Lay outs regulation
-
‘ఎల్ఆర్ఎస్’ ఆధారంగా ఇకపై పన్నుల వడ్డన
సాక్షి, హైదరాబాద్: లే–అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) దరఖాస్తుదారులపై ఖాళీ స్థలాల పన్ను (వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్) పడబోతోంది. యజమానులు ఎవరో, వారి చిరునామా తెలియక ఇంతకాలం పాటు అత్యధిక శాతం ఖాళీ స్థలాలపై ప్రభుత్వం పన్నులు విధిం చలేకపోయింది. ఇప్పుడు ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారుల నుంచి ప్లాటు విస్తీర్ణం, యజమాని పేరు, చిరునామా, ఫోన్ నంబర్ తదితర వివరాలను సేకరించింది. ప్లాట్ల క్రమబద్ధీకరణతో పాటు వీటిపై ఖాళీ స్థలాల పన్ను మదింపునకు ఈ డేటా బేస్‌ను ప్రభుత్వం రెండు విధాలుగా వినియోగించుకోబో తోంది. గతేడాది ఆగస్ట్ 31న ప్రభుత్వం తీసుకొచ్చిన ఎల్ఆర్ఎస్ కింద రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పట్ట ణాలు, గ్రామ పంచాయతీల పరిధిలోని 25.59 లక్షల అనధికార ప్లాట్లు, లే–అవుట్ల క్రమబద్ధీకరణకు దరఖాస్తులొచ్చాయి. ఈ ప్లాట్లు, లే–అవుట్లు సమీప భవిష్యత్‌లో వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి రానున్నాయి. వచ్చే ఆర్థిక సంవత్సరం నుంచే వీటిపై సంబంధిత పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఈ మేరకు పన్నులు విధించే అవకాశాలున్నాయని ప్రభుత్వ వర్గాలు పేర్కొంటున్నాయి. దీని కోసం ఎల్ఆర్ఎస్–2020 డేటా బేస్‌ను త్వరలో ఆయా పురపాలికలు, గ్రామ పంచాయతీలకు ప్రభుత్వం అందజేయనుందని ప్రభుత్వంలోని ఉన్నత స్థాయి వర్గాలు పేర్కొంటున్నా యి. ఈ వివరాల ఆధారంగా ఖాళీ స్థలా లపై విధించే పన్నును స్థానిక పురపాలికలు/గ్రామ పంచాయతీలు మదించి దరఖాస్తుదారుల చిరునామాకు డిమాండ్ నోటీసులు పంపించే అవకాశముంది. 100% పన్నులు వసూలే లక్ష్యం.. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 100 శాతం వ్యవసాయేతర ఆస్తులపై ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్, పన్నేతర చార్జీల వసూళ్లను 100 శాతం జరపాలని, దీంతో అన్ని పురపాలికలు, గ్రామ పంచాయతీలు ఆదాయపరంగా స్వయం సంవృద్ధి సాధిస్తాయని ప్రభుత్వం భావిస్తోంది. స్థానిక సంస్థల్లో పన్నులు, చార్జీలను ఆయా సేవల కల్పనకు అవుతున్న వాస్తవ వ్యయం మేరకు ఎప్పటికప్పుడు పెంచి వసూలు చేయాలని కేంద్ర ప్రభుత్వం సైతం రాష్ట్రాలకు లక్ష్యాలను నిర్ధేశిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధానంగా పట్టణ ప్రాంతాల్లో ఆస్తి పన్నులు, వేకెంట్ ల్యాండ్ ట్యాక్స్ పరిధిలోకి రాకుండా మిగిలిన పోయిన గృహాలు, ఖాళీ స్థలాలను పన్నుల పరిధిలోకి తీసుకురావడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. గతంలో సైతం డేటాబేస్‌తో పన్నులు ధరణి పోర్టల్ రూపకల్పన కోసం గతేడాది రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన వ్యవసాయేతర ఆస్తుల నమోదు కార్యక్రమంలో భాగంగా ఇంటింటికి తిరిగి నిర్వహించిన సర్వేలో ఆస్తి పన్నుల పరిధిలోకి రాని 1,09,735 గృహాలను పురపాలకశాఖ గుర్తించింది. వీటిపై ఆస్తి పన్ను విధించాలని రాష్ట్రంలోని అన్ని పురపాలికలకు ఇటీవల రాష్ట్ర పురపాలక శాఖ ఆదేశించింది. తెలంగాణ ఏర్పడ్డాక తొలిసారిగా 2015లో ఎల్ఆర్ఎస్ను ప్రవేశపెట్టినప్పుడు సైతం దరఖాస్తుదారుల వివరాల ఆధారంగా ప్లాట్లపై ఖాళీ స్థలాల పన్నులను స్థానిక పురపాలికలు విధించాయి. అనుమతి లేకుండా/అనుమతులను ఉల్లంఘించి నిర్మించిన కట్టడాలపై.. ఉల్లంఘనల తీవ్రత ఆధారంగా 25 శాతం నుంచి 100 శాతం వరకు ఆస్తి పన్నులను అధికంగా జరిమానాలుగా వసూలు చేయాలని పురపాలక శాఖ నిబంధనలు పేర్కొంటున్నాయి. అయితే అక్రమ కట్టడాలు, ఉల్లంఘనలకు సంబంధించిన వివరాలు లేక గతంలో జరిమానాలు విధించలేకపోయారు. బీఆర్ఎస్–2015 కింద అక్రమ కట్టడాల క్రమబద్ధీకరణకు పెద్ద ఎత్తున దరఖాస్తులు రావడం, అందులో ఉల్లంఘనలకు సంబంధించిన పూర్తి సమాచారం ఉండటంతో, ఆయా కట్టడాలపై జరిమానాలను విధించడానికి సమాచారాన్ని ప్రభుత్వం ఉపయోగించుకుంది. బీఆర్ఎస్–2015 అమలుపై హైకోర్టు స్టే విధించడంతో దరఖాస్తులు పరిష్కారమయ్యే వరకు జరిమానాలు చెల్లించక తప్పట్లేదని దరఖాస్తుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
ఏపీ: అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిపివేత
సాక్షి, అమరావతి : సుబ్బారావు విజయవాడ శివారులోని ఒక వెంచర్లో ప్లాట్ కొనుగోలు చేశాడు. కూడబెట్టుకున్న సొమ్ముకు మరికొంత అప్పు చేసి రిజిస్టర్ చేయించుకున్నాడు. తీరా ఇప్పుడు ఆ లే అవుట్‌కు అనుమతుల్లేవని బయటపడింది. కొనేవరకు వెంటపడిన దళారిగానీ, వెంచర్ యజమానిగానీ సమాధానం చెప్పడంలేదు. సుబ్బారావుకు దిక్కుతోచడంలేదు. ఇకపై ఇటువంటి అక్రమాలు జరగకుండా రాష్ట్ర ప్రభుత్వం చెక్ పెట్టింది. సామాన్యులు మోసపోకుండా చూసేందుకు చర్యలు చేపట్టింది. అనధికార, అక్రమ లే అవుట్లపై పురపాలకశాఖ కొరఢా ఝుళిపించింది. వీటి రిజిస్ట్రేషన్లకు అడ్డుకట్ట వేసింది. అనధికార, అక్రమ లే అవుట్ల వివరాలను అన్ని జిల్లాల్లో రిజిస్ట్రార్ కార్యాలయాలకు పంపింది. ఆ లే అవుట్లల్లో రిజిస్ట్రేషన్లు చేయవద్దని కోరింది. ప్రజలు మోసపోకుండా ముందే పరిశీలించుకునేందుకు వీలుగా ఈ జాబితాలను పట్టణ, వార్డు సచివాలయాల్లోను, పట్టణాభివృద్ధి సంస్థల పరిధిలోని పంచాయతీల్లోను అందుబాటులో ఉంచింది. దీంతో సామాన్యులకు ఊరట లభించింది. రాష్ట్రంలో అనధికార, అక్రమ లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపేయడం ఇదే తొలిసారి. 6,076 లే అవుట్లు.. 34,167 ఎకరాలు పురపాలకశాఖ రాష్ట్రంలో ఇప్పటివరకు 6,076 అనధికార లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. మొత్తం 34,167 ఎకరాల్లో ఈ లే అవుట్లు వేశారు. వాటిలో నిబంధనల మేరకు రోడ్లు, పార్కులకు భూమి కేటాయించకపోవడం, ప్రభుత్వ స్థలాలను ఆక్రమించినవి, ప్రైవేటు వివాదాల్లో ఉన్న భూములు మొదలైనవి ఉన్నాయి. ఆ అంశాలను పట్టించుకోకుండా లే అవుట్లు వేసి సామాన్యులకు విక్రయించాలని కొందరు రియల్టర్లు భావించారు. నిబంధనల ప్రకారం వాటికి అనుమతులు తీసుకోకుండా ప్లాట్లు వేసి విక్రయాలకు సిద్ధమయ్యారు. ముందు అమ్మి సొమ్ముచేసుకుంటే తరువాత ఎప్పుడో క్రమబద్ధీకరించుకోవచ్చని ఎత్తుగడ వేశారు. దీన్ని గమనించిన పురపాలకశాఖ ఆ లే అవుట్లను బ్లాక్ లిస్టులో పెట్టింది. వాటిని రిజిస్ట్రేషన్ చేయొద్దని రిజిస్ట్రార్ కార్యాలయాలకు జాబితా కూడా సమర్పించింది. అనధికార లే అవుట్ల రిజిస్ట్రేషన్లు నిలిచిపోయాయి. ఆ ప్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు ఇబ్బందులు పడకుండా పురపాలక శాఖ అడ్డుకోగలిగింది. నిబంధనలను పాటిస్తేనే భవిష్యత్‌లో వాటికి రిజిస్ట్రేషన్లకు అవకాశం కల్పిస్తారు. సామాన్యులు మోసపోకూడదనే.. అనధికార, అక్రమ లే అవుట్లలో ప్లాట్లు, ఫ్లాట్లు కొనుగోలు చేసి సామాన్యులు మోసపోతున్నారు. దీన్ని అడ్డుకునేందుకే ఇటువంటి లే అవుట్ల రిజిస్ట్రేషన్లను నిలిపివేయించాం. ఇది సత్ఫలితాలను ఇస్తోంది. వ్యవస్థను పూర్తిగా ప్రక్షాళన చేసేందుకు ఈ కార్యాచరణ చేపట్టాం. - వి.రాముడు, డైరెక్టర్, టౌన్ ప్లానింగ్ విభాగం, పురపాలకశాఖ జిల్లాల వారీగా రిజిస్ట్రేషన్లు నిలిపేసిన అనధికార, అక్రమ లే అవుట్లు -
ఇకపై లే అవుట్ క్రమబద్ధీకరణ గుదిబండే!
