laying off
-
Google: ఉద్యోగులను వదిలించుకునేందుకు ఇన్ని వేల కోట్లా?
సాధారణంగా ఖర్చును తగ్గించుకునేందుకు కంపెనీలు లేఆఫ్‌ల పేరుతో ఉద్యోగులను తొలిగిస్తున్నాయి. అయితే ఉద్యోగులను వదిలించుకోవడానికి కంపెనీలు వేలాది కోట్లు ఖర్చు చేస్తున్నాయని చేస్తున్నాయని మీకు తెలుసా? అవును నిజమే.. లేఆఫ్‌ల కోసం టెక్ దిగ్గజం గూగుల్ చేసిన ఖర్చు వివరాలు తాజాగా వెల్లడయ్యాయి. ఇవి చూస్తే అవాక్కవుతారు..! రూ.17 వేల కోట్లు గూగుల్ యాజమాన్య సంస్థ ఆల్భాబెట్ వెల్లడించిన తాజా త్రైమాసిక ఫలితాల ప్రకారం.. తొలగించిన ఉద్యోగులకు సీవెరన్స్ (తొలగింపు పరిహారం), సంబంధిత ఇతర చెల్లింపుల కింద గూగుల్ చెల్లించిన మొత్తం 2.1 బిలియన్ డాలర్లు ( దాదాపు రూ.17 వేల కోట్లు) . ఇది కేవలం 2023 ఒక్క ఏడాదిలో చేపట్టిన లేఆఫ్‌లకు అయిన ఖర్చు మాత్రమే. గూగుల్ 2023 జనవరిలో ప్రకటించిన మొదటి రౌండ్ లేఆఫ్‌లలో దాదాపు 12 వేల మందిని అంటే తమ వర్క్‌ఫోర్స్‌లో సుమారు 6 శాతం మందిని తొలగించింది. ప్రపంచవ్యాప్తంగా నెలకొన్న ఆర్థిక అనిశ్చితి భయాలను ఈ తొలగింపులు తెలియజేయడమే కాకుండా టెక్ పరిశ్రమను ఒక్కసారిగా కలవరపాటుకు గురిచేశాయి. తొలగించిన ఉద్యోగులకు చెల్లించేందుకు గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు.. దాని నికర ఆదాయంలో 7 శాతం వరకూ ఖర్చు చేసినట్లు తాజా వెల్లడి ద్వారా తెలుస్తోంది. ఉద్యోగుల తొలగింపులకే ఈ స్థాయిలో ఖర్చయితే ఆ ఉద్యోగులను కొనసాగిస్తే ఎంత ఖర్చయ్యేదో అంచనా వేయొచ్చు. 2024లోనూ.. గూగుల్ 2024లోనూ ఇప్పటికే 1000 ఉద్యోగాల తొలగింపును ప్రకటించింది. దీని కోసం 700 మిలియన్ డాలర్లు (రూ.5,800 కోట్లు ) ఖర్చు చేసింది. ఈ ఏడాదిలో లేఆఫ్‌లు ఇంకా కొనసాగుతాయని గూగుల్ సీఈవో సుందర్ పిచాయ్ ఇదివరకే సూచనలు ఇచ్చారు. అయితే గతేడాదిలో ఉన్నంత తొలగింపులయితే ఈ ఏడాదిలో ఉండకపోవచ్చు. -
‘బకరాల్ని చేశాడు.. మస్క్ ట్వీట్‌తో మబ్బులు వీడాయ్’
ప్రముఖ బిలియనీర్ ఎలాన్ మస్క్ ట్విటర్‌ను కొనుగోలు చేసిన అనంతరం.. ఆ సంస్థ సీఈవో పరాగ్ అగర్వాల్, పాలసీ చీఫ్ విజయ గద్దె, చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ నెడ్ సెగాల్, జనరల్ కౌన్సిల్ సీన్ ఎడ్జెట్‌లను తొలగించారు. అయితే ఉద్యోగుల తొలగింపు అంశం మరో సారి చర్చాంశనీయంగా మారింది. మస్క్ - ట్విటర్ కొనుగోలు కొలిక్కి రావడం. టాప్ ఎగ్జిక్యూటీవ్‌లను మస్క్ తొలగించడం అన్నీ చకచకా జరిగిపోయాయి. తాజాగా, శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ట్విటర్ ప్రధాన కార్యాలయం నుంచి భారతీయుడు రాహుల్ లిగ్మా, డానియల్ జాన్సన్‌లు అమాయక చక్రవర్తుల్లాంటి మొహాలతో అట్టపెట్టెలు తీసుకొని బయటకు వచ్చారు. దీంతో అక్కడే ఉన్న మీడియా ప్రతినిధులు ఏమైందని వారిని ప్రశ్నించగా..మస్క్ తమను ఉద్యోగం నుంచి తీసేశారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు అమెరికా మాజీ అధ్యక్షుడు ఒబామా భార్య మిషెల్లీ ఒబామా ఉంటే ఈ పరిస్థితి రానిచ్చేవారు కాదంటూ బోరుమన్నారు. చదవండి👉 భారత్‌పై ఎలాన్ మస్క్ స్వీట్ రివెంజ్! Ligma Johnson had it coming 🍆 💦 pic.twitter.com/CgjrOV5eM2 — Elon Musk (@elonmusk) October 28, 2022 దీంతో వాళ్లు చెప్పింది నిజమని నమ్మిన దిగ్గజ మీడియా సంస్థలు సైతం వీడియోల్ని ప్రసారం చేశాయి. ప్రింట్ మీడియా సైతం పతాక శీర్షికలతో కథనాల్ని వడ్డి వార్చాయి. ఉద్యోగుల తొలగింపుపై నెటిజన్లు మస్క్‌కు శాపనార్ధాలు పెట్టారు. Quite ironic that a major news outlet failed to do basic diligence and fell for a crisis actor prank, resulting in the spread of misinfo, on the first day of new ownership. All you had to do was ask to see a badge or look for bird-themed stuff in the boxes. Also we don’t use Zoom https://t.co/QtIrBjOH3H — Paul Lee (@BeeBimBop) October 28, 2022 ఈ తరుణంలో మీడియా కథనాల్ని మస్క్ ట్వీట్ చేయడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. వాళ్లు నిజమైన ట్విటర్ ఉద్యోగులు కాదని, ఫ్రాంక్ స్టార్లని తేలింది. మస్క్ సైతం ఆ కథనాల్ని ట్వీట్ చేస్తూ ఫ్రాంక్ స్టార్లపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ వార్తలపై ట్విటర్ ప్రొడక్ట్ మేనేజర్ పాల్ లీ స్పందించారు. మస్క్ ఉద్యోగుల్ని తొలగించారని వస్తున్న వార్తల్ని ఖండించారు. వాస్తవాల్ని తెలుసుకొని ప్రసారం చేయాలని కోరారు. Software engineer and his buddy got fired from @Twitter #ELONMUSK #Twitter #twitterhq #fired #TwitterTakeover #elonmusktwitter #twitter pic.twitter.com/RkDGXm3nAH — Rezowan Siddique Reza (@Rezowan_) October 28, 2022 చదవండి👉 ఈ కంపెనీ ఉద్యోగులకు బంపరాఫర్, ‘వారానికి 4 రోజులే పని’ -
షాకిచ్చిన వేదాంతు, వందల మంది ఉద్యోగుల తొలగింపు!
న్యూఢిల్లీ: ఎడ్టెక్ కంపెనీ వేదాంతు 424 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు వారాల క్రితం 200 మందికి ఉద్వాసన పలకడంతోపాటు కొత్తగా 1,000 మందిని చేర్చుకోనున్నట్టు కంపెనీ ప్రకటించడం గమనార్హం. కఠినమైన బాహ్య వాతావరణం, మాంద్యం భయం ఈ నిర్ణయానికి కారణమని సంస్థ తెలిపింది. ‘ఐరోపాలో యుద్ధం, రాబోయే మాంద్యం భయాలు, ఫెడ్ వడ్డీ రేట్ల పెంపుదలలు..వెరశి ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత స్టాక్ మార్కెట్లో భారీ దిద్దుబాటుతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీశాయి. ఈ వాతావరణాన్ని బట్టి రాబోయే త్రైమాసికాల్లో మూలధనం కొరతగా ఉంటుంది’ అని వేదాంతు కో–ఫౌండర్, సీఈవో వంశీ కృష్ణ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,900 మంది పనిచేస్తున్నారు. -
14వేలమంది ఉద్యోగులపై వేటు?
టెక్నాలజీ దిగ్గజం సిస్కో సిస్టమ్స్ ఇంక్ భారీ సంఖ్యలో ఉద్యోగులపై వేటు వేయనుంది. నెట్వర్క్ పరికరాల తయారీలో ప్రపంచంలో దాదాపు 20 శాతం ప్రాతినిధ్యం వహిస్తున్న సిస్కో సుమారు 14,000 ఉద్యోగులను తొలగించనుందని సాంకేతిక వార్తల సైట్ సీఆర్ఎన్ రిపోర్టు చేసింది. దీనికి సంబంధించి త్వరలోనే సంస్థ ఒక ప్రకటన విడుదల చేసే అవకాశం ఉందని సన్నిహితవర్గాలు తెలిపాయి. ఈ క్రమంలోనే ఇప్పటికే ముందస్తు ఉద్యోగ విమరణ ప్యాకేజీలను ప్రకటించినట్టు తెలిపింది. సీఆర్ఎన్ నివేదించిన సమాచారం ప్రకారం సిస్కో డాటా ఎనలిటిక్స్ సాఫ్ట్ వేర్, డాటాసెంటర్ల కోసం క్లౌడ్ బేస్డ్ టూల్స్ పై పెట్టుబడులు పెడుతోంది. కాలిఫోర్నియాకు చెందిన సిస్కో హార్డ్‌వేర్ నుంచి సాఫ్ట్వేర్-సెంట్రిక్ సంస్థగా మార్పు చెందనున్న క్రమంలో రానున్న కొద్ది వారాల్లో కోతలు ప్రకటింవచ్చని అంచనా. కాగా గత ఏప్రిల్ వరకు 70వేల మంది ఉద్యోగులను కలిగి వున్న సిస్కో ఈ వార్తలపై స్పందించడానికి నిరాకరించింది. ఇదే ఏడాది రెండు ఇతర పెద్ద సాఫ్ట్వేర్ సంస్థలు మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ , హెచ్‌పీ ఇంక్, ఉద్యోగంలో కోతలను ప్రకటించిన సంగతి తెలిసిందే. -
ట్విట్టర్ ఉద్యోగులపై వేటు
ప్రముఖ సామాజిక అనుసంధాన వేదిక ట్విట్టర్ తమ ఉద్యోగుల సంఖ్యను తగ్గించుకోనుంది. తమ కంపెనీకి చెందిన మొత్తం ఉద్యోగులలో 8 శాతం ఉద్యోగులను తొలగించనున్నట్లు సీఈవో జాక్ డోర్సీ మంగళవారం సూత్రప్రాయంగా వెల్లడించారు. ఈ నిర్ణయంతో 336 మంది ఉద్యోగులపై వేటు పడనుంది. గత కొంత కాలంగా కంపెనీ లాభాలు తగ్గడంతో, వేతనాల భారాన్ని తగ్గించడానికి ఈ నిర్ణయం తీసుకున్నట్లు డోర్సీ తెలిపారు. ట్విట్టర్‌కు ఉన్న ఆదరణ తగ్గుతుండడం మరియు నూతన వినియోగదారులను ఆకర్షించడంలో కంపెనీ విఫలం కావడం వంటి కారణాలు ట్విట్టర్ తిరోగమనానికి కారణంగా విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఇతర నెట్వర్కింగ్ సైట్లయిన ఫేస్బుక్, వాట్సప్‌ల మాదిరిగా వినియోగదారులను ఆకర్షించడంలో విఫలం కావడంతో 9 సంవత్సరాల చరిత్ర గల ట్విట్టర్ సంక్షోభంలో పడినట్లు తెలుస్తోంది. ట్విట్టర్‌ను వాడడం వినియోగదారులకు కొంత సంక్లిష్టంగా ఉందని స్వయానా సీఈవో డోర్సీ వెల్లడించడం పరిస్థితికి అద్దం పడుతోంది.