైల్ లొకేషన్ ద్వారా శ్రీకాంత్‌రెడ్డిని తిరుపతిలో అదుపులోకి తీసుకున్నారు. విచారణలో కుమార్తెను తానే హత్య చేసినట్లు శ్రీకాంత్‌రెడ్డి అంగీకరించాడు. -
ఫైట్ మాస్టర్‌గా మారిన మనోజ్
స్టార్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన యంగ్ హీరో మంచు మనోజ్, యాక్షన్ కొరియోగ్రాఫర్‌గా మారాడు. గతంలో తాను నటించిన సినిమాలకు మాత్రమే ఫైట్స్ కంపోజ్ చేసిన మనోజ్ ఇప్పుడు బయటి సినిమాలకు పనిచేస్తున్నాడు. అయితే అది కూడా ఎవరో నటించిన సినిమా ఏం కాదు..? మంచు లక్ష్మీ ప్రధాన పాత్రలో తెరకెక్కుతున్న లక్ష్మీ బాంబ్ సినిమా కోసం మనోజ్ ఫైట్ సీక్వన్స్ను కంపోజ్ చేశాడు. సినిమా క్లైమాక్స్‌లో వచ్చే ఈ యాక్షన్ సీన్స్‌కు ఎంతో ఇంపార్టెన్స్ ఉందని, మనోజ్ మంచి యాక్షన్ ఎపిసోడ్‌ను డిజైన్ చేశాడని చెపుతున్నారు చిత్రయూనిట్. ప్రస్తుతం ఒక్కడే మిగిలాడు షూటింగ్లో పాల్గొంటున్న మనోజ్, మరో రెండు సినిమాలకు అంగీకరించాడు. హీరోగా కొనసాగుతూనే ఫైట్ మాస్టర్ గానూ సత్తా చాటుతున్నాడు మంచువారబ్బాయి. -
ఇకనుంచీ అలా చేయదలుచుకోలేదు
‘‘ఇప్పటివరకు చేసినవాటిలో కొన్ని సినిమాలకు పారితోషికం తీసుకోలేదు. ఇకనుంచీ అలా చేయదల్చుకోలేదు. మా నాన్నగారు ధనవంతులే. కానీ, నేను కాదు. ఇంకా ఆయన మీద ఆధారపడితే ఏం బాగుంటుంది? నాకూ కుటుంబం ఉంది కదా. అందుకే, మంచి పాత్ర, అందుకు తగ్గ పారితోషికం ఇవ్వడానికి ఎవరు సిద్ధంగా ఉన్నా చేస్తా’’ అని లక్ష్మీప్రసన్న స్పష్టం చేశారు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో చాణక్య బూనేటి నిర్మించిన ‘చందమామ కథలు’లో ఆమె నటించారు. రేపు ఈ చిత్రం విడుదల కానుంది. ఈ సందర్భంగా లక్ష్మీప్రసన్న మాట్లాడుతూ -‘‘ఈ కథ విన్నప్పుడు ఇలాంటి సినిమా వదులుకుంటే, భవిష్యత్తులో మళ్లీ ఇంత మంచి అవకాశం రాదనిపించింది. ఎనిమిది కథలతో సినిమా అంటేనే చాలా కొత్తగా ఉందనిపించింది’’ అని చెప్పారు. ఈ సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ -‘‘ఇందులో నాది గ్లామరస్‌గా ఉండే మోడల్ కేరక్టర్. ఈ మోడల్ సిగరెట్ కాలుస్తుంది.. మందు కొడుతుంది. వాస్తవానికి సిగరెట్ ఎలా పట్టుకోవాలో నాకు తెలియదు. దాంతో కొంతమందిని పరిశీలించాను. మందు కొట్టే సన్నివేశాలకు కూడా ఇతరులను అబ్జర్వ్ చేశాను. నా కేరక్టర్ మాట్లాడే మాటలు అక్కడక్కడా అభ్యంతరకరంగా కూడా ఉంటాయి. ‘ఇలాంటి డైలాగులా? కత్తెర పడుతుందేమో’ అని దర్శకుడితో అంటే, ‘ఈ కేరక్టర్ ఇలానే మాట్లాడాలి’ అన్నారు. మోడల్‌గా చేయడం కోసం నేను హిందీ చిత్రం ‘ఫ్యాషన్’ని కొంత ఆదర్శంగా తీసుకున్నా’’ అని చెప్పారు. సిగరెట్, మందు తాగడం వంటి సన్నివేశాల్లో నటిస్తే, నెగిటివ్ ఇమేజ్ ఏర్పడే అవకాశం ఉండదా? అన్న ప్రశ్నకు -‘‘ఓ నటిగా ఎంతైనా చేయాలనే విషయాన్ని నేను పూర్తిగా నమ్ముతాను. విష్ణు, మనోజ్‌కి ఈ సన్నివేశాల గురించి తెలుసు. నాన్నగారికే తెలియదు. ఒకవేళ సినిమా చూసిన తర్వాత ‘ఎందుకిలాంటివి చేశావ్?’ అని అడిగితే ‘మీరే కదా డాడీ.. కళాకారులు ఏ పాత్రై నా చేయాలని అంటుంటారు’ అని కూల్ చేసేస్తా’’ అన్నారు. చందమామ కథలు’లాంటి మల్టీస్టారర్ చిత్రంలో నటించడంవల్ల మీకు ప్రాధాన్యం ఉంటుందంటారా? అని అడిగితే -‘‘మంచి సినిమాలో నాది చిన్న పాత్ర అయినా ఫర్వాలేదు. చివరికి ఒక్క సన్నివేశంలో కనిపించినా చాలు. కాకపోతే, కథకు కీలకంగా ఉండాలి. ఈ సినిమాలో నా పాత్ర మాత్రమే కాదు.. అందరివీ బాగుంటాయి’’ అని చెప్పారు. తదుపరి సొంత సంస్థలో కొత్త దర్శకునితో ఓ సినిమా నిర్మించనున్నట్లు, అందులో తానే నటించనున్నట్లు లక్ష్మీ తెలిపారు.