- ఎల్ఆర్ఎస్కి దరఖాస్తు చేసుకోని వారికి భారీ జరిమానాలతో మరో అవకాశం - 33% అదనపు ఎల్ఆర్ఎస్ చార్జీలు, 14% ప్రస్తుత మార్కెట్ ధర కలిపి చెల్లించాలి - పురపాలక శాఖ ఉత్తర్వులపై బిల్డర్ల అసంతృప్తి సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లే అవుట్ల క్రమబద్ధీకరణ గుదిబండగా మారనుంది. లే అవుట్ల క్రమబద్ధీకరణ పథకం (ఎల్ఆర్ఎస్) కింద దరఖాస్తు చేసుకోని వారి భూములు/లే అవుట్ల క్రమబద్ధీకరణకు భారీ జరిమా నాతో మరో అవకాశం కల్పిస్తూ పురపాలక శాఖ జారీ చేసిన ఉత్తర్వులు ఇళ్ల నిర్మాణాలకు పెనుభారంగా మారాయి. 2015 నవంబర్ 2న రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఎల్ఆర్ఎస్ గడువు ఇప్పటికే ముగిసింది. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీల పరిధిలో ఎల్ఆర్ఎస్ కింద దరఖాస్తు చేసుకోని వారి లే అవుట్లు, ప్లాట్లు, భూముల్లో ఇళ్లు, భవన నిర్మాణాలకు అనుమతులు జారీ చేసే సమయంలో భారీ మొత్తంలో జరిమానాలు వసూలు చేసి సంబంధిత లే అవుట్లు, ప్లాట్లు, భూములు క్రమబద్ధీకరించాలని రాష్ట్ర పురపాలక శాఖ గత నెల 6న ఉత్తర్వులు జారీ చేసింది. వీటినే రాష్ట్రంలోని అన్ని మునిసిపల్ కార్పొరేషన్లు, మునిసిపాలిటీలు, నగర పంచాయతీలకు వర్తింపజేస్తూ గత నెల 28న మరో ఉత్తర్వులు జారీ చేసింది. ఈ రెండు ఉత్తర్వుల ప్రకారం...ఇకపై లే అవుట్లు, ప్లాట్ల క్రమబద్ధీకరణ కోసం 2015 నాటి ఎల్ఆర్ఎస్ చార్జీలకు అదనంగా జరిమానాల రూపంలో మరో 33 శాతం ఎల్ఆర్ఎస్ చార్జీలను చెల్లించాలని, దీనికి తోడు భూమి ‘ప్రస్తుత మార్కెట్ విలువ’లో 14 శాతాన్ని ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీల రూపంలో చెల్లించాలి. బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థల ఆందోళన ప్రస్తుత మార్కెట్ విలువ ప్రకారం 14 శాతం ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు చెల్లించాలని తీసుకున్న నిర్ణయం గుదిబండగా మారుతుందని బిల్డర్లు, నిర్మాణ రంగ సంస్థలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ప్రధానంగా ఎప్పుడో ఏళ్ల కింద కొనుగోలు చేసిన భూముల మార్కెట్ ధరలు ప్రస్తుతం ఎన్నో రెట్లు పెరిగిపోయాయి. గతంలో కొనుగోలు చేసిన భూముల మొత్తం ధరతో పోల్చితే ప్రస్తుత మార్కెట్ విలువలో 14 శాతమే అధికంగా ఉంటుందని బిల్డర్లు అభిప్రాయపడుతున్నారు. ఎల్ఆర్ఎస్ చార్జీలకు అదనంగా విధించిన 33 శాతం చార్జీలతో చెప్పుకోదగ్గ భారం పడకపోయినా, దీనికి అదనంగా 14 శాతం మార్కెట్ విలువను సైతం ఓపెస్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలుగా చెల్లించాలని ఆదేశించడం పట్లే వ్యతిరేకత వ్యక్తమవుతోంది. భవన నిర్మాణ అనుమతుల సమయంలోనే లే అవుట్ల క్రమబద్ధీకరణకు జరిమానాలతో ఎల్ఆర్ఎస్ చార్జీలూ వసూలు చేయాలని పురపాలక శాఖ ఆదేశించడంతో భవన నిర్మాణ అనుమతులు పొందడం మరింత క్లిష్టంగా మారుతుందని పురపాలక శాఖ వర్గాలు పేర్కొం టున్నాయి. ప్రస్తుత మార్కెట్ విలువకు బదులు భూమి కొన్ననాటి విలువ ప్రకారం ఓపెన్ స్పేస్ కంట్రిబ్యూషన్ చార్జీలు వసూలు చేస్తే నిర్మాణ రంగానికి ఊరట లభించనుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది.