Vedantu Says It Is Laying Off Another 424 Employees, Blames Scare Capital - Sakshi
Sakshi News home page

Vedantu Fires Employees: షాకిచ్చిన వేదాంతు, వందల మంది ఉద్యోగుల తొలగింపు!

Published Fri, May 20 2022 3:56 PM | Last Updated on Fri, May 20 2022 6:02 PM

Vedantu Says It Is Laying Off Another 424 Employees - Sakshi

న్యూఢిల్లీ: ఎడ్‌టెక్‌ కంపెనీ వేదాంతు 424 మంది ఉద్యోగులను తొలగించింది. రెండు వారాల క్రితం 200 మందికి ఉద్వాసన పలకడంతోపాటు కొత్తగా 1,000 మందిని చేర్చుకోనున్నట్టు కంపెనీ ప్రకటించడం గమనార్హం. కఠినమైన బాహ్య వాతావరణం, మాంద్యం భయం ఈ నిర్ణయానికి కారణమని సంస్థ తెలిపింది. 

‘ఐరోపాలో యుద్ధం, రాబోయే మాంద్యం భయాలు, ఫెడ్‌ వడ్డీ రేట్ల పెంపుదలలు..వెరశి ప్రపంచవ్యాప్తంగా, అలాగే భారత స్టాక్‌ మార్కెట్లో భారీ దిద్దుబాటుతో ద్రవ్యోల్బణ ఒత్తిళ్లకు దారితీశాయి. ఈ వాతావరణాన్ని బట్టి రాబోయే త్రైమాసికాల్లో మూలధనం కొరతగా ఉంటుంది’ అని వేదాంతు కో–ఫౌండర్, సీఈవో వంశీ కృష్ణ తెలిపారు. ప్రస్తుతం సంస్థలో 5,900 మంది పనిచేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